మాస్తి వెంకటేశ అయ్యంగార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాస్తి వెంకటేశ అయ్యంగార్
33 KB
మాస్తి వెంకటేశ అయ్యంగార్
జననం6 జూన్ 1891
మరణం6 జూన్ 1986
బెంగుళూరు
వృత్తిమైసూర్ సివిల్ సర్వీసెస్ అధికారి
ఉద్యోగంకృష్ణరాజ వడియార్-4(మైసూర్ మహారాజు)
మతంహిందూ

మాస్తి వెంకటేశ అయ్యంగార్ ప్రముఖ కన్నడ రచయిత. ఆయన తన రచనలకుగాను భారతీయ సాహిత్య రంగంలో అత్యుత్తమ పురస్కారమైన భారతీయ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన ఈ పురస్కారాన్ని అందుకున్న నాలుగో కన్నడ రచయిత.[1] వీరు ముఖ్యంగా తన చిన్నకథలకు ప్రసిద్ధులు. ఆయన చిన్నకథల పుస్తకానికి "కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం" పొందారు. శ్రీనివాస అనే కలం పేరుతో ఆయన రచనలు చేశారు. కన్నడ సాహిత్య రంగంలో మాస్తి కన్నడద ఆస్తి (మాస్తి కన్నడకు ఆస్తి) అన్న సూక్తి బహుళ ప్రచారం పొందింది.

వృత్తి, జీవిత విశేషాలు[మార్చు]

మాస్తి వెంకటేశ అయ్యంగార్ 1891లో నేటి కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లాలోని కోసహళ్ళిలో[ఆధారం చూపాలి]తమిళ వైష్ణవ కుటుంబంలో జన్మించారు.[2] కళాశాల విద్యను అభ్యసించిన మాస్తి మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో ఎం.ఎ. పొందారు. మైసూరు మహారాజా ప్రభుత్వంలో మైసూరు సివిల్ సర్వీసెస్ లో చేరి కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. అంచెలంచెలుగా జిల్లా కమీషనర్ బాధ్యతల్లో పనిచేశారు. దివాన్ పదవికి అన్ని విధాలా అర్హుడైనా తనకన్నా తక్కువ సంవత్సరాల సర్వీసు ఉన్న సహోద్యోగికి ఆ పదవిని ఇవ్వడాన్ని నిరసిస్తూ రాజీనామా చేశారు.

మరణం[మార్చు]

ఈయన బెంగళూరు లో 6 జూన్ 1986 న చనిపోయాడు.

రచన రంగం[మార్చు]

కన్నడ సాహిత్యంలో చిన్నకథల ప్రక్రియ వికాసంలో మాస్తి వెంకటేశ అయ్యంగార్ ది ప్రాధాన పాత్ర. తొలుత ఇంగ్లీష్ భాషలో రచనలు చేసిన మాస్తి అనంతరం కన్నడ భాషలో రాయడం ప్రారంభించారు. పలు నవలలు, నవలికలు, చిన్న కథలు తదితర ప్రక్రియల్లో మాస్తి ఎన్నో రచనలు చేశారు. ఆయన 17 ఆంగ్ల పుస్తకాలు, 123 కన్నడ గ్రంథాలు రచించారు.

రచనలు[మార్చు]

  1. చిక్కవీర రాజేంద్ర
  2. మాస్తి చిన్నకథలు[3]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Jnanapeeth Awards". Ekavi. Archived from the original on 27 ఏప్రిల్ 2006. Retrieved 31 అక్టోబరు 2006.
  2. Iyengar, Masti Venkatesha; Sharma, Ramachandra (August 2019). Masti (in ఇంగ్లీష్). Katha. ISBN 978-81-87649-50-2.
  3. మాస్తి వెంకటేశ అయ్యంగార్ (1999). మాస్తి చిన్నకథలు. Translated by జి.ఎస్ మోహన్. Retrieved 2020-07-13.