వాడుకరి చర్చ:Vjsuseela

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Vjsuseela గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Vjsuseela గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Bhaskaranaidu (చర్చ) 16:02, 27 ఏప్రిల్ 2014 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
మీరు అందంగా డిజైన్ చేసిన పేజీ గజిబిజిగా కనిపిస్తోందా?

కొన్ని క్లిష్టమైన టేబుల్స్ తో డిజైన్ చేసిన పేజీలు మీరు వాడిన బ్రౌజరులో సరిగ్గానే కనిపించవచ్చు కానీ వేరే బ్రౌజర్లలో సరిగ్గా కనిపించకపోవచ్చు. ఈ సమస్య చాలావరకు కొత్తతరం బ్రౌజర్లలో కనిపిస్తుంది. వీటిలో డిజైన్ చేసిన పేజీలు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లో సరిగ్గా కనిపించకపోవచ్చు లేదా ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లో డిజైన్ చేసిన పేజీ కొత్త బ్రౌజర్లలో సరిగ్గా కనిపించకపోవచ్చు. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లో పేజీలు డిజైన్ చేయడం వలన చాలావరకు ఇతర బ్రౌజర్లలో సమస్యలు లేకుండా వీక్షించవచ్చు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Bhaskaranaidu (చర్చ) 16:02, 27 ఏప్రిల్ 2014 (UTC)

..... సుసీల గారు .... గత కొంత కాలంగా నేను తెవికి లో లేను పైగా నా సిస్టం పాడై వున్నది ఏదో వ్రాయ బోతె ఏదో అవుతున్నది. మీ ఆవసరాలకు తగు సూచనలివ్వమని మన వికీఫీడియన్ కస్యప్ గారిని అబ్యర్దించాను. వారు అంగీకరించారు. వారు ఇప్పటికే మీతో మాట్లాడి వుండవచ్చు. వారు Hyderabad IIIt గచ్చి బౌలి లో నిర్వహించే కార్యశాలకు మీకు ఆహ్వానము పంపుతారు. ఆ శిక్షణా కార్యక్రమాలను మీరు సద్వినియేగ పర్చుకోగలరని నా మనవి. మీవంటి ఔత్సాహికులు తెవికి ఎంతో అవసారం. ధన్యవాదములతో Bhaskaranaidu (చర్చ) 14:43, 31 మార్చి 2020 (UTC)

నా వ్యాసాలను ప్రయోగ శాల నుండి, వాడుకరి పుట నుండి ప్రధాన వికి పీడియా కు తరలించడము ఎలాగ?[మార్చు]

YesY సహాయం అందించబడింది

నా వ్యాసాలను ప్రయోగ శాల నుండి, వాడుకరి పుట నుండి ప్రధాన వికి పీడియా కు తరలించడము ఎలాగ? దయచేసి నాకు వివరించండి. —Vjsuseela (చర్చ) 19:08, 28 మార్చి 2020 (UTC)

భాస్కరనాయుడు గారూ! కశ్యప్ గారు నాతో మాట్లాడారు. వారి ఫోన్ నంబర్ ఈమెయిల్ ఇచ్చారు. మీ సహాయానికి ధన్యవాదాలు. V.J. సుశీల

ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం[మార్చు]

నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం వ్యాసాన్ని చేర్చి, తెలుగు వికీపీడియాకు ఒక మంచి వ్యాసాన్ని అందించారు. ధన్యవాదాలు. మొదటి పేజీలో ప్రదర్శించదగ్గది ఇది. పేజీ నుండి ఇంగ్లీషు వికీపీడియా పేజీకి లింకు ఇవ్వాలంటే, ఎడమ పక్క నేవిగేషను పట్టీలో "భాషలు" కింద ఉన్న "లంకెలను చేర్చండి" అనే లింకును నొక్కితే సంబంధిత వ్యాసాన్ని ఎంచుకునే వీలు ఉంటుంది. ఇలా చెయ్యడం వలన ఓ గొప్ప ప్రయోజనం ఏంటంటే.. ఇంగ్లీషుతో పాటు, ఏయే ఇతర భాషా వికీపీడియాల్లో ఈ వ్యాసం ఉందో, ఆ లింకులన్నీ ఇక్కడకు వచ్చి చేరతాయి. నేను "ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం" పేజీకి అలా లింకును కలిపాను, గమనించగలరు. __చదువరి (చర్చరచనలు) 01:58, 2 ఏప్రిల్ 2020 (UTC)

ధన్యవాదాలు అండి. Vjsuseela (చర్చ) 03:04, 2 ఏప్రిల్ 2020 (UTC)

గ్రంథాలయాలకు సంబంధించిన వికీ వ్యాసాలు[మార్చు]

గ్రంథాలయాలకు సంబంధించి తెవికీలో ఉన్న పేజీలను వర్గం:గ్రంథాలయాలు అనే వర్గం లోకి చేర్చారు. వ్యాసాలే కాకుండా, ఉపవర్గాలను కూడా చూడొచ్చు. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 02:28, 2 ఏప్రిల్ 2020 (UTC)

ఆంగ్లం, తెలుగు వికీలకు ఒకటే వాడుకరి పేజి ?[మార్చు]

ఆంగ్లం, తెలుగు వికీలకు ఒకటే వాడుకరి పేజి, నిర్వహించడము కుదురుతుందా. ఆంగ్లం లో సవరించుతున్న వాడుకరి పేజీ తెలుగు వికీ లో కూడా సవరింపబడుతుందా? నా సందేహము తీర్చగలరు. దీనికి మార్గమేమిటి. నాకు లాగిన్ రెండీంటికీ ఒకటే. --VJS (చర్చ) 14:53, 9 అక్టోబరు 2020 (UTC)

మనం సందేహాలను అడిగేటపుడు సందేహానికి పైన {{సహాయం కావాలి}} అనే మూసను చేరిస్తే అది వర్గం:సహాయం కోసం ఎదురు చూస్తున్న సభ్యులు లేక పేజీలు అనే వర్గం లోకి చేరుతుంది. అందువలన మనకు పరిష్కారం దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. కొందరు నిర్వాహకులు, సీనియర్ వాడుకరులూ ఆ వర్గాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూంటారు. వాళ్ళు వెంటనే తగు సాయం చేస్తారు. ఇక్కడ మీరు రాసిన ప్రశ్నను బహుశా ఎవరూ చూసి ఉండరు (అది సంభవమే, ఎందుకంటే మీ ప్రశ్నను "ఇటీవలి మార్పులు" పేజీలో తప్ప మరెక్కడా చూసే అవకాశం లేదు). అందుకే మీకు ఇప్పటిదాకా సమాధానం దొరకలేదు. నా చర్చాపేజీలో రాయకముందు నేనూ చూళ్ళేదు. పై మూసను చేరిస్తే మన సందేహాలు తీరే అవకాశాలు చాలా ఎక్కువ. గమనించగలరు.
మరొక్క సంగతి.. మన సమస్యకు పరిష్కారం దొరికాక, ఈ మూసను తీసేసి, దాని స్థానంలో మూస:సహాయం చేయబడింది అనే మూసను, సరైన సహాయం దొరక్కపోతే మూస:సహాయం కావాలి-విఫలం అనే మూసనూ పెట్టాలి. __చదువరి (చర్చరచనలు) 11:10, 16 అక్టోబరు 2020 (UTC)

నాకు ఈ విషయాలు తెలియవండి. ఇకముందు ఇలాగే చేస్తాను. ధన్యవాదాలు. --VJS (చర్చ) 15:54, 16 అక్టోబరు 2020 (UTC)

మీ అనువాద కృషిపై సూచనలు[మార్చు]

Vjsuseela గారు, మీరు అనువాద వ్యాసాలపై కృషి చేస్తున్నందులకు అభివందనాలు. వాడుకరి పేజీకి ఉపపేజీగా వాడుకరి:Vjsuseela/ప్లగారిజం వ్యాసం ప్రచురించడం బాగుంది. వికీపీడియా:విషయ అనువాద ఉపకరణం మీ అనువాదానికి ఉపయోగంగా ఉండవచ్చు. మీరు ఎంపికచేసిన ఆంగ్ల వ్యాసాన్ని తెలుగులో గ్రంథ చౌర్యం గా నాకు తెలిసినంతవరకు వ్యవహరిస్తున్నారు కావున ప్లగారిజం బదులు ఆ పదం వాడితే బాగుంటుంది. మీరు పేజీని తరలించడం ద్వారా అలా వ్యాస పేరుని మార్చవచ్చు. లేక ప్రస్తుతానికి వ్యాసంలో మార్పు చేసి, మీ అనువాదం మెరుగుపరచిన తరువాత ప్రధానపేరుబరిలోకి తరలించేటప్పుడు పేరు మార్చవచ్చు. ఇక మీ వ్యాసం ఆంగ్ల వ్యాసానికి పూర్తిగా అనువాదం చేసినట్లుంది. అనువాదాలలో తెలుగు పాఠకస్థాయికి మెరుగుగావుండేటట్లు కుదించడం మేలని నా అభిప్రాయం. అన్నట్లు వ్యాసంలో తొలి పరిచయ పేరాలకు శీర్షిక వుండదు. దానిని ప్రవేశిక అంటారు. ఆంగ్లం లేకపోయినా తెలుగులో మీరు శీర్షిక చేర్చినట్లున్నారు. దానిని సవరించండి. ఇంకేమైనా సందేహాలుంటే ఆ పేజీ చర్చా పేజీలో {{సహాయం కావాలి}} చేర్చి వ్యాఖ్య చేయండి. ఇతర సభ్యులు వీలైనంత త్వరలో తోడ్పడతారు.

గ్రంథ చౌర్యం గురించి గూగుల్ లో వెతికితే కనబడిన వాటిలో ఈమాట వ్యాసం ఉపయోగంగా వుండవచ్చు. దానిని మీరు తగినచోట మూలంగా చేర్చవచ్చు, దానిలో విషయసారాంశాన్ని మీ వ్యాసంలో చేర్చవచ్చు. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 22:47, 4 ఏప్రిల్ 2021 (UTC)

అర్జున్ రావు గారు! మీరు వ్యాసాన్ని చదివి సూచనలు చేసినందుకు ధన్యవాదాలు. ఈ అనువాద వ్యాసము ఇంకా పూర్తికాలేదు. అనువాద ఉపకరణములోనే యాంత్రిక అనువాదాన్ని 3 సార్లు సవరించడం జరిగింది. ఈ విషయ నిర్మాణం లో కూడా కొంత మార్పు చేసాను. చూసే ఉంటారు. అసలు కొత్త వ్యాసం వ్రాయలనుకున్నాను. కాని ఆంగ్లంలో అంశాలు చాలవరకు (కాన్సెప్ట్) కొంత విస్తృతం గా ఉండటముతో అదే అనువదించి (కొంత తగ్గింపు తో) ఇంకొంత విషయము నేను జోడించి పూర్తిచేయాలి అని అనుకున్నాను. చివరగా మళ్ళీ భాషాపరంగా మార్పులు చేయవలసి ఉంటుంది. ఇది పూర్తవడానికి ఇంకొంత సమయం పడుతుంది. ఇక ప్లగారిజం పదం ఆంగ్లం లో చాల విస్తృతమైన పదం - గ్రంధాలనుండి ఒక వాక్యము లేదా పదాల సముదాయ చౌర్యం వరకు, అక్షరాలే కాకుండా, పాటలు దాంట్లో కొంత భాగము కూడా, స్వరం, కళలు, చిత్రాలు, ఛాయాచిత్రాలు, భావాల చౌర్యం కూడా సూచిస్తుంది. వ్యాసం చదివారు కాబట్టి మీకు ఈ విషయం గమనించే ఉంటారు. గ్రంధ చౌర్యం లేదా ఏ చౌర్యం అనుకున్నా శీర్షిక కేవలం 10% విషయాన్ని సూచిస్తుంది. నేను కూడా ఈ విషయం చాలా ఆలోచిస్తున్నాను.
తెలుగులో ఈ విషయం మీద వ్యాసాలు చాలా తక్కువ. నా వ్యాసం గ్రంధాలయ సర్వస్వం అను పత్రిక లో ప్రచురించబడింది. ఇంకా మూలాల గురించి వెతుకుతాను. మీ సూచనలు గుర్తుంచుకుంటాను.--VJS (చర్చ) 09:10, 5 ఏప్రిల్ 2021 (UTC)
Vjsuseela గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. మీ వాడుకరి చర్చలో స్పందన చేర్చినందున, మరల నా చర్చ పేజీలో అదే స్పందన అవసరంలేదు కావున అక్కడ తొలగించాను. గ్రంథ చౌర్యం పదం వాడి దానికి అర్ధం విస్తృతంగా వుంటుందని వ్యాసం ద్వారా వివరించితే సరిపోతుంది అని నా భావన. మీ వ్యాసం మూలంగా మీరు వికీపీడియాలో సమాచారం చేర్చటం వికీపీడియా నియమాలను అతిక్రమించినట్లవుతుంది. మీరు గ్రంధాలయ సర్వస్వం వ్యాసం వివరాలు, దాని లింకు చర్చా పేజీలో తెలిపితే ఆసక్తిగల ఇతరులు ఉపయోగమైన మూలం అనుకుంటే సారాంశాన్ని వ్యాసంలో చేర్చుతారు. --అర్జున (చర్చ) 23:11, 5 ఏప్రిల్ 2021 (UTC)
అర్జున అర్జున్ రావు గారు. ధన్యవాదాలు. నేను కూడా గ్రంధ చౌర్యం పదము వాడడములో అదే అనుకున్నాను. స్వంత వ్యాసాలు లో విషయాన్ని తీసుకొని రిఫరెన్స్ (self citation) వికిపీడియాలో ఈయకూడదని చెప్పారు. నాకు తెలియదు. మిగిలిన వైజ్ఞానిక వ్యాసాల వలె అనుకున్నాను. సరే నేను వేరే చూస్తాను. నాకు 2-3 రోజులు సమయం కావాలి దీనిని మెరుగు పరచడానికి. అనువాద ఉపకరణము తరువాత దీనికి వికి పుటలలో కాకుండా డ్రాఫ్ట్ లో భద్రపరచే సౌకర్యం ఉంటే బాగుండేది.--VJS (చర్చ) 14:54, 6 ఏప్రిల్ 2021 (UTC)
@Vjsuseela గారు, మీరు అవసరమైన సమయం తీసుకోవచ్చు. వాడుకరి పేరుబరి ఉపపేజీలను చిత్తు పేజీలుగానే(డ్రాఫ్ట్) వాడుకోవచ్చు. అర్జున (చర్చ) 00:36, 7 ఏప్రిల్ 2021 (UTC)

అర్జునగారు. నేను గ్రంధచౌర్యం (ప్లగారిజం) అను శీర్షికన ఒక వ్యాసాన్ని వికిపీడియాలో తరలించాను. ఆ పుట కనపడుటలేదు. దీనిపై నేను ఒక నెల రోజులు పైన పని చేసాను. తొలగించినట్లు కనపడుతొంది. నాకు ఈ విషయం అర్ధం కాలేదు. తొలగిస్తే నాకు ఈ పుట కాపీని నాకు ఇవ్వండి. తెలుపగలరు. --VJS (చర్చ) 19:00, 18 ఏప్రిల్ 2021 (UTC)

@Vjsuseela గారు, క్షమించాలి. నేను వికీపీడియా పేరుబరిలో తొలగించటానికి ప్రయత్నించినందున పొరబాటున ప్రధానపేరుబరి వ్యాసం తొలగింపబడినట్లుంది. ఇప్పుడు పునఃస్థాపించాను. చూడండి గ్రంధచౌర్యం (ప్లగారిజం) అర్జున (చర్చ) 03:50, 19 ఏప్రిల్ 2021 (UTC)
అర్జున చూసానండి. ధన్యవాదాలు. --VJS (చర్చ) 09:22, 19 ఏప్రిల్ 2021 (UTC)

మీ కొత్త ప్రయోగశాల వ్యాసం గురించి[మార్చు]

వాడుకరి:Vjsuseela/ప్రయోగశాల లో తెలుగునాడు- అను ఆంధ్రవీధిలో బ్రాహ్మణ ప్రశంస అనే వ్యాసం వివరాలు చేరుస్తున్నట్లు గమనించాను. కొత్త వ్యాసం వాడుకరి పేజీకి ఉపపేజీగా చేర్చేటప్పుడు, సాధారణ శీర్షిక కాకుండా, ప్రధానపేరుబరిలో వుంటే ఏ శీర్షిక వుంటుందో దానితోటే ప్రారంభించండి. ప్రస్తుత వ్యాసం గురించి, పుస్తక రచయిత మీకు బంధుత్వం గల వారని గత చర్చలలో తెలిపినందున, నిష్పక్షత పాటించడానికి అవరోధాలు ఏర్పడే అవకాశం వున్నందున, మీరు అటువంటి వ్యాసాలు వ్రాయకుండా వుండడమే మంచిది. అర్జున (చర్చ) 23:48, 23 ఏప్రిల్ 2021 (UTC)

అర్జునగారు మీ సూచన కు ధన్యవాదాలు. దీనితొ కలిపి 12 గ్రంధాలను కామన్స్ లో అప్లోడ్ చేసి OTRS అనుమతి కోసము కాపీ రైట్ 4.0 విడుదల చేస్తూ ఈమెయిల్ పంపారు. నేను గ్రంధ వివరాలను ఏ విధముగా పొందుపరచవచ్చో అని ప్రయత్నం చేస్తున్నాను. నేను ఆయన గురించి కానీ గ్రంధాల గురించి గానీ అతిశయోక్తులు రాయడములేదు. అవి కేవలము వివరాలు మాత్రమే. ఈ పురాతన వనరులు, డేటా మాదగ్గర ఉంది. మీరు ఎవరైనా ఈ విషయంలో సహకరిస్తే వాళ్ళకు నేను ఈయగలను. వాటిని సంరక్షించకపోతే ఎవరికీ అందుబాటులో లేకుండా పోయే ప్రమాదము ఉంది. --VJS (చర్చ) 07:43, 24 ఏప్రిల్ 2021 (UTC)
@Vjsuseela గారు, కామన్స్ లో చేర్చి, వాటిని పాఠ్య రూపంలో మార్చటానికి వికీసోర్స్ వాడితే సంరక్షించినట్లే. దీనితో పాటు దాసు శ్రీరాములు పేజీలో కామన్స్ లో వర్గానికి లింకు ఇవ్వడం ద్వారా ఆసక్తిగలవారు, ఆ రచనలు చూడగలరు. వాటిలో విషయప్రాముఖ్యత గలవాటికి ఇతరులు వికీపీడియా వ్యాసాలు సృష్టించవచ్చు. అర్జున (చర్చ) 23:25, 24 ఏప్రిల్ 2021 (UTC)