వికీపీడియా:సహాయ కేంద్రం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కొత్త సభ్యులు వికీని త్వరగా అర్థం చేసుకునేందుకు 5 నిమిషాల్లో వికీ పేజీని చూడండి.

గమనిక: ఇక్కడ ప్రాపంచిక ప్రశ్నలు అడగరాదు (ఉదా.., మన ప్రధాన మంత్రి ఎవరు?)

సహాయ కేంద్రానికి స్వాగతం! వికీపీడియా గురించిన ప్రశ్నలు అడగటానికీ, వ్యాసాలు రాసే విషయంలో సహాయం పొందటానికి ఇదే సరియైన స్థలం. ఎక్కువగా కొత్తవారి ప్రశ్నలకు సమాధానాలిస్తాం, కాని అనుభవజ్ఞులూ అడగవచ్చు. ప్రశ్న రాసిన తరువాత, సమాధానాలు వచ్చాయేమో చూడటానికి ఈ పేజీని చూస్తూ ఉండండి.


ప్రశ్న ఎలా అడగాలి

 • ముందుగా, మీ ప్రశ్నకు ఇదివరకే సమాధానం ఇచ్చేసారేమో చూడండి. చాలా ప్రశ్నలకు తరచుగా అడిగే ప్రశ్నల లో సమాధానాలు దొరుకుతాయి.
 • ప్రశ్నలకు ఒక అర్ధవంతమైన శీర్షిక పెట్టండి, దానికి అర్ధవంతమైన సమాధానం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
 • సూటిగా, వివరంగా అడగండి.
 • ప్రశ్న చివర సంతకం పెట్టండి. మీకు వికీపీడియా లో సభ్యత్వం ఉంటే, ~~~~ అని టైపు చెయ్యండి. లేకపోతే, మీ పేరు రాయవచ్చు లేదా ఆకాశరామన్న అని రాయవచ్చు.
 • ప్రశ్నలకు ఈ-మెయిల్‌ లో సమాధానాలు ఇవ్వరు కాబట్టి, ఈ-మెయిల్‌ అడ్రసు ఇవ్వకండి. పైగా వికీపీడియాలో విషయాలు యథేఛ్ఛగా కాపీ చేసుకోవచ్చు కనుక మీ ఈ-మెయిల్‌ కు గోప్యత ఉండదు.
 • అప్పుడప్పుడూ ఈ పేజీని చూస్తూ ఉండండి. ఎందుకంటే, సమాధానం ఒక్కసారే రాకపోవచ్చు, అది ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి.
 • మీ ప్రశ్నకు అనుబంధంగా ఇంకా అడగాలంటే, మీ ప్రశ్న విభాగం పక్కనే ఉండే [మార్చు] లింకును నొక్కి ప్రశ్నను రాయండి. ఒకే ప్రశ్నపై బహుళ విభాగాలు ప్రారంభించవద్దు.
 • అన్ని వయసుల పాఠకులూ ఈ పేజీ చూస్తారని గుర్తుంచుకోండి.
 • ప్రశ్న తెలుగులో లేక ఇంగ్లీషులో అడగండి. తెలుగుని ఆంగ్ల అక్షరాలతో రాయకండి, అర్ధం చేసుకోవడం కష్టమవుతుంది.
 • ప్రశ్నలకు సమాధానాలు మనుష్యులే ఇస్తారు, కంప్యూటర్లు కాదు. ఇది సెర్చ్‌ ఇంజిన్‌ కాదు.


సమాధానం ఎలా ఇవ్వాలి

 • వీలయినంత విపులమైన సమాధానం ఇవ్వండి.
 • క్లుప్తంగా ఇవ్వండి, కరకుగా కాదు. స్పష్టంగా, సులభంగా అర్ధమయ్యే విధంగా రాయండి. ప్రశ్న పరిధికి లోబడి సమాధానం ఇవ్వండి.
 • సమాధానం తెలుగులోనే ఇవ్వండి.
 • వికీపీడియా లోని పేజీలకు లింకులు ఇవ్వండి. దీనివలన మరింత సమాచారం దొరుకుతుంది.
 • వాదాలకు ఇది వేదిక కాదు. ఏ విషయంపైనైనా వాదించాలనుకుంటే, చర్చా పేజీ చూడండి.


తెలుగు రచయితలు పుటలో పేరు చేర్చడం ఎలా?[మార్చు]

YesY సహాయం అందించబడింది


బివిడి ప్రసాదరావు (చర్చ) 09:09, 20 ఫిబ్రవరి 2017 (UTC)

స్నేహాంజలి. తెలుగు రచయితలు పుటలో నేను రచయితగా చేరడము ఎలా? నా eMail: prao.bvd@gmail.com

తెలుగు రచయితల జాబితా లో మీ పేరు చేరినది. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 06:34, 26 ఫిబ్రవరి 2017 (UTC)

విస్తరాకుల గురించి సందేహం[మార్చు]

vistarakulu tayari lo enni rakala chetla akulu vadutaru? —45.115.1.84 06:07, 26 ఫిబ్రవరి 2017 (UTC)

YesY సహాయం అందించబడింది

వికీపీడియాలో వ్రాసాలు రాసేటప్పుడు మీకు గల సందేహాలను నివృత్తి చేయడం జరుగుతుంది. రచనలు చేసేటప్పుడు ఏ సహాయం కావలసి వచ్చినా మా వికీపీడియా బృందం సహకారాన్నందిస్తుంది. యిలా జనరల్ నాలెడ్జి ప్రశ్నలు అడగరాదు! అయినా విస్తరాకులు వ్యాసం చూడండి. మీరు వికీపీడియాలో అకౌంటు సృష్టించుకొని వ్యాసాన్ని విస్తరణ చేయగలరు. ధన్యవాదములు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 06:37, 26 ఫిబ్రవరి 2017 (UTC)

తూర్పు గోదావరి జిల్లాలో పట్టు చీరలు నేతల ఫోన్ నంబర్లు[మార్చు]

{{సహాయం కావాలి}}

103.46.233.19 09:27, 2 మార్చి 2017 (UTC)

అజ్ఞాత వాడుకరీ, వికీపీడియా ప్రచార వేదిక కాదు. మీకు వ్యాసాలు రాయడంలో విధివిధానాలు, సలహాలు,సూచనలు గురించి ఏవైనా సందేహాలు వస్తే సహాయాన్ని అభ్యర్థించండి. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 09:36, 2 మార్చి 2017 (UTC)


తెవికీ మూసలు పనితీరు[మార్చు]

YesY సహాయం అందించబడింది

తెవికీ ఏ మూసలు "మూత" (క్లోజ్) పడటం లేదని గమనించాను. దయచేసి పెద్దలు సరిచేయగలరు. —JVRKPRASAD (చర్చ) 03:13, 28 మే 2017 (UTC)

JVRKPRASAD గారూ నమస్తే. ఏదైనా ఉదాహరణకు ఒక పేజీ చూపించగలరా? మీరనేది మూసలు క్లోజ్ చేయకుండా వాడుకరులు కానీ, మరెవరైనా ఐపీ అడ్రస్ రచయితలు కానీ వదిలేస్తున్నారనా? లేక చేసినా మూతపడడం లేదనా?--పవన్ సంతోష్ (చర్చ) 17:36, 7 సెప్టెంబరు 2017 (UTC)
Module:Navbox ఆంగ్లంనుండి తాజా చేశాను. Template:Navbox ఇప్పటికే తాజాగా వుంది. మన common.js లో మార్పులు పరిశీలించాలి. వారాంతంలో ఇంకొంచెం పరిశీలిస్తాను.--అర్జున (చర్చ) 17:45, 7 సెప్టెంబరు 2017 (UTC)
ఇప్పుడు దాచు అనేది పని చేస్తున్నది, ఇది వరకు చేయలేదు. ఇంకా మూసలలో ఏదో సమస్య కొంత ఉన్నట్లుగా అనిపిస్తోంది, అది ఏమిటో నాకు తెలియదు. నా సమస్య ఇప్పుడు తీరింది. మీ అందరికీ ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 18:27, 7 సెప్టెంబరు 2017 (UTC)
JVRKPRASAD గారికి, మీ తాజావార్తకి ధన్యవాదాలు. నేను పరిశీలించాను. ఇపుడు పనిచేస్తున్నది.--అర్జున (చర్చ) 05:26, 9 సెప్టెంబరు 2017 (UTC)
అర్జున గారికి, మీకు అభివాదముతో ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 05:50, 9 సెప్టెంబరు 2017 (UTC)

సంరక్షణ తొలగింపు[మార్చు]

YesY సహాయం అందించబడింది

నేను నిర్వాహకుడుగా ఉన్న రోజుల్లో, నా వాడుకరి పుట, వ్యాసాలు, మూసలు ఇత్యాదివి "సంరక్షణ"లో ఉంచాను. అవి నిర్వాహకులు మాత్రమే మార్చగలరు, ప్రస్తుతము నాకు కొత్తవి ఎక్కించేందుకు లేదా మార్చే ఆ అవకాశము లేదు. కనుక, దయచేసి తెవికీ నిర్వాహక పెద్దలు వీలయినన్నింటికి సంరక్షణ తొలగించ గలరు అని విన్నపము. —JVRKPRASAD (చర్చ) 11:56, 28 మే 2017 (UTC)

సభ్యుని తక్షణ సౌలభ్యం కోసం వాడుకరి పేజీ సంరక్షణ స్థితిని మాత్రమే మార్చాను. మిగతా వాటిని పరిశిలించి, వీలు వెంబడి నిర్వాహకులెవరైనా మార్చగలరు.__చదువరి (చర్చరచనలు) 14:37, 28 మే 2017 (UTC)
మీకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 14:47, 28 మే 2017 (UTC)


వికీపీడియా వివరం వేరే జాలగూడులో ఎలా?[మార్చు]

సార్ ఇది ఒక వెబ్ లింకు చూడండి ఈ లింకును వికీపీడియా ఆన్ లైన్లో మోత్తం కనిపిస్తూంది ఆ సైట్ యోమిటని సందేహం వచ్చి అడుగుచున్నాను.--N.P.Gouda (చర్చ) 12:22, 21 జూలై 2017 (UTC)


2405:204:6404:2C4E:27B0:1491:8D2E:15EC 10:19, 20 జూలై 2017 (UTC)

N.P.Gouda గారూ, నమస్తే. చూశాను, కానీ ఈ వెబ్సైట్ గురించి నాకేమీ తెలియదు. ఐతే సాధారణంగా జరిగేది చెప్తున్నాను. వికీపీడియాలన్నీ స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదలై ఉంటాయి. అంటే మనం రాసే ప్రతీదీ ప్రపంచంలో ఎవరైనా వికీపీడియాకు, వాడుకరులకు అట్రిబ్యూషన్ ఇచ్చి తోచిన విధంగా వాడుకోవచ్చు. ఆ పద్ధతిలో ఐరోపా, అమెరికా (వారి పుస్తక సంస్కృతి బలమైనది) దేశాల్లో కొన్ని ప్రచురణ సంస్థ ప్రతీ ఏటా వికీపీడియాను ప్రచురించి అమ్ముతూంటాయట, జాలంలో ఉచితంగా లభిస్తున్నా ప్రింట్ పుస్తకాలపై మక్కువ ఉన్నవారు కొనుక్కుంటూంటారు కూడాను. ఓ టీచర్ పిల్లలకు ఏదైనా కొత్త విషయాన్ని బోధించడం మొదలుకొని, వాణిజ్యావసరాలతో సహా దేనికైనా వికీపీడియాలోని సమాచారాన్ని స్వేచ్ఛగా వాడుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఇటువంటి మిర్రర్ సైట్లు (అద్దంలా మనల్ని ప్రతిబింబిస్తూంటాయి, ఐతే అది నిజం కాదు ప్రతిబింబమే) ఉపయోగించుకుని వికీపీడియాలోని సమాచారాన్ని ప్రతిబింబిస్తూంటాయి. ఇదండీ సంగతి. --పవన్ సంతోష్ (చర్చ) 17:42, 7 సెప్టెంబరు 2017 (UTC)

-పవన్ సంతోష్ గారూ సార్ నమస్తే నా సందేహం కూడ అలానే ఉండేది ఇప్పుడు తీరింది. మీకు ధన్యవాదములు సార్.--N.P.Gouda (చర్చ) 06:39, 8 సెప్టెంబరు 2017 (UTC)

రాశివనం వివరాలు దానికి సంబందించిన మొక్కల వివరాలు[మార్చు]

YesY సహాయం అందించబడింది


124.123.82.183 06:42, 20 సెప్టెంబరు 2017 (UTC)

ఎవరైనా సభ్యులు మీ సందేహ నివృత్తి చేయాలంటే ముందు మీరు ప్రశ్న సుస్పష్టంగా అడగండి. మీరిప్పుడు ఏం అడుగుతున్నారో సరిగా తెలియట్లేదు. --పవన్ సంతోష్ (చర్చ) 15:56, 20 సెప్టెంబరు 2017 (UTC)
అర్జున గారూ, చదువరి గారూ ఈ ప్రశ్న గమనించండి. సూటిగా లేదు. సరే నేను సూటిగా అడగమన్నా అడగలేదు. ఇప్పుడు ఈ అంశం ముగించడానికి సహాయం చేయబడిందితో మూస మార్చాలా, సహాయం విఫలమైందని మార్చాలా? ఎందుకంటే సహాయం విఫలమైందన్నది నిర్దుష్ట సమయంలోపు (వారం) ఎవరూ సమాధానం చెప్పకపోతే చేయాలని నాకు తెలిసిన విషయం. కానీ ఇక్కడ సమాధానం చెప్పాం, కానీ ప్రశ్న సరిగాకుండడం వల్ల సహాయం జరగలేదు. --పవన్ సంతోష్ (చర్చ) 10:47, 25 సెప్టెంబరు 2017 (UTC)
ప్రశ్న వివరంగా లేదు. కానీ నా కర్థమైనంతలో ఈ ప్రశ్నకిది తగు స్థలం కాదు. ఇక్కడ వికీపీడియాకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగాలి. అదే ముక్క చెప్పి, ఈ అంశాన్ని ముగించండి. {{సహాయం చేయబడింది}} మూస ఈ సందర్భానికి తగినదని నా ఉద్దేశం.__చదువరి (చర్చరచనలు) 11:04, 25 సెప్టెంబరు 2017 (UTC)
ధన్యవాదాలు చదువరి గారూ అలా చేశానండీ. --పవన్ సంతోష్ (చర్చ) 11:39, 26 సెప్టెంబరు 2017 (UTC)
పవన్ సంతోష్ గారికి, అర్ధవంతం కాని సందేహలను నేనైతే తొలగిస్తున్నాను. వాటివలన ఉపయోగం ఏమీలేదు.--అర్జున (చర్చ) 07:55, 29 సెప్టెంబరు 2017 (UTC)

క్రుత్రిమంగ కాయలను పంద్లుగా మార్చె విదానం[మార్చు]

{{సహాయం కావాలి}}

157.48.240.125 14:46, 29 జనవరి 2018 (UTC)

ఇటువంటి ప్రశ్నకిది తగు స్థలం కాదు. ఇక్కడ వికీపీడియాకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగాలి.--కె.వెంకటరమణచర్చ 16:42, 29 జనవరి 2018 (UTC)