బాల్‌చంద్ర నెమాడే

వికీపీడియా నుండి
(బాలచంద్ర నెమాడే నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

నెమాడే

బాల్‌చంద్ర వనాజీ నెమాడే
పుట్టిన తేదీ, స్థలం1938
సంగవి, రవేర్, మహారాష్ట్ర
వృత్తిమరాఠీ రచయిత
జాతీయతభారతీయుడు
పురస్కారాలుజ్ఞానపీఠ పురస్కారం-2014, పద్మశ్రీ– 2011

బాలచంద్ర వనాజీ నెమాడే (Devanagari: भालचंद्र वनाजी नेमाडे) (born 1938) మరాఠీ చయిత. కోసల, హిందూ పుస్తకాల రచయితగా సుప్రసిద్ధుడు. 2014సంవత్సరానికిగానూ జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపికయ్యాడు.[1]

జీవితం

[మార్చు]
పద్మశ్రీపురస్కారం

నెమాడే 1938లో ఖాందేశ్‌లోని సంగవి గ్రామంలో జన్మించాడు. మహారాష్ట్ర, పూణేలోని ఫెర్గూసన్ కళాశాల నుండి బాచిలర్ డిగ్రీని, అదే పూణేలోని డెక్కన్ కాలేజి ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ రిసెర్చ్ నుండి భాషాశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. ముంబై విశ్వవిద్యాలయం నుండి ఆంగ్లంలో మాస్టర్ డిగ్రీని అందుకున్నాడు. ఉత్తర మహారాష్ట్ర విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డీ., డీ.లిట్., పట్టాలు అందుకున్నాడు.

నెమాడే ఆంగ్లం, మరాఠీ, తులనాత్మక సాహిత్యం మొదలగు అంశాలను వివిధ విశ్వవిద్యాలయాలలో బోధించాడు. లండన్లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ లాంగ్వేజెస్‌లోను పనిచేశాడు. ముంబై విశ్వవిద్యాలయంలో గురుదేవ్ రవీంద్రనాథ ఠాగూర్ తులనాత్మక సాహిత్య పీఠంలో పనిచేసి పదవీ విరమణ పొందాడు. 1960లో మరాఠీ పత్రిక 'వాచా (वाचा) ' కు సంపాదకుడిగా పనిచేశాడు. 1990లో టీక స్వయన్వర్ (टीका स्वयंवर). అను విమర్శా గ్రంథానికి సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నాడు. 2015 ఫిబ్రవరీలో జ్ఞానపీఠ పురస్కారం పొందాడు[2].

సాహితీ ప్రస్థానం

[మార్చు]

1963లో నెమాడే తన మొదటి నవల కోసల (कोसला) ను వెలువరించాడు.[3] ఇదీ గ్రామీణ ప్రాంతం నుండి పూనేకు చదువుకోడానికి వచ్చిన ఓ యువకుని కథ. ఇదీ నెమాడే జీవితాన్ని ప్రతిబింబించే నవల. ఈ నవల ఆంగ్లం, హిందీ, గుజరాతీ, కన్నడ, అస్సామీ, పంజాబీ, బెంగాళీ, ఉర్దూ, ఓరియా వంటి పలు భాషల్లోకి అనువాదమైంది. దీని తర్వాత బీదర్, హూల్, జరీలా, జూల్ అను మరో నాలుగు నవలలు రాశాడు[4].

దస్త్రం:Sangm.jpg
స్వగ్రామాన్ని సందర్శించిన సందర్భంలో

రచనలు

[మార్చు]

నవలలు

  1. కోసల (Kosla)
  2. బీదర్ (Bidhar)
  3. హూల్ (Hool)
  4. జరీలా (Jarila)
  5. జూల్ (Jhool)

కవితా సంకలనాలు

  1. మెలోడీ (Melody)
  2. దెఖనీ Dekhani

విమర్శా గ్రంథాలు

  • టీకాస్వయంవర్
  • సాహిత్యాచీ భాష
  • తుకారామ్
  • మరాఠీపై ఆంగ్లభాషా ప్రభావం.
  • ఇండో - ఆంగ్లియన్ రాతలు
  • స్థానికత్వం (దేశీవాద్)

మూలాలు

[మార్చు]
  1. మూస:Civil Services Junction
  2. http://www.thehindu.com/todays-paper/nemade-wins-jnanpith/article6867002.ece
  3. Nemade, Bhalchandra (1963). Kosala (कोसला). Mumbai: Polular Prakashan. p. 265.
  4. Nemade, Bhalchandra (2003). Bidhar(बिढार). Mumbai: Polular Prakashan. p. 305. ISBN 978-81-267-0298-5.

బయటి లంకెలు

[మార్చు]