రెక్క
Appearance
(రెక్కలు నుండి దారిమార్పు చెందింది)
రెక్కలు (Wings) పక్షులు యొక్క ప్రత్యేక లక్షణము. కొన్ని రకాల ఎగరగలిగే గబ్బిలం వంటి క్షీరదాలకు రెక్కలవంటి నిర్మాణాలు పూర్వాంగాలకు ఉంటాయి. కొన్ని కీటకాలు రెక్కల సహాయంతో ఎగరగలుగుతాయి. వీటికివి ప్రధానమైన చలనాంగాలు.
పక్షిని చూసి ఎగరడానికి ప్రయత్నించిన మానవుడు, తన కలలు ఫలించి విమానం కనుగొన్నాడు.
గాలిని నియంత్రించడానికి ఉపయోగించే పంఖా (Fan) కి కూడా 3-4 రెక్కలు ఉంటాయి.
వ్యుత్పత్తి
[మార్చు]రెక్కను తెలుగు భాషలో పక్షం, భుజం అనే అర్ధాలున్నాయి. అందువలనే రెక్కలు లేదా పక్షాలు ఉన్న జీవుల్ని పక్షులు అన్నారు. జంతువులలోని భుజాలను ఉద్దేశించి "రెక్కాడితే గాని డొక్కాడదు" అనే సామెత వచ్చింది. అంటే భుజాలతో కష్టపడి పనిచేస్తే గాని పూట గడవదు అని అర్ధంతో ఉపయోగిస్తారు.