కోడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కోడి
Rooster04 adjusted.jpg
కోడి పుంజు
Scientific classification
Kingdom
Phylum
Class
Order
Galliformes
Family
Phasianidae
Genus
Gallus
Species
G. gallus, Gallus gallus domesticus

కోడి లేదా కుక్కుటము ఒక రకమైన పక్షులు. వీటిలో మగ కోడిని 'కోడిపుంజు', ఆడ కోడిని 'కోడిపెట్ట' అని వ్యవహరిస్తారు. కోళ్ళల్లో అనేక రకాల జాతులు ఉన్నాయి. అవి

  • నాటు కోళ్ళు;ఇళ్ళలో పెంచు దేశివాళి రకాలు.గుడ్లు పెట్టుటకై తప్పని సరిగా మగకోడితో సంపర్కం అవసరం.నాటు/దేశివాళి కోడి గుడ్లు పునరుత్పత్తిశక్తి కలిగివుండును(గుడ్లను పొదగిన పిల్లలు వచ్చును)
  • ఫారంకోళ్ళు=గుడ్ల ఉత్పత్తికై పెంచు సంకరజాతి కోళ్ళు.వయస్సుకువచ్చిన తరువాత మగకోడితో సంపర్కం అవసరం లేకుండ గుడ్లు పెట్టును.ఈ గుడ్లకు పునరుత్పత్తి శక్తి లేదు.
  • బ్రాయిలర్=ప్రత్యేకంగా మాంసం కై పెంచు కోళ్ళు.వీటి ఎముకలు చాలా మృదువుగా వుండును.

కోడిపెట్టలు విశేషాలు[మార్చు]

  • ఇవి గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతాయి.
కోడి పెట్ట దాని పిల్లలు, కరీంనగర్లో తీసిన చిత్రం
కోడి పెట్ట దాని పిల్లలు
కోడి పిల్ల

కోడిపుంజులు విశేషాలు[మార్చు]

  • వీటిని అధికంగా పందాలలో వాడుతుంటారు.
  • వీటికి పౌరుషం పెరిగేందుకు మిర్చి మొదలుకొని అనేక రకాల ఆహారం ప్రత్యేకంగా తినిపిస్తుంటారు.
  • వీటిని ఆంధ్ర ప్రాంతంలో నెమలి, డేగ, కోయిల, పరగ ఇంకా అనేక రకాల పేర్లతో పిలుస్తుంటారు.
కోడి పుంజు

ఉపయోగాలు[మార్చు]

కోడి గుడ్లు
  • వీటి మాంసం విరివిగా వాడుతుంటారు.
  • వీటి గుడ్లు అత్యధికంగా వాడు ఒక ఆహార పదార్థం

కోడి ముందా? గుడ్డు ముందా?[మార్చు]

కోడి గుడ్డు ఏర్పడడంలో ఓవోస్లిడీడిన్ 17 (ఓసీ- 17) అనే ప్రొటీన్ గుడ్డు పెంకులో మాత్రమే కనిపిస్తుంది. కోడి దేహంలో కాల్షియం కార్బొనేట్ తయారవుతుంది.కోడిలోనే ఉత్పత్తి అయ్యే ఓసీ- 17 ప్రొటీన్ కాల్షియం కార్బొనేట్‌లోని సూక్ష్మ కణాల మధ్య రసాయన లంకె (క్లాంప్)లా ఏర్పడి వాటిని పట్టి ఉంచి, అవి కాల్షైట్ స్ఫటికాలుగా మారడానికి దోహదపడుతుంది. ఆ స్ఫటికాలకు కేంద్రకంగా మారి అవి తమంతతాముగా పెరగడానికి కూడా ప్రొటీన్ దోహదపడుతుంది. అవి ఒకసారి పెరగడం పూర్తయిన తరువాత ప్రొటీన్ అదృశ్యమవుతుంది. 24 గంటల్లోపే మరో గుడ్డును తయారు చేసే పనిలో పడుతుంది. 'గుడ్డు ఏర్పడటానికి అత్యంత కీలకమైన ఈ ప్రొటీన్ కోడిలోనే ఉంటుంది తప్ప, గుడ్డులో కనిపించదు' .గుడ్డు ఏర్పడాలంటే ఈ ప్రొటీన్ ఉండాలి. అంటే గుడ్డుకన్నా ముందు ఈ ప్రొటీన్ ఉత్పత్తి జరిగింది కాబట్టి ప్రొటీన్ ఉత్పత్తి జరగాలంటే కోడి ఉండాలి కనుక, గుడ్డు కన్నా కోడే ముందు పుట్టిందట.

కుక్కుట శాస్త్రం[మార్చు]

కుక్కుట శాస్త్రము అనగా పందెం కోడిపుంజుల గురించి వ్రాయబడిన పంచాంగము. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలలో ఈ శాస్త్రాన్ని సంక్రాతి పండుగ సమయాల్లో కోడి పందెములు వేసేటప్పుడు చదువుతారు. కోడి పుంజుల సంరక్షణ,కోడి పుంజుల వర్గీకరణ, ఏ సమయాల్లో కోడి పందెము వేయాలి, కోడి జన్మ నక్షత్రము, కోడి జాతకము మొదలుగు విషయాలు ఈ శాస్త్రములో ఉండును. కుక్కుట శాస్త్రము గురించి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి.

ఇవి కూడా చూడండి[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కోడి&oldid=2995985" నుండి వెలికితీశారు