వీవెన్
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
వీరపనేని వీర వెంకట చౌదరి | |
---|---|
జననం | వీరపనేని వీర వెంకట చౌదరి జూన్ 11, 1979 వర్ని, నిజామాబాద్ |
నివాస ప్రాంతం | హైదరాబాద్ |
ఇతర పేర్లు | వీవెన్ |
వృత్తి | బహుళ జాతి సంస్థలో మేనేజర్ |
ఉద్యోగం | S&P Capital IQ |
పదవి పేరు | ప్రాజెక్ట్ టీం లీడర్ |
వెబ్‌సైటు | |
www.veeven.com |
వీవెన్ గా అందరికీ సుపరిచితుడైన వీరపనేని వీర వెంకట చౌదరి తెలుగు భాషాభిమాని, తెలుగు సాంకేతిక నిపుణులు, తెలుగు స్థానికీకరణలో ఆధ్యులు. లినక్స్ లో ఉన్న చాలా సాఫ్ట్‌వేర్ ఉపకరణాలను స్థానికీకరించడంలో విశేష కృషి చేస్తారు.[1]
జీవిత చరిత్ర
[మార్చు]వీవెన్ నిజామాబాద్ జిల్లా వర్ని గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను ప్రస్తుతం హైదరాబాదులో నివాసం.
వృత్తి
[మార్చు]వీవెన్ వృత్తి రిత్యా హైదరాబాదులోని ఒక బహుళజాతి సంస్థలో మేనేజరుగా పనిచేస్తున్నారు.
ప్రవృత్తి
[మార్చు]తెలుగు వెబ్ డిజైనర్, ఈ-తెలుగు అసోసియేషన్ స్థాపకులలో ఒకరు. ఇతను కూడలికి, లేఖిని వెబ్ సైట్ల నిర్వాహకుడు.[2]
అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికై కృషి
[మార్చు]- ఇ-తెలుగు సంస్థ రూపొందించడంలోను, నిర్వహించడంలోనూ విశేష కృషి చేసారు. అంతర్జాలంలో తెలుగు వాడకం పై అవగాహన సదస్సులు నిర్వహించారు. దీనితో పాటు అంతర్జాలంలో తెలుగు టైపింగు సులభతరం చేయడానికి, తెలుగు సమాచారం పెరగడానికి దోహదపడేలా లేఖిని అనే ఉపకరణాన్ని రూపొందించారు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న తెలుగు భాషా సాంకేతిక వనరుల కేంద్రానికి సంబంధించిన సలహా మండలి సభ్యులుగా వీవెన్ తన సేవలను జూన్ 2011 నుండి అందజేస్తున్నారు.[3]
తెలుగు వికీపీడియాపై కృషి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ లాంచ్‌పాడ్ వద్ద వీవెన్ స్థానికీకరణ కృషి
- ↑ "తెలుగు వెలుగుల్లో సాంకేతిక సారథులు [[తెలుగు వెలుగు]],ఆగష్టు 2013". Archived from the original on 2013-09-03. Retrieved 2013-12-23.
- ↑ "ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సమాచార సాంకేతిక, ప్రసార మాధ్యమాల శాఖ, తెలుగు అంతర్జాల సలహా మండలి, జి.ఒ. ఎం. ఎస్. నం: 6, ది. 13.06.2011 (తెలుగు విజయం సైటులో)". Archived from the original on 2013-12-08. Retrieved 2013-12-20.