Jump to content

వాడుకరి చర్చ:Helloisgone

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

స్వాగతం

[మార్చు]
Helloisgone గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

Helloisgone గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగు వికీపీడియా పరిచయానికి అంచెలంచెల(step by step) పారస్పరిక (interactive)బోధన, వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం) చూడండి. తెలుగు వ్యాసరచన గురించి విషయ వ్యక్తీకరణ, కంప్యూటర్ లో తెలుగు టైపు చెయ్యడం గురించి టైపింగు సహాయం, కీ బోర్డు వ్యాసాలు ఉపయోగపడతాయి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   యర్రా రామారావు (చర్చ) 02:42, 21 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

గొలుసు గిలక

[మార్చు]

నమస్కారం. ఈ కూర్పులో మీరు చెయిన్ బ్లాక్‌ను గొలుసు గిలక అని మార్చారు. వాడుకలో ఎక్కువగా ప్రచురంలో ఉన్న పేర్లనే వాడాలి అనేది తెవికీ పద్ధతి. ఈ రెండు పదాల్లోను వాడుకలో చెయిన్ బ్లాక్ అనేదే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది, అంచేత మన పద్ధతి ప్రకారం ఆ పేరే వాడాలి. ఇలాంటి మార్పులు చేసేముందు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవలసినదిగా మనవి. __ చదువరి (చర్చరచనలు) 05:31, 23 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తక్కువగా ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ, అసలంటూ వాడుకలో ఉంటే, దాన్ని ఈ పేరుతో కూడా పిలుస్తారు అని రాయవచ్చు.__చదువరి (చర్చరచనలు) 05:33, 23 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
kanni adi aanglam andi! en.wikipedia.org miku kavalanukunta. telugu teliyakapothe ikkada enduku untaru? leda aanglam telisithe en.wiki lo enduku undaru? ekkuva vadina aanglam padalaki redirect pejilu cheyyandi. telugulo vrayakandi 🙏 Helloisgone (చర్చ) 04:16, 13 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
అయ్యా, తెలుగు వికీపీడియా అనేది కేవలం విజ్ఞానసర్వస్వం, ఇది తెలుగును ప్రచారం చేసేందుకు ఉదేశించిన వెబ్‌సైటు కాదు. సమాజంలో బహుళ ప్రచారంలో ఉన్నవాటినే వాడుతుంది తప్ప, ఇది ప్రచారం కల్పించదు. దయచేసి ఆంగ్లదేశం లాంటి దారిమార్పులు చెయ్యకండి. అలా రాయడమే సబబని మీకు, నాకూ అనిపించవచ్చు. కానీ వికీలో కొన్ని నియమాలున్నాయి. వాటిలో బహుళ ప్రాచుర్యంలో ఉన్న పేర్లనే వాడాలనేది ఒకటి. దాన్ని పాటించండి. మీరు చేసిన తరలింపులను వెనక్కి తిప్పండి. ఒక వారం రోజుల్లో చేయకపోతే, నేను ఆ తరలింపులను వెనక్కి తిప్పుతాను.
రెండు సూచనలు:
  1. ఈ విషయంపై మరింత చర్చ చేసేపనైతే నాకు లింకు ఇస్తూ నన్ను ప్రస్తావించండి. ఎక్కడైనా చర్చలో ఎవరినైనా ఉద్దేశించినట్లైతే, వారి వాడుకరి పేజీకి లింకు ఇస్తూ వారిని ప్రస్తావించాలి. అది ఇక్కడి సంప్రదాయం. లేదంటే ఇక్కడ మీరు రాసిన సంగతి తెలీకపోవచ్చు. ఉదాహరణకు ఇక్కడ మీరు తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యను ఇప్పుడే చూసాను, ఇక్కడ మీరు రాసిన సంగతి తెలవదు.
  2. ఇది తెలుగు వికీపీడియా. తెలుగు లోనే రాయాలి. దయచేసి తెలుగులో రాయండి. ఇంగ్లీషు లోనో, తెంగ్లీషులోనో రాస్తే చదవడం ఇబ్బందిగా ఉంటుంది.
నమస్కారం. __ చదువరి (చర్చరచనలు) 01:15, 21 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు వికీపీడియా మొత్తం తెంగ్లీష్ రాసుంటుడి. కని నేను తెంగ్లీష్ వ్రాయలేదు. తెంగ్లీష్ అనేది తెలుగు వ్రాతలో ఆంగ్లము. వియన్నా పేజీ చూసారా? "ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ అఫ్గానిస్తాన్" అనేది తెంగ్లీష్; అఫ్గానిస్తాన్ ఇస్లామీయ గణతంత్రం అనేది తెలుగు. "సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్" అనేది తెంగ్లీష్; కానీ మధ్య ఆఫ్రికా గణతంత్రం అనేద తెలుగు. "ఇంగ్లాండు" తెలుగు కాదు. ఆంగ్లదేశం తెలుగు. ఇలాంటివి ఈ వికీలో వెతికితే చాల కనబడతాయి. ఎవరైనా  "ఇండియా" తెలుగు అని అనుకుంటున్నారా? మీ దేశాల జాబితే తప్పు గా ఉంది అంది! దయచేసి ఈ తప్పులను మార్చండి. ఎక్కువ మంది “ఇండియా” అని అంటే భారతదేశం పేజి మార్చుతారా? “ఇంగ్లిష్” తెలుగు కాదు అంటే “ఇంగ్లాండ్” ఎల్లా అవుతుంది? దయచేసి ఇది అర్థం చేసుకుకొంది. ఒక తెలుగు వికీ మొదటిగా ఒక తెలుగులో వ్రాసిన వికీ. మనము తెలుగులో ఆంగ్లం వ్రాసి, తెలుగు పదం తరవత “(ఆంగ్లం: “ వ్రాసి అగౌరవంగా ప్రవర్తిస్తున్నాము. అర్థం చేసుకునందుకు మీకు ధన్యవాదములు! Helloisgone (చర్చ) 21:49, 6 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీ

[మార్చు]

సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీ పేరును కేంద్రీయ సమాచార సంస్థ గా మార్చారు. కానీ అది ప్రాచుర్యంలో ఉన్న పేరు కాదు. సమాజంలో అత్యధిక ప్రాచుర్యంలో ఉన్న పేరునే వికీపీడియాలో వాడాలి. గతంలో ఇలాంటి మార్పులు చేసినపుడు కూడా ఈ విషయాన్ని మీకు చెప్పాను. అయినప్పటికీ ఈ మార్పు చేసారు. దయచేసి ఇకపై ఇలాంటి మార్పులూ తరలింపులూ చెయ్యకండి. నమస్కారం. __ చదువరి (చర్చరచనలు) 01:10, 6 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

that is litterally English hiding in Telugu script. The correct translation is Kendriya Samachara Sanstha. every single language in the world translates agencies. You say it's more used, but when people say CIA, they aren't speaking Telugu. The word "intelligence" means nothing in Telugu. It isn't a Telugu word. I'm not promoting the language or anything, this is the bare minimum of translation. Helloisgone (చర్చ) 21:22, 6 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
సార్, తెలుగు వికీపీడీయాలో తెలుగే వాడాలి, ఇంగ్లీషు వాడకూడదు అనే విషయంలో నేను మీతో ఏకీభవిస్తాను. వ్యాసాల్లో తొలి వాక్యంలో పేజీ పేరు పక్కనే బ్రాకెట్లో ఇంగ్లీషు పేరు ఉండడం మీకు నచ్చదు, తీసేస్తూంటారు. ఆ విషయంలో నాదీ మీ అభిప్రాయమే. కానీ ఇక్కడ అది ఉండాలనో, ఉండకూడదనో ఇక్కడ నియమమేమీ లేదు. కాబట్టి, అలా ఎవరూ రాయకూడదని నిర్బంధించలేం. అలాగే, వికీపీడియా కొత్త తెలుగు పదాలను కాయించే స్థలం కాదు. బాగా ప్రచారంలో ఉన్న పేర్లనే ఇక్కడ వాడాలి అనేది నియమం. తెలుగులో సిఐఎ ని సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీ అనే అంటారు గానీ, కేంద్రీయ సమాచార సంస్థ అనరు. సిఐఏ అనేది తెలుగుమాట కాదు, నిజమే. కానీ అదే ప్రచారంలో ఉంది. తెవికీలో వ్యాసాలు చప్పున అర్థమయ్యే రీతిలో వెతుకులాటలో తేలిగ్గా దొరికేళా, పేరు చూడగానే చప్పున స్ఫురించేలా ఉండాలి. తెలుగువారు సిఐఎ అని వెతుకుతారు గానీ "కేంద్రీయ.." అని వెతకరు. పరిశీలించండి.
మరొకటి.., పేర్ల విషయంలో అనువదించకుండా ఉన్నది ఉన్నట్లుగా వాడాలి - అనువాద పదమో, మరొక పదమో ఎక్కువగా వాడుకలో ఉంటే తప్ప. పాలస్తీనా అనేది దీనికి ఉదాహరణ - పాలస్టైన్ అనేది ఎక్కువగా వాడే ఇంగ్లీషు మాట. కానీ మనం పాలస్తీనా అనే అంటాం. అంచేత పేజీ పేరు అలాగే ఉంటుంది.
ఇంకోటి.. "ఇంటిలిజెన్స్‌" అనే మాటకు కు సరైన సమానార్థకం "సమాచారం" కాదు. ఆ మాటకు ఇక్కడ "నిఘా" అని "గూఢచార" అనీ అర్థాలు వస్తాయి గానీ, సమాచారం అనే అర్థం రాదు. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 04:21, 10 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
(మొదటగా నేను ఏ తెలుగు పదం కనిపెట్టలేదు)
మీ జవాబుకు ధన్యవాదాలు! నిజమే! తెలుగు వికీలో ఎక్కువ వదిన తెలుగు పదం ఉంటుంది, ఆంగ్లం వికీలో ఆంగ్లం పదం. ఇక ఈ విషయాలలో, అంటే ఆంగ్లం పేరు ఎక్కువ వాడినపుడు, దారిమార్పులు ఉంటాయి. యూరప్ కోసం వెతుకుతే ఐరోపా వస్తుంది. అలాగా చెయ్యవచ్చు! ఆలా దారిమార్పు పేజీ పుర్తి అంతా సరిగ్గా వెతకొచ్చు! ఇక ప్రతి భాష ఇలాంటి సంస్థలు అనువదించుతారు. కావాలంటే వేరే వికీలు చూడండి! Spanish: Agencia Central de Inteligencia, అలాగా. ఇక ఈ పేరుతో ఇంటెలెజెన్స్ అంటే రహస్య సమాచారం, అందుకున్న సమాచార అని పెట్టాను. ఇంకా బాగా అనువదించాగేలుగుతే దయచేసి వ్రాయండి. Helloisgone (చర్చ) 21:45, 15 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఇండిక్ మీడియావికి డెవలపర్స్ యూజర్ గ్రూప్ - టెక్నికల్ సంప్రదింపులు 2024

[మార్చు]

నమస్తే,

ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నప్పుడు వివిధ సాంకేతిక సమస్యలపై సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిటీ టెక్నికల్ కన్సల్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి లక్ష్యం కమ్యూనిటీలలోని సవాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సాధారణ సమస్యలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం.

మొదటి దశ మీ సాధారణ సమస్యలు, ఆలోచనలు మొదలైనవాటిని ఎక్కడ నివేదించాలనే సర్వే. దయచేసి సర్వేను (మీకు నచ్చిన భాషలో) ఇక్కడ పూరించండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link

చివరి తేదీ 20 సెప్టెంబర్ 2024.

మీరు బహుళ సమస్యలు లేదా ఆలోచనలను నివేదించాలనుకుంటే, మీరు సర్వేను ఒకటి కంటే ఎక్కువసార్లు పూరించవచ్చు.

కార్యాచరణ గురించి మరింత చదవడానికి, దయచేసి సందర్శించండి: https://w.wiki/AV78

సర్వే తెలుగులో పైన పేజీలో ఉన్నాయ్.

ధన్యవాదాలు! MediaWiki message delivery (చర్చ) 13:29, 9 సెప్టెంబరు 2024 (UTC), ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ తరపున[ప్రత్యుత్తరం]