చర్చ:కరోనా వైరస్ 2019

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కరోనా వైరస్ 2019 వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2020 సంవత్సరం, 14 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


వైరస్ మూలం గురించి

[మార్చు]
  1. "కట్ల పాము, నాగు పాము ఈ రెండు కూడా విషపూరితమైన సర్పాలు. ఇవి ఎక్కువగా చైనాలో ఉంటాయి. ఈ విషపూరితమైన పాములు కరవడం వలన లేదంటే, వాటిని తినడం వలన వైరస్ సోకి ఉండొచ్చని అంటున్నారు."
  2. "ఈ వైరస్ సోకిన 28 రోజుల్లోగా మనిషి మరణిస్తాడు."

- మహేశ్వర రాజు గారూ, పై రెండు వాక్యాలకు మూలాలను సూచించగలరు. ఈ అంశం చాలా సున్నితమైనది, ప్రజలపై ప్రభావం కలిగించగలిగినదీ కావడం చేత వీలైనన్ని ఎక్కువ మూలాలను, ముఖ్యంగా విశ్వసనీయ మూలాలను, చూపిద్దాం. https://www.amaravatinews.com/corona-virus-name-change/ - ఇలాంటి తప్పు సమాచారం చూపించే వెబ్‌సైట్లను మూలాలుగా వాడ్డం మానేద్దాం. __చదువరి (చర్చరచనలు) 02:31, 5 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మూలం గురించి

[మార్చు]

చదువరి గారు సరైన మూలాలు ఇచ్చి ఈ వ్యాసాన్ని అభివృద్ధి చేస్తాను. Ch Maheswara Raju (చర్చ) 02:42, 5 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు Ch Maheswara Raju గారు. కోవిడ్-19 కు ఇప్పటి వరకు టీకా గాని, ఔషధం గానీ కనుక్కోలేదని WHO చెబుతోంది (To date, there is no vaccine and no specific antiviral medicine to prevent or treat COVID-2019)[1]. కానీ చికిత్స ఉందని మీరు రాసారు. బహుశా వేరే చికిత్సా విధానం అయి ఉండవచ్చు లేదా మందులు లేకుండా చేసే చికిత్స అయి ఉండవచ్చు. దాని వివరాలు ఇస్తూ, మూలాన్ని కూడా ఇవ్వండి. __చదువరి (చర్చరచనలు) 04:30, 5 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వారు 95,481 ఉండగా వారిలో 53,688 మంది వ్యాధి నుండి కోరుకున్నట్లు ఒక వెబ్ సైట్ లో ఉంది అంటే వేరే పద్ధతి ద్వారా చికిత్స విధానం ఉంది కదా అండి.ఈ లింకులో చూడండి ఒకసారి. [1] మీ ఫోన్ నంబర్ ఇవ్వండి.Ch Maheswara Raju (చర్చ) 04:43, 5 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Ch Maheswara Raju గారూ, మీరు రాసినదాన్ని ఇప్పుడే చూస్తున్నాను. వ్యాధి వచ్చిన వాళ్ళంతా చనిపోతారని కాదండి, దాని వలన కలిగే మరణాల రేటు చలా ఎక్కువ. సహజంగా వంట్లో పుట్టే రోగనిరోధకత వలన వ్యాధి నుండి కోలుకుంటున్నారు. అంతే తప్ప ఖచ్చితంగా చికిత్సా విధానం ఇదీ అని ఇంకా WHO ప్రకటించలేదు.చదువరి (చర్చరచనలు) 02:15, 17 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సూచన

[మార్చు]

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది కాబట్టి ఎక్కడ చూసినా ఈ వార్తలే కనిపిస్తున్నాయి. కానీ వాటిలో ప్రామాణికమైనవి బహు స్వల్పం. మనదేశంలో తీసుకుంటే సాక్షాత్తూ ముఖ్యమంత్రులే కరోనా వైరస్ గురించి తెలిసీ తెలియకుండా మాట్లాడటం చూస్తున్నాం. కాబట్టి ఏ పేరొందిన మెడికల్ జర్నలో లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచురించిన వాటినో లేదా ఇతర ప్రామాణికమైన వాటిని మూలాలుగా తీసుకుంటే బాగుంటుంది. రవిచంద్ర (చర్చ) 05:06, 17 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర గారూ, సరిగ్గా చెప్పారు. __చదువరి (చర్చరచనలు) 05:20, 17 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సూచన

[మార్చు]

Veera.sj గారు కరోనా వైరస్ పేజీలో మీరు చేస్తున్న మార్పులను చూశానండి. వైరస్ కాలక్రమం, భారతదేశంలో కరోనా వైరస్ రాష్ట్రాల వారీగా సమాచారం, భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి (2020) ఇక్కడ రాస్తున్నాం మీరు ఒకసారి చూడండి. అలాగే దేశాల వారీగా ఒక్కో పేజీ సృష్టించవచ్చు అని నా అభిప్రాయం. .పవన్ సంతోష్ గారు వికీప్రాజెక్టు/కోవిడ్-19 ప్రాజెక్ట్ పెట్టారు. వికీపీడియా:వికీప్రాజెక్టు/కోవిడ్-19 పేజీని సందర్శించండి. మీకు నచ్చితే పని ప్రారంభించగలరు ధన్యవాదాలు.Ch Maheswara Raju (చర్చ) 11:41, 30 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Ch Maheswara Raju గారు, అప్ డేట్ కు ధన్యవాదాలు. భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి (2020) భేషుగ్గా ఉంది. ఈ వ్యాసంలో నా మార్పులు ఇక్కడితో ఆపుతున్నాను. వీటిని ఇక్కడే ఉంచాలా, కొద్దిగా మార్చాలా, పూర్తిగా తొలగించాలా అన్నది నిర్వహణ బృందానికి వదిలివేస్తున్నాను. వికీపీడియా:వికీప్రాజెక్టు/కోవిడ్-19ను చూసి, నేను ఏం చేయగలనో అది చేస్తాను. శశి (చర్చ) 14:01, 30 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Veera.sj గారు స్పందించినందుకు ధన్యవాదాలు.ప్రాజెక్టులో పాల్గొంటారని భావిస్తున్నాను. ఇలా అందరం కలిసి రాస్తే ఎక్కువ సమాచారం రాయవచ్చు.మీరు రాసిన సమాచారం విలువైనది ఆ సమాచారమంతా భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి లో పొందు పరుస్తాను.Ch Maheswara Raju (చర్చ) 15:28, 30 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

  1. "Q&A on coronaviruses (COVID-19)". www.who.int (in ఇంగ్లీష్). Archived from the original on 2020-03-05. Retrieved 2020-03-05.