Jump to content

సచ్చిదానంద రౌత్రాయ్

వికీపీడియా నుండి
సచ్చిదానంద రౌత్రాయ్
సచ్చిదానంద రౌత్రాయ్
పుట్టిన తేదీ, స్థలం(1916-05-13)1916 మే 13
గురుజంగ్, ఖొద్రా
మరణం2004 ఆగస్టు 21(2004-08-21) (వయసు 88)
కటక్
కలం పేరుసచీ రౌతర
రచనా రంగంకవిత్వం
గుర్తింపునిచ్చిన రచనలుపల్లిశ్రీ
పురస్కారాలుజ్ఞానపీఠ పురస్కారం

సచ్చిదానంద రౌత్రాయ్ (1916–2004) ఒరియా భాషకు చెందిన కవి, నవలా రచయిత , లఘు కథా రచయిత. Archived 2020-02-01 at the Wayback Machine ఈయనకు 1986 లో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఈయన "సాచీ రౌత్రాయ్"గా సుపరిచితులు.[1]

జీవితం

[మార్చు]

రౌత్రాయ్ మే 13, 1916ఖుర్దాకు దగ్గరలో గల గురుజంగ్లో Archived 2020-02-01 at the Wayback Machine జన్మించారు.[2] ఈయన బెంగాల్ లో విద్యాభ్యాసం చేశారు. ఈయన గొల్లపల్లిలో రాజకుటుంబానికి చెందిన రాకుమారిని వివాహమాడారు.[1]

రౌత్రాయ్ తన 11 యేండ్ల వయసు నుంచే రచనా ప్రస్థానాన్ని ప్రారంభ్హించారు.[1] పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమ భావాలు ఉన్నాయన్న కారణంగా ఆయన రచనలలో కొన్నింటిని బ్రిటిష్ రాజులు నిషేధించారు.

ఆయన కటక్లో ఆగష్టు 21, 2004 లో మరణించారు.[1]

సాహితీ సేవ

[మార్చు]

రౌత్రాయ్ తన రచనా వ్యాసాంగాన్ని 1932లో " పథేయ " (తొలి కవిత) తో ప్రారంభించాడు. 1943లో బాజీ రౌత్ అనే కవిత ప్రచురణతో రౌత్రాయ్ ఒరియా పాఠకులలో చాలా ప్రాచుర్యం పొందాడు. ఈ దీర్ఘ కవిత, బ్రిటీషు పోలీసులను తన్న చిన్న పడవలో బ్రాహ్మణి నది ఆవలి ఒడ్డుకు చేర్చటానికి నిరాకరించినందుకు, వారి బుల్లెట్లకు బలైన పడవనడిపే అబ్బాయి యొక్క వీరమరణాన్ని కీర్తిస్తుంది. రౌత్రాయ్ కవితా ఝరి అనర్గళంగా సాగింది. ఈయన దాదాపు ఇరవై దాకా కవితా సంపుటాలను ప్రచురించాడు. ఈయన పట్టణపు యువతి యొక్క వేదనను, కష్టాలను చిత్రిస్తూ వ్రాసిన ప్రతిమా నాయక్ ఎంత ప్రాచుర్యం పొందిందో, ఒరిస్సా గ్రామీణ జీవితంపై వ్రాసిన పల్లిశ్రీ', కూడా అంతే ప్రాచుర్యం పొందింది. ఈయన ప్రజా కవులుగా పేరు Archived 2020-02-01 at the Wayback Machineపొందిన రచయితల కోవకు చెందుతాడు[1]

రౌత్రాయ్ మతసంబంధమైన విషయాలపై కూడా కొన్ని కవితలు ప్రచురించాడు.

అవార్డులు - గుర్తింపులు

[మార్చు]
  • 1962 : పద్మశ్రీ [1]
  • 1963 : సాహిత్య అకాడమీ అవార్డు - "కవితా 1962"కు వచ్చింది.[3]
  • 1965 : సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు [1]
  • 1986 : జ్ఞానపీఠ్ అవార్డు [4]
  • 1988 : లైఫ్ టైం ఫెలోషిప్ (కేంద్రసాహిత్య అకాడమీ)
  • 1986 : "మహాకబి" సమాన్ - రూర్కెలా,
  • 1988 : కటక్ ప్రెసిడెంట్ - నిఖిల్ భరత్ కబితా సమ్మేళన్
  • 1997 : సాహిత్య భారతి అవార్డు.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Sachidananda Routray passes away". The Hindu. 2004-08-22. Archived from the original on 2005-01-05. Retrieved 2008-11-06.
  2. "SACHI ROUTRAY". orissadiary.com. 2012. Archived from the original on 10 మే 2012. Retrieved 23 May 2012. Sachi Routray was born in Gurujang near Khurda on May 13, 1916.
  3. "Sahitya Akademi Awards 1955-2007 (Oriya)". Sahity Akademi. Retrieved 2008-11-06. [dead link]
  4. "Jnanpith Laureates". Bharatiya Jnanpith. Archived from the original on 2007-10-13. Retrieved 2008-11-06.

బయటి లంకెలు

[మార్చు]