వికీపీడియా:తెవికీ 20 వ వార్షికోత్సవం/సన్నాహక సమావేశాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రధాన పేజీచర్చకార్యక్రమ
ప్రణాళిక
కమిటీలుసన్నాహక
సమావేశాలు
స్కాలర్‌షిప్స్నివేదికభావి కార్యాచరణ

సీఐఎస్-ఎ2కె భాగస్వామ్యంతో తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవాన్ని నిర్వహించాలన్న ఆలోచనను, నిర్వహిస్తే ఎలా నిర్వహించాలన్న వివరాలను చర్చించడానికి ఏర్పాటుచేస్తున్న సమావేశం.

వన్నెండవ సమావేశం[మార్చు]

తేదీ: 2024 జనవరి 7, ఆదివారం

  • సమయం: మధ్యాహ్నం 2.00 నుంచి 4.00 వరకూ
  • నిర్వహించే చోటు: గూగుల్ మీట్
  • నిర్వాహకులు: వాడుకరి:Vjsuseela

నివేదిక[మార్చు]

ఈ సమావేశంలో శిరీష్ కుమార్ (చదువరి), వి.జె. సుశీల, ప్రణయరాజ్ పాల్గొన్నారు.

చర్చలు

'తెవికీ పండగ' పేరుతో లోగో డిజైన్ తోపాటు, బ్యానర్లు, పుస్తక ముఖచిత్రంపై డిజైన్లు తయారు చేయించాలి. లోగోలో తెవికీ పండగ పేరు, తెవికీ లోగో (తెలుగు ‘వి’) ఉండాలి. వార్షికోత్సవానికి ఉపయోగిస్తున్న అన్నింటిమీద తెవికీ పండగ లోగో ఉండాలి. లోగో కింద 20వ వార్షికోత్సవం అని రాయాలి. స్కాలర్ షిప్ కు ఎంపిక కానివారికి ఒక మెయిల్ (వికీమానియాలో మాదిరిగా) పంపించాలి.

పదకొండవ సమావేశం[మార్చు]

తేదీ: 2024 జనవరి 4, గురువారం

  • సమయం: సాయంత్రం 6.00 నుంచి 8.00 వరకూ
  • నిర్వహించే చోటు: గూగుల్ మీట్
  • నిర్వాహకులు: వాడుకరి:Vjsuseela

నివేదిక[మార్చు]

ఈ సమావేశంలో శిరీష్ కుమార్ (చదువరి), యర్రా రామారావు, వి.జె. సుశీల, రవిచంద్ర, పవన్ సంతోష్, కశ్యప్ పాల్గొన్నారు.

పదవ సమావేశం[మార్చు]

తేదీ: 2023 డిసెంబర్ 31, ఆదివారం

  • సమయం: మధ్యాహ్నం 2.00 నుంచి 4.00 వరకూ
  • నిర్వహించే చోటు: గూగుల్ మీట్
  • నిర్వాహకులు: వాడుకరి:Vjsuseela

నివేదిక[మార్చు]

ఈ సమావేశంలో శిరీష్ కుమార్ (చదువరి), యర్రా రామారావు, వి.జె. సుశీల, ప్రణయరాజ్ పాల్గొన్నారు.

తొమ్మిదవ సమావేశం[మార్చు]

తేదీ: 2023 డిసెంబర్ 28, గురువారం

  • సమయం: సాయంత్రం 6.00 నుంచి 8.00 వరకూ
  • నిర్వహించే చోటు: గూగుల్ మీట్
  • నిర్వాహకులు: వాడుకరి:Vjsuseela

నివేదిక[మార్చు]

ఈ సమావేశంలో యర్రా రామారావు, వి.జె. సుశీల, కృపాల్ కశ్యప్, పవన్ సంతోష్, ప్రణయరాజ్, భవ్య పాల్గొన్నారు.

లాజిస్టిక్ కమిటీ నివేదికలో భాగంగా వేడుకలకు ఆహ్వానించదగిన అతిథుల గురించిన అప్డేట్ లను పవన్ సంతోష్ గారు తెలియజేశారు. స్కాలర్ షిప్ కు ఎంపికైనవారికి ప్రయాణ టికెట్లు బుక్ చేస్తున్నట్టు తెలిపారు. వికీ లవ్స్ మాన్యుమెంట్స్ పోటీకి కు మన వికీపీడియన్ ఐ. మహేష్ సహకారం ఉంటుందని, తదుపరి వివరాలు త్వరలో తెలియజేస్తామని అన్నారు. వేడుకల సందర్భంగా జ్ఞాపిక గా వికీ గ్లోబ్, వికీ క్యాలెండరు పరిశీలనలో ఉన్నాయన్నారు.

ప్రోగ్రామ్స్ కమిటీ నివేదికలో భాగంగా మూడు రోజుల కార్యక్రమాలపై జరిగిన ప్రొగ్రెస్ ను సుశీల గారు స్థూలంగా తెలియచేసారు. తెవికీ ప్రస్థానంపై పుస్తక ప్రచురణ కోసం కంటెంట్ తయారుచేస్తున్నామని, జనవరి మొదటివారంలో కంటెంట్ పూర్తిచేసి పుస్తక ప్రచురణకు ఇస్తామని అన్నారు.

స్కాలర్ షిప్ కు ఎంపికైనవారి నుండి అంగీకారం వచ్చిన తరువాత వారి పేర్లను వికీలో ప్రకటిస్తామని స్కాలర్ షిప్ కమిటీ తరపున రామరావు గారు తెలియజేశారు.

వేడుకలకు వచ్చే అతిధుల వ్యాసాలను పరిశీలించి సరిచేయాలని, లేని వ్యాసాలను రాయాలని కశ్యప్ గారు సూచించారు.

ఎనమిదవ సమావేశం[మార్చు]

తేదీ: 2023 డిసెంబర్ 24, ఆదివారం

  • సమయం: మధ్యాహ్నం 2.00 నుంచి 4.00 వరకూ
  • నిర్వహించే చోటు: గూగుల్ మీట్
  • నిర్వాహకులు: వాడుకరి:Vjsuseela

నివేదిక[మార్చు]

ఈ సమావేశంలో శిరీష్ కుమార్ (చదువరి), యర్రా రామారావు, నివాస్ (CIS), వి.జె. సుశీల పాల్గొన్నారు.

స్కాలర్ షిప్ కమిటీ ఎంపిక చేసిన దరఖాస్తుదారుల జాబితా ప్రకారం లాజిస్టిక్స్ కమిటీ ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. కార్యక్రమ స్థలం విశాఖపట్నం డాల్ఫిన్స్ హోటల్ గా నిర్ణయం అయిందని తెలియచేసారు. చదువరి గారు 3 రోజుల కార్యక్రమ వివరాలు, ప్రోగ్రాం కమిటీ పురోగతిని తెలియచేయడం జరిగింది. మొదటిరోజుకు సందర్శించవలసిన ప్రదేశాలు కూడా ఈ లోగా చూస్తామని అనుకున్నారు.

ఏడవ సమావేశం[మార్చు]

తేదీ: 2023 డిసెంబర్ 21, గురువారం

  • సమయం: సాయంత్రం 6.00 నుంచి 8.00 వరకూ
  • నిర్వహించే చోటు: గూగుల్ మీట్
  • నిర్వాహకులు: వాడుకరి:Vjsuseela

నివేదిక[మార్చు]

ఈ సమావేశంలో శిరీష్ కుమార్ (చదువరి), రవిచంద్ర, యర్రా రామారావు, సాయికిరణ్, భవ్య, పవన్ సంతోష్, ఆదిత్య పకిడే, వి.జె. సుశీల పాల్గొన్నారు.

స్కాలర్ షిప్ కమిటీ 51 దరఖాస్తులు అందుకుంది. వాటిని అర్హతల బట్టి రాంక్ చేసి 23 నాటికి జాబితా విడుదల చేస్తారు. ప్రోగ్రాం కమిటీ పురోగతిని తెలియచేయడం జరిగింది.

ఆరవ సమావేశం[మార్చు]

తేదీ: 2023 డిసెంబర్ 17, ఆదివారం

  • సమయం: మధ్యాహ్నం 2.00 నుంచి 4.00 వరకూ
  • నిర్వహించే చోటు: గూగుల్ మీట్
  • నిర్వాహకులు: వాడుకరి:Chaduvari

నివేదిక[మార్చు]

ఈ సమావేశంలో శిరీష్ కుమార్ (చదువరి), రవిచంద్ర, యర్రా రామారావు, ప్రణయరాజ్ పాల్గొన్నారు.

ప్రోగ్రామ్స్ కమిటీ నివేదికలో భాగంగా మూడు రోజుల కార్యక్రమాలపై చదువరి గారు స్థూలంగా తెలియచేసారు. మొదటిరోజు కార్యక్రమాలపై స్పష్టత వచ్చినట్లు, విుగతా రెండురోజుల కార్యక్రమాల విషయంలో చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. రెండురోజుల కార్యక్రమాలలో సభ్యుల పరిచయం, వికీలో వారి అనుభవాలు, అభిప్రాయాలు.. వికీమీడియా ఫౌండేషన్-వికీపీడియా ప్రాజెక్టుల పరిచయం-వికీలో ఎక్కువ పనిచేసిన వారిపై ప్రజంటేషన్స్ … బయటివారిని పిలిచి వారితో వికీ గోష్ఠి వంటివి ఉంటాయన్నారు.

ఇప్పటివరకూ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు అప్లై చేయనివారికి మళ్ళీ మెయిల్ పంపించడంతోపాటు, వ్యక్తిగతంగా పరిచయం ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించి వారితో అప్లై చేయించాలని నిర్ణయించారు.

అప్లై చేసుకున్నవారిని స్కాలర్‌షిప్ కి ఎంపిక చేసే అర్హతల గురించిన చర్చ జరిగింది, 21 వ తేదీకి జాబితా విడుదల చేయాలని నిర్ణయించారు.

ఐదవ సమావేశం[మార్చు]

తేదీ: 2023 డిసెంబర్ 14, గురువారం

  • సమయం: సాయంత్రం 5.00 నుంచి 7.00 వరకూ
  • నిర్వహించే చోటు: గూగుల్ మీట్
  • నిర్వాహకులు: వాడుకరి:Vjsuseela

నివేదిక[మార్చు]

ఈ సమావేశంలో శిరీష్ కుమార్ (చదువరి), విజె సుశీల, రవిచంద్ర, యర్రా రామారావు, కృపాల్ కశ్యప్, ప్రణయరాజ్, ఆదిత్య పకిడె, భవ్య, మమత పాల్గొన్నారు.

  • కమ్మూనికేషన్స్ నుంచి ప్రణయరాజ్ గారు అప్పటివరకు 500 పైగా ఎడిట్స్ ఉండి, ఈ 6నెలలలో కనీసం 1 ఎడిట్ చేసినవారికి స్కాలర్షిప్ ఫారం గురించిన పంపిన సందేశాలను వివరించారు. దీనిలో ఈ 6నెలలలో 1 ఎడిట్ కూడా చేయనివారు అను కండిషన్ తొలగిస్తే వచ్చే ఇంకో వందమందికి అంటే 158 మందికి సందేశాలు పంపవలెనని నిరోధంలో ఉన్నవారు, దుశ్చర్యలకు పాల్పడ్డవారికి అవకాశం ఈయకూడదని అందరు ఏకగ్రీవంగా భావించారు.
  • రవిచంద్రగారు, రామారావుగారు నిన్నటికి 26 ఫార్మ్స్ వచ్చాయని తెలియచేసారు. సబ్జెక్టివ్ ఇవాల్యూయేషన్ గురించి ఇంకొంత మంది సభ్యులను కలుపుకొని డేటా ను షేర్ చేస్తాము అన్నారు.
  • సుశీల 3 రోజుల కార్యక్రమాన్ని స్థూలంగా తెలియచేసారు. కార్యక్రమాల వరుస, అతిధుల వివరాలు ఇంకా నిర్ణయాలు కావాలని చెప్పారు. సమీక్ష గురించిన ప్రస్తావనకు CIS వారు చేస్తున్నారు అని తెలుసు కానీ, ఎవరు ఏ ప్రతిపాదికన చేస్తారు అనే విషయం ఇంకా తెలియలేదని చెప్పారు. అతిధుల గురించి అందిన కొన్ని సూచనలు
    • మామిడి హరికృష్ణ గారు
    • పత్రిక ప్రముఖులు ఉదా. రామోజీరావుగారు
  • మమతగారు తెవికీ ప్రెజెన్టేషన్స్ వీడియో రూపంలో ఉంటె బావుంటుందని సూచించారు. దాని గురించి కూడా ప్రయత్నం చేస్తున్నామని బదులిచ్చారు.
  • ఈవెంట్ సేఫ్టీ అండ్ ఇంక్లూజన్ కమిటీ నుంచి మమతగారు తాము తమ కమిటీ సభ్యులతో చర్చించి ప్రణాళిక తెలియచేస్తాము అని అన్నారు.
  • లాజిస్టిక్స్ కమిటీ మన సమాచారం కొంతవారికి ఇచ్చిన తరువాత తమ పనుల అంచనా వేస్తాము అన్నారు.
  • కశ్యప్ గారు తెవికీ రచ్చబండలో ఆగిపోయిన చర్చలను అక్కడ చర్చించి ఒక అభిప్రాయానికి రావడం ద్వారా కొన్ని విధానపర నిర్ణయాలు తీసుకోవచ్చని సూచించారు. ఈ విషయం భవిష్యత్ కార్యాచరణ చర్చలో ఉంచుదామని అందరు అభిప్రాయపడ్డారు.
  • ఇదే విధం గా వికీపీడియన్లకు శిక్షణా కార్యక్రమాలు కూడా క్రోడీకరించి భవిష్యత్ కార్యాచరణ చర్చలో చేర్చుదామని అంగీకరించారు.
  • ప్రణయరాజ్ గారు సమావేశాల వివరాలు 20వార్షికోత్సవాలు పేజీ లో క్లుప్తంగా చేర్చుతామని చెప్పారు.

నాల్గవ సమావేశం[మార్చు]

తేదీ: 2023 డిసెంబర్ 10, ఆదివారం

నివేదిక[మార్చు]

ఈ సమావేశంలో శిరీష్ కుమార్ (చదువరి), పవన్ సంతోష్, విజె సుశీల, రవిచంద్ర, కృపాల్ కశ్యప్, ప్రణయరాజ్, ఆదిత్య పకిడె, నివాస్ (CIS /A2K) పాల్గొన్నారు.

కమ్యూనికేషన్స్ కమిటీ

ముందుగా కమ్యూనికేషన్స్ కమిటీ నుంచి ఆదిత్య పకిడె గారు, ప్రణయరాజ్ గారు తమ కమిటీలో అంతర్గత, బహిర్గత సమాచారాలన్నిటి ప్రసార, నిర్వహణా బాధ్యతలు చర్చించుకున్న వివరాలు అందచేశారు. ఇవ్వవలసిన పత్రికా ప్రకటనలు, తెలుగు వికీమీడియా విషయాలపై కథనాలు, మీడియాతో సమన్వయం, పేజీల నిర్వహణ, మీటింగ్ నోట్స్ ప్రచురణ, ఇందులోకి కార్యక్రమ నివేదిక, పత్రికా సంబంధాలు, సామాజిక మాధ్యమాలు.

ప్రోగ్రామ్స్ కమిటీ

ప్రోగ్రామ్స్ కమిటీ (ఇందులో సుశీల గారు, చదువరిగారు, పవన్ సంతోష్ గారు పాల్గొన్నారు). ఇంతకూ ముందు నిర్వహించుకున్న సమావేశాల గురించి, తెవికీ వేడుకల కు సంబంధించి ఏర్పరచుకున్న లక్ష్యాలకు (ఆటవిడుపు, వేడుకలు, పరిచయాలు, outreach, సమీక్ష, అభిప్రాయాలూ, ముగింపు) అనుగుణంగా స్థూలంగా రూపొందించిన 3 రోజుల కార్యక్రమాన్ని అందరు సభ్యులకు వివరించారు. ఇంకా ప్రోగ్రాం ఫ్లో తదితర వివరాలు ఇంకా పూర్తి కావలిసినది తెలియచేసారు.

స్కాలర్‌షిప్స్ కమిటీ

రవిచంద్ర గారు తమ కమిటీ తరపున రూపొందించిన ఉపకారవేతనం దరఖాస్తు ఫారం ను గురించి అందరి సభ్యుల అభిప్రాయాలు తీసుకున్నారు. అనుగుణంగా దరఖాస్తు ఫారం ను సవరించి స్కాలర్ షిప్ విభాగంలో పోస్ట్ చేస్తాను అని చెప్పారు. ప్రణయరాజ్ గారు తెవికీ 20వ వార్షికోత్సవాలు పేజీలో స్కాలర్ షిప్ విభాగం (టాబ్) ఏర్పాటు చేస్తానని చెప్పారు. నివాస్ గారు కూడా సమావేశంలో తమ అభిప్రాయాలూ, సూచనలు ఇచ్చారు. తదుపరి సంయుక్త సమావేశం 14 గురువారం నిర్వహించాలనే సూచనతో సమావేశం సుమారు మధ్యాహ్నం 12 గంలకు ముగిసింది.

మూడవ సమావేశం[మార్చు]

తేదీ: 2023 డిసెంబర్ 5, మంగళవారం

అజెండా[మార్చు]

  • తెలుగు వికీపీడియా వార్షికోత్సవం నిర్వహణలో సీఐఎస్-ఎ2కె, తెలుగు వికీమీడియా సముదాయం భాగస్వామ్యంతో ముందుకువెళ్ళాలన్న నిర్ణయం నేపథ్యంలో కార్యక్రమ నిర్వహణ విషయంలో కమిటీల ఏర్పాటు, నిర్వహణ, సభ్యుల విధులు, బాధ్యతలు వంటివి చర్చించడానికి ఉద్దేశించిన సమావేశం.
  • ఈ సమావేశంలో అన్ని కమిటీలకు సంబంధించిన సభ్యులందరు పాల్గొంటారు.

నివేదిక[మార్చు]

2023, డిసెంబరు 5న వాట్సాప్ గ్రూప్ కాల్ లో సాయంత్రం 7:00 నుండి 9:00 వరకు అన్ని కమిటీల తొలి సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విజె సుశీల, శిరీష్ కుమార్ (చదువరి), పవన్ సంతోష్, యర్రా రామారావు (కానీ నెట్ సమస్య కారణంగా వెంటనే డ్రాపయ్యారు), రవిచంద్ర, కృపాల్ కశ్యప్, సాయి కిరణ్, రాజశేఖర్, ఆదిత్య పకిడె, భవ్య పాల్గొన్నారు.

ఈ సమావేశంలో వివిధ కమిటీల బాధ్యులు వారివారి ప్రణాళికలు, కార్యాచరణపై వివరణలు ఇచ్చారు. ఆయా కమిటీలు అంతర్గతంగా సమావేశమై, తమతమ బాధ్యతల మేరకు చర్చించుకుని, పని ప్రణాళికలు, టైమ్‌లైన్లు తయారుచేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

రెండవ సమావేశం వివరాలు[మార్చు]

అజెండా[మార్చు]

  • తెలుగు వికీపీడియా వార్షికోత్సవం నిర్వహణలో సీఐఎస్-ఎ2కె, తెలుగు వికీమీడియా సముదాయం భాగస్వామ్యంతో ముందుకువెళ్ళాలన్న నిర్ణయం నేపథ్యంలో కార్యక్రమ నిర్వహణ విషయంలో బాధ్యతలు, లక్ష్యాలు, వనరులు, తేదీలు వంటివి చర్చించడానికి ఉద్దేశించిన సమావేశం.
  • ఈ సమావేశంలో సీఐఎస్-ఎ2కె ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తన్వీర్ హాసన్, తెలుగు వికీపీడియా నాణ్యతా సమీక్ష చేసే బృంద సభ్యులు కూడా పాల్గొంటారు.

చేరడానికి ఆసక్తిగల సభ్యులు[మార్చు]

మార్పు[మార్చు]

@Chaduvari: @యర్రా రామారావు: @Vjsuseela: @V Bhavya: @Pranayraj1985: @Kasyap: @Divya4232: గార్లకు విజ్ఞప్తి. ఇక్కడ నమోదుచేసుకున్నందుకు ధన్యవాదాలు. అయితే, ఈ ఆదివారం సాయంత్రం సమయంలో క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఉందనీ, అది కూడా భారత జట్టు ఆడుతున్నదినీ తట్టలేదు. మన్నించండి. చాలామందికి ఈ సమయం సౌకర్యవంతం కాకపోవచ్చునన్న ఆలోచనతో దీన్ని బుధవారం రాత్రి 8-9.30కి వాయిదా వేస్తున్నాము. గమనించగలరు. మరోసారి మీ ఆసక్తికి ధన్యవాదాలు, అసౌకర్యానికి క్షమాపణలు. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 14:55, 17 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ @పవన్ సంతోష్ గారు. ధన్యవాదాలు Divya4232 (చర్చ) 15:06, 17 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగేనండీ @పవన్ సంతోష్ గారు, ధన్యవాదాలు. V Bhavya (చర్చ) 15:02, 21 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

నివేదిక[మార్చు]

క్లుప్తంగా[మార్చు]

ఈ విభాగంలో కింద సవివరంగా చేసిన చర్చ తాలూకు సారాంశాన్ని రాశాము. దీనిలో వ్యక్తుల పేర్లు కాక బాధ్యతలు మాత్రమే ఉంటాయి. క్లుప్తంగా తెలుసుకోదలిచినవారు ఇది చదవగలరు. ఎవరెవరు ఏమేం ప్రతిపాదించారో, ఎలా చర్చ సాగిందో సవివరంగా తెలుసుకోదలిచినవారు కింద చర్చలు చదవవచ్చు.

నేపథ్యం

గత చర్చల నిర్ణయం ప్రకారం వేడుకలతో పాటుగా సమీక్ష, భవిష్యత్ ప్రణాళికతో కూడిన కార్యక్రమాలతో తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవాన్ని సీఐఎస్-ఎ2కె భాగస్వామ్యంతో విశాఖపట్టణంలో జరుపుకోవాలన్న నిర్ణయం ఇరుపక్షాలూ తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో సీఐఎస్-ఎ2కె, తెలుగు వికీమీడియా సముదాయాల మధ్య జరిగిన చర్చ ఇది.

తేదీలు

2024 జనవరి 26 శుక్రవారం నాడు వచ్చింది. ఆ వారాంతం (జనవరి 26-28) జరిగితే అందరికీ సౌకర్యంగా ఉంటుందని సీఐఎస్-ఎ2కె ప్రతిపాదించగా పాల్గొన్న సభ్యులు ఏకీభవించారు.

లక్ష్యాల గురించిన చర్చ సారాంశం

మొత్తంగా జరిగిన చర్చలో సారాంశంగా చూస్తే తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవానికి లక్ష్యాలు ఈ కింది విధంగా ఉండాలని చర్చ అభిప్రాయపడింది:

  • తెలుగు వికీమీడియన్లు కలసి సరదాగా గడపాలి.
  • తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల సమీక్ష చేయాలి. మన పనిలో తప్పులేమిటో తెలుసుకోవాలి.
  • తెలుగు వికీమీడియా భవిష్యత్ వ్యూహాలను రూపొందించుకోవాలి, వ్యూహాత్మక స్థాయిలోని ప్రశ్నల (స్ట్రాటజిక్ క్వశ్చన్స్) గురించి ఆలోచించాలి.
  • తెలుగు వికీమీడియన్ల కృషిని సెలబ్రేట్ చేసుకోవాలి, వారు చేసిన పనిని రిప్రజెంట్ చేయాలి.
  • తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల గురించి ఒక బజ్ క్రియేట్ చేయాలి.
కార్యక్రమ ప్రణాళికల గురించిన చర్చ సారాంశం

పై లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ విషయంలో స్పష్టత కోసం తెలుగు వికీమీడియన్లు, సీఐఎస్-ఎ2కె వారు ప్రతిపాదించిన, చర్చించిన కొన్ని ఆలోచనలు ఇవి, (అయితే- ఇవన్నీ భవిష్యత్తులో సాధ్యాసాధ్యాలను బట్టి, మానవ వనరులను బట్టి, ఆర్థిక వనరులను బట్టి జరుగుతాయి. ఇంతకన్నా మెరుగైన, ఆచరణ సాధ్యమైన, లక్ష్యాలకు అనుగుణమైన వేరే ఆలోచనలు భవిష్యత్తులో ప్రోగ్రామ్స్ కమిటీ చేసి వాటిని అమలుచేయవచ్చు. గమనించగలరు):

  • ప్రీఈవెంట్ కార్యక్రమంగా బజ్ క్రియేట్ చేసేందుకు విజయవాడ బుక్ ఫెస్టివల్లో ఒక స్టాల్ పెడితే బావుంటుంది.
  • విశాఖకు ఒక ప్రత్యేక బస్సు (లేక టెంపో) ఏర్పాటుచేసుకుని అందరూ కలసి వస్తే బావుంటుంది.
  • ఈ వేడుకల్లో వేడుకలకు ఆహ్లాదానికి మంచి స్థానం ఉండాలన్నదానిపై ఏకాభిప్రాయం ఉంది. విశాఖపట్టణంలో నడక, బీచ్‌లో వికీపీడియా స్టాల్, స్థానిక ప్రముఖుల వద్దకు వెళ్ళి కలవడం - వంటి ఆలోచనలు కొన్ని వచ్చాయి.
  • ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా తెలుగు సాంస్కృతిక నాయకత్వాన్ని ఆహ్వానించి వారితో ఇంటరాక్ట్ కావడం పట్ల మంచి స్పందన వచ్చింది. ఎవరెవరిని పిలవచ్చు అన్నది కూడా చాలామంది చర్చించారు.
  • సీఐఎస్-ఎ2కె చేయిస్తున్న తెలుగు వికీపీడియా సమీక్ష చాలా ముఖ్యమైన, ప్రయోజనకరమైన కార్యక్రమమనీ, దాని చుట్టూ జరగాల్సిన చర్చ ప్రధానమైనదనీ అభిప్రాయం వెల్లడైంది.
  • తెలుగు వికీపీడియన్ల కృషిని, వికీపీడియాల ప్రత్యేకతలను తెలియజేసేలా ఒక క్యూరేటెడ్ పద్ధతిలో రెండు గంటల బహిరంగ కార్యక్రమం (ఆస్కార్ వేడుకల తరహాలో) చేస్తే బావుంటుంది.
  • ఒక ప్రత్యేకమైన ప్రతిమను చేయించి వికీపీడియన్లకు బహూకరించవచ్చు.
బడ్జెట్, బాధ్యతలు
  • పై కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని తెలుగు వికీపీడియన్ ఒకరు రూ.8 నుంచి 9 లక్షల వరకూ కార్యక్రమానికి ఖర్చవ్వగలదన్న అంచనా అందించగా దాన్ని పరిశీలించి నిర్ణయాన్ని, వనరుల విషయంలో తదుపరి కార్యాచరణను కొద్దిరోజుల్లో తెలియజేస్తాననీ సీఐఎస్-ఎ2కె ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రతిస్పందించారు.
  • ఈ కార్యక్రమ నిర్వహణలో బాధ్యతలు ఏమేం ఉంటాయన్నది సీఐఎస్-ఎ2కె ప్రోగ్రామ్ మేనేజర్ అయిన తెలుగు వికీమీడియన్‌ని తన అనుభవాన్ని బట్టి సూచిస్తూ రాయమని ఒక తెలుగు వికీమీడియన్ కోరారు. ఆపైన, ఆ బాధ్యతలు ఎవరెవరు స్వీకరించాలన్నది నిర్ణయించుకుంటే పని ఇంకాస్త త్వరగా, మెరుగ్గా సాగుతుందని ఆ వికీమీడియన్ అభిప్రాయపడ్డారు.

వివరంగా[మార్చు]

ఈ కింద ప్రస్తావించిన వ్యక్తులు తమ అభిప్రాయాలు ఇక్కడ ప్రతిబింబించిన తీరులో ఏమైనా సరికాదని తోస్తే దయచేసి దిద్దుబాట్లను చేయమని మనవి
కింద రాసిన పూర్తి చర్చనే సాధ్యమైనంతవరకూ క్లుప్తీకరించి పైన రాశాము. గమనించగలరు.

  • ఇంతకుముందు జరిగిన చర్చల పర్యవసానంగా జరిగిన నిర్ణయం ప్రకారం తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవాన్ని అందరూ విశాఖపట్టణంలో కలిసి జరుపుకోవాలనీ, ఆ విషయంలో సమీక్ష-భవిష్యత్ ప్రణాళిక కూడా భాగాలుగా ఉండాలనీ, దీనిలో సీఐఎస్-ఎ2కె భాగస్వామిగా ఉంటుందనీ నిర్ణయాలు వెలువడ్డట్టు పేర్కొంటూ, ఈనాటి సమావేశంలో తేదీలు, లక్ష్యాలు, బడ్జెట్, స్థూలంగా కార్యక్రమ సరళి, బాధ్యతల పంపకం వంటివాటిపై చర్చించుకుందామంటూ వాడుకరి:Pavan (CIS-A2K) సమావేశం ప్రారంభించారు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్‌ ఇంటరెస్ట్ ఉండకుండా చూసుకునేందుకు తాను సీఐఎస్-ఎ2కె తరఫు నుంచి ఈ ఒక్క కార్యక్రమం విషయంలో ఆర్థిక వ్యవహారాల బాధ్యతను తన్వీర్ హాసన్‌కి అప్పగిస్తున్నట్టు గతంలో ప్రకటించిన నిర్ణయాన్ని మరోసారి గుర్తుచేశారు.
కార్యక్రమ లక్ష్యాలు, దిశ
  • సీఐఎస్-ఎ2కె ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తన్వీర్ హాసన్ మాట్లాడుతూ 20 సంవత్సరాల పాటు అన్నది ప్రాజెక్టు విజయవంతంగా సాగడమన్నది చాలా ముఖ్యమైన మైలురాయి అనీ, తెలుగు వికీమీడియా సముదాయం అంతా ఈ సందర్భంగా ఒకచోట కలుస్తున్నప్పుడు వేడుకలతో పాటుగా ప్రాజెక్టు గతం-ప్రస్తుతం-భవిష్యత్తు గురించిన ముఖ్యమైన ప్రశ్నలు వేసుకుని, వాటిపై భవిష్యత్ వ్యూహాలను రూపొందించుకోవడం ముఖ్యమని అన్నారు. ఇలాంటి అంశాలు ఆన్‌లైన్ సమావేశాల్లోనూ, ఇంటరాక్షన్లలోనూ మాత్రమే తేలేవి కాదనీ, ముఖాముఖి కలుసుకున్నప్పుడు ఇటువంటి చర్చలు చేయడం ప్రయోజనకరమనీ అన్నారు.
  • వాడుకరి:Chaduvari మాట్లాడుతూ సన్మానాలు సత్కారాలతో సరిపెట్టకుండా, వికీమీడియా ప్రాజెక్టులకు సంబంధించి ఏ విధంగా అభివృద్ధి చెందాలి, పరిస్థితి ఎలా ఉంది అన్నది చర్చించుకోవడం ముఖ్యమన్నారు. అలాగే, తెలుగు వికీపీడియాని సమీక్షించే బాధ్యతలు సీఐఎస్-ఎ2కె స్వీకరించి చేయడం చాలా మంచి పని అనీ, ఇది తెలుగు వికీపీడియాకు చాలా ప్రయోజనకరమనీ పేర్కొన్నారు. ఈసారి కార్యక్రమం నిర్వహించడంలో తన్వీర్, సీఐఎస్-ఎ2కె మంచి మార్గదర్శకం చేస్తే, తెలుగు వికీపీడియాకి ఉపయోగపడేలా చర్చలు చేసుకోవచ్చు అని తన ఉద్దేశమని చెప్పారు.
  • వికీపీడియాకు సంబంధించిన కాన్ఫరెన్సులను పరిశీలించిన మీదట రివ్యూ, స్ట్రాటజీ వంటివాటిపై చర్చల కన్నా కన్నా సెలబ్రేషన్లుగా చేసుకోవడాన్నే పాల్గొనేవారు ఎక్కువ ఇష్టపడతారన్నది తన అనుభవమని వాడుకరి:Kasyap అభిప్రాయపడ్డారు. తెలుగు వికీపీడియాలో చూసినా చర్చా పేజీల్లో కూడా ఆరేడుగురు మినహాయించి మాట్లాడేవారు ఎక్కువగా లేరనీ, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా సెలబ్రేషన్‌గానే చూడడం మంచిదన్నది తన అభిప్రాయమని చెప్పారు.
    • దీనికి ప్రతిస్పందిస్తూ వేడుకలు జరుపుకోవడానికి, సెలబ్రేషన్స్ చేయడానికి ఈ కార్యక్రమంలో చోటు ఉండకూడదన్నది ఆలోచన కాదనీ, విశాఖ వంటి నగరంలో కలసినప్పుడు అక్కడి స్థానిక సాంస్కృతిక సంస్థలతో కలవడమూ, హెరిటేజ్ వాక్ వంటి కార్యక్రమాలో, సరదాగా బీచ్‌లో గడపడమో - ఇలా చాలా రకాలుగా వేడుకలు, సరదా సమయమూ గడపవచ్చన్నది ప్రోగ్రామ్‌లో భాగమేననీ, కాకపోతే వాటితో పాటుగా వ్యూహాత్మక చర్చలకు, సమీక్షలకు చోటు ఉండాలని అంటున్నామనీ, నిజానికి సెలబ్రేషన్స్‌తో పాటుగానే వీటిని చేద్దామన్నది మొదటి సమావేశంలోనే అందరమూ చర్చించుకున్నామనీ వాడుకరి:Pavan (CIS-A2K) గుర్తుచేశారు.
    • @యర్రా రామారావు: మాట్లాడుతూ వేడుకలు చేసుకుంటే చర్చలు చేయకూడదని ఏమీ లేదు కాబట్టి లోపాల గురించిన చర్చ, అభివృద్ధి గురించిన చర్చ, వేడుకలకు వేర్వేరు రోజులు పెట్టుకుని ఆ ప్రకారం కార్యక్రమాన్ని చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. లోపాలను గురించి చర్చించుకోవడానికి కూడా దీనిలో చోటు కల్పించాలని పేర్కొన్నారు.
    • @Chaduvari:: 2019లో మనం వార్షికోత్సవం ఒకటి చేసుకున్నాం. కశ్యప్ గారిదీ ప్రధాన పాత్రే. 20 మంది వచ్చారు. శశి గారి హాస్టల్లో. అప్పుడు వేడుకల ధోరణిలో సమావేశం చేసుకున్నాం. కేకు కోశాం, సరదాగా కబుర్లు చెప్పుకున్నాం. మనం గంటన్నర రెండు గంటల పాటు ఒకరి తర్వాత ఒకరు అందరం మాట్లాడాలీ అనుకుని తప్పులేమిటి, ఒప్పులేమిటీ చెప్పారు. అవన్నీ మనం క్రోడీకరించాం. ఆరోజు విశేషాల గురించి రాసుకున్నాం. ముఖ్యమైన పాయింట్లు విడదీసి రాసుకున్నాం. ఎవరెవరు ఏమేం పనులు చేయగలిగామన్నది కొద్దిగా, జరిగినంతమేరకు యాక్షన్ రిపోర్టు కూడా రాసుకున్నాం. ఆన్‌లైన్ సమావేశాలు కాకుండా అందరం కలిసి కూర్చున్నప్పుడు, "చెప్పండీ మీ అభిప్రాయం ఏమిటి?" అని అభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందరం కలసి కూర్చున్నప్పుడు ఒక్కొక్కళ్ళం ఆలోచించుకునే వీలుంటుంది. అంచేత నేనేమంటానంటే - రేపు జరగబోయే వార్షికోత్సవ సమావేశంలో వికీపీడియా విషయంలో ఏం జరిగిందో చెప్పడం, ఎలా జరిగుండాల్సిందో చెప్పడం, తప్పొప్పులు ఎంచుకోవడం చేస్తే మన అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇది మనం ఇంతకుముందు కూడా కొంతమేరకు చేసే ప్రయత్నం చేశాం. ఈసారి మరింత మెరుగ్గా చేయాలన్నది ఆలోచన.
    • @Kasyap: తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తూ సమావేశాలూ, చర్చలూ, నిర్ణయాలు వద్దని తానూ అనడం లేదన్నారు. ఇంతకుముందు జరిగిన కొన్ని కార్యక్రమాలు చూశాకా ఒక అవుట్ రీచ్ యాక్టివిటీ, పబ్లిక్ గేదరింగ్ ఈవెంట్ వంటివాటికి సమయం కేటాయించవచ్చునని చెప్పారు. ఇతరులు అభిప్రాయపడ్డట్టు స్ట్రాటజిక్ థింకింగ్‌కీ, ప్లాన్‌కీ తప్పక చోటునివ్వవవచ్చన్నారు. అలానే, తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవాల చుట్టూ బజ్ క్రియేట్ చేసే పనికూడా చేయవచ్చునన్నారు.
    • తన్వీర్ హాసన్ మాట్లాడుతూ 20 ఏళ్ళ పాటు ఒక ప్రాజెక్టు నడవడం అనేది చాలా పెద్ద విషయం అన్నారు. ఏ ప్రాజెక్టు నిర్వహించినవారైనా ఇలాంటి ఒక మైలురాయికి చేరుకున్నందుకు సంతోషించాలి, గర్వించాలి. ఈ సందర్భంగా ఆ సెలబ్రేషన్స్, ప్రచారంతో పాటుగా వికీపీడియన్లను గుర్తించడం కూడా ఉండాలన్నారు. అయితే, ఒక రోజులో 8 గంటల సమయం యాక్టివ్‌గా ఉంటామనుకుంటే ఆరు, ఆరున్నర గంటలు వేడుకలకే కేటాయించినా ఫర్వాలేదని కనీసం 90 నిమిషాల పాటైనా సమీక్షకీ, భవిష్యత్ వ్యూహాల నిర్మాణానికి చర్చించుకోవడానికి కేటాయించుకున్నా సరిపోతుందని సూచించారు. అవుట్‌రీచ్ గురించిన ఆలోచన బాగా చేయవచ్చుననీ, వైజాగ్ బీచ్‌లోనే ఒక మంచి స్టాల్ పెడదాం, వికీపీడియా గురించి ప్రచారం చేయచ్చన్నారు. తెలుగు వికీపీడియన్ల కృషిని ఇందులో ప్రజెంట్ చేసేలాంటి కార్యక్రమాలు చేయవచ్చనీ చెప్పారు. ఇక బజ్ క్రియేట్ చేయడానికి, అవుట్‌రీచ్‌కీ చక్కగా విశాఖలోని ప్రధానమైన కృషి చేసిన వ్యక్తులను గుర్తించి వారిని తెలుగు వికీపీడియన్లు కలిసేలాంటి కార్యక్రమాలు చేస్తే అది రెంటికీ బావుంటుందనీ సూచించారు. స్థూలంగా - ఇలాంటి ధోరణిలో చాలా వేడుకలూ, గుర్తింపూ కలిగే పనులు చేయవచ్చన్న సూచన చేశారు. అయితే, ఒక 8 గంటల రోజులో 5-6 గంటలు సరదాగా గడపండి, కనీసం గంటన్నర, రెండు గంటల పాటు మాత్రం చాలా ముఖ్యమైన, ప్రయోజనకరమైన ప్రశ్నలు వేసుకుని చర్చించాలని సూచన చేశారు.
  • భాస్కర్ ఈ అంశంపై మాట్లాడుతూ జరిగిన చర్చతో తాను ఏకీభవిస్తున్నాననీ, లోపాల గురించి, లోటుపాట్ల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందనీ పేర్కొన్నారు.
  • @Nskjnv: మాట్లాడుతూ ఈ కార్యక్రమం క్రిటికల్ రివ్యూగా కన్నా సెలబ్రేషన్‌గా ఎక్కువ ఉండాలని తాను అభిప్రాయపడుతున్నట్టు చెప్పారు. రిలాక్స్ అవ్వడానికి కూడా ఇందులో చోటు ఉండాలన్నారు, కశ్యప్ గారు సూచించినట్టు అవుట్ రీచ్ కార్యక్రమాలు కూడా దీనిలో భాగంగా ఉండాలని అనుకున్నట్టు చెప్పారు. రచ్చబండలో అడపాదడపా జరిగేట్టు విమర్శలు, వివాదాలు కాకుండా ఉండేలా చేయాలని చెప్పారు.
    • దీనిపై తన్వీర్ హాసన్ స్పందిస్తూ క్రిటికల్ రివ్యూ అన్నప్పుడు తన ఉద్దేశం క్రిటిసైజ్ చేయడం అన్నది కాదనీ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులకు సంబంధించిన ఈ 20 ఏళ్ళ గతిని హైలెవెల్లో అర్థం చేసుకునేలా విశ్లేషించి చూడడాన్నే తాను ఉద్దేశించానని పేర్కొన్నారు. దీన్ని ఉదాహరణలతో వివరిస్తూ - తెలుగు వికీపీడియాకు ఏ సంవత్సరం ఎక్కువ సినిమా వ్యాసాలు వచ్చాయి, ఏ దశలో వికీమీడియా కామన్స్‌కు తెలుగు వికీమీడియన్ల నుంచి ఎక్కువ కాంట్రిబ్యూషన్లు జరిగాయి, ఏ సమయంలో ఎక్కువమంది తెలుగు వికీపీడియాలో ఎడిట్ చేసేవారు, అంతకుముందు, ఆ తర్వాత ఆ గ్రాఫ్‌ ఎలా ఉంది - ఇలాంటి అంశాలను చర్చించి విశ్లేషించడం అన్నది తన సూచనకు అర్థమని చెప్పారు. యర్రా రామారావు కూడా స్పందిస్తూ తెలుగు వికీపీడియాలో లోపాల గురించి చర్చించడం అన్నప్పుడు వ్యక్తులను, చిన్న చిన్న అంశాలను విమర్శించడం, వ్యాఖ్యానించడం తన అభిప్రాయం కాదన్నారు. ఒక ప్రాజెక్టుగా తెలుగు వికీపీడియాలోని లోటుపాట్లను అవగాహన చేసుకోవడం ముఖ్యమన్నారు.
  • @Adithya pakide: మాట్లాడుతూ జరిగిన చర్చలో వచ్చిన అంశాలను తాను అంగీకరిస్తున్నాని పేర్కొన్నారు.
  • @Vjsuseela: మాట్లాడుతూ జరిగిన చర్చ బావుందన్నారు. మన పొరబాట్లు ఏమిటన్నది తెలుసుకోవడంలో తప్పేమీ లేదన్నారు. స్ట్రాటజిక్ ప్లానింగ్‌ని ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన అంశంగా తీసుకోవడం అన్నది మంచి ఆలోచన అనీ, ఇది చాలా ముఖ్యమైన అంశమనీ అభిప్రాయపడ్డారు. ఇక ప్రచారం విషయానికి వస్తే విశాఖపట్టణంలో ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయనీ, ఉత్తరాంధ్ర కవి పండితులు పుట్టిన ప్రాంతమనీ గుర్తుచేశారు. ఆ సంస్థలతోనూ, వ్యక్తులతోనూ సంప్రదించి వారిని కూడా కార్యక్రమంలో భాగం చేయవచ్చని సూచించారు. అలాగే, ఈ సమావేశాల్లో కలసినప్పుడు తెలుగు వికీపీడియాలో ఏమేం విషయాలను అభివృద్ధి చేయవచ్చో ఆలోచించుకోవచ్చనీ, కొన్ని స్టాండర్డ్స్ ఏర్పరుచుకోవచ్చనీ చెప్పారు. ఇంగ్లిష్‌ వికీపీడియాలో ఒక వ్యాసం రాస్తే దాన్ని రివ్యూ చేసి అంగీకారమో తిరస్కారమో చేస్తున్నారనీ అలాంటి గైడ్‌లైన్స్ మనం కూడా ఏర్పరుచుకోవడం మంచిదనీ, ఎలా, ఏమిటి వంటివన్నీ మాట్లాడుకోవడానికి ఈ సందర్భం బావుంటుందన్నారు.
బడ్జెట్, కార్యక్రమ ప్రణాళికలపై చర్చ
  • బడ్జెట్ విషయమై చర్చ ప్రారంభించమని తన్వీర్ హాసన్‌ని @Pavan (CIS-A2K): కోరగా ఆయన మాట్లాడుతూ - సముదాయం ప్రోగ్రామ్ యాక్టివిటీ విషయమై ఏం జరగాలని ఆశిస్తుందన్నదాని బట్టి బడ్జెట్ ఎంత అవ్వచ్చన్న అంచనా ఉంటుందని చెప్పారు. కార్యక్రమం ఎలా జరగాలనుకుంటున్నారు, ఏ ఫలితాలు ఆశిస్తున్నారు, కార్యక్రమం తర్వాత దానివల్ల ఎలాంటి యాక్టివిటీ ఉండొచ్చు, దానికి ఎలాంటి వనరులు అవసరమవుతాయి - ఇవన్నీ ఈ అంశంలో ముఖ్యమన్నారు. అలానే ఆ బడ్జెట్ మీద పెట్టే వనరులకు మనం ఆశించదగ్గ ప్రభావానికి సంబంధం ఉండేలా కూడా చూసుకోవాలని చెప్పారు. ప్రీ-ఈవెంట్ ఏం జరగాలి?, ఈవెంట్ ఏం జరగాలి? పోస్ట్ ఈవెంట్ ఏం జరగాలి? అన్నది ఆలోచించుకోవాలని సూచించారు. స్థూలంగా - సముదాయం ఈ అంశాలు ఆలోచించి చెప్తే, దానికెంత బడ్జెట్ కావాల్సి వస్తుందో ఆలోచిస్తే, దాని విషయమై సాధ్యాసాధ్యాలు, ఇతర వనరులు చర్చించవచ్చన్నారు. అయితే, వికీమీడియన్ల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమనీ అందువల్ల కార్యక్రమాన్ని సురక్షితమైన, సౌకర్యవంతమైన చోటనే చేస్తామని, ఆ విషయంలో మాత్రం మరో ఆలోచన, చర్చ లేదనీ వెల్లడించారు.
  • @యర్రా రామారావు: మాట్లాడుతూ వికీపీడియన్లందరినీ ఒక పెళ్ళి బస్సు తరహాలో హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం తీసుకువెళ్ళే ఏర్పాటుచేస్తే, మధ్యలో మిగిలిన కోస్తా ప్రాంతాల వారు కూడా బస్సు ఎక్కి విశాఖ కలసి చేరుకుంటే బావుంటుందని సూచించారు. ప్రత్యేక సంచిక ప్రచురిస్తే ఎలా ఉంటుందో ఆలోచించమని సూచించారు. @Kasyap: టెంటెటివ్ ప్లాన్ పేరిట కార్యక్రమంలో ఏమేం చేస్తే బావుంటుందో కొన్ని అంశాలు చెప్పారు. బజ్ క్రియేట్ చేసేలా ప్రీ యాక్టివిటీ ఒకటి నిర్వహించాలనీ, అది విజయవాడ బుక్ ఫెస్టివల్‌లో చేస్తే బావుంటుందనీ అన్నారు. ప్రెస్ డార్లింగ్ పీపుల్ ఉంటారనీ, వారిని ఆహ్వానిస్తే బజ్ బాగా వస్తుందనీ - చెప్పారు. పబ్లిక్‌తో ముడిపడిన యాక్టివిటీ ఉంటే బావుంటుందని అభిప్రాయపడ్డారు. అది కూడా వికీమీడియా సిస్టర్ ప్రాజెక్టులకు బెనిఫిట్ కలిగించేలా ఉండాలన్నారు.
  • @Chaduvari: వార్షికోత్సవానికి ముందు బజ్ నిర్వహించడానికి అవసరమైన కార్యక్రమాల విషయంలో తనకేమీ ప్రత్యేకంగా అభిప్రాయాలు లేవన్నారు. అయితే, కార్యక్రమం ఎలా ఉండాలన్న విషయంలో తనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయని చెప్పి వాటిని వివరించారు. ఆయన అభిప్రాయాలు, ఆలోచనలు ఇలా ఉన్నాయి:
    • ఈవెంట్లో ముఖ్యమైన కార్యక్రమంగా నేను భావిస్తున్నది మీరు (ఎ2కె) చేయిస్తున్న సమీక్ష. దీని పట్ల నాకు చాలా ఆసక్తి, ఉత్సాహం ఉన్నాయి. సమీక్ష విడుదల, దానిపై చర్చ ప్రధాన కార్యక్రమంగా ఉండాలి.
    • బయట నుంచి సాహిత్య సాంస్కృతిక ఇతర రంగాలలో మంచి కృషి చేస్తున్న ప్రముఖులను ఆహ్వానించి, వారి నుంచి నేర్చుకుని, వారితో చర్చించాలన్న విషయంలో తన్వీర్ గారికి ఉన్న ఆలోచనలూ, నా ఆలోచనలూ దాదాపు ఒకటే.
    • కార్యక్రమంలో ఏదో ఒక రోజున తెలుగు సాంస్కృతిక నాయకత్వాన్ని ఆహ్వానించాలి. సాహితీ సంస్థలను నిర్వహించేవాళ్ళు, సాంస్కృతిక ప్రముఖులు, ప్రభుత్వ ముఖ్యులు - ఇలా ఎవరైనా కావచ్చు కానీ వాళ్ళు తెలుగు సాంస్కృతిక నాయకత్వంలో భాగమై ఉండాలి. అలాంటివాళ్ళను విశాఖ చుట్టుపక్కల ఉన్నవారినే కాదు ఆంధ్ర, తెలంగాణల్లో ఇతర ప్రాంతాలు కానీ, హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ వంటి నగరాల నుంచైనా కానీ కూడా అవసరమైతే ఆహ్వానించవచ్చు. వాళ్ళు ఎలాంటి పనిచేశారన్నది ముఖ్యం, ఎక్కడివారన్నది కాదు.
    • వికీమీడియన్లను అందరినీ, వారి కృషితో సహా పరిచయం చేసే కార్యక్రమం జరగాలి. ఇది ఆస్కార్ అవార్డు ఫంక్షన్ తరహాలో (అవార్డులు ఇవ్వడం విషయంలో కాదు) రెండున్నర గంటల పాటు మంచి వ్యాఖ్యానంతో తెలుగు వికీమీడియాలోనూ, భారతీయ వికీమీడియాల్లోనూ, ప్రపంచవ్యాప్తంగా వికీమీడియాల్లోనూ జరుగుతున్న, జరిగిన విశేషాల్లో వింతలూ, ఆసక్తికరమైన సంగతులూ కలగలిపి ఉత్సాహకరంగా ఉండేలా చెయ్యాలి. దీనికి విశాఖకు చెందిన బయటి ప్రముఖులను కూడా ఆహ్వానించాలి. వికీపీడియన్లు అందరికీ ఒక చక్కటి మెమెంటో: ఒక విశిష్టంగా ఉండేది ఇవ్వాలి. చిన్న ప్రతిమ లాంటిది ఇవ్వాలని నా కోరిక.
    • విశాఖపట్టణంలో నడక చేయాలి. అది ఒక వికీపీడియా వాక్ గా చేయాలి. ఆటవిడుపు కార్యక్రమం ఏదైనా పెట్టుకోవచ్చు.
  • సాంస్కృతిక నాయకత్వాన్ని ఆహ్వానించాలన్న సూచనను సమర్థిస్తూ దానికి సంబంధించి ఎవరెవరు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నారో కొందరు సభ్యులు సూచించారు.
    • @రహ్మానుద్దీన్: సాంస్కృతిక నాయకత్వాన్ని ఆహ్వానించదలిస్తే ఉత్తరాంధ్రలో ఉన్న సంస్థలు, వ్యక్తుల పేర్లను ఉదాహరణగా ఇచ్చారు. కథానిలయం, విజయనగరం సంగీత కళాశాల, ఆంధ్రవిశ్వవిద్యాలయంలో కొందరు మంచి కృషిచేస్తున్న అధ్యాపకులు (ఉదాహరణకు యాత్రాచరిత్రకారునిగా పేరొందిన ఆదినారాయణ), తెలుగు ఓరియంటల్ కళాశాల, చిన్నయసూరి పీఠం వంటివి ఉదహరించారు. తొలి తెలుగు విజ్ఞాన సర్వస్వ నిర్మాత అయిన కొమఱ్ఱాజు లక్ష్మణరావు గారి వారసులు అక్కడే ఉన్నారన్నారు. అరకులో కొన్ని సంగ్రహాలయాలు ఉంటాయి. అవి కూడా కార్యక్రమంలో చేర్చుకోవచ్చు. గిరిజన విజ్ఞానం, జానపద విజ్ఞానం సంబంధ అంశాలు దగ్గరే ఉన్నాయనీ, అల్లూరి విజ్ఞాన కేంద్రం(ప్రజానాట్యమండలి) వారు మనకు సాంస్కృతిక కార్యక్రమాల్లో సహాయపడగలరనీ సూచించారు.
    • జెడి లక్ష్మీనారాయణ వంటి వ్యక్తులు కూడా ఆ ప్రాంతానికి చెందినవారేనని వి.భాస్కర్ గుర్తుచేశారు.
    • @Vjsuseela: దాసుభాషితంలో మీనా యోగేశ్వర్ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆంధ్రవిశ్వవిద్యాలయానికి చెందిన సంగీత అధ్యాపకురాలు ఒకరితో మాట్లాడించారని, వారు చాలా బాగా మాట్లాడారనీ, అలాంటి వ్యక్తులను కూడా పరిశీలించవచ్చనీ, రాజమండ్రి, కాకినాడల్లోనూ, విజయనగరంలోనూ కూడా ఎంతో సాంస్కృతిక కృషి జరిగిందనీ, సాంస్కృతిక సంస్థలు నెలకొన్నాయనీ చెప్పారు.
  • బడ్జెట్ గురించిన చర్చ ముందుకు తీసుకువెళ్తూ తన్వీర్ హాసన్ తాను పనిచేయడానికి అవసరమైన ఒక స్థూలమైన బడ్జెట్ అంకెను ఇవ్వమనీ, ఒకవేళ సీఐఎస్-ఎ2కె అదంతా ఇవ్వగలదా, లేదంటే వేరే వనరుల కోసం ప్రయత్నించాలా, కాదంటే దీనిపై మరికొంత చర్చించాలా అన్నది దాన్నిబట్టి ఆలోచించగలనని చెప్పారు. @Chaduvari: తాను పైన సూచించిన ప్రణాళికకు అయ్యే ఖర్చు దాదాపు రూ. 8-9 లక్షలు ఉండొచ్చని అంచనా వేశారు, దానిపై తన్వీర్ హాసన్ మాట్లాడుతూ మొత్తంగా రూ. 10 లక్షలు ప్రతిపాదనగా తీసుకుంటాననీ, ఈ ప్రతిపాదనను పరిశీలించి కొద్దిరోజుల్లో తన నిర్ణయాన్ని, ఈ విషయంపై తాను అనుకుంటున్న తదుపరి స్టెప్స్‌ని తెలియజేస్తానని తన్వీర్ హాసన్ తెలియజేశారు.
బాధ్యతల పంపిణీపై చర్చ
  • @Pranayraj1985:: ఏయే బాధ్యతలు ఎవరు తీసుకుంటారన్నదానిపై స్పష్టత వస్తే పని ఇంకా చురుగ్గా ముందుకువెళ్తుందని అన్నారు. సీఐఎస్-ఎ2కె వారు లాజిస్టిక్స్, ఫైనాన్స్ చూసుకుంటారు కాబట్టి మిగిలిన వాటిలో బాధ్యతలేముంటాయి, కమిటీలేముంటే బావుంటాయన్నది ఈ విషయాలపై అవగాహన ఉన్న పవన్ సంతోష్‌ రాస్తే అదొక మొదటి మెట్టుగా పనికొస్తుందన్నారు. రోల్స్‌కీ, కమిటీలకు ఉండే కొన్ని ముఖ్యమైన బాధ్యతలు చెప్పొచ్చు, మిగతావాటిల్లో టీం మెంబర్స్ చొరువ తీసుకొని ఇన్వావ్ అవుతారుని ఆయన భావించారు.
  • దీనిపై @Pavan (CIS-A2K): మాట్లాడుతూ కొత్తగా రాస్తున్నవారు ముందుకువచ్చి ఇందులో కీలకమైన బాధ్యతలు స్వీకరిస్తే, కొత్తతరం నాయకత్వం అభివృద్ధి చెందుతుందని అది తెవికీకి మంచిదని పలుమార్లు అనుకున్న సంగతినే గుర్తుచేశారు. దీనికి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీలు, ఒక్కో కమిటీలోనూ ఎలాంటి పనులుంటాయి, ఎలా చేస్తే బావుంటుంది వంటివన్నీ ఇటీవలే వికీకాన్ఫరెన్స్ ఇండియా 2023, వికీ విమెన్స్ క్యాంప్ 2023 భారతదేశంలో జరగడం వల్ల మంచి అవగాహన ఉన్న వికీపీడియన్లు జాతీయ స్థాయిలోనూ, తెలుగులోనూ కొద్దిమందిమి ఉన్నామనీ, గైడెన్స్ తీసుకుని పనిచేసి అనుభవం సంపాదించి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం కష్టసాధ్యమేమీ కాదని చెప్పారు. కాబట్టి, కొత్త వికీపీడియన్లు తామే ముందుకువచ్చి తమకు ఎంతోకొంత మంచి అనుభవం కానీ, ఆసక్తి కానీ ఉన్నవాటిలో ధైర్యంగా బాధ్యతలు స్వీకరించవచ్చనీ, సహాయం తప్పకుండా దొరుకుతుందనీ పేర్కొన్నారు.
  • తన్వీర్ హాసన్ స్పందిస్తూ ఆయా కార్యక్రమాలు చేసినవారు అందుబాటులో ఉన్నారనీ, అయితే అవసరాన్ని బట్టి వారి సలహా తీసుకోవడం బావుంటుందనీ, కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి అవసరమైన అనుభవం సముదాయంలోనూ, సీఐఎస్-ఎ2కె జట్టులోనూ ఉందనీ పేర్కొన్నారు.

మొదటి సమావేశం వివరాలు[మార్చు]

అజెండా[మార్చు]

  • తెలుగు వికీపీడియా వార్షికోత్సవం గురించి, దానిలో సీఐఎస్-ఎ2కెతో భాగస్వామ్యం గురించి చర్చ

పాల్గొన్నవారు[మార్చు]

ముందుగా నమోదుచేసుకుని పాల్గొన్నవారు[మార్చు]

అప్పటికప్పుడు పాల్గొన్నవారు[మార్చు]

పైన సంతకం చేసినవారిలో అందరూ పాల్గొన్నారు. వారు కాక పాల్గొన్న ఇతరుల్లో ఈ కిందివారు ఉన్నారు:

నివేదిక[మార్చు]

కార్యక్రమ నిర్వాహకుడు నివేదిక చిత్తుప్రతి పూర్తిచేశారు. ఇందులో ప్రస్తావించబడ్డవారు తమ వ్యాఖ్యల విషయంలో ఏమైనా అవసరమైన మార్పుచేర్పులు ఉంటే చేయగలరు. వేరేవారి మాటలను దయచేసి మార్చవద్దని మనవి. వేరేవారు మాట్లాడినవి ఏమైనా ఇక్కడ రాలేదని మీరనుకుంటే ఆ అంశాన్ని చర్చా పేజీలో @Pavan (CIS-A2K):ని పింగ్ చేస్తూ చెప్పండి.

ప్రతిపాదన[మార్చు]

@Pavan (CIS-A2K): సీఐఎస్-ఎ2కె ప్రోగ్రామ్ మేనేజర్ హోదాలో తాను ఈ సమావేశంలో మాట్లాడుతున్నట్టు మొట్టమొదట స్పష్టం చేశారు. కనుక, ఈ ప్రతిపాదన సీఐఎస్-ఎ2కె తరఫు నుంచి తెలుగు వికీమీడియా సముదాయంతోనూ, యూజర్ గ్రూప్‌తోనూ తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం విషయమై కలసి పనిచేసేందుకు ఆసక్తి ఉందంటూ చేసిన ప్రతిపాదన.

  • లాభాపేక్ష రహిత పరిశోధన సంస్థ అయిన సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీలోని యాక్సెస్ టు నాలెడ్జ్ టీమ్ (ఇకపై సీఐఎస్-ఎ2కె అని వ్యవహరిస్తాను) గత పది సంవత్సరాలకు పైగా భారతీయ భాషల్లో వికీమీడియా ప్రాజెక్టులతోనూ, భారతీయ వికీమీడియన్లతోనూ కలసి భారతీయ భాషల వికీమీడియా ప్రాజెక్టుల వృద్ధి లక్ష్యంతో (స్థూలంగా) పనిచేస్తోందని @Pavan (CIS-A2K): తెలియజేశారు.
  • 2014-19 మధ్యకాలంలో సీఐఎస్-ఎ2కె తెలుగు వికీమీడియా ప్రాజెక్టులను ఫోకస్ లాంగ్వేజ్ ఏరియా పేరిట ఒక ప్రత్యేకమైన వర్టికల్‌గా లేక వర్టికల్‌లో భాగంగా ఎంచుకుని ఈ ప్రాజెక్టు అభివృద్ధి కోసం రకరకాల ప్రణాళికలను అమలుచేసి పనిచేసిన సంగతి కొత్తవారికి తెలియజేశారు. ఆ సందర్భంగా 2013లో తెలుగు వికీపీడియా ఉగాది మహోత్సవం, 2014లో తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలు, 2015లో తెలుగు వికీపీడియా 11వ వార్సికోత్సవం కార్యక్రమాలకు సహజంగానే ఆ ప్రణాళికలో భాగంగా సీఐఎస్-ఎ2కె మద్దతునిచ్చి పనిచేసిందని తెలిపారు. అయితే, సీఐఎస్-ఎ2కె ప్రస్తుతం కొన్ని సంవత్సరాలుగా ఫోకస్ లాంగ్వేజ్ ఏరియా పద్ధతిలో పనిచేయట్లేదని తెలియజేశారు.
  • ప్రస్తుతం సీఐఎస్-ఎ2కె ప్రణాళికలో వికీమీడియా ప్రాజెక్టులపై జరిగిన పని గురించిన సమీక్ష, అవకాశాలు-సవాళ్ళపై అధ్యయనం, భవిష్యత్ కార్యప్రణాళిక వంటివాటిపై దృష్టి ఉందని చెప్పారు. తెలుగు వికీమీడియా సముదాయం కూడా తరచుగా ఈ దృష్టిలోనే ఆలోచిస్తుందని తాము గమనించామన్నారు. వల్ల తెలుగు వికీపీడియా సమీక్ష, అధ్యయనం, ప్రణాళిక రచన వంటివాటిని కూడా కొన్ని లక్ష్యాలుగా తీసుకుని 20వ వార్షికోత్సవం నిర్వహించే ఉద్దేశం ఉంటే 20వ వార్షికోత్సవాన్ని నిర్వహించడంలో భాగస్వామ్యం వహించడానికి సీఐఎస్-ఎ2కె ఇష్టపడుతోందని చెప్పారు.
  • సీఐఎస్-ఎ2కె వారు తెలుగు వికీపీడియా కంటెంట్ నాణ్యత, కార్యక్రమాల ప్రభావం, సాంకేతిక సామర్థ్యం, వంటి కొన్ని అంశాలపై స్వతంత్ర్య అధ్యయనం చేయించి ఇవ్వడమూ, 20వ వార్షికోత్సవానికి సంబంధించిన ఆర్థిక ఖర్చులను, రవాణా-వసతి వంటి ఏర్పాట్ల సహా సీఐఎస్-ఎ2కె అందించడానికి ఆసక్తి చూపుతోందన్నారు.
  • ముందుగా తెలుగు వికీమీడియన్లు ఈ లక్ష్యాలతో కార్యక్రమం నిర్వహించడానికి ఉత్సాహం చూపిస్తూంటే గనుక ఎప్పుడు, ఎక్కడ, ఎంత ఖర్చుతో, ఎలా నిర్వహించాలన్న అంశాలపై తదుపరి చర్చలు చేయవచ్చన్నారు.
  • ఈ కార్యక్రమాన్ని గనుక సీఐఎస్-ఎ2కె భాగస్వామ్యంతో చేసేట్టయితే తనకు రెండుపక్షాలతోనూ సంబంధం ఉన్నందున, ఆసక్తుల ఘర్షణ ఏర్పడే అవకాశం ఉన్నందున, ముఖ్యంగా ఎ2కెలో నిర్ణయాత్మకమైన స్థానం ఉన్నందున ఈ కార్యక్రమం విషయంలో సీఐఎస్-ఎ2కెలో "ఆర్థికపరమైన అభ్యర్థనలను స్వీకరించి, నిర్ణయించే అధికారాన్ని" తన బదులు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ని స్వీకరిస్తారని పవన్ సంతోష్‌ తెలియజేశారు.

చర్చ[మార్చు]

@Pranayraj1985:
  • కార్యక్రమ లక్ష్యాలు వేడుకలు కాకుండా సమీక్ష, ప్రణాళిక అయితే సీఐఎస్-ఎ2కె కార్యక్రమంలో భాగస్వాములుగా ముందుకు వస్తుందని అర్థం చేసుకోవచ్చా అని ప్రణయ్ ప్రశ్నించగా పవన్ సంతోష్‌ మాట్లాడుతూ కార్యక్రమ లక్ష్యాలు మూడు నాలుగు ఉంటే అందులో సమీక్ష, ప్రణాళిక కూడా ఉన్నట్టైతే మాకు భాగస్వాములుగా చేరడానికి ఆసక్తి చూపిస్తున్నామని అన్నారు. మరోలా చెప్పాలంటే వేడుకలు జరుపుకోవడమూ, ఆటవిడుపు-టీమ్ బిల్డింగ్ కార్యకలాపాలు చేయడమూ, ఆమాటకొస్తే తెలుగు వికీపీడియన్లు చేయదలుచుకున్న ఏ కార్యక్రమమైనా చేయొద్దని నియమించడం మా పద్ధతి కాదన్నారు. ఆటవిడుపుగా అందరూ కలిసే కార్యక్రమాలో, వేడుకలో - వాటితో పాటుగా సమీక్ష, ప్రణాళిక ఉంటే మాకు ఆసక్తి ఉందని, ఎందుకంటే తమ కార్యప్రణాళికకు, ప్రస్తుతం సీఐఎస్-ఎ2కె సాగుతున్న వ్యూహానికి అవి సరిపోతాయని వివరించారు.
  • తెలుగు వికీపీడియా, సీఐఎస్-ఎ2కెల మధ్య బాధ్యతలు, అధికారాల విభజన ఎలా ఉండొచ్చని ప్రణయ్ రాజ్ ప్రశ్నించగా పవన్ సంతోష్‌ జవాబిస్తూ లక్ష్యాల విషయంలో స్పష్టత ఏర్పరుచుకుని కలసి పనిచేద్దామని మౌలికంగా నిర్ణయించుకుంటే రెండో అడుగుగా స్థూలంగా కార్యక్రమ రూపకల్పన రెండు పక్షాలూ కలసి చేద్దామని సూచించారు. ఆ తర్వాత మూడో అడుగులో - సీఐఎస్-ఎ2కె వారు ముందుగా నిర్ణయించుకున్న పరిమితుల మేరకు రవాణా, వసతి, ఇత్యాది లాజిస్టిక్స్ ఏర్పాట్లన్నీ చూడడమూ, ఇండిపెండెంట్ రివ్యూ నిర్వహించడమూ, తెలుగు వికీమీడియన్లు కార్యక్రమంలో ఏమేం జరగాలి, ఎలా జరగాలి, స్కాలర్‌షిప్‌లు ఎవరెవరికి ఇవ్వాలి వంటి వివరాలు నిశ్చయించుకోవడమూ చేస్తే బావుంటుందని తమ ఆలోచన అని చెప్పారు.
@Kasyap:
  • కార్యక్రమం జరిగే రెండ్రోజుల్లో కాకుండా ముందుగా రవీంద్రభారతి వంటి చోట భారీ ఎత్తున ఒక అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహిస్తే బావుంటుంది. పెద్ద ఎత్తున జనం హాజరై వికీమీడియా ప్రాజెక్టులు నేర్చుకునేలా ఆ కార్యక్రమం ఉంటే బావుంటుంది.
  • ఈ కార్యక్రమం కేవలం వికీపీడియా ఫోకస్‌తోనే కాకుండా వికీసోర్సు, విక్ష్నరీ వంటి సోదర ప్రాజెక్టులను కూడా పరిగణనలోకి తీసుకుని, వాటికి కూడా సమయమిచ్చి చేస్తే బావుంటుంది.
  • ఈ సందర్భంగా తెలుగు వికీపీడియా వర్క్‌షాపులు పెట్టుకోవడం కూడా మంచిది.
@Rajasekhar1961:
  • ఒకప్పుడు జరిగే కార్యక్రమాల కన్నా ఇప్పుడు మెరుగ్గా జరుగుతున్నాయి. ఉదాహరణకు క్రికెట్ ప్రాజెక్టు చూస్తే చాలా ప్రణాళికాబద్ధంగా జరిగింది. బహుశా నిర్వాహకులైన చదువరి గారికి ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, దాన్ని ప్రాజెక్టు నిర్వహణలో ఉపయోగించే నేర్పు ఇందుకు కారణం కావచ్చు.
  • తెలుగు వికీపీడియా కంటెంట్, కార్యక్రమాల ప్రభావం మాత్రమే కాకుండా సాంకేతిక స్థితిగతులు కూడా విశ్లేషించాలి.
  • ఇతర భాషల వికీపీడియా ప్రాజెక్టులతో పోలిస్తే తెలుగు ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంది అన్న అంశంపై విశ్లేషణ జరిగితే బావుంటుంది.
@రహ్మానుద్దీన్:
  • 2010లో వికీపీడియా దశమ వార్షికోత్సవాలు జరిగినప్పుడు, 2014లో తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలు జరిగినప్పుడు - ఒక్కోసారి ఒక్కో మైల్ స్టోన్ పెట్టుకుని దాని దిశగా పనిచేస్తూ వచ్చాం. ఇప్పుడూ అలా చేస్తే బావుంటుంది. తెలుగు వికీపీడియా వివిధ స్థూలమైన విభాగాల విషయంలో కంటెంట్ ఎంత, ఎలా ఉందన్నదాన్ని బేరీజు వేయగలిగితే ఏ అంశాల్లో ముందంజలో ఉంది, ఏ అంశాల్లో తక్కువ సమాచారం అందుబాటులో ఉందన్నది తెలుస్తుంది.
  • తెలుగు వికీపీడియా వ్యాసాల్లో తాజాకరణ అన్నదొక ముఖ్యమైన సమస్య. వ్యాసాల్లో తాజా సమాచారం చేర్చకపోవడం వల్ల పాత సమాచారంతోనే వ్యాసాలు ఉండిపోతున్నాయి. ఇంగ్లిష్ వికీపీడియాలోని ఇండియా డాష్‌బోర్డు ఆధారంగా, భారతదేశానికి సంబంధించిన వర్గాలను, వ్యాసాలను తీసుకుని, వాటిలో మార్పులు జరిగితే తెలుగు వికీపీడియాలో అనుసరించేవారికి అలెర్ట్స్ వచ్చేలా ఒక వ్యవస్థ రూపొందించమని సీఐఎస్‌-ఎ2కెకి సూచించారు. (ఇది తన విష్‌లిస్టులో భాగం అన్నారు)
  • స్టాట్స్ డాష్‌బోర్డు ఉపయోగించి వివిధ భాషల వికీమీడియా ప్రాజెక్టుల మధ్య ఉన్న భేదాలు పరిశీలించడానికి మొదటి అడుగుగా ఉపయోగించవచ్చన్నారు.
  • ఇంగ్లిష్‌ వికీపీడియాలో వ్యాసాలకు స్టబ్ (మొలక) నుంచి సీ క్లాస్, బీ క్లాస్, గుడ్ ఆర్టికల్ (మంచి వ్యాసం), ఏ క్లాస్, ఫీచర్డ్ ఆర్టికల్ (విశేష వ్యాసం) వంటి వివిధ స్థాయిల్లో నాణ్యత పరిశీలించి బేరీజు వేసే పద్ధతి ఉందని, తెలుగు వికీపీడియాలో మొలక వ్యాసమా కాదా అన్నది మినహాయిస్తే నాణ్యతా ప్రమాణాలు, వాటి కింద బేరీజు వేయడం లేదని పేర్కొన్నారు.
    • మంచి వ్యాసం ప్రమాణాలను నెలకొల్పి, పదిలోపు వ్యాసాలను ఇప్పటికే తెలుగులో ఆ ప్రమాణాల కింద గత కొన్నేళ్ళ క్రితం పరిశీలించామనీ, దానితో పాటుగా అంతకన్నా తక్కువ స్థాయిలో మెరుగైన వ్యాసం అన్న ప్రమాణం ఏర్పరిచి అందులో కనీస, మధ్య, ఉన్నత స్థాయి భేదాలు ఏర్పరిచామని, తక్కువ మంది ఉండడం, ఆసక్తి తక్కువ ఉండడం వల్ల ముందుకు వెళ్ళలేదని పవన్ సంతోష్‌ వివరించారు.
    • తానూ అదే సూచిస్తున్నాననీ, కనీసం ఈవారం వ్యాసాలనైనా తీసుకుని ప్రమాణాలతో పరిశీలించి వాటి నాణ్యతను కొలవడం మంచి ప్రయత్నం అవుతుందని రహ్మానుద్దీన్ సూచించారు.
@Vjsuseela:
  • కొన్ని డేటాబేస్‌లలో సెర్చ్ చేసిన టాపిక్ లేకపోతే వాటిని గ్యాప్‌ కింద చూపించే సాంకేతికత ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. జర్నల్స్, బుక్స్ డేటాబేస్‌లలో ఈ సాంకేతికత ఉంటుంది. వికీలో ఉందో లేదో చూడాలి.
    • రహ్మానుద్దీన్ స్పందిస్తూ సీఐఎస్-ఎ2కె వారు వికీమీడియా ఫౌండేషన్‌ను సంప్రదించి తెలుగు వికీపీడియా వరకూ సెర్చ్ డేటా తెప్పించుకోవడానికి ఈ ఆలోచన పనికివస్తుందని సూచించారు.
@Nskjnv:
  • ప్రస్తుతం కంటెంట్ డెవలప్‌మెంట్ మీద ప్రధానంగా కృషి చేస్తున్నాం. నాణ్యతాపరంగా రహ్మానుద్దీన్ చెప్పిన అనేక విషయాలు ఇన్‌కార్పొరేట్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు.వ్యాసాల నాణ్యతని ఇన్‌కార్పొరేట్ చేయడం గురించి కూడా యాక్షన్ ఓరియంటెడ్‌గా కూడా చేయొచ్చు.
  • "మన ఓటు మన హక్కు" అని సమకాలీన అంశమైన తెలంగాణ ఎన్నికలకు సంబంధించి వ్యాసాలు నిర్మిద్దాం అని ప్రయత్నిస్తున్నాం ఆయన పాయింట్ అవుట్ చేసిన వ్యాసాల నాణ్యతకు సంబంధించిన విషయాన్ని కూడా చేయొచ్చు.
  • లింగ్వా లిబ్రేలో పదిలక్షల ఆడియో ఫైల్స్ రికార్డు అయితే పదిలక్షలవ ఫైల్ తెలుగుకు సంబంధించిన పదమేనని తెలియజేశారు. లింగ్వా లిబ్రే విషయంలో @V Bhavya: చేస్తున్న కృషి, తద్వారా లింగ్వా లిబ్రేలో తెలుగు భాష ప్రపంచవ్యాప్తంగా అందులో ఐదవ స్థానంలో నిలవడం వివరించారు.