లేఖిని
లేఖిని [1] తెలుగు అక్షరములు వ్రాయుటకు ఉపయోగించు ఒక సులువైన సాధనము. వీవెన్గా పేరుపొందిన వీరపనేని వీర వెంకట చౌదరి, లేఖినిని రూపొందించాడు . కంప్యూటర్లో తెలుగు వాడకం తొలినాళ్లలో అంగ్ల అక్షరములు తెలుగులోకి మార్చేదిగా ఇది రూపు దిద్దుకుంది, బాగా వాడుకలోకి వచ్చింది. దీని తరువాత దాదాపు ఇదే పద్ధతిలో నేరుగా ఉపకరణాలలో రాసే ఇతర ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ తాజాపరిచిన యూనీకోడ్ తో సరిపోయే కొత్త రూపం విడుదలవుతున్నది.
దీనిలో ఇంగ్లీషు అక్షరాలు టైపు చేసే పెట్టె పైన దానిని తర్జుమా చేసి తెలుగులో చూపించి పెట్ట క్రింది విభాగంలో వుంటుంది. తెలుగు అక్షరాల కొరకు ఇంగ్లీషు అక్షరాల జతచేసే పట్టి కుడి ప్రక్క వుంటాయి. అక్షరఅక్షరానికి లేక పదం పూర్తయి ఖాళీ ప్రవేశపెట్టినతరువాత తెలుగులోకి మార్చేటట్లు ఎంపికచేసుకోవచ్చు.
లేఖిని ఇన్స్క్రిప్ట్
[మార్చు]లేఖిని ఇన్స్క్రిప్ట్[2] ద్వారా ఇన్స్క్రిప్ట్ నమూనాలో నేరుగా తెలుగు అక్షరాలు ప్రవేశపెట్టవచ్చు. తెరపై నమూనాకనబడుతుంది.దానికితగ్గట్టుకీ బోర్డు నొక్కాలి.
ఇవీ చూడండి
[మార్చు]వనరులు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- లేఖిని యొక్క అలెక్సా ర్యాంకింగ్ Archived 2010-10-08 at the Wayback Machine