Jump to content

ఇక్థియోసిస్ వల్గారిస్

వికీపీడియా నుండి
ఇక్థియోసిస్ వల్గారిస్
Ichthyosis vulgaris #1 (top-left)
ప్రత్యేకతMedical genetics Edit this on Wikidata

ఇక్థియోసిస్ వల్గారిస్ (Ichthyosis vulgaris) అనునది వంశ పారంపర్యంగా సంక్రమించు చర్మ సంబంధ అసాధారణ స్థితి. ఈ వ్యాధి ఉన్నవారి చర్మం పొడిబారి, పొలుసులుగా విడిపోతుంది. ప్రతి 250 మందిలో ఒక్కరు దీని బారిన పడతారు. తల్లిదండ్రులలో ఎవరి ద్వారా నైనా ఒక అసాధారణ జన్యువు సంక్రమించటంతో ఈ వ్యాధి సోకుతుంది.

ఈ వ్యాధి ప్రాణాంతకం కాదు. చాలా తక్కువగా దురద ఉండటం, శరీరం కనిపించే లాగా బట్టలు వేసుకోలేకపోవటం తప్పితే వేరే ఎటువంటి హాని ఉండదు.

స్వేదం ఈ వ్యాధి తీవ్రతని తగ్గించటం మూలాన, తేమ వాతావరణం ఉన్న ప్రదేశాలు వ్యాధిగ్రస్తులకి క్షేమం. ఎయిర్-కండిషన్, మద్యం దీని తీవ్రతని పెంచవచ్చును.

తీసుకొనవలసిన జాగ్రత్తలు

[మార్చు]
  • మాయిశ్చరైజింగ్ క్రీములు, లోషన్ లు, స్నోలు వాడాలి
  • మరీ వేడినీటితో కాకుండా, గోరువెచ్చటి నీటితో మాత్రమే స్నానం చేయాలి (చలికాలంలో కూడా).
  • స్నానం చేసి, తువ్వాలుతో తుడుచుకొన్న వెంటనే, ఆ తడి ఆరక ముందే, క్రీము రాయాలి.
  • ప్యారాఫిన్ మైనం గల క్రీములు శ్రేయస్కరం. (ఉదా: వ్యాజ్లిన్). వీటివల్ల జిడ్డు ఎక్కువగా ఉంటే ఎమోలియంట్, హ్యూమెక్టెంట్, కెరటాలిటిక్ క్రీములు వాడాలి. (ఉదా: మాయిశ్చరెక్స్, కోటరిల్)

మూలాలు

[మార్చు]

1. http://www.nlm.nih.gov/medlineplus/ency/article/001451.htm