సహాయం:విజువల్ ఎడిటరును ఎంచుకోవడం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పేజీకి అన్నిటి కంటే పైన, కుడి వైపున ఉన్న వ్యక్తిగత లింకుల పట్టీలోని "అభిరుచులు" లింకుపై నొక్కండి.

అప్పుడు నా అభిరుచులు పేజీ తెరుచుకుంటుంది. అందులో దిద్దిబాట్లు ట్యాబుకు వెళ్ళండి.
ఆ పేజీలో "విజువల్ ఎడిటర్ బీటా రూపంలో వున్నప్పుడు తాత్కాలికంగా అచేతనం చేయి." పెట్టెలో టిక్కు పెట్టి ఉంటే దాన్ని తీసెయ్యండి.

సవరణ విధం: కు అనుబంధంగా దాని కింద ఉన్న డ్రాప్‌డౌను పెట్టెలో కింది నాలుగు వికల్పాలు కనిపిస్తాయి:
  1. "క్రిందటిసారి వాడిన ఎడిటరును గుర్తుంచుకో" (కిందటిసారి మీరు వాడిన ఎడిటరునే మళ్ళీ చూపిస్తుంది)
  2. "వీలైతే అన్నివేళలా విజువల్ ఎడిటరునే ఇవ్వు" (విజువల్ ఎడిటరుకు అనుకూలంగా ఉన్న పేజీలలో దాన్ని చూపిస్తుంది. మిగతా పేజీల్లో వికీపాఠ్యం ఎడిటరును చూపిస్తుంది)
  3. "ఎల్లప్పుడూ వీకీపాఠ్యం ఎడిటరునే ఇవ్వు" (ఏ పేజీలో నైనా వికీపాఠ్యం ఎడిటరునే చూపిస్తుంది)
  4. "దిద్దుబాటు ట్యాబ్‌లు రెంటినీ చూపించు" (పేజీలో చదువు అనే ట్యాబు పక్కన సవరించు, మూలపాఠ్యం సవరించు అనే ట్యాబులను చూపిస్తుంది.)
అందులో "వీలైతే అన్నివేళలా విజువల్ ఎడిటరునే ఇవ్వు" పెట్టెలో టిక్కు పెట్టండి. దాంతో విజువల్ ఎడిటరుకు అనుకూలంగా ఉన్న పేజీలలో దిద్దుబాట్లు చేసేటపుడు దాన్నే చూపిస్తుంది. మిగతా పేజీల్లో వికీపాఠ్యం ఎడిటరును చూపిస్తుంది. పేజీకి అడుగున ఉన్న "భద్రపరచు" బొత్తాన్ని నొక్కి మీ ఎడిటరు అమరికలను భద్రపరచండి.

నమోదై, లాగినై కూడా పై విధంగా తమ అభిరుచులలో విజువల్ ఎడిటరును చేతనం చేసుకోని వారు వికీపీడియా పేజీ URL చివరన ?veaction=edit అని చేర్చి, విజువల్ ఎడిటరును వాడుకోవచ్చు. వికీలో ఖాతా లేనివారు, కూడా ఈ పద్ధతిని పాటించవచ్చు