కీ బోర్డు

కంప్యూటర్ మరియు ఫోన్ కీ బోర్డులు సాంప్రదాయికంగా భౌతిక మీటలు కలిగివుండేవి. వీటిపై సాధారణంగా ఇంగ్లీషు అక్షరాలే ముద్రించబడివుండేవి. అందువలన తెలుగు టైపు నేర్చుకోవడం కొంత కష్టంగా వుండేది. ఇటీవల స్మార్ట్ ఫోన్ల లేక టాబ్లెట్ కంప్యూటర్ లో స్పర్శా తెర (touch screen) సాంకేతికాలు (ఉదాహరణ మల్టీలింగ్ తెలుగు కీ బోర్డు) వుండటం వలన తెలుగు అక్షరాలు చూపించడం, దానివలన టైపు చేయడం అత్యంత సులభం అవుతున్నది. 2013లో ఆండ్రాయిడ్ 4.2 తో తెలుగు మరియు ఇతర భారతీయ భాషల తోడ్పాటు మెరుగై పూర్తిగా తెలుగులో వాడుకోవడానికి వీలయ్యింది. (చూడండి ప్రక్కన ఫోటోలు) సాంప్రదాయక భౌతిక కీ బోర్డులకు ప్రామాణికాలు తయారైనా అవి అంతగా ప్రజాదరణ పొందలేక, వివిధ రకాల పద్ధతులు వాడుకలోకి వచ్చాయి.
విషయ సూచిక
తెలుగు కీ బోర్డులలో రకాలు[మార్చు]
తెలుగు అక్షరాల కీ బోర్డు[మార్చు]
దీనిలో ఇంగ్లీషు QWERTY కీ బోర్డులో ఒక్కొక్క కీ (మీట) కి తెలుగు అక్షరము జత చేయబడివుంటుంది.
ఉదాహరణకి ఇన్‌స్క్రిప్టులో y అక్షరము బతో జతచేయబడి, h అక్షరము పతో జతచేయబడి ఉన్నాయి. ఇంగ్లీషు అక్షరం ఉచ్ఛారణకు జతచేయబడిన తెలుగు అక్షరం ఉచ్ఛారణకు పొంతన లేదు. అందువలన ఇంగ్లీషు QWERTY కీ బోర్డుతో నేర్చుకోవడం, ఒకే వ్యాసములో ఇంగ్లీషు వాడాలంటే కష్టము. ఐతే నేర్చుకున్న తరువాత టైపు త్వరగా చేయవచ్చు.
- రకాలు
ఉచ్ఛారణా కీ బోర్డు (Phonetic Keyboard)( ఇంగ్లీషు (రోమన్) అక్షరాలతో తెలుగు రాయుటకు కీ బోర్డు)[మార్చు]
దీనిలో ఒకటి లేక ఎక్కువ ఇంగ్లీషు అక్షరాల సమూహానికి ఒక తెలుగు అక్షరము జత చేయబడుతుంది. అ ఇంగ్లీషు అక్షరాల సమూహము నొక్కినపుడు ప్రత్యేక సాప్టువేరు సహాయంతో తెలుగు అక్షరాల కోడ్ కి మార్చబడి బద్రపడచబడుతుంది.
- ఉదాహరణకి
- క అని రాయటానికి ka నొక్కాలి.
- ఖ అని రాయటానికి kha లేక Ka నొక్కాలి
ఇది ఇంగ్లీషు తెలిసినవారు కొద్ది పాటి సమయములో నేర్చుకోవచ్చు. ఒకే వ్యాసములో ఇంగ్లీషు కూడా వాడవలసినపుడు కీ బోర్డు మారదు కాబట్టి సులభముగా వుంటుంది. ఏ కంప్యూటర్ లో నైనా ఇంటర్ నెట్ లో స్క్రిప్టు ద్వారా దీనిని వాడుకోవచ్చు. వికీపీడియాలో తెలుగు వ్యాసాలు రాయటానికి కూడా వాడుతున్నారు.
- రకాలు
- నేరుగా అన్ని ఉపకరణాలలో రాయలేనివి. (వెబ్ లేక బ్రౌజర్ అధారిత) కీ బోర్డులు
- బ్రౌజర్ (విహరిణి) లో ఒక్క సైట్ వరకే వరకే పనిచేసేవి
- నేరుగా ఉపకరణంలో రాయుటకు వీలైనవి.
- ఐట్రాన్స్ ITRANS
- రైస్ ట్రాంస్లిటరేషన్ స్టాండర్డ్ RTS
వీటిలో కొద్ది తేడాలున్నాయి.[1]
- నేరుగా బ్రౌజర్ (విహరిణి) వుపకరణంలో రాయటకు మరియు విండోస్ వ్యవస్థలలో స్థాపించుకోగలుగుటకు వీలైనవి.
సంకర (ఊహానుగత) కీ బోర్డు[మార్చు]
దీనిలో మిగతా రెండు రకాల కీ బోర్డుల మంచి లక్షణాలు కలిసి ఉన్నాయి. ఇది ఇంగ్లీషు తెలిసినవారు కొద్ది పాటి సమయములో నేర్చుకోవచ్చు.
- రకాలు
ఇతర రకాల కీ బోర్డు[మార్చు]
డిటిపి రంగంలో ఏపిల్ కంప్యూటర్ వాడుక మొదటలో ఎక్కువగా వుండేది. అప్పుడు కొన్ని రకాల కీ బోర్డులు వాడేవారు. వాటిలో ముఖ్యమైనవి
ఎంచుకోవడం ఎలా[మార్చు]
- ఒక పరిశోధనలో[2], ఒక వ్యాసం టైపు చేయడానికి, తెలుగు అక్షరాల కీ బోర్డు కంటే, ఉఛ్ఛారణా కీ బోర్డు వాడినప్పుడు, 21-22 శాతం ఎక్కువ కీ నొక్కులు అవసరమవుతాయని తెలిసింది.
- ఇంగ్లీషు టైవు చేయడం బాగా వచ్చి, తెలుగు టైపు అరుదుగా చేసేవారు, ఇతర భారతీయ భాషలు పెద్దగా తెలియని వారు, ఉఛ్ఛారణా కీ బోర్డు వాడటం మంచిది.
- టైవు చేయడం కొత్తగా మొదలెట్టే వారు, తెలుగు టైపు ఎక్కువగా చేసేవారు, ఇతర భారతీయ భాషలలోకూడా ముందు ముందు టైపు చేద్దామనేకోరిక కలవారు తెలుగు అక్షరాల కీ బోర్డుని వాడటం మంచిది.
టైపు నేర్పటానికి సహాయం[మార్చు]
టైపు నేర్పటానికి కొన్ని సహాయ పరికరాలు [3] [4] [5] వున్నాయి.
ఇవీ చూడండి[మార్చు]
- నోకియా మొబైల్ ఫోన్ తెలుగు కీ బోర్డు
- వికీపీడియా:తెలుగులో రచనలు చెయ్యడం
- తెలుగు కీబోర్డులు ప్రదర్శనము (పిడిఎఫ్ ప్రదర్శనాపత్రము)