నా పేరు ఎస్. పవన్ సంతోష్. తెలుగు వికీపీడియా ద్వారా నాకు తెలిసిన ప్రదేశాల వివరాలు, పుణ్యక్షేత్రాల విశేషాలు, సుప్రసిద్ధ వ్యక్తులు వీటన్నిటిలోనూ చరిత్ర, అన్నిటికన్నా ముఖ్యంగా నాకు ఆసక్తి ఉన్న సాహిత్యరంగం, నా రంగమైన ఔషధరంగం వంటి విషయాల్లో తెవికీ వ్యాసాలు రాసి అభివృద్ధి చేస్తున్నాను. ప్రస్తుతం నేను సీఐఎస్-ఎ2కెలో కమ్యూనిటీ అడ్వొకేట్ (తెలుగు) గా పనిచేస్తున్నాను. ఆ ఉద్యోగ బాధ్యతలకు సంబంధించి చేయాల్సిన మార్పులను వాడుకరి:Pavan Santhosh (CIS-A2K) అన్న ఖాతా ద్వారా చేస్తున్నాను. ఐతే జనవరి 2018 వరకూ నా స్వచ్ఛంద కృషికీ, అధికారిక కార్యకలాపాలకు ఒకే అక్కౌంట్ వాడడం వల్ల ఈ ఖాతా వికీపీడియా పేరుబరిలో చేసిన మార్పుల్లో పేరు వెనుక (సీఐఎస్-ఎ2కె) అని చేర్చి సంతకం పెట్టడం కనిపిస్తూంటుంది.
ఒక పేజీకి బొమ్మను చేర్చడానికి [[బొమ్మ:పేరు.jpg|లేబెల్]] అని మీరు బొమ్మను చేర్చదలచిన ప్రదేశంలో ఉంచండి. "|" ను ఉపయోగించి ఇతర ఆప్షన్స్ను కూడా వాడుకోవచ్చు. ఉదాహరణకు [[బొమ్మ:పేరు.jpg|thumb|180px|కాప్షన్]] అని వ్రాస్తే ఆ బొమ్మయొక్క నఖచిత్రం కుడివైపు అలైన్ చేయబడి 180 పిక్సెల్స్ సైజ్తో "కాప్షన్" అనే కాప్షన్ చేర్చబడుతుంది. ఒకవేళ బొమ్మను ఎడమవైపుకు చేర్చాలనుకుంటే [[బొమ్మ:పేరు.jpg|left]] అని వ్రాస్తే ఫుల్సైజ్ బొమ్మ ఎడమవైపుకు చేర్చబడుతుంది. ఒకవేళ బొమ్మకు "jpg" ఎక్స్టెన్షన్ కాకుండా ఇతర ఎక్స్టెన్షన్ ఉంటే చుక్క తర్వాత ఆ ఎక్స్టెన్షన్ను చేర్చాలి (svg, gif లాంటివి).
సంతోష్ గారూ తెవికీలో మీ సాహితీ పవన పయనం చాలా చక్కగా వున్నది. తెలుగు సాహిత్యానికి సంబంధించిన వ్యాసాల అభివృద్దికి చేస్తున్న కృషికి అందుకోండి ఈ పతకం ___అహ్మద్ నిసార్.
అసాధారణమైన కొత్త తెవికీ సభ్యులు పురస్కారం
తెవికీలో చేరి కొన్నాళ్లే అయినా, చక్కగా వికీ పద్ధతిలో, వికీ అవగాహన ఉన్న సభ్యుడికి మల్లే తెలుగు సాహిత్యరంగానికి సంబంధించిన వ్యాసాలు వ్రాస్తూ, తెవికీ అభివృద్ధికి తోడ్పడుతున్న పవన్ సంతోష్ గారికి తెవికీ సభ్యులందరి తరఫున ఈ వన్నెల చిన్నెల సీతాకోకచిలుక పతకాన్ని ప్రదానం చేస్తున్నాను. వైజాసత్య (చర్చ) 07:21, 30 జనవరి 2014 (UTC)
పుస్తకం.నెట్ జాలపత్రికలో నేను చేసిన రచనలు పదుల సంఖ్యలోకి చేరడంతో ఈ టాగ్ కింద పోగుజేశారు నా రచనలన్నీ. ఆర్టికల్స్ ఆఫ్ సూరంపూడి పవన్ సంతోష్ అన్న టాగులో అవన్నీ ఉన్నాయి.
సారంగ సాహిత్య పత్రికలో కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాసాలు రాసాను. చదవడానికి ఇక్కడ
ఇవి కాక తెలుగు వెలుగు పత్రికలో "ఏడు తరాల నీడ", "తెలుగు కథలకు శ్రీపాదం", "కలికి చిలకల కొలికి" వ్యాసాలు, ఒక పుస్తక సమీక్ష ప్రచురితమయ్యాయి.
User:Adityamadhav83 ఎక్కిస్తున్న ఫోటోలు చాలా బావున్నాయి. ప్రత్యేకించి తెవికీకి పనికివస్తాయి. ఈయన కామన్సులో ఏమేం ఎక్కిస్తున్నారో గమనిస్తూ, వాటిని తెలుగు వికీపీడియాలో వాడుకోవచ్చు.