వాడుకరి చర్చ:Chaduvari

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వాగతం! "మరియు" అనే మాట తెలుగు భాషకు సహజమైన వాడుక కాదు. ప్రామాణికమైన ప్రచురణల్లోను, నాణ్యమైన వార్తాపత్రికల్లోనూ దాన్ని వాడరు.
వికీపీడియాలో "మరియు" రాయకూడదు. నేను రాయను. మరి మీరు?

సూర్యదేవర నాయకులు X సూర్యదేవర సామ్రాజ్యం[మార్చు]

"చదువరి గారు, నేను మార్చి 2008లో వ్రాసిన 'సూర్యదేవర నాయకులూ వ్యాసం పేరు 'సూర్యదేవర సామ్రాజం' గా మార్చబడింది. ఇది సవరించగలరు.  కుమారరావు."

నాకే చెందిన వాడుకరి:ChaduvariAWBNew పేజీలో పై వ్యాఖ్య రాసిన అజ్ఞాతకు ఇది నా సమాధానం:

అయ్యా/అమ్మా, మీరు కింది విధంగా చెయ్యాలి:

 1. మీరు నిజం గానే కుమారరావు అయితే, మీ ఖాతా ద్వారా లాగినవండి. అది ఉత్తమం. (ఏ కారణం చేతనైనా లాగిన్ కాలేకపోతే ఏం పర్లేదు, వదిలెయ్యండి. అజ్ఞాత గానే కొనసాగండి.)
 2. చర్చ:సూర్యదేవర సామ్రాజ్యం పేజీలో, "సూర్యదేవర సామ్రాజ్యం" అనే పేరుతో ఆ పేజీ ఎందుకు ఉండకూడదో, "సూర్యదేవర నాయకులు" గా ఎందుకుండాలో వివరిస్తూ చర్చ తీయండి.
 3. చర్చలో వచ్చిన నిర్ణయాన్ని బట్టి చర్య తీసుకోవచ్చు.

దీనిపై సందేహాలేమైనా/చెప్పాల్సిందేమైనా ఉంటే, ఇక్కడ రాయండి. నేను అవసరమైన సహాయం చేసేందుకు సిద్ధం. __ చదువరి (చర్చరచనలు) 09:16, 25 ఏప్రిల్ 2021 (UTC)

వాడుకరి:శశికళ గురించి శశికళ అడుగుతున్న ప్రశ్న (12:29, 30 ఏప్రిల్ 2021)[మార్చు]

నమస్తే గురువు గారు 🙏 ఎలా ప్రారంభించాలి? తెలియజేయగలరు 🙏 --శశికళ (చర్చ) 12:29, 30 ఏప్రిల్ 2021 (UTC)

@శశికళ గారూ, నమస్కారం. వికీపీడియాలో పని చెయ్యడం పట్ల మీరు చూపుతున్న ఆసక్తికి ధన్యవాదాలు. చాలా చిన్నచిన్న పనులతో మీరు పని మొదలు పెట్టవచ్చు. వ్యాసాల్లో కనబడే భాషాదోషాలను సవరించడం అలాంటి చిన్నచిన్న, సులువైన పనుల కోవ లోకి వస్తుంది. పనులు చిన్నవే కానీ వాటి విలువ చాలా పెద్దది. పంటి కింద రాళ్లలా అచ్చుతప్పులు తగులుతూ ఉండే పుస్తకాన్ని చదవడం ఎలా ఉంటుందో, భాషాదోషాలుండే వికీ వ్యాసాన్ని చదవడం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఈ సులువైన, విలువైన పని చెయ్యడం మీ మొదటి లక్ష్యంగా పెట్టుకోమని నా సలహా.
మీరు మీ హోంపేజీని చూసారా? కొత్త వాడుకరులకు మాత్రమే ఉంటుంది ఈ పేజీ, నాబోటి పాతవాళ్లకు ఉండదు. ఆ పేజీలో మీరు ఏయే వ్యాసాల్లో పనులు చెయ్యవచ్చో సూచనలిస్తుంది. ఆ సూచనలను అనుసరించి ఏదైనా పేజీని తెరిచి భాషాదోషాలను సవరించడం మొదలుపెట్టండి. మీకు సందేహం ఏమైనా ఉంటే నన్ను అడగండి. నేను వచ్చే మూడు గంటలు ఆన్‌లైన్లోనే ఉండి మీ సందేహాల కోసం ఎదురు చూస్తాను.
వ్యాసంలో సవరణలు చేసేటపుడు తప్పులేమైనా దొర్లుతాయేమోనని వెనకాడకండి. ధైర్యంగా ముందుకు సాగండి, మీవెనకే నేనున్నాను. తప్పులేమైనా జరిగితే నేను కాచుకుంటాను, సరిదిద్దుతాను. అసలు వికీలో, సరిదిద్దుకోలేనంత పెద్ద తప్పు చెయ్యడం మన వల్ల కానేకాదు. కాబట్టి ముందుకు సాగండి. __ చదువరి (చర్చరచనలు) 13:36, 30 ఏప్రిల్ 2021 (UTC)

కొత్త పేజీలు[మార్చు]

తెలుగు వికీపీడియా సైట్ లో ఎడమవైపు ఉన్న ట్యాబులలో "కొత్త పేజీలు" ట్యాబు కనబడుట లేదు. ఏమి చేయాలి.➠ కె.వెంకటరమణచర్చ 14:52, 3 మే 2021 (UTC)

వెంకటరమణ గారూ, ఆ లింకును ఓ పది రోజుల కిందట అర్జున గారు తీసేసారు. దానిపై జరిగిన చర్చ చూడండి. 1. మీడియావికీ చర్చ:Sidebar 2. మీడియావికీ చర్చ:Common.css __చదువరి (చర్చరచనలు) 00:16, 4 మే 2021 (UTC)

Growth Newsletter #18[మార్చు]

15:23, 17 మే 2021 (UTC)

FATHIMABI16 అడుగుతున్న ప్రశ్న (18:45, 19 మే 2021)[మార్చు]

నమస్తే గురువుగారు --FATHIMABI16 (చర్చ) 18:45, 19 మే 2021 (UTC)

నమస్కారం @FATHIMABI16 గారు. వికీపీడియాకు స్వాగతం. వికీపీడియా ప్రత్యేకతలను, బహుశా మీరు గమనించే ఉంటారు -
 1. ప్రజలే ప్రజల కోసం రాస్తున్న విజ్ఞాన సర్వస్వం ఇది.
 2. తెలుగులో మరెక్కడా దొరకని - అంతర్జాలంలో గాని, పుస్తకాల్లో గానీ ఎక్కడైనా సరే, దొరకని - ఎన్నో విశేషాలు తెలుగు వికీపీడియాలో మాత్రమే లభిస్తాయి. ఉదాహరణకు "డెప్సాంగ్ మైదానం" గురించి ఎక్కడైనా దొరుకుతుందేమో గూగుల్లో వెతికితే, మన వికీలోను, మనలను కాపీ చేసే సైట్లలోనూ తప్ప ఇంకెక్కడా దాని గురించి కనబడదు. అదీ మన ప్రత్యేకత.
 3. దేని గురించైనా గూగుల్లో తెలుగులో వెతికి చూస్తే, 90% కేసుల్లో, తెలుగు వికీపీడియాయే ఫలితాల్లో మొట్టమొదటి స్థానంలో కనిపిస్తుంది.
ఇక్కడ రాయడం నాకు చాలా సంతృప్తి నిస్తుంది. మీక్కూడా తెలుగు వికీపీడియాలో అలాంటి అనుభవమే కలగాలని కోరుకుంటున్నాను. వికీలో మీకు ఎలాంటి సహాయం అవసరమైనా నన్ను సంప్రదించండి. నా శాయశక్తులా సాయం చేస్తాను. __ చదువరి (చర్చరచనలు) 03:55, 20 మే 2021 (UTC)

Sureshupanyaram అడుగుతున్న ప్రశ్న (00:10, 2 జూన్ 2021)[మార్చు]

Hello sir, My father is great poet, I want to add his profile in wikipedia --Sureshupanyaram (చర్చ) 00:10, 2 జూన్ 2021 (UTC)

సురేష్ గారూ, తప్పకుండా చేర్చండి సార్. వారి గురించి ప్రపంచమంతా తెలుసుకోవాల్సి ఉంది అని మీరు భావిస్తే అలాగే చెయ్యండి. కాకపోతే, వారి గొప్పదనం గురించి కొడుకుగా మీరు చెప్పడంతో సరిపెట్టకుండా, ఇదుగో ఫలానా ఈనాడు లోనో, సాక్షి లోనో ఆయన గురించి ఈ వ్యాసాలు వచ్చాయి అని లింకులివ్వండి. లేదా ఆయనకు ఫలానా పురస్కారాలు వచ్చాయి అని ఆ లింకులివ్వండి. లేదా ఫలానా పుస్తకాల్లో ఆయన గురించి రాసారు అని ఆ లింకులివ్వండి. ఆ లింకులను నొక్కి ఇతరులు మీ నాన్నగారి గురించి తెలుసుకునేలా ఉండాలి. అప్పుడు మీరు రాసే వ్యాసం వికీపీడియా-యోగ్యంగా ఉంటుంది. మౌలికంగా, ఒక విషయం గురించి ఇక్కడ రాయాలంటే ఆ విషయానికి (వ్యక్తి కావచ్చు, సంస్థ కావచ్చు, మరేదైనా కావచ్చు) ఈసరికే తగు ప్రాముఖ్యత ఉన్నట్టు పత్రికలు, పుస్తకాల వంటి మంచి ప్రచురణల్లో వచ్చి ఉండాలి. బ్లాగులు, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలు అందుకు పనికిరావు. మీరు వికీకి కొత్త కాబట్టి ఇది కొంత కొత్తగా అనిపించవచ్చు. అంచేత ఒకపని చెయ్యండి.. ఆ వ్యాసాన్ని ముందుగా మీ వాడుకరి పేజికి ఒక ఉపపేజీ పెట్టి అందులో రాయండి. అంటే, ఇలా చెయ్యాలి:
వెతుకు పెట్టెలో User:Sureshupanyaram/మీ నాన్నగారి పేరు అని రాసి ("మీ నాన్నగారి పేరు" అన్నచోట వారి పేరు రాయండి) వెతకండి. ఇక్కడ ఆ పేరుతో పేజీ లేదు కాబట్టి, ఫలితాల్లో ఒక ఎర్ర లింకు చూపిస్తుంది. దాన్ని నొక్కితే, కొత్త ఖాళీ పేజీ తెరుచుకుంటుంది.
ఆ పేజీలో మీరు రాయదలచినది రాసెయ్యండి. ఎక్కడెక్కడ మూలాలు పెట్టాలో, ఏయే మూలాలు పెట్టాలో ఏవి పెట్టకూడదో.. ఈ విషయాల్లో నేను సాయం చేస్తాను.__చదువరి (చర్చరచనలు) 02:24, 2 జూన్ 2021 (UTC)

మూస:Disney theatrical animated features[మార్చు]

Hello. Do you have any interest in improving this template? Many movies on it need improvement, such as ది రేస్క్యూయర్స్ and బ్యాంబి 2. The original బ్యాంబి also seems to have a few problems, along with ది ఫాక్స్ ఎండ్ ది హౌండ్. The problem on the later page, is that it is lacking sources and mostly short. All the pages seem to lack sources, and most are really short. What can be done about them? 2600:1700:53F0:AD70:CDE6:A40E:4248:639B 04:40, 15 జూన్ 2021 (UTC)

Hi, I cannot improve the articles that you mentioned. Basically it is not my cup of tea. As of the template, yes I can. That template seems to have an issue: It is too large for the number of articles that we have -an overkill for Tewiki. We need to prune it by removing the red links. As we create new article pages, we can keep adding the links in the template. I will do it in about a week's time. Thanks. __ చదువరి (చర్చరచనలు) 04:54, 15 జూన్ 2021 (UTC)
I removed everything that wasn't translated in the other sections, and the red links on the first two sections. I don't know if that's what you had in mind? But most of the template didn't have the translation and some article titles were possibly wrong. There aren't many blue links on the page. What I don't know is, if anyone is interested in any of these articles? I haven't found anyone yet. It seems like if anyone was interested before, they retired or aren't active. Most of the people who contributed to ది ఫాక్స్ ఎండ్ ది హౌండ్ for example, or to బ్యాంబి and బ్యాంబి 2. I didn't see native users edit ది రేస్క్యూయర్స్ either. 2600:1700:53F0:AD70:CDE6:A40E:4248:639B 04:50, 17 జూన్ 2021 (UTC)

పద్మాకర్ అడుగుతున్న ప్రశ్న (20:09, 15 జూన్ 2021)[మార్చు]

అయ్యా నేను english లొ ఉన్న Indian Banking పేజీ ని తెలుగు లోకి ప్రయత్నిస్తున్నాన. అది మధ్యలొ ఉండగా connectivity పోయింది. దానికి తోడు LAPTOP ఆగిపొయింది. నేను చేస్తున్న పేజీ save అవ్వలేదు. దీనివలన ఎమైనా problem ఉంటుందా --పద్మాకర్ (చర్చ) 20:09, 15 జూన్ 2021 (UTC)

@పద్మాకర్ గారూ, నమస్కారం. మీకు సమాధానం ఇవ్వడం చాలా ఆలస్యమైంది. మన్నించండి. ఈ పాటికి మీకు కరెంటు వచ్చే ఉంటుంది, మీ సమస్య ఏదో ఒక తీరానికి చేరే ఉంటుంది. అయినప్పటికీ నేను దీని గురించి నాకు తెలిసిన సంగతులు రాస్తాను. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో పనికి రావచ్చు.
అయితే, వికీపీడీయాలో ఒక సౌలభ్యం ఉంది. పేజీ సగంలో ఉండగా ఇలాంటి ఆటంకం ఏర్పడి, తరువాత ఆ పేజీని తిరిగి తెరిచినపుడు గతంలో మనం రాసినంత మేరకు తిరిగి చూపిస్తుంది. అంటే అది పేజీలో మనం దిద్ద్దుబాటు చేస్తూ ఉంటే ఎప్పటికప్పుడూ సేవు చేస్తూ పొతుందన్నమాట. అయితే ఇక్కడ కింది అంశాలను గమనించాలి:
 1. తిరిగి తెరిచేటపుడు, మీరు గతంలో చేస్తూ ఉన్న దిద్దుబాటునే మళ్ళీ తెరవమంటారా అని అడుగుతుంది.మనం "సరే" ననాలి
 2. అది పేజీని సేవు చెయ్యడంలో కొంత ల్యాగ్ ఉంటుంది. అంచేత తిరిగి తెచ్చేటపుడు మనం రాసినది పూర్తిగా రాకపోవచ్చు, చాలావరకు వస్తుంది. (పోయే పాఠ్యం కొంతే ఉంటుంది కాబట్టి, ఇది పెద్ద సమ్మస్య కాదు)
 3. కొన్ని సందర్భాల్లో తిరిగి తెచ్చిన పాఠ్యం చివర కొంత చెత్త చేర్చి చూపిస్తుంది. అంటే - ఫ్శృఏఘ్డ్టాఫేఋశ్ట్ఘేఫ్ఃశ్టేఫ్శ్ - లాంటి చెత్త అన్నమాట. అలాంటి సందర్భాల్లో, ఆ పేజీ కొంత చిత్రంగాఅ ప్రవర్తిస్తుంది. అప్పుడూ ఆ పాఠ్యాన్నంతా వేరే చోట కాపీ చేసి పెట్టుకుని, ఈ దిద్దుబాటును మూసేసి, ఫ్రెష్ గా పేజీని మళ్ళీ దిద్దుబాటు కోసం తెరవాలి. అందులో మనం కాపీ చేసుకున్న పాఠ్యాన్ని చేర్చి దిద్దుబాటును కొనసాగించుకోవచ్చు.
నాకు క్రోం బ్రౌజరులో అనేక సందర్భాల్లో ఇలాంటి అనుభవాలు ఉన్నై. ఇతర బ్రౌజర్లలో కూడా ఇలాగే ఉంటుందా అంటే, నేను చెప్పలేను సార్. ఇకపోతే, ఇలాంటి అటంకాల వల్ల వికీపీడియా సైటుకు ఇబ్బంది ఏమైనా కలుగుతుందా అనే సందేహం మీకు ఉంటే... అలాంటిదేమీ ఉండదు, వికీపీడియాకు ఏ ఇబ్బందీ కలగదు.
ఈ సమాచారం మీకు పనికొస్తే సంతోషం. ఇంకా ఏదైనా సందేహాలుంటే అడగండి సార్. __ చదువరి (చర్చరచనలు) 04:25, 16 జూన్ 2021 (UTC)

ప్రాజెక్టు పేజీ అనువాదానికి సహాయం[మార్చు]

చదువరిగారూ! వికీపీడియా పేజెస్ వాంటెడ్ ఫోటోస్ ఇన్ తెలుగు వికీపీడియా 2021 కొరకు రాపిడ్ గ్రాంట్ అప్రూవ్ అయ్యిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ ప్రాజెక్టు కోసం ఒక డ్రాఫ్ట్ పేజీని ఇక్కడ ప్రారంభించాను. మీరు దీనిని చూచి తగిన రీతిలో అనువదించడానికి మరియు సరైన సూచనలు ఇచ్చి సహకరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. స్వరలాసిక (చర్చ) 16:20, 16 జూన్ 2021 (UTC)

@స్వరలాసిక గారూ, అనువాదం చేసాను. బహుమతుల వివరాలను అనువదించలేదు. మన బహుమతులేంటో నేరుగా మీరే రాసెయ్యండి. __ చదువరి (చర్చరచనలు) 15:35, 17 జూన్ 2021 (UTC)
@స్వరలాసిక గారూ, రెండు అంశాలు:
 1. బొమ్మలు అవసరమైన పేజీలు వర్గంలో ఉన్న పేజీల్లో కొన్నిటిలో ఫొటోలను చేర్చినప్పటికీ, చర్చ పేజీలో మూసను తీసెయ్యలేదు. అంచేత అవి ఇంకా ఈ వర్గంలో కొనసాగుతున్నాయి. వాటిని ఈ వర్గం లోంచి తీసెయ్యాలి. నేను వాటిని తీసేస్తాను.
 2. మన పోటీలో ఈ అంశాన్ని కూడా చేర్చితే బాగుంటుందని భావిస్తున్నాను. - ఎలాగంటే.. పేజీలో బొమ్మను చేర్చి మెరుగు పరచాక, సంబంధిత చర్చ పేజీలో ఉన్న {{బొమ్మ అభ్యర్థన}} అనే మూసను తీసెయ్యాలి.
పరిశీలించండి.
పోతే.. నాకొక సందేహం కలుగుతోంది. ఇప్పుడూ.. ఎవరైనా వాడుకరి ఈసరికే బొమ్మ ఉన్న ఒకపేజీ తీసుకుని, దాన్ని దిద్దుబాటు కోసం తెరిచి ఏమీ చెయ్యకుండానే సేవు చేస్తూ దిద్దుబాటు సారాంశంలో హ్యాష్‌ట్యాగును చేర్చారనుకోండి.. అప్పుడు ఆ పేజీ పోటీలో పరిగణన లోకి వస్తుంది. అలాంటి వాటిని నివారించాలంటే ప్రతి దిద్దుబాటునూ పరిశీలించాల్సి ఉంటుంది. అలా చెయ్యడం కష్టమౌతుంది. దాన్ని ఆటోమాటిగ్గా కనుక్కోవడానికి వాళ్ళు ఏదైనా బాటో మరోటో వాడతారా అనేది తెలుసుకోగలరు. __ చదువరి (చర్చరచనలు) 16:18, 17 జూన్ 2021 (UTC)
చదువరిగారూ! ఈ బ్యానర్ ఎలా ఉందో చూడండి. (దస్త్రం:WPWPTE Banner.png) దీన్ని ఎలా వాడుకోవాలి?--స్వరలాసిక (చర్చ) 17:00, 23 జూన్ 2021 (UTC)
@స్వరలాసిక గారూ, ఎందుకు ఈ బ్యానరు? సైట్ నోటీసులో ప్రకటించడానికైతే, బొమ్మ అక్కర్లేదు, పాఠ్యమైనా పెట్టవచ్చు. బొమ్మ కూడా పెడదామంటే సరే, అలాగే చేద్దాం. కానీ బొమ్మలోని పాఠ్యంలో చిన్న దోషముంది. "వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021" అని ఉండాలి. కానీ వాంటెడ్ అని రాసారు. దాన్ని సవరించండి. నేను సైట్ నోటీసు పెడతాను. __ చదువరి (చర్చరచనలు) 02:57, 25 జూన్ 2021 (UTC)
@స్వరలాసిక గారూ బొమ్మ ఎత్తును కూడా తగ్గించండి. ఇప్పుడున్నదానిలో 70% ఉంచండి.__ చదువరి (చర్చరచనలు) 03:03, 25 జూన్ 2021 (UTC)

Editing news 2021 #2[మార్చు]

14:12, 24 జూన్ 2021 (UTC)

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.


ఆహ్వానం WPWP పునసమీక్షా సమావేశం[మార్చు]

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 లో మీ చేర్పులకు ధన్యవాదములు, ఇందులో భాగంగా జూలై 15వ తేదీ సాయంత్రం 7.00 నుండి 8.00 IST వరకు జరుగుతున్న సభ్యుల పునసమీక్షా సమావేశంలో గూగుల్ మీట్ ద్వారా చేరగలరు (లింకు) Or Open Google Meet and enter this code: bqk-vdyf-gzc , ప్రాజెక్టు జరిగే కాలంలో ఇందులో పాల్గోనే అందరూ సబ్యులూ వీలయితే నేర్చుకొన్న విషయాలు పంచుకోవచ్చు,సూచనలు కూడా చేయవచ్చు, కొత్త వారికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది.

[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities[మార్చు]

Hello,

As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.

An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:

 • Bangladesh: 4:30 pm to 7:00 pm
 • India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
 • Nepal: 4:15 pm to 6:45 pm
 • Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
 • Live interpretation is being provided in Hindi.
 • Please register using this form

For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.

Hope that you are able to join us, KCVelaga (WMF), 06:35, 23 జూలై 2021 (UTC)

#WPWbPTE #WPWP[మార్చు]

#WPWbPTE #WPWP ట్యాగ్ ను సరి చూడండి @Chaduvari గారు .. Nskjnv (చర్చ) 06:41, 25 జూలై 2021 (UTC)

@Nskjnv గారూ, ధన్యవాదాలు. మీరు చూసారు కాబట్టి 43 పేజీలతో సరిపోయింది. లేదంటే ఇంకా ఎన్ని అయ్యేవో. ఏదో తోచిన విధంగా వాటిని సరి చేసాను. ఒప్పుకుంటుందో లేదో చూడాలి.__ చదువరి (చర్చరచనలు) 07:28, 25 జూలై 2021 (UTC)