Jump to content

ఇంటెగ్రేటెడ్ అథారిటీ ఫైల్

వికీపీడియా నుండి
Gemeinsame Normdatei
GND: జర్మన్ జాతీయ లైబ్రరీ
తెరపట్టు.
పొడి పేరుGND
ప్రవేశపెట్టిన తేదీ5 ఏప్రిల్ 2012 (2012-04-05)
నిర్వహించే సంస్థజర్మన్ జాతీయ లైబ్రరీ
ఉదాహరణ7749153-1

ఇంటిగ్రేటెడ్ అథారిటీ ఫైల్‌ లేదా GND అనేది కేటలాగ్‌ల లో ఉండే వ్యక్తిగత పేర్లు, సబ్జెక్ట్ శీర్షికలు, కార్పోరేట్ సంస్థలను క్రోడీకరించే అంతర్జాతీయ అధికార ఫైల్ . దీన్ని యూనివర్సల్ అథారిటీ ఫైల్ అని కూడా పిలుస్తారు. జర్మను భాషలో దీని పేరు జెమీన్‌సేమె నార్మ్‌డాటే. దీన్ని ప్రధానంగా లైబ్రరీలలో డాక్యుమెంటేషన్ కోసం, ఆర్కైవ్‌లు, మ్యూజియంలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. GND ని జర్మన్ నేషనల్ లైబ్రరీ జర్మన్ మాట్లాడే యూరప్‌లోని వివిధ ప్రాంతీయ లైబ్రరీ నెట్‌వర్క్‌లు, ఇతర భాగస్వాముల సహకారంతో నిర్వహిస్తుంది. GND క్రియేటివ్ కామన్స్ జీరో (CC0) లైసెన్స్ కిందకు వస్తుంది. [1]

GND స్పెసిఫికేషన్, లైబ్రరీ వర్గీకరణలో ఉపయోగపడే ఉన్నత-స్థాయి ఎంటిటీలు, ఉప-తరగతుల యొక్క క్రమానుగతాన్ని అందిస్తుంది. ఒక్కొక్క అంశాన్నీ సందిగ్ధాతీతంగా గుర్తించే విధానాన్ని అందిస్తుంది. ఇందులో సెమాంటిక్ వెబ్‌లో జ్ఞాన ప్రాతినిధ్యం కోసం ఉద్దేశించిన ఆన్టాలజీని కూడా ఉంటుంది. ఇది RDF ఫార్మాట్‌లో అందుబాటులో ఉంటుంది. [2]

GND 2012 ఏప్రిల్‌లో పని చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత కింది అధికార ఫైల్‌ల కంటెంట్‌ను అందులో విలీనం చేసి, వాటిని నిలిపివేసారు:

  • PND (నేం అథారిటీ ఫైల్)
  • GKD (కార్పొరేట్ బాడీస్ అథారిటీ ఫైల్)
  • SWD (సబ్జెక్ట్ హెడింగ్స్ అథారిటీ ఫైల్)
  • DMA-EST (యూనిఫార్ం టైటిల్ ఫైల్ ఫర్ ది జర్మన్ మ్యూజిక్ ఆర్కైవ్)

దీన్ని GND-ID అనే ఐడెంటిఫైయర్‌ల ద్వారా సూచిస్తారు.

2012 ఏప్రిల్ 5 న ప్రవేశపెట్టిన నాడు, GND లో 26,50,000 పేర్లతో సహా 94,93,860 ఫైళ్ళున్నాయి. 

GND ఉన్నత-స్థాయి ఎంటిటీల రకాలు

[మార్చు]

GND ఎంటిటీలలో ఆరు ప్రధాన రకాలు ఉన్నాయి: [3]

టైప్ చేయండి జర్మన్ (అధికారిక) ఆంగ్ల అనువాదం)
p వ్యక్తి వ్యక్తి
కె Körperschaft కార్పొరేట్ శరీరం
v Veranstaltung సంఘటన
w Werk పని
లు Sachbegriff సమయోచిత పదం
g Geografikum భౌగోళిక స్థల పేరు

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Integrated Authority File (GND)
  2. GND Ontology – Namespace Document Archived 2013-01-03 at the Wayback Machine, version 2012-06-30.
  3. „Entitätencodierung – Vergaberichtlinien“ (pdf)