పొలుసు
స్వరూపం
పొలుసులు (Scales) చర్మం యొక్క ఉపాంగాలు.
జీవశాస్త్రం
[మార్చు]జీవశాస్త్రంలో పొలుసులు (గ్రీకు lepid, లాటిన్ squama) వివిధ జంతువుల చర్మం నుండి రక్షణకోసం ఏర్పడిన చిన్న కఠినమైన పలుచని పలకవంటి నిర్మాణాలు. వీటి నిర్మాణము, ఉపయోగాలు వివిధ దశలలో అభివృద్ధి చెందాయి. సీతాకోక చిలుకలలో పొలుసులు రెక్కల మీద వివిధ రంగుల్ని కలిగిస్తాయి. సరీసృపాలలో ఇవి ముఖ్యంగా కనిపిస్తాయి. పాములు మొదలైన కొన్ని జంతువులకు ఇవి చలనాంగాలుగా ఉపకరిస్తాయి.
పొలుసులను వాటి ఆకారం, జీవియొక్క రకాన్ని బట్టి వర్గీకరిస్తారు. జంతువుల మాంసం తింటారు, కానీ పొలుసులకు తినరు.
చర్మవ్యాధులు
[మార్చు]మనుషులలో చుండ్రు, సోరియాసిస్, ఇక్థియోసిస్ వల్గారిస్ వంటి కొన్ని రకాల చర్మవ్యాధులలో పొలుసులుగా వెండి లాంటి పొట్టు రాలుతుంది.