మహాదేవి వర్మ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మహాదేవి వర్మ | |
|---|---|
![]() మహాదేవి వర్మ | |
| జన్మ నామం | महादेवी वर्मा |
| జననం | 1907 మార్చి 26 ఫారుఖ్రాబాద్ , బ్రిటిష్ ఇండియా |
| మరణం | 1987 సెప్టెంబరు 11 (వయసు: 80) అలహాబాద్, ఉత్తరప్రదేశ్, భారతదేశం |
| వృత్తి | నవల రచయిత , కవయిత్రి |
| భాష | Hindi |
| జాతీయత | భారతీయురాలు |
| విద్య | ఎం ఏ సంస్కృతం , అలాహాబాద్ యూనివర్సిటీ |
| సాహిత్య ఉద్యమం | చయవాడ్ |
| ప్రసిద్ధ రచనలుs | యమ మేరా పరివార్ పాత్ కె సాథీ |
| ప్రసిద్ధ పురస్కారాలు |
|
| దాంపత్యభాగస్వామి | డా. స్వరూప్ నారాయణ్ వర్మ |
| సంతకం | |
మహాదేవి వర్మ (ఏప్రిల్ 27, 1907 - సెప్టెంబర్ 11, 1987) ఆధునిక హిందీ కవయిత్రులలో ఒకరు. హిందీ సాహిత్యంలో ఛాయవాద యుగానికి మూల స్తంభాలుగా భావించబడే నలుగురు సాహిత్యకారులలో ఆమె ఒకరు. ఆధునిక హిందీ కవిత్వంలో ఆమె సేవలకు గాను ఆమెను ఆధునిక మీరా అని కూడా అంటారు. కవి సూర్యకాంత్ త్రిపాఠీ నిరాలా ఈమెను విశాల హిందీ మందిరపు సరస్వతి గా అభివర్ణించాడు.[1]
స్వాతంత్ర్యానికి పూర్వపు భారతదేశంలోనూ, స్వతంత్ర భారతదేశంలోనూ నివసించిన ఈమె బహుళ సమాజంలో పనిచేస్తూనే భారతదేశంలో అంతర్లీనంగా ఉన్న ఉద్వేగాలను, ఆక్రోదనలను చూసి, పరిశీలించి, అంధకారాన్ని పోగొట్టే దృష్టిని ఇవ్వటానికి ప్రయత్నించిన కవుల్లో ఒకర్తె. ఈమె కవితలే కాకుండా ఈమె చేపట్టిన సమాజోద్ధరణా పనులు, మహిళాచైతన్యం కోసం చేసిన కృషి ఈ దృష్టితోనే ప్రభావితమైనవి. ఈమె మానసిక క్షోభను ఎంత హృద్యంగా వర్ణించిందంటే దీపశిఖలో అది ప్రతి మనిషి యొక్క వేదనగా అందరి హృదయాలను హత్తుకుంది. అది పాఠకులనే కాకుండా సమీక్షకులను కూడా లోతుగా ప్రభావితం చేసింది.
ఈమె ఖరీబోలీ హిందీ మాండలికంలో వ్రాసిన కవితల్లో అప్పటివరకు కేవలం భృజ్ భాషలోనే సంభవమని అనుకొన్నంత మృదువైన శబ్దాలను పలికించింది. దీని కోసం ఆమె తన సమయంలో వాడకంలో ఉన్న సంస్కృత, బెంగాలీ భాషలలోని మృదువైన పదాలను ఎన్నుకొని వాటికి హిందీ తొడుగులు తొడిగింది. సంగీతంతో పరిచయముండటం వల్ల ఈమె పాటల నాథ సౌందర్యం, లయబద్ధమైన వ్యంజనాల శైలి అనితరసాధ్యమైనది. అధ్యాపకురాలిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి పదవీ విరమణ చేసే కాలానికి ప్రయాగ మహిళా విద్యాపీఠం యొక్క ప్రధానాచార్యులైంది. ఈమెకు బాల్యవివాహమైనా జీవితం మొత్తం అవివాహిత మాదిరిగానే గడిపింది. ప్రతిభావంతమైన కవయిత్రి, గద్య రచయితైన మహాదేవి వర్మ సాహిత్య, సంగీతాల్లో నైపుణ్యంతో పాటు చక్కటి చిత్రకారిణి, సృజానాత్మక అనువాదకురాలు కూడా. ఈమెకు హిందీ సాహిత్యంలోని అన్ని ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలను అందుకొన్న గౌరవము దక్కింది. భారత సాహిత్యాకాశంలో మహాదేవివర్మ ధ్రువతారగా వెలుగుతున్నది. గత శతాబ్దంలో అత్యంత లోకప్రియమైన మహిళా సాహిత్యకారిణిగా మహాదేవివర్మ వెలుగొందింది. 2007లో ఈమె జన్మ శతాబ్ది ఉత్సవాలు జరుపబడినవి.
పోస్టల్ స్టాంప్
[మార్చు]
1991, సెప్టెంబరు 16న ఆమె పేరుమీద భారత ప్రభుత్వం రూ. 2 విలువగల పోస్టల్ స్టాంపును విడుదల చేసింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Mahadevi Varma". /www.financialexpress.com. financialexpress. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 April 2018.
- ↑ "Postage Stamps: Commemorate section". postagestamps.gov.in. the original నుండి 23 నవంబరు 2018 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 December 2020.
- విస్తరించవలసిన వ్యాసాలు
- జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- 1907 జననాలు
- 1987 మరణాలు
- హిందీ కవయిత్రులు
- రచయిత్రులు
- సాహితీకారులు
- పద్మభూషణ పురస్కారం పొందిన మహిళలు
- పద్మ పురస్కారాలు
- కవులు
- సాహిత్యం
- భారతీయ కవయిత్రులు
- భారతీయ మహిళలు
- భారతీయ సాహిత్యవేత్తలు
- భారతీయులు

