డి.జయకాంతన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జయకాంతన్
2012లో జయకాంతన్
పుట్టిన తేదీ, స్థలం(1934-04-24)1934 ఏప్రిల్ 24
కడలూర్, సౌత్ ఆర్కాట్ డిస్ట్రిక్ట్ (మద్రాస్ ప్రెసిడెన్సీ), బ్రిటిష్ ఇండియా
మరణం2015 ఏప్రిల్ 8(2015-04-08) (వయసు 80)
చెన్నై, భారతదేశం
వృత్తినవలా రచయిత, చిన్న కథా రచయిత, స్క్రీన్ ప్లే రైటర్, సినిమా దర్శకుడు
భాషతమిళం
పురస్కారాలుపద్మభూషణ్ పురస్కారం,
జ్ఞానపీఠ పురస్కారం,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు,
ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్

జయకాంతన్ (24 ఏప్రిల్ 1934 – 2015 ఏప్రిల్ 8), తమిళ రచయిత, పాత్రికేయుడు, వక్త, సినీ నిర్మాత, సినీ విమర్శకుడు, సామాజిక కార్యకర్త. అతనిని జెకె అని కూడా పిలుస్తారు.[1] కడలూర్ లో జన్మించిన జయకాంతన్ చిన్నప్పుడే చదువు మానేశాడు. మద్రాసు వెళ్ళి అక్కడ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో చేరాడు. 60ఏళ్ళ కెరీర్ లో 40నవలలు, 200చిన్న కథలు, రెండు జీవిత చరిత్రలు రాశాడు అతను. సాహిత్యంలోనే కాక సినిమా రంగంలోనూ తన ముద్ర వేశాడు జయకాంతన్. రెండు సినిమాలు తీయడంతో పాటు, అతను రాసిన నాలుగు నవలలను ఇతరులు సినిమాలుగా తీయడం విశేషం.

జయకాంతన్ రచనలకు భారత సాహిత్యానికి ఇచ్చే అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారాలైన జ్ఞానపీఠ పురస్కారం, సాహిత్య అకాడమీపురస్కారాలు లభించాయి. 2009లో భారతదేశ మూడవ అతి పెద్ద పౌర పురస్కారమైన పద్మభూషణ్ పురస్కారం కూడా అందుకున్నాడు జయకాంతన్. [2] 1978లో సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కారం, 2011లో రష్యా ప్రభుత్వం చే ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్ షిప్ పురస్కారాలు అందుకున్నాడు జయకాంతన్.

జీవిత విశేషాలు[మార్చు]

జయకాంతన్ 1934 ఏప్రిల్ 24కడలూర్‌లోని మంజకుప్పంలో జన్మించాడు. సాహిత్యరంగంలో అతను జేకేగా సుప్రసిద్ధులు. తమిళ సాహిత్యరంగంలో నూతన ఒరవడిని సృష్టించాడు. అభ్యుదయ రచనలతో పాఠకులను విశేషంగా ఆకట్టుకున్నాడు.[3] అతను రచించన పలు కథల్ని తెలుగులోకి మధురాంతకం రాజారాం అనువదించాడు. అతను కథలు పంచవటి పేరుతో స్వాతి మాస పత్రికలో సీరియల్‌గా ప్రచురించగా కార్టూనిస్ట్, సినీ దర్శకుడు బాపు బొమ్మలు వేశాడు. జయకాంతన్ రచనలపై రచయిత సుబ్రమణ్య భారతి ప్రభావం ఎక్కువగా ఉండేది.[4] ఐదవ గ్రేడ్ పూర్తి చేసిన తరువాత జయకాంతన్ చదువు మానేశాడు. చదువు తన రాజకీయ, సామాజిక కార్యక్రమాలకు అడ్డుగా ఉంటుందని భావించడం వల్లనే చదువుకు స్వస్తి పలికాడు[5] 1946లో, మద్రాసు (ఇప్పటి చెన్నై)కు జీవన పోషణ కోసం చేరిన అతను, కమ్యూనిస్ట్ పార్టీ ముద్రణశాలలో కంపోజిటర్ గా చేరడానికి ముందు వరకూ రకరకాల ఉద్యోగాలు చేశాడు.[6] సిపిఐతో ఈ సాన్నిహిత్యంతో అతను ఉద్యమానికి ఆకర్షితుడు అవడమే కాక, తన ఆలోచనలను కూడా సహచరులతో పంచుకుని, అమలులోకి పెట్టేవాడు.[7] ఆ సమయంలోనే పి.జీవానందం, బాలదండాయుధం, ఎస్. రామకృష్ణన్ వంటి నాయకులతో కలసి పని చేసే అవకాశం లభించింది అతనికి. పార్టీ నాయకులు అతనిని రాయమని ఎంతగానో ప్రోత్సహించేవారు.[8] పార్టీలో క్రియాశీల సభ్యునిగా మారిన తరువాత జయకాంతన్ కు ప్రపంచ సాహిత్యం, సంస్కృతి, రాజకీయాలు, ఆర్థిక విషయాలు, పాత్రికేయం వంటి విషయాలపై అవగాహన కలిగింది. ఈ సమయంలోనే జయకాంతన్, కమ్యూనిస్టు అనుకూల పత్రికలకు రాయడం మొదలపెట్టాడు. కొన్నేళ్ళల్లోనే పార్టీలో ప్రముఖ రచయితగా ఎదిగాడు. అతని రచనలు మొదట్లో పార్టీ పత్రిక అయిన జనశక్తిలో ప్రచురితమయ్యేవి. మెల్లగా సరస్వతి, తమరై, శాంతి, మణిధన్, శక్తి, సమరన్ వంటి ఇతర ప్రముఖ పత్రికల్లో కూడా ప్రచురితమవ్వడం ప్రారంభమయింది. మొదట్లో అతని రచనలన్నీ పార్టీ కార్యాలయం దగ్గర్లోని స్లం ప్రాంతంలో నివసించే నిరుపేదల కష్టాల గురించే ఉండేవి.[5]

1953లో సౌబాకియవతి అనే తమిళ పత్రిక కోసం మొట్టమొదటి చిన్నకథను రచించాడు జయకాంతన్.[6] ఆ తరువాత నుంచీ కమ్యూనిస్టు అనుకూల పత్రికలకే కాక, ప్రధాన పత్రికలైన ఆనంద వికటన్, కుముదం, దినమణి కాదిర్ వంటి వాటికి కూడా రాయడం మొదలు పెట్టాడు. 1960లలో ఈ పత్రికలు జయకాంతన్ రాసిన ఎన్నో చిన్నకథలను ప్రచురించాయి.[1][8] 1964లో, జయకాంతన్ సినీరంగంలోకి ప్రవేశించాడు. దర్శకత్వం, కో-ప్రొడక్షన్ వంటి రంగాలలో పనిచేయడం మొదలు పెట్టాడు. 1965లో తన నవల ఆధారంగా, తానే సహనిర్మాతగా, దర్శకునిగా ఉంటూ ఉన్నైపోల్ ఒరువన్ అనే సినిమాను తీశాడు.[8] ఈ సినిమా స్లం ప్రాంతంలో నివసించేవారి కష్టాలపై తీసాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయినా, 1965 సంవత్సరానికి గానూ 3వ ఉత్తమ ఫీచర్ సినిమాగా రాష్ట్రపతి పురస్కారం గెలుచుకోవడం విశేషం.[9] ఆ తరువాతి సంవత్సరం నగేష్ కథానాయకుడిగా, జయకాంతన్ నవల యారుక్కగ అళుదాన్ ఆధారంగా ఇంకో చిత్రం తీశాడు జయకాంతన్.[10] 1970లో, జయకాంతన్ రచించిన శిల నేరంగళిల్ శిల మణితరగల్ నవలకు సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆ తరువాత ఈ నవలను అదే పేరుతో ఎ.భీంసింగ్ సినిమాగా తీశారు. ఈ చిత్రానికి జాతీయ పురస్కారం లభించింది. ఈ చిత్రం విజయం సాధించడంతో భీంసింగ్, మళ్ళీ జయకాంతన్ రాసిన నవల ఆధారంగా ఒరు నడిగై నాదగం పార్కిరల్ అనే సినిమాను తీశాడు.[11]

అతని రచనలు ఒరు నాదిగై నాదగమ్ పార్కిరళ్, యారుక్కగ అజుధాన్ సినిమాలుగా తెరకెక్కాయి. ఉన్నై పోల్ ఒరువన్ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని రష్యాలో ప్రదర్శించారు.

అవార్డులు[మార్చు]

 • అతనికి రష్యా ప్రభుత్వం ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ అవార్డును ప్రదానం చేసింది.
 • భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
 • 2002లో జ్ఞానపీఠ్ పురస్కారం.

వ్యక్తిగత జీవితం[మార్చు]

జయకాంతన్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు జయసింహన్ ఉన్నారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 S., Dorairaj (2012). "Social realist". Frontline. Retrieved 10 April 2015.
 2. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 31 మార్చి 2018.
 3. "ప్రముఖ రచయిత జయకాంతన్ ఇకలేరు". No. నమస్తే తెలంగాణ. 2015-10-04.[permanent dead link]
 4. Raman, N Kalyana (10 April 2015). "Jayakanthan 1934-2015 - in the commoner's era". The Times of India. Archived from the original on 10 ఏప్రిల్ 2015. Retrieved 10 April 2015.
 5. 5.0 5.1 S, Viswanthan. "A writer in his world". Frontline. Retrieved 11 April 2015.
 6. 6.0 6.1 "Jnanapith winner Jayakanthan dead". The Hindu. 8 April 2015. Retrieved 8 April 2015.
 7. S, Viswanthan. "Celluloid tribute". Frontline. Retrieved 10 April 2015.
 8. 8.0 8.1 8.2 "Legendary Tamil writer Jayakanthan 'JK' passes away". Rediff.com. 9 April 2015. Retrieved 10 April 2015.
 9. Times of India (Firm) (1965). The Times of India Directory and Year Book Including Who's who. Bennett, Coleman. p. 279.
 10. Bhaskaran, S. Theodre. "Tragic comedian". Frontline. Retrieved 10 April 2015.
 11. "Jnanapith awardee Tamil writer Jayakanthan died". jagranjosh.com. 9 April 2015. Retrieved 10 April 2015.

ఇతర లింకులు[మార్చు]