వినాయక కృష్ణ గోకాక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వినాయక కృష్ణ గోకాక్
VKGokak.jpg
పుట్టిన తేదీ, స్థలం(1909-08-09) 1909 ఆగస్టు 9
[సవనూరు, ధారవాడ జిల్లా, కర్నాటక
మరణం1992 ఏప్రిల్ 28 (1992-04-28)(వయసు 82)
బెంగళూరు, కర్నాటక
వృత్తిఅధ్యాపకుడు, రచయిత
జాతీయతఇండియా
రచనా రంగంకాల్పనిక సాహిత్యం
సాహిత్య ఉద్యమంNavodaya
ప్రభావండి.ఆర్.బెంద్రె

సంతకం

వినాయక కృష్ణ గోకాక్ కన్నడ భాష చెందిన సాహిత్యవేత్త.కన్నడ ప్రసిద్ధకవి, పండితుడు.కేవలం కన్నడ భాషలో మాత్రమే కాకుండగా కన్నడ, ఆంగ్ల భాష రెండింటిలోను సమాన ప్రతిభా పాటవాలు కలిగిన మేధావి.కన్నడ సాహిత్య రంగానికి సంబంధించి 5వ జ్ఞానపీఠ అవార్డు పొందిన కన్నడిగుడు.గోకాక్ భారతీయ జ్ఞానపీఠ పీఠ ఎన్నిక సమితి యొక్క అధ్యక్షుడుగా కూడా పనిచేశాడు.

జననం-విద్యాభ్యాసం[మార్చు]

వినాయక కృష్ణ గోకాక్ 1909 లో కన్నడరాజ్యంలోని ధారవాడజిల్లాలోని సవణూరు అనే గ్రామంలో జన్మించారు.గోకాక్ తండ్రి కృష్ణరాయ ఒక లాయరు/వకేలు,తల్లి సుందరమ్మ[1].గోకాక్ విద్యాభ్యాసం సవణూరు, ధారవాడలో జరిగింది.ధారవాడలో గోకాక్ కు వరకవి దత్తాత్రేయ రామచంద్ర బెంద్రెతో పరిచయం కలిగినది.ఈ విధంగా బెంద్రే వారి సహచర్యం వలన గోకాక్ కు సాహిత్యం పట్ల ఆసక్తి పెరిగింది.బెంద్రెగారి మార్గదర్శంలో, ప్రోత్సాహంతో కన్నడ సాహిత్యవనంలో గోకాక్ తన రచనా కృషిని మొదలు పెట్టాడు.గోకాక్ స్వయంగా పలు సందర్భాలలో సహిత్యరచనలో బెంద్రే తనగురువు, మార్గదర్శకుడని పెర్కొన్నాడు.

వృత్తి-జీవనం[మార్చు]

ఇంగ్లీసు భాషలో ఎం.ఎ, డిగ్రీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యిన గోకాక్ పూణెలోని ఫెర్గుసన్ విద్యాలయంలో ఇంగ్లిసు భాష ఉపన్యాసకుడగా నియమితుడయ్యాడు.అక్కడి కళాశాల యజమాన్యం ఆయన ప్రతిభను గుర్తించి, తమ స్వంతఖర్చులతో ఇంగ్లీసులో మరింత ఉన్నత విద్యార్జనకై ఇంగ్లాండులోని ఆక్సుఫర్డు విశ్వవిద్యాలయానికి పంపించారు.గోకాక్ అక్కడ ఇంగ్లీసు సాహిత్యంలో మొదటి శ్రేణిలో ఉత్తిర్ణుడయ్యిన ప్రథమ భారతీయుడు.ఇంగ్లాండులో విద్య ముగించుకొని వచ్చిన గోకాక్ సాంగ్లిలోని విల్లింగ్‌డన్ కళాశాలలో 1938 లో ప్రధానాధ్యాపకుడుగా నియమితుడయ్యాడు[2]. వీసనగరపు కళాశాలలో,కొల్లాపూర్ రామరాజ కళాశాల,ధారవాడ లోని కర్నాటక కళాశాల,ఉన్మానియా విశ్వవిద్యాలయం,హైదరాబాదులోని ఇంగ్లీసు, విదేశిభాషలో సంస్థలలో పలురకాల పదవులను అలంకరించాడు.బెంగళూరు విశ్వవిద్యాలయ,, సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలలో ఉప కులపతిగా పనిచేశారు.

రచనలు[మార్చు]

గోకాక్ కన్నడ, ఆంగ్లంభాషలలో రచనలు చేశాడు.ఆయన ముద్రిత మొదటి రచన/కృతి "కలోపాసకరు".గోకాక్ ఉన్నత విద్యను అభ్యసించుటకై ఇంగ్లాండుకు సముద్రపయనం ద్వారా వెళ్ళిన అనుభవాల ఆధారంగా వ్రాసిన "సముద్రగీతగళు", "సముద్రాచెయింద" రెండు కృతులు మిక్కిలి ప్రజాదరణ చెందాయి .సముద్రగీతగళు కావ్యం లోని "కూడదిరు శరధిగె షట్టిదియ దీక్షెయను"అనే గీతం చాలా ప్రసిద్ధి చెందినది.ఈయన ఆగ్లంలో వ్రాసిన రచనల సంఖ్య ముప్పైకి మించినవి.గోకాక్ రచనలలో నాటకాలు,ప్రబంధాలు, ప్రవాస కథలు,విమర్శలువున్నాయి.కన్నడ సాహిత్యంలోని పెద్ద గ్రంధాలలో గోకాక్ రచించిన "సమరసవే జీవన" ఒకటి.ఈయన రచించిన"జననాయక" అత్యధికంగా మన్నన పొందిన ప్రసిద్ధ నాటకం. "భారత సింధు రశ్మి"వినాయక కృష్ణ గోకాక్ రచించిన మహా కావ్యం.ఇందులో 12 ఖండా(కాండ)లు,ముప్పై అయిదువేల పద్యపాదాలున్న కావ్యం.ఋగ్వేద కాలం నాటి జనజీవన విధానాన్ని గురించి వ్రాసిన గ్రంథం.విశ్వామిత ఈ కావ్యంలోని నాయకుడు.

పురస్కారాలు[మార్చు]

  • 1967 లో కర్నాటక విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రశస్తిని ఇచ్చి గౌరవించినది.
  • 1979 లో కాలిఫోర్నియా యొక్క ఫసిఫిక్ విశ్వవిద్యాలయం కూడా గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసినది.
  • 1961 లో కేంద్ర ప్రభుత్వం "పద్మశ్రీ" అవార్డును ఇచ్చినది
  • గోకాక్ రచన "ద్వావా పృథివి" కవన సంకలనానికి 1960 లో కేంద్ర సాహిత్య అకాడమి ప్రశస్తి లభించింది.
  • "భారత సింధు రశ్మి" రచనకుగాను కర్నాటక సాహిత్య అకాడమి ప్రశస్తి,భారతీయ విద్యాభవనం వారి రాజాజి ప్రశస్తి, ఐ.బి.హెచ్.ప్రశస్తి లభించింది.
  • 1991 లో జ్ఞానపీఠ అవార్డు[3]

సాధారణంగా జ్ఞానపీఠ ఆవార్డును దేశ రాజధాని డిల్లీలో ప్రదానం చేస్తారు.గోకాక్ గారికి ప్రధానమంత్రి ముంబాయి వచ్చి ఇచ్చి సత్కరించారు

నిధనము[మార్చు]

1992,ఏప్రిల్ 28 న ముంబాయిలో తెల్లవారుజామున మరణించారు[3].

బయటి లింకులు[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]