వికీపీడియా:వికీప్రాజెక్టు/వ్యక్తుల వర్గాల క్రమబద్ధీకరణ
స్వరూపం
వ్యక్తుల పేజీలకు చెందిన వర్గాలను క్రమబద్ధీకరించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం.
ప్రాజెక్టు మౌలిక విశేషాలు
[మార్చు]రచ్చబండలో జరిగిన ఈ చర్చ ఈ ప్రాజెక్టుకు మూలం. ఈ చర్చ సుప్రసిద్ధ వర్గాలకు మాత్రమే చెందినప్పటికీ, దీన్ని విస్తరించి మొత్తం వ్యక్తుల పేజీలన్నిటి వర్గాలను క్రమబద్ధీకరించే ప్రాజెక్టుగా రూపొందించే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రాజెక్టు రూపు దిద్దుకుంటోంది. ఈ సందర్భంగా ఈ చర్చను కూడా చూడాలి.
- ప్రాజెక్టు మొదలుపెట్టిన తేదీ: 2019 మే 23.
- ప్రాజెక్టు ఉద్దేశాలను అమలు చెయ్యడం మొదలుపెట్టిన తేదీ: 2019 ఏప్రిల్ 20. (పైన చూపిన మొదటి చర్చ ననుసరించి పనులు చెయ్యడం మొదలైంది. ఆ తరువాత దీన్ని ఒక ప్రాజెక్టుగా రూపొందించాలని భావించారు.)
ప్రాజెక్టు చేపట్టినప్పటి పరిస్థితి
[మార్చు]ప్రాజెక్టు చేపట్టిన నాటికి పరిస్థితి కింది విధంగా ఉంది:
- కొన్ని పేజీలు మాతృ, ఉప వర్గాలు రెంటిలోనూ ఉన్నాయి
- కొన్ని పేజీలు, వర్గాలు నిమ్నతమ వర్గంలో కాకుండా ఉచ్ఛవర్గాల్లో ఉన్నాయి
- మహిళలకు చెందిన పేజీలను కొన్నిటిని ప్రత్యేకంగా వర్గీకరించి నప్పటికీ అన్నీ పేజీలనూ చెయ్యలేదు.
- వృత్తిపరమైన వర్గాలు అన్నీ లేవు
- భౌగోళిక+వృత్తి పరమైన వర్గాలు అన్నీ లేవు
- ప్రసిద్ధ, సుప్రసిద్ధ, ప్రసిద్ధి చెందిన వర్గాలు ఉన్నాయి. (అప్పటికే కొన్నిటిని మార్చడం మొదలైంది)
- ఒకే వర్గానికి వివిధ రూపాల్లో పేర్లు ఉన్నాయి. ఉదా: కొన్ని వర్గాలకు ఆంధ్ర ప్రదేశ్.. అని, కొన్నిటికి ఆంధ్రప్రదేశ్.. అనీ పెట్టాం. వీటిని ఒక విధానం ప్రకారం మార్చాలి.
వర్గీకరణ విధానం
[మార్చు]ఒక పేజీని కింది వర్గాలుగా విభజించవచ్చు
- వృత్తిపరంగా/ప్రసిద్ధి పరంగా - న్యాయవాదులు, నటులు, రాజకీయ నాయకులు, స్వాతంత్ర్య సమర యోధులు
- వ్యక్తి ప్రాంతీయత/స్థానికత పరంగా - గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తులు, తిరుపతి వ్యక్తులు, తెలంగాణ వ్యక్తులు వగైరాలు
- లింగ పరంగా - రచయితలు/రచయిత్రులు, స్వాతంత్ర్య సమర యోధులు/మహిళా స్వాతంత్ర్య సమర యోధులు
- జాతి (ఎథ్నిసిటీ) పరంగా - తెలుగు వారు, తమిళులు,
- భాష పరంగా - తెలుగు రచయితలు, హిందీ కవులు, మలయాళ సినిమా నటులు వగైరాలు
వర్గీకరణ నియమాలు
[మార్చు]- అత్యల్పస్థాయిలో వర్గీకరణ
- పేజీని అత్యల్ప స్థాయి (నిమ్నతమ స్థాయి) వర్గంలోకి చేర్చాలనేది మౌలికమైన వర్గీకరణ నియమం. ఇక అంతకంటే తక్కువ స్థాయిలో వర్గాన్ని సృష్టించలేము అన్నమాట. అంటే జమున అనే గుంటూరు జిల్లాకు చెందిన సినిమా నటిని గుంటూరు జిల్లా వ్యక్తులు, సినిమా నటీమణులు అనే వర్గాల్లోకి కాకుండా గుంటూరు జిల్లా సినిమా నటీమణులు అనే వర్గం లోకి చేర్చాలి. ఈ వర్గం, గుంటూరు జిల్లా వ్యక్తులు, ఆంధ్ర ప్రదేశ్ సినిమా నటీమణులు అనే రెండు వర్గాల్లోకి చేరుతుంది. ఈ చివరి ఎండు వర్గాలు మరింత పైవర్గాల్లోకి చేరుతాయి.
- అత్యల్ప స్థాయికి కూడా ఒక హద్దుంది
- అయితే, ఏదైనా వర్గంలోకి చేర్చేందుకు ఒకటో రెండో పేజీల కంటే ఎక్కువ లేనపుడు, భవిష్యత్తులో పేజీలు వచ్చే అవకాశాలు కూడా లేవు అనుకున్నపుడు ఆ వర్గాన్ని సృష్టించ నవసరం లేదు. ఉదాహరణకు ఆవుల సాంబశివరావు అనే ఉపకులపతి మూల్పూరు గ్రామంలో పుట్టినంత మాత్రాన మూల్పూరు ఉపకులపతులు అనే వర్గాన్ని సృష్టించనక్కర్లేదు. అమృతలూరు మండలంలోని ఉపకులపతులు, గుంటూరు జిల్లా ఉపకులపతులు అనే వర్గాలు కూడా అక్కర్లేదు. ఎందుకంటే భవిష్యత్తులో మరి కొన్ని పేజీలు ఈ వర్గాల్లోకి చేరే అవకాశాలు లేవు.
- ఒక వర్గవృక్షంలో ఒక్కసారే
- ఒక పేజీని/వర్గాన్ని ఒక వర్గవృక్షంలోని అత్యంత దిగువ స్థాయి వర్గంలోకి మాత్రమే చేర్చాక, ఇక దాన్ని ఆ వర్గవృక్షంలోని పై వర్గాల్లోకి చేర్చరాదు. ఇతర వర్గ వృక్షాల్లోకి చేర్చవచ్చు. అంటే నల్లగొండ జిల్లా రచయితలు అనే వర్గం లోకి చేర్చిన నోముల సత్యనారాయణ అనే పేజీని, తెలంగాణ రచయితలు, రచయితలు అనే పైవర్గాల్లోకి చేర్చకూడదు.
- స్థానికత ఆధారంగా వర్గీకరణ
- వ్యక్తి స్థానికత ఆధారంగా పేజీలను వర్గీకరించవచ్చు. ఇవే భౌగోళిక+వృత్తిపర వర్గాలు. ఉదా: నల్గొండ జిల్లా రచయితలు, హైదరాబాదు వ్యాపారవేత్తలు వగైరా
- తెలుగువారు పేరుతో వచ్చే వర్గాలు
- తెలుగువారు పేరుతో వచ్చే వర్గాలు వేరే వర్గవృక్షంలోకి వస్తాయి. ఓ పేజీని భౌగోళిక+వృత్తిపర వర్గాలతో పాటు, తెలుగువారు.. వర్గాల్లోకి కూడా చేర్చవచ్చు. తెలుగువారు అంటే తెలుగు జాతికి చెందిన వారు. తెలుగు జాతి అంటే తెలుగు మాతృభాషగా కలిగినవారు. అలాంటి వ్యక్తి గుంటూరు జిల్లా వారైనా, అమెరికాలో స్థిరపడ్డవారైనా వారి పేజీలు ఈ వర్గవృక్షంలోకి చేరుతాయి. ఉదాహరణకు కొడవటిగంటి రోహిణీప్రసాద్ అనే పేజీ వర్గం:గుంటూరు జిల్లా శాస్త్రవేత్తలు అనే వర్గం లోకి మాత్రమే కాక, వర్గం:తెలుగువారిలో శాస్త్రవేత్తలు అనే వర్గంలోకి చేర్చవచ్చు. అంటే.., భౌగోళిక+వృత్తిపర వర్గవృక్షం, తెలుగువారు అనే వర్గవృక్షం - ఈ రెండూ సమాంతర వర్గవృక్షాలు. సముచితమైన పేజీలను ఈ రెండు వర్గాల్లోకీ చేర్చవచ్చు. ఈ పేజీని వర్గం:అమెరికా లోని తెలుగువారు అనే వర్గం లోకి గానీ, దాని ఉపవర్గంలోకి గానీ చేర్చవచ్చు.
- తెలుగు తో వచ్చే వర్గాలు
- తెలుగు తో మొదలయ్యే వర్గాలు మరొక వృక్షానికి చెందుతాయి. ఇవి భాషకు సంబంధించిన వర్గాలు. ఉదాహరణకు, తెలుగు భాషలో రాసేవాళ్ళ పేజీలన్నీ తెలుగు రచయితలు వర్గవృక్షంలోకి చేరుతాయి. ఉదాహరణకు, పైన చూపిన నోముల సత్యనారాయణ అనే పేజీని తెలుగు రచయితలు, హిందీ రచయితలు అనే రెండు ఇతర వర్గాల్లోకి చేర్చవచ్చు (ఇది భాషాపరమైన వర్గీకరణ). ఆ వర్గవృక్షాలు ఇలా ఉంటాయి:
- వర్గం:రచయితలు --> వర్గం:తెలంగాణ రచయితలు --> వర్గం:నల్గొండ జిల్లా రచయితలు --> నోముల సత్యనారాయణ
- |___________ వర్గం:తెలుగు రచయితలు --> నోముల సత్యనారాయణ
- |___________ వర్గం:హిందీ రచయితలు --> నోముల సత్యనారాయణ
- వర్గం:తెలుగువారు --> వర్గం:తెలుగువారిలో హిందీ రచయితలు --> నోముల సత్యనారాయణ. మళ్ళీ వర్గం:తెలుగువారిలో హిందీ రచయితలు అనే వర్గం, వర్గం:హిందీ రచయితలు అనే వర్గం లోకి కూడా చేరుతుంది.
- వీలైనన్ని ఎక్కువ వర్గాలు
- పేజీని వీలైనన్ని ఎక్కువ వర్గాల్లోకి చేర్చడమనేది వికీలో పాటించే ఒక సామాన్య నియమం.
చర్చించాల్సినవి
[మార్చు]కింది అంశాలపై చర్చా పేజీలో చర్చించగలరు.
- ఆంధ్రప్రదేశ్.. ను ఆంధ్ర ప్రదేశ్.. అని మార్చాలని ప్రతిపాదన. ఉదాహరణలు వర్గం:ఆంధ్రప్రదేశ్ శాస్త్రవేత్తలు అనే వర్గాన్ని వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాస్త్రవేత్తలు అనే వర్గంగా మార్చాలి. ఈ విషయంపై గతంలో చర్చ జరిగింది. (అది వెతకాలి).
- అలాగే తెలంగాణ, తెలంగాణా
- భారత, భారతీయ అనే రెండు పదాలను వర్గాల పేర్లలో ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా వాడుతున్నాం. దీన్ని సరి చేసుకోవాలి.
- గుంటూరు జిల్లా సినిమా నటులు అంటూ వాడుతున్నాం. గుంటూరు జిల్లాకు చెందిన సినిమా నటులు అని వాడటం లేదు. వర్గం పేరు కచ్చితమైన, వ్యాకరణోచితమైన వాక్యంగా ఉండాల్సిన అవసరం లేదు అనేది దీని వెనుక ఉన్న భావన. దీనిపై వాడుకరుల అభిప్రాయం తెలుసుకోవాలి.
- వ్యక్తి పుట్టిన ప్రదేశానికి చెందిన వర్గంలో కూడా పేజీని చేర్చాలా? కొడవటిగంటి రోహిణీప్రసాద్ పుట్టినది గుంటూరు జిల్లా, ఎక్కువగా నివసించినది అమెరికా అయితే ఈ రెండు ప్రాంతాలకు సంబంధించిన వర్గాల్లోనూ చేర్చాలా అనేది నిర్ణయించుకోవాలి.
- మాజీ శాసనసభ్యులు, మాజీ లోక్‌సభ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు -ఇలా మాజీ అనే వర్గాలుండాలా?
నమూనా
[మార్చు]పాల్గొంటున్న వారు
[మార్చు]- చదువరి (చర్చ • రచనలు)
- పవన్ సంతోష్ (చర్చ)
ప్రాజెక్టు పురోగతి, స్థితిగతులు
[మార్చు]2019 జూలై 18 నాటికి చదువరి చేసిన పని పురోగతి ఇలా ఉంది.
- భౌగోళిక+వృత్తిగత వర్గీకరణ: అసలు ఈ ప్రాజెక్టు పని మొదలైన ఉద్దేశం ప్రధానంగా ఇదే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల పేజీల - గతంలో వివిధ జిల్లా వ్యక్తులు వర్గాల్లో ఉన్నవి - భౌగోళిక+వృత్తిగత వర్గీకరణ పూర్తైంది. ఆ వర్గాల లోకి చేరని పేజీలను కూడా కొన్నిటిని చేర్చాను. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జిల్లాల వ్యక్తుల పుట్టిన ఊరి విషయంలో సందేహాలున్న వాటిని వర్గీకరించలేదు. వాటిని జన్మస్థలం తెలియని వ్యక్తులు వర్గం లోకి చేర్చాను.
- జన్మస్థలం స్పష్టంగా తెలియని వ్యక్తుల పేజీలను వర్గం:జన్మస్థలం తెలియని వ్యక్తులు అనే వర్గంలోకి చేర్చాను. వాడుకరులు వీటిపై పని చెయ్యాల్సిందిగా రచ్చబండలో కోరాను.
- గతంలో ఏ భౌగోళిక వర్గంలోకీ చేరని, అసలు ఏ వర్గంలోకీ చేరని పేజీలు ఉన్నాయి. వాటిని వెతికి పట్టుకుని సముచితంగా వర్గీకరించాలి. ఈ పని చేస్తున్నాను. ఇప్పటికి దాదాపు డెబ్భై ఎనభై దాకా అలాంటి పేజీల వర్గీకరణ జరిగింది.
- "ఆంధ్ర ప్రదేశ్" కు చెందిన వ్యక్తుల పేజీల వర్గాలను "ఆంధ్రప్రదేశ్" గా మార్చాను.
- తెలంగాణకు చెందిన శాసన సభ్యులు, లోక్‌సభ సభ్యులు, మంత్రులు వగైరాలు, ఉమ్మడి రాష్ట్రానికి చెందిన వారిని, ప్రత్యేక రాష్ట్రానికి చెందిన వారినీ స్పష్టంగా వర్గీకరించాను. ఉదాహరణకు, "ఫలానా జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు", "ఫలానా జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు" అనే రెండు వర్గాలుంటాయన్న మాట. వర్గం పేరులో రాష్ట్రం పేరు లేకపోతే అది తెలంగాణ అన్నమాట.
- కొన్ని ప్రత్యేక వర్గాలను కాయించాను. ఉదా: వర్గం:ఆత్మకథ రాసుకున్న ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు, వర్గం:మారుపేరు కలిగిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు + అందులోని ఉపవర్గాలు, వర్గం:విధి నిర్వహణలో మరణించినవారు, వర్గం:ఆంధ్ర రాష్ట్రం + అందులోని ఉపవర్గాలు, వర్గం:మద్రాసు ప్రెసిడెన్సీలో శాసన సభ్యులుగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు, వర్గం:మద్రాసు ప్రెసిడెన్సీలో మంత్రులుగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు, వర్గం:మద్రాసు రాష్ట్రంలో శాసన సభ్యులు.. మొదలైనవి. ఇలాంటివి పాతిక ముప్పై పైనే సృష్టించాను.
- అడ్డుకోత: ఈసరికే ఉన్న వర్గాలను విస్తరించి, మరింత సూక్ష్మ వర్గాలను సృష్టించాను. వర్గం:కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీతలు, వర్గం:కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు, వర్గం:కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీతలు, వర్గం:కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ పురస్కార గ్రహీతలు, వర్గం:కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీతలు అనే ఇతర వర్గాలుగా విభజించాను
- కళాకారులు వంటి స్థూల వర్గాలను కూడా సూక్ష్మీకరించాను.
- నిట్ట నిలువు విభజన: కొని వర్గాల లోని పేజీలను తీసి, అదే వర్గపు ఉపవర్గాల్లోకి చేర్చాను. ఉదా: వర్గం:కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు అనే వర్గం లోని కొన్ని పేజీలను, వర్గం:కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ రచయితలు, వర్గం:కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ రచయిత్రులు, వర్గం:కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తెలంగాణ రచయితలు, వర్గం:కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తెలంగాణ రచయిత్రులు, వర్గం:కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తెలుగు రచయితలు, వర్గం:కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచయిత్రులు అనే ఉపవర్గాల లోకి చేర్చాను.
- మహిళల వర్గాలు: మహిళలకు ప్రత్యేక వర్గాలను సృష్టించాను. భౌగోళిక+వృత్తిగత వర్గాల్లోనే కాక, ఇతర అంశాల వర్గాల్లోనూ మహిళా వర్గాలను సృష్టించాను. తెలంగాణ మహిళలు, జగిత్యాల జిల్లా మహిళలు, మహబూబ్ నగర్ జిల్లా మహిళలు లాంటి వర్గాల ద్వారా మహిళల పేజీలను చూడవచ్చు.
- ఇంకా చెయ్యాల్సినవి: వర్గీకరణ అనేది నిరంతర ప్రక్రియ. ఒక చోట చుక్క పెట్టేది కాదు. జరుగుతూనే ఉంటుంది. అయితే, ప్రస్తుత ప్రాజెక్టులో భాగంగా కొన్ని పనులు చెయ్యాల్సి ఉంది:
- ఇతర ప్రాంతాలు, దేశాలకు చెందిన వ్యక్తుల పేజీలను భౌగోళిక+వృత్తిగత వర్గీకరణ చెయ్యాలి.
- వర్గం:జన్మస్థలం తెలియని వ్యక్తులు లోని పేజీల సంగతి చూడాలి.
- గతంలో ఏ భౌగోళిక వర్గంలోకీ చేరని, అసలు ఏ వర్గంలోకీ చేరని పేజీలను వర్గీకరించే పనిని కొనసాగించాలి.
- "తెలుగువారిలో", "తెలుగు " మొదలైన పదాలతో మొదలయ్యే వర్గాలను క్రమబద్ధీకరించాలి. ఇది ఇంకొక పెద్ద పని. బహుశా నేనొక్కణ్ణీ చేస్తే చాన్నాళ్ళు పట్టే పని.
- ఇంకా కొన్ని ప్రత్యేక వర్గాలను (వర్గం:ఆత్మకథ రాసుకున్న ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు లాంటి వాటిని) కాయించాలి. ఉదాహరణకు: పత్రికల్లో శీర్షికలు నిర్వహించిన వ్యక్తులు --> దినపత్రికల్లో శీర్షికలు నిర్వహించిన వ్యక్తులు --> వారపత్రికల్లో శీర్షికలు నిర్వహించిన వ్యక్తులు, అంగ వైకల్యం ఉన్న వ్యక్తుల వర్గీకరణ, మొదలైనవి.
పై పనుల పైన, ఇంకా చెయ్యాల్సిన పనుల పైనా వాడుకరులు తమ అభిప్రాయాలు, సూచనలను చర్చాపేజీలో చెప్పాలని విజ్ఞప్తి. __చదువరి (చర్చ • రచనలు) 01:53, 19 జూలై 2019 (UTC)