వికీపీడియా:కొత్త పేజీని ఎలా ప్రారంభించాలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సహాయం పేజీలు | స్వాగతం  ·   తెలుగులో రచనలు చెయ్యడం  ·   5 నిమిషాల్లో వికీ  ·   పాఠం  ·   గైడు  ·   పదకోశం  ·   సహాయం  ·   సహాయ కేంద్రం  ·   ప్రశ్నలు  ·   వీడియో పాఠాలు

ఈ వ్యాసం సహాయం పేజీలలో భాగం.

పేజీ సృష్టించటం

[మార్చు]

పేజీకీ, కొత్త పేజీకి తేడా ఒకటే - పేజీకి పేజీ చరిత్ర ఉంటుంది, కొత్తపేజీకి ఉండదు. కొత్తపేజీ ప్రారంభించడం అంటే మరేమీ కాదు, ఓ ఖాళీపేజీలో మొదటి వాక్యాలు రాయడమే!

కింద ఉన్న పెట్టెలో ఏదో ఒక పేరు రాసి, "వ్యాసాన్ని సృష్టించు" ను నొక్కండి. ఇక్కడ ఏమి రాస్తారో అదే ఆ పేజీపేరు అవుతుంది. పేరు పెట్టే పద్ధతుల గురించి వికీపీడియా:నామకరణ పద్ధతులు చూడండి.


వెతుకు పెట్టె నుండి

[మార్చు]

సృష్టించదలచిన వ్యాసం పేరును పేజీలో పైనున్న వెతుకు పెట్టెలో రాయండి. టైపు చేస్తూండగానే ఆ అక్షరాలతో వచ్చే పేజీల జాబితాను చూపిస్తుంది. పేరు పూర్తిగా రాసి ఎంటరు నొక్కగానే, సరిగ్గా అదే పేరుతో పేజీ ఉంటే నేరుగా ఆ పేజీకి తీసుకెళ్తుంది. లేకపోతే, వెతుకులాట ఫలితాలను చూపిస్తుంది. ఆ ఫలితాల్లో, మీరిచ్చిన పేజీ పేరు ఇలా ఎర్రలింకుతో కనిపిస్తుంది. ఆ లింకును నొక్కితే ఆ పేరుతో ఖాళీ పేజీ తెరుచుకుంటుంది. ఇక అక్కడ మీరు రాయదలచిన విషయం రాసేసి పేజీని ప్రచురించండి. మీరు సృష్టించదలచిన పేజీ సిద్ధం!

ఎర్రలింకు ద్వారా

[మార్చు]

మీరు రాయదలచిన వ్యాసానికి సంబంధించి వికీలో ఇతర వ్యాసాల్లో ఎక్కడైనా ప్రస్తావన ఉందేమో గమనించండి. ఉదాహరణకు హైదరాబాదు నగరం లోని "సాలార్‌జంగ్ మ్యూజియం" గురించి వ్యాసం రాయదలిస్తే, హైదరాబాదు పేజీలో దాని ప్రస్తావన ఉందేమో వెతకండి. ఉంటే, ఆ ప్రస్తావన ఉన్న పదానికి/పదాలకు మీరు తలపెట్టిన వ్యాసం పేరు లింకు ఇవ్వండి. "హైదరాబాదు" వ్యాసంలో "నగరంలో ప్రపంచ ప్రసిద్ది గాంచిన సాలార్‌జంగ్ మ్యూజియం ఉంది" అనే వాక్యం ఉందనుకోండి. అందులో "సాలార్‌జంగ్ మ్యూజియం" కు ఎర్రలింకు ఈసరికే ఉంటే సరే, లేకుంటే ఇచ్చి, పేజీని ప్రచురించండి. ఆ తరువాత ఆ ఎర్రలింకును నొక్కి పేజీని సృష్టించండి.

వేరే పేజీ నుండి వికీలింకు ద్వారా

[మార్చు]

ఏదో ఒక పేజీ మార్చు లింకును నొక్కండి. దిద్దుబాటు పెట్టెలో మీరు సృష్టించదలచిన పేజీ పేరును రాసి, వికీలింకు ఇవ్వండి. మునుజూపు చూడండి. "మార్పులను ప్రచురించు" మీటను నొక్కరాదు. అప్పుడు, దిద్దుబాటు పెట్టెకు పైన కనిపించే మునుజూపులో కొత్తపేజీ లింకు ఎర్రగా కనిపిస్తుంది. ఆ లింకును నొక్కి పేజీని సృష్టించండి.

వ్యాసార్హమైన అంశాలు

[మార్చు]

వికీపీడియాలో మీకు ప్రాముఖ్యత గలది అనిపించిన ఏవిషయం గురించైనా వ్రాయొచ్చు. ఐతే అంశాలపై సూచనలు కావాలంటే అంశాల జాబితాలు చూడండి.