తారాశంకర్ బందోపాధ్యాయ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

తారాశంకర్ బందోపాధ్యాయ్ (23 జూలై 1898[1] - 14 సెప్టెంబర్ 1971) ప్రముఖ బాంగ్లా నవలా రచయిత. ఈయన 65 నవలలు, 53 కథా సంకలనాలు, 12 నాటకాలు, 4 వ్యాస సంకలనాలు, 4 ఆత్మకథలు, 2 యాత్రా వర్ణనలురాసారు. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈయన రబీంద్ర పురస్కార్, సాహిత్య అకాడెమీ పురస్కారం, జ్ఞానపీఠంతో పాటుగా పద్మభూషణ్ కూడా అందుకున్నారు.

జీవితం[మార్చు]

బందోపాధ్యాయ్ (ప్రస్తుత పశ్చిమ బెంగాల్) అప్పటి బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్ ప్రావిన్స్ లోని బీర్భూమ్ జిల్లాలోని లాభ్పుర్ గ్రామంలో వారి పూర్వీకుల ఇంట్లో పుట్టారు. ప్రభావతీ దేవీ, హర్దాస్ బందోపాధ్యాయ్ వీరి తల్లిదండ్రులు. ఈయన లాభ్పుర్ జాదబ్లాల్ హెచ్.ఈ. స్కూలు నుండి 1916లో మెట్రిక్యులేషన్ పరీక్ష ప్యాసయ్యారు. ఆపై మొదట సెంట్ జేవియర్ కళాశాల కలకత్తాలో తరువాత సౌత్ సబర్బన్ కాలేజీ (ప్రస్తుతం ఆశుతోష్ కాలేజీ) లో చదివారు. సెంట్ జేవియర్ కళాశాలలో చదువుతుండగా సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనటం వలన, ఆరోగ్యం సరిగా ఉండకపోవటం వలన యూనివర్సిటీ చదువు కొనసాగించలేకపోయారు. 1930లో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనటం వలన జైలుకు వెళ్ళవలసి వచ్చింది, అయితే సంవత్సర కాలం తరువాత విడుదలయ్యారు. ఆ తరువాత ఆయన పూర్తి స్థాయిలో సాహిత్యాన్ని చేపట్టాలనుకున్నారు. 1932లో రబీంద్రనాథ్ ఠాగూర్ని శాంతినికేతన్ వద్ద మొదటి సారి కలిశారు. ఇదే సంవత్సరంలో బందోపాధ్యాయ్ మొదటి నవల చైతాలి ఘుర్నీ వెలువడింది. 1940లో ఆయన తన కుటుంబాన్ని కలకత్తాలోని బాగ్బజార్‌కు మార్చారు. 1941లో బారానగర్ కు మారారు. 1942లో బీర్భూం జిల్లా సాహిత్య సదస్సును నిర్వహిస్తూ, ఫాసిస్ట్-విరుద్ధ రచయితలు మరియు కళాకారుల సంఘానికి కలకత్తాకు గానూ అధ్యక్షులయ్యారు. 1944లో కాన్పుర్ బెంగాలీ సాహిత్య కాన్ఫరెన్సుకు అధ్యక్షుడిగా ఉన్నారు.

బందోపాధ్యాయ్ ఆయన స్వగృహంలో 1971 సెప్టెంబర్ 14న కన్నుమూసారు. ఉత్తర కలకత్తాలోని నింతలా శ్మశానవాటికలో ఆయన అంతిమసంస్కారాలు జరిగాయి.

మూలములు[మార్చు]

  1. తారాశంకర్ బందోపాధ్యాయ్ పై తీయబడిన డాక్యుమెంటరీ