సరీసృపాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సరీసృపాలు
కాల విస్తరణ: కార్బోనిఫెరస్ యుగం - ప్రస్తుత కాలం
A Tuatara, స్ఫీనోడాన్ పంక్టేటస్
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Subphylum:
Class:
సారాప్సిడా *

ఉపతరగతులు
Synonyms

సరీసృపాలు (ఆంగ్లం: Reptiles) భూమిపై గుడ్లు పెట్టే మొట్టమొదటి నిజమైన భూచర జీవులు. ఇవి 270 మిలియన్ సంవత్సరాల క్రితం లాబిరింథోడాంట్ ఉభయచరాల నుంచి పరిణామం చెందాయి. సరీసృపాల విజ్ఞానాన్ని 'హెర్పటాలజీ' అంటారు.

సాధారణ లక్షణాలు[మార్చు]

ఒక ఆడ అమెరికన్ ఎలిగేటర్ యొక్క ఎక్స్-రే ఫ్లోరోస్కోపీ వీడియోలు శ్వాస తీసుకునేటప్పుడు ఊపిరితిత్తుల సంకోచాన్ని చూపుతున్నాయి
  • ఇవి మొదటి నిజ భూచరాలు. చర్మం పొడిగా ఉంటుంది. వీటికి చర్మీయ గ్రంథులు లేవు.
  • దేహం పొడిగా ఉన్న బహిత్వచ స్కూట్ లు లేదా పొలుసులతో కప్పబడి ఉంటుంది.
  • గోళ్ళను కలిగియున్న పంచాంగుళిక అంగాలు ఉంటాయి.
  • కపాలం ఒక అనుకపాల కందాన్ని కలిగి ఒకటి లేదా ఎక్కువ శంఖఖాతాలను కలిగి ఉంటుంది.
  • కింది దవడకు అర్ధభాగంలో ఆరు ఎముకలు ఉంటాయి.
  • ఉరోస్థి బాగా అభివృద్ధి చెంది పర్శుకలను కలిగి ఉంటుంది.
  • ఉరోమేఖలలో ఆకారపు అంతర జత్రుక ఉంటుంది. కశేరుకాలు పురోగర్తికలు.
  • సమదంతాలు, ఆక్రోడాంట్ లేదా ప్లూరోడాంట్ దంతాలను కలివి ఉంటాయి.
  • ఆవస్కరం మూడు భాగాలుగా విభజించి ఉంటుంది. ఇవి కోప్రాడియం, యూరోడియం, పాయుపదం.
  • శ్వాసక్రియ ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది. సముద్ర తాబేళ్ళలో అవస్కర శ్వాసక్రియ కనిపిస్తుంది.
  • వీటిలో మూడు గదుల గుండె ఉంటుంది.
  • మూత్రపిండాలు అంత్యవృక్కాలు. విసర్జక పదార్థం యూరిక్ ఆమ్లం.
  • కేంద్ర నాడీ వ్యవస్థ ఉభయచరాల కంటే బాగా అభివృద్ధి చెందింది. 12 జతల కపాల నాడులుంటాయి (సర్పాలలో 10 జతలు మాత్రమే ఉంటాయి.
  • మగ జీవులలో సంపర్కావయవాలు ఉంటాయి. స్పీన్ డాన్ లో సంపర్కావయవాలు లేవు.
  • చాలా జీవులు అండోత్పాదకాలు.

వర్గీకరణ[మార్చు]

మూలాలు[మార్చు]