శ్వాసక్రియ
Jump to navigation
Jump to search

శ్వాసక్రియ (ఆంగ్లం Cellular Respiration) అన్ని జీవకణాలలో జరిగే ప్రధానమైన జీవక్రియ. ఇది జీవకణంలోని మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఇది వాయుసహిత, వాయురహిత శ్వాసక్రియ అని రెండు రకాలు.
ఒక గ్లూకోజ్ అణువు శ్వాసక్రియలో పాల్గొనడం వలన మొత్తం 36 ATPలు ఏర్పడతాయి. ఒక ATP నుండి 7.6 కిలో కేలరీల శక్తి చొప్పున 36 అణువుల నుండి (36 x 7.6) 273.6 కిలో కేలరీల శక్తి విడుదలవుతుంది. మిగిలిన శక్తి ఉష్ణశక్తిగా వెలువడుతుంది.
వాయుసహిత శ్వాసక్రియ[మార్చు]
వాయుసహిత శ్వాసక్రియ (Aerobic respiration) లో శక్తి నాలుగు దశలలో విడుదలవుతుంది.
గ్లైకాలసిస్[మార్చు]
- చక్కెర విచ్ఛిన్నమై పైరువిక్ ఆమ్లంగా మారుతుంది. ఇది కణద్రవంలో జరుగుతుంది. దీని వలన రెండు NADH+H+లు, రెండు ATPలు వస్తాయి.
పైరువిక్ ఆమ్ల ఆక్సీకరణ[మార్చు]
- పై చర్యలో ఏర్పడిన పైరువిక్ ఆమ్లం మైటోకాండ్రియల్ మాత్రికలో ప్రవేశించి, కో ఎంజైమ్ 'ఎ'తో కలిసి అసిటైల్ కో ఎంజైమ్ 'ఎ' ఏర్పడి క్రెబ్స్ వలయాన్ని చేరుతుంది. దీని వలన రెండు NADH+H+ అణువులు విడుదలవుతాయి.
క్రెబ్స్ వలయం[మార్చు]
- ఇందులో అసిటైల్ కో ఎంజైమ్ 'ఎ', గా మారుతుంది. ఇందులో ముందుగా సిట్రిక్ ఆమ్లం ఏర్పడడం వల్ల దీనిని సిట్రిక్ ఆమ్ల వలయం అని కూడా అంటారు. ప్రతి రెండు అణువుల అసిటైల్ కో ఎంజైమ్ కు 2 లు 6 ATPలులు ఏర్పడతాయి.