IT3 లిప్యంతరీకరణ
Appearance
IT3 అనగా ఇండిక్ ట్రాన్స్లిటరేషన్ లేక లిప్యంతరీకరణ. దీనిని భారతీయ డిజిటల్ లైబ్రరీ పుస్తకాల వివరాలు దత్తాంశం చేయడానికి వాడారు. అన్ని భారతీయ భాషలకు ఇది అనువుగా వుండి, భాషా పరిశోధనలో ఇతర లిప్యంతరీకరణలకన్నా (itrans లాంటి వాటికన్నా ) మెరుగుగావుంటుంది.[1]
ఐట్రాన్స్ తో పోల్చితే దీనిలో కేవలం ఆంగ్ల అక్షరాలలో పెద్దదా, చిన్నదా అన్న బేధం వుండదు. అక్షరాలు కాని గుర్తులు తక్కువగా వాడుతారు. వాటి వాడుక ఏకరీతిగా వుంటాయి. ఆంగ్ల అక్షరాల ఎంపిక టైపు చేయుటకు సులభంగా వుండేటట్లు, ధ్వనిలో దగ్గరగా వుండేటట్లు , ఆంగ్లంలాగా చదువుటకు సులువుగా వుండేటట్లు నిర్ణయించారు. పెద్దబడి అక్షరం లేక చిన్నబడి అక్షరము ఒకే ధ్వనికి వాడవచ్చు కాబట్టి, ఆంగ్ల నిర్మాణంలో పెద్ద అక్షరాలు వాక్యం మొదటిగా వాడటం వీలై కనబడటం, చదివేందుకు సౌలభ్యంగా వుంటుంది.
మూలాలు
[మార్చు]- ↑ N Balakrishnan. "Digital Library of India: A testbed for Indian Language Research". Retrieved 2020-01-15.