వాడుకరి:Chaduvari

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

నేనిక్కడ తొంభయ్యేడో వాణ్ణి. మాది కావూరు. నేనో నిర్వాహకుణ్ణి, ఓ అధికారినీ.

వాడుకరి:ChaduvariAWB పేరుతో నాకు మరొక వాడుకరిపేరు ఉంది. దాని పేరిట AWB సాయంతో మార్పుచేర్పులు చేస్తూంటాను. ఆ వాడుకరిని అందుకు తప్పించి మరెందుకూ వాడను.

సభ్యత్వాలు[మార్చు]

Flag of India.svg ఈ వాడుకరి భారతదేశ చరిత్ర ప్రాజెక్టులో సభ్యులు.
Telugu template.jpg ఈ వాడుకరి అక్షరదోష నిర్మూలన దళ సభ్యులు.
శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.

ప్రధాన పేరుబరిలో నా దిద్దుబాటు "సైజు" గణాంకాలు[మార్చు]

2016 జూలై నుండి నెలవారీగా నా వికీపీడియా గణాంకాలు. ప్రధాన పేరుబరి లోని దిద్దుబాట్లను మాత్రమే పరిగణించాను. దారిమార్పులు, తరలింపులను కూడా లెక్కలోకి తీసుకున్నాను.

నెల మొత్తం

దిద్దుబాట్ల సంఖ్య

(క)

పాఠ్యం "చేర్చిన"

దిద్దుబాట్ల సంఖ్య

(ఖ)

"చేర్చిన" బైట్లు

(గ)

"తొలగించిన" బైట్లు

(ఘ)

మొత్తం బైట్లు

(చేర్చినవి+తొలగించినవి)

(చ=గ+|ఘ|)

ఒక్కో చేర్పుకూ

"చేర్చిన" బైట్ల సంఖ్య

(గ/ఖ) బైట్లు/దిద్దుబాటు

ప్రతీ ఒక్క దిద్దుబాటుకూ

బైట్ల సంఖ్య

(చ/క) బైట్లు/దిద్దుబాటు

2016 జూలై 247 207 685,885 (49,154) 735,039 3,313 2,976
2016 ఆగస్టు 622 507 346,022 (144,582) 490,604 682 789
2016 సెప్టెంబరు 195 125 201,143 (51,132) 252,275 1,609 1,294
2016 అక్టోబరు 816 681 180,310 (97,652) 277,962 265 341
2016 నవంబరు 974 610 341,013 (267,966) 608,979 559 625
2016 డిసెంబరు 774 467 326,619 (419,188) 745,807 699 964
2017 జనవరి 294 210 335,750 (159,119) 494,869 1,599 1,683
మొత్తం/సగటు 3922 2807 2,416,742 (1,188,793) 3,605,535                    861 బైట్లు/దిద్దుబాటు                     919 బైట్లు/దిద్దుబాటు

కన్నతల్లి, జన్మభూమి, మాతృభాష[మార్చు]

కన్నతల్లి, జన్మభూమి, మాతృభాష -  ఈ మూడిటి కన్న మిన్నయైనది, గౌరవప్రదమైనది, ఆరాధనీయమైనది మరోటి లేదు. వీటిలో, మాతృభాషను తెలుగువారు ఉపేక్షిస్తున్నారు. మనభాషను మనమే చులకన చేస్తే మనమే పలుచన అవుతాం. తెలుగు జాతిని, తెలుగు భాషను, తెలుగు దేశాన్ని కాపాడుకోవాలని చెప్తూ కాకతీయుల సమకాలికుడైన నన్నెచోడ మహాకవి తెలుగు నిలుపుట అనే మాట చెప్పాడని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, తేరాల సత్యనారాయణ శర్మ రాసాడు. ఆనాడు భాషను కాపాడుకోవలసి వచ్చింది - పర దేశస్థుల దండయాత్రల నుండి, వారి సాంస్కృతిక దురాక్రమణల నుండి. ఇప్పుడు మాత్రం.. మనకు మనమే శత్రువులం. ఎంత విషాదం!

కొన్ని లింకులు[మార్చు]

వాడుకరి:Chaduvari/AWB ప్రయోగం వాడుకరి:Chaduvari/AWB వికీపీడియా:AutoWikiBrowser/Typos వాడుకరి:Chaduvari/అడవి రామవరం (దుమ్ముగూడెం)
వాడుకరి:Chaduvari/నేను సృష్టించిన మొలకలు వికీపీడియా:వికీప్రాజెక్టు అనాథాశ్రమం వికీపీడియా:అనాథ వాడుకరి:Chaduvari/మ్యాప్ప్రయోగాలు
వాడుకరి:Chaduvari/వికీవీడియోలు వాడుకరి:Chaduvari/ఎందుకని ఇలా..? వికీపీడియా:కొత్తపేజీ సృష్టించడం వీడియో

ఏది వికీపీడియా కాదు[మార్చు]

 • వికీపీడియా వంటల పుస్తకమా? కాదు
 • వికీపీడియా సినిమా పాటల పుస్తకమా? కాదు
 • వికీపీడియా మొలకల నర్సరీ మాత్రమేనా? కాదు
 • వికీపీడియా అనాథ పేజీల ఆశ్రమమా? కాదు
 • వికీపీడియా వ్యాసమంటే విషయం గురించిన ఉపోద్ఘాతం/నిర్వచనం/పరిచయం మాత్రమేనా ? కాదు
 • వికీలో ఏదో ఒకటి రాసి తీరాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేదు
 • పుంఖానుపుంఖంగా మొలకలు తయారు చేసి వికీలో పడెయ్యాల్సిన అవసరం ఉందా? వికీపీడియాకైతే లేదు
 • సమాచారమేమీ లేకుండా కేవలం శీర్షికలు, ఉపశీర్షికలతో పేజీలు నింపెయ్యడం అవసరమా? వికీపీడియాకు అలాంటి పేజీల అవసరం లే...దు

కొత్తవారికి[మార్చు]

కొత్త సభ్యుడు: వికీపీడియా అంతా గందరగోళంగా ఉంది. నేనూ ఇక్కడ రాయాలంటే ఏం చెయ్యాలి, ఎలా రాయాలి?: వికీపీడియను: నిజమే, కొత్తలో వికీపీడియా కొంత గందరగోళంగానే ఉంటుంది. (పాతబడ్డాక కూడా కొత్త కొత్తగానే ఉంటుం దిది) ఈ గందరగోళంలోంచి దారి చూసుకుని ముందుకు పోయేందుకు కొన్ని చిట్కాలు. అటూ ఇటూ చూడకుండా కింది లింకులను పోట్టుకుని వెళ్ళి పోండంతే!

 1. ముందుగా కొన్ని వ్యాసాలను చదవండి. ఆ వ్యాసాల ఆకృతిని పరిశీలించండి. ఎలా మొదలుపెడుతున్నారు (ఉపోద్ఘాతంతో), ఎలా ముగిస్తున్నారు (మూలాలు వనరులతో) వగైరాలను గమనించండి. ఉదాహరణకు ఈ వ్యాసాలు చూడండి: కలివికోడి, పొందూరు, యోగా, ఛందస్సు, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. ఈ వ్యాసాల్లో తప్పులేమైనా ఉన్నాయేమో గమనించండి. తప్పులు సరిదిద్దవచ్చు. అది మీ హక్కు అని మీకు చెబుతున్నాం. త్వరలోనే అది మీ బాధ్యతగా భావిస్తారు. అయితే, దిద్దుబాట్లు చెయ్యబోయే ముందు...
 2. వికీలో ఓ ఖాతా సృష్టించుకోండి: పేజీకి పైన కుడిపక్కన ఉన్న లింకును చూడండి, ఇక సృష్టించుకోండి.
 3. ..కున్నాక, లాగినవండి
 4. తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోండి. మీరు ఇంగ్లీషులో టైపు చేసుకుంటూ పోతుంటే, వికీపీడియా తెలుగులోకి మార్చుకుంటూ పోతుంది.
 5. పేజీకి పైన ఉన్న మీ పేరును నొక్కితే మీ వాడుకరి పేజీకి వెళ్తారు. అక్కడ మీకు కావలసిన ప్రయోగాలు చేసుకోవచ్చు.
 6. అక్కడ తెలుగులో రాయడం సాధన చెయ్యండి. రాయడానికి అలవాటు పడ్డాక, ఇక మొదలుపెట్టండి.
 7. ముందుగా..
  1. మీ ఊరి పేరుతో వెదకండి. (వెదకడానికి పేజీలో పైన కుడిపక్కన వెతుకుపెట్టె ఉంటుంది, చూడండి.) 90 శాతం మీ ఊరి పేరిట పేజీ ఉండే ఉంటుంది. ఉంటే, ఆ పేజీలో ఉన్న సమాచారాన్ని చదవండి. కొత్త సమాచారాన్ని చేర్చాలని అనిపిస్తే చేర్చెయ్యండి, వెనకాడకండి. తప్పు జరుగుతుందేమోనని భయపడకండి. తప్పులను సరిచేసుకుందాం. కానీ మీరు రాసే సమాచారంలో తప్పేమీ లేకుండా చూసుకోండి.
 8. పేజీకి ఎడమవైపున ఉన్న లింకులను చూసారా? కొన్ని లింకులను గురించి చెబుతా నిక్కడ:
  1. వికీపీడియాలో ఏ పని ఎలా చెయ్యాలో సహాయసూచిక చెబుతుంది.
  2. వికీపీడియాలో ఏం జరుగుతోందో ఇటీవలి మార్పులు చెబుతుంది.
  3. వికీపీడియాలో ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో చర్చించవచ్చు రచ్చబండ లో.
 9. వ్యాసాల్లో వాడుతున్న భాషలో మార్పులు చేసుకోవాల్సి ఉంది. వికీలో వ్యావహారికం వాడాలి. శిష్ట వ్యావహారికం వాడరాదు. సరళ గ్రాంథికం, శిష్ట గ్రాంథికం అసలే కుదరదు. కొన్ని ఉదాహరణలిక్కడ.
ఏం వాడకూడదు ఏం వాడాలి
వచ్చెను వచ్చాడు, వచ్చారు, వచ్చింది
మూలము మూలం
కలదు, కలవు ఉంది, ఉన్నాయి
కారణములు కలవు కారణాలున్నాయి / కారణాలు ఉన్నాయి

గమనిస్తూ ఉండాల్సినవి[మార్చు]

 • పేజీ నుండి బయటికి పోయే లింకులు
  • అగాధ పేజీలు
  • బాగా తక్కువ అంతర్గత లింకులున్న పేజీలు
 • పేజీకి వచ్చే లింకులు: అనాథ పేజీలు
 • పేజీ సైజు: మొలకలు
 • మూలాలు: మూలాల్లో దోషాలున్న పేజీలు

ఇతరత్రా.త్రా..త్రా...[మార్చు]

 • श्रीश्री: श्रीश्री: तेलुगु साहित्य की महाकवी श्रीरंगं श्रीनिवासराव (१९१० अप्रैल ३०- १९८३ जून, १५) है। वे श्रीश्री के नाम पर प्रसिद्ध हुये। क्रांतिकारी कवि के रूप मे, पारंपरिक, छंदोयुत् कवित्व को धिक्कार्ने वाले श्रीश्री, प्रगतिशील लेखक संघ के अध्यक्ष, और क्रांतिकारी लेखक संघ के संस्थापक अध्यक्ष रहे। फिल्म गीत लेखन मे भी वह प्रसिद्ध है।

గుర్తింపు[మార్చు]

ఇక్కడ నేను చేసిన పనులకు నాకు లభించిన బహుమతులివి:

తెవికీ మూలస్తంభాలలో ఒకరైన చదువరికి 10వేల దిద్దుబాట్లు పూర్తిచేసుకున్న సందర్భంగా వేసుకో ఒక ఘనమైన వీరతాడు - వైఙాసత్య
తెలుగు వికీ కొరకు విశేష సేవలందిస్తున్నందుకు విశ్వనాధ్ అందించే కృతజ్ఞతల చిరు బహుమతి
Certificate of komarraju lakshmanarao Award for who are given long and good service to Telugu Wikipedia (తెలుగు వికీపీడియాలో విశేషసేవలు అందించినందుకు కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార గ్రహీతలకు ఇవ్వబడిన ప్రశంసాపత్రం)