Jump to content

వాడుకరి చర్చ:V Bhavya

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

స్వాగతం

[మార్చు]
V Bhavya గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

V Bhavya గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ వాడుకరి:Kasyap గారిని ప్రత్యేకంగా మీకోసం గురువుగా కేటాయించారు. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూడండి. అక్కడ మీకవసరమైన ఏ సహాయమైనా చేసేందుకు Kasyap గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరించండి.
  • తెలుగు వికీపీడియా పరిచయానికి అంచెలంచెల(step by step) పారస్పరిక (interactive)బోధన, వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం) చూడండి. తెలుగు వ్యాసరచన గురించి విషయ వ్యక్తీకరణ, కంప్యూటర్ లో తెలుగు టైపు చెయ్యడం గురించి టైపింగు సహాయం, కీ బోర్డు వ్యాసాలు ఉపయోగపడతాయి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 04:29, 16 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]

కొండలమ్మ తల్లి వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

కొండలమ్మ తల్లి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

వికీకరణ లేదు. ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు లేవు. కనుక తొలగించాలి.➤ కె.వెంకటరమణచర్చ 15:55, 17 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కొండలమ్మ తల్లి పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణచర్చ 15:55, 17 సెప్టెంబరు 2022 (UTC) ➤ కె.వెంకటరమణచర్చ 15:55, 17 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

సాదా ఫారము ద్వారా దస్త్రపు ఎక్కింపు గురించి

[మార్చు]

@V Bhavya గారూ, వికీలో ప్రస్తుతం జరుగుతున్న ఫోటోల ఎక్కింపు పోటీలో చురుగ్గా పాల్గొంటుంన్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. సాదా ఫారము ద్వారా ఫోటోలను ఎక్కించినపుడు ఆయా ఫోటోల వికీ పేజీలోని సోర్స్ విభాగంలో గూగుల్ ఇమేజెస్ లింకును ఇస్తున్నారు. అలా ఇవ్వకూడదు. ఏదైతే వెబ్సైటు నుండి ఫోటోను తీసుకుంటున్నామో ఆ వెబ్సైటు లింకును మాత్రమే సోర్స్ గా ఇవ్వాల్సివుంటుంది. అంతేకాకుండా వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసిన ఫోటోను నేరుగా ఎక్కించకుండా, ఫోటో సైజును తగ్గించి ఎక్కించాల్సివుంటుంది. మరో విషయం, మీరు వావిలాల వాసుదేవశాస్త్రి గారి కలర్ ఫోటోను వికీలోకి ఎక్కించారు. వావిలాల వాసుదేవశాస్త్రి గారు 1851 - 1897 మధ్యకాలంలో జీవించారు. అలాంటప్పుడు ఆయనది ఈ రకమైన కలర్ ఫోటో ఉండడానికి అవకాశం లేదు. మరి, మీరు ఈ ఫోటోను ఎక్కడినుండి తీసుకున్నారు?. దాని వివరాలు తెలుపగలరు.-- Pranayraj1985 (చర్చ) 18:48, 18 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

గూగుల్ లో సెర్చ్ చేసినపుడు వావిలాల వాసుదేవశాస్త్రి గారి ఫోటో కనిపించింది. ఆ ఫోటో ని ఇక్కడ పెట్టాను. తప్పులు ఉంటే మన్నించగలరు. ఫోటోలను సరిగా ఎలా పెట్టాలో తెలుపగలరు. V Bhavya (చర్చ) 13:38, 19 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
సాదా ఫారము ద్వారా ఫోటోలను ఎక్కించినపుడు ఆయా ఫోటోల వికీ పేజీలోని సోర్స్ విభాగంలో గూగుల్ ఇమేజెస్ లింకును కాకుండా, ఏదైతే వెబ్సైటు నుండి ఫోటోను తీసుకుంటున్నామో ఆ వెబ్సైటు లింకును మాత్రమే సోర్స్ గా ఇవ్వాలి. అంతేకాకుండా వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసిన ఫోటోను నేరుగా ఎక్కించకుండా, ఫోటో సైజును తగ్గించి ఎక్కించాలి.--Pranayraj1985 (చర్చ) 13:58, 19 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
కొన్ని ఫోటోలను వెబ్సైటు లింకును పెట్టి ఎక్కించాను. ఒక సారి సరిగా ఉన్నాయేమో చెప్పగలరు. V Bhavya (చర్చ) 14:48, 19 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

దస్త్రం:గగన్ ఖోడా1.jpg తొలగింపు చర్చలో ఉంది

[మార్చు]

మీరు ఎక్కించిన/మార్చిన దస్త్రం, దస్త్రం:గగన్ ఖోడా1.jpg ను, వికీపీడియా:తొలగింపు కొరకు దస్త్రాలు పేజిలో చేర్చారు. దానికి కారణమేంటో అక్కడున్న చర్చలో చూడవచ్చు (కనబడకపోతే, ఆ పేజీలో దస్త్రం పేరుతో వెతకండి). దానిపై మీ అభిప్రాయాన్ని ఆ ప్రతిపాదన కింద రాయండి. ధన్యవాదాలు. ➤ కె.వెంకటరమణచర్చ 15:11, 29 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

WPWPTE ముగింపు వేడుక

[మార్చు]

నమస్కారం !

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ప్రాజెక్టులో మీ కృషికి ధన్యవాదాలు.

నవంబరు 12 (రెండవ శనివారం) నాడు హైద్రాబాద్ రవీంద్ర భారతిలో WPWPTE ముగింపు వేడుక నిర్వహిస్తున్నాము. ఆరోజు పోటీలో గెలుపొందిన వారిని సత్కరించుకుందాం, అలాగే ఇటీవల మన సముదాయం కోల్పోయిన వికీపీడియను ఎల్లంకి భాస్కర్ నాయుడు గారిని స్మరించుకుందాం. కావున మీరు తప్పక హాజరవ్వగలరని నా మనవి.

వేడుకకి హాజరయ్యే వారు వేడుక పేజీలో పాల్గొనేవారు అనే శీర్షిక కింద మీ సంతకం చేయగలరు.

పోటీలో పాల్గొన్న వారందరికీ సావనీర్లు అందించాలని తలుస్తున్నాము, వీటికోసం ఈ [1] ఫారంలో మీ వివరాలు చేర్చగలరు.

ధన్యవాదాలు.

NskJnv 05:43, 5 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

WikiConference India 2023: Program submissions and Scholarships form are now open

[మార్చు]

Dear Wikimedian,

We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.

We also have exciting updates about the Program and Scholarships.

The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.

For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.

‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.

Regards

MediaWiki message delivery (చర్చ) 11:25, 16 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

(on behalf of the WCI Organizing Committee)

WikiConference India 2023: Open Community Call and Extension of program and scholarship submissions deadline

[మార్చు]

Dear Wikimedian,

Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.

COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.

Please add the following to your respective calendars and we look forward to seeing you on the call

Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 16:21, 2 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

On Behalf of, WCI 2023 Core organizing team.

అకేల్ హోసేన్ పేజీ గురించి

[మార్చు]

అకేల్ హోసేన్ పేజీలో చాలా ఎర్రలింకులు ఉండిపోయాయి. బహుశా ఇరవైకి పైగానే ఉంటాయి. ఎర్రలింకులు ఒకటీ రెండూ ఉంటే ఫరవాలేదు గానీ ఎక్కువగా ఉంటే పాఠకులకు ఇబ్బంది కలిగిస్తాయి. (ఆ మధ్య ఎర్రలింకులను సరిచేసేందుకు ప్రత్యేకంగా ఒక ప్రాజెక్టు కూడా పెట్టుకున్నాం.)

మీరు ఇంగ్లీషు నుండి ఈ పేజీని నేరుగా అనువదించారని భావిస్తున్నాను. అందువల్లనే ఆ లింకులు వచ్చాయి. ప్రచురించాక, ఆ లింకులను తీసేస్తే సరిపోతుంది.

అనువదించేటపుడు ఇలా ఎర్రలింకులు రాకుండా ఉండాలంటే, అనువాద పరికరం వాడితే మంచిది. తెలుగులో వాటికి సమానమైన పేజీలు ఉంటేనే అది అది లింకులు ఇస్తుంది. పేజీలు లేకపోతే ఎర్రలింకులను ఉంచదు. అనువాద పరికరం వాడడం వలన ఇంకా అనేక ఉపయోగాలున్నాయి. వాడిచూడండి. దాన్ని వాడడంలో మీకు ఇబ్బంది ఏమైనా ఉంటే నా శక్తిమేరకు మీకు సాయపడతాను. __ చదువరి (చర్చరచనలు) 09:31, 17 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ఎర్రలింకులు గురించి తెలియచేసినందుకు చదువరి గారికి ధన్యవాదాలు. వాటిని తీసివేసాను. అలాగే అనువాద పరికరం ఎలా ఉపయోగించాలో తెలియచేయగలరు. V Bhavya (చర్చ) 14:40, 17 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
భవ్య గారూ, కింది రెండు పేజీలను చూడండి.
  1. వికీపీడియా:విషయ అనువాద ఉపకరణం
  2. వికీపీడియా:అనువాద పరికరం - తరచూ వచ్చే సందేహాలు
ఆ తరువాత అనువాదం మొదలుపెట్టండి. సందేహాలేమైనా వస్తే అడగండి. __ చదువరి (చర్చరచనలు) 12:59, 18 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగే చదువరి గారు తప్పకుండా ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు. V Bhavya (చర్చ) 13:40, 18 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
అనువాద పరికరం గురించి తెలియచేసినందుకు, దానిని ఎలా ఉపయోగించాలో తెలిపినందుకు ధన్యవాదాలు చదువరి గారు. నేను ఇపుడు అనువాద పరికరాన్ని ఉపయోగించి వ్యాసాలు రాస్తున్నాను. V Bhavya (చర్చ) 14:38, 21 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీలో మీ కృషికి

[మార్చు]
Tireless Contributor Barnstar
భవ్య గారూ, తెవికీలో 100వికీడేస్ (2023, జూన్ 29 - 2023, అక్టోబరు 6) విజయవంతంగా పూర్తిచేసిన సందర్భంగా మీరు చేస్తున్న కృషిని అభినందిస్తూ ప్రణయ్‌రాజ్ వంగరి చదివిస్తున్న తార.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:50, 6 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు -ప్రణయ్‌రాజ్ వంగరి గారు. V Bhavya (చర్చ) 06:41, 22 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

గళ నేర్పరులు - (లింగ్వ లిబ్రే)

[మార్చు]
తెలుగు గళం ప్రపంచానికి వినిపిస్తున్న వారు
@వాడుకరి :V Bhavya గారు, లింగ్వ లిబ్రే ప్రాజెక్టులో నిర్విరామ కృషి చేస్తూ ప్రపంచంలో 5 వ స్థానంలో నిలుస్తూ, తెలుగు గళాన్ని కూడా 5 వ స్థానంలో నిలిపినందుకు[2] అలాగే లింగ్వ లిబ్రే ప్రాజెక్టు ఇటీవల చేరుకున్న మైలు రాయి 10 లక్షవ పదాన్ని రికార్డు చేసినందుకు అందుకోండి ఈ ఆడియో బార్న్‌స్టార్. NskJnv 14:05, 19 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు NskJnv గారు. V Bhavya (చర్చ) 06:41, 22 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

క్రికెట్ 2023 ప్రాజెక్టులో మీ కృషికి అభినందనలు

[మార్చు]
క్రికెట్ బార్న్‌స్టార్
క్రికెట్ 2023 ప్రాజెక్టులో కృషి చేసి ప్రాజెక్టు విజయంలో పాలుపంచుకున్నందుకు అభినందనలతో__చదువరి (చర్చరచనలు) 14:10, 21 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు __చదువరి గారు. V Bhavya (చర్చ) 06:40, 22 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

[మార్చు]

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:28, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]

నమస్కారం @ భవ్య గారు,

స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.

2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.

వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.

ధన్యవాదాలు.

ఇట్లు

Tmamatha (చర్చ) 09:36, 5 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండి తప్పకుండా నా వంతు సహకారం అందించగలను. V Bhavya (చర్చ) 09:54, 5 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలో స్పందించం

[మార్చు]

భవ్య గారూ, నిర్వాహకత్వ బాధ్యతలు స్వీకరించుటకు కావలిసిన కనీస మార్గదర్శకాలు సూచించటానికి తయారుచేసిన కొత్త మార్గదర్శకాల ప్రతిపాదనల పేజీలో మీరు 2024 మార్చి 31 లోపు స్పందించవలసినదిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 13:49, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండి V Bhavya (చర్చ) 15:56, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@భవ్య గారూ పై లింకులోని నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలోని మధ్యంతర ప్రతిపాదనల విభాగంలో కూడా స్పందించగలరు. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 06:37, 29 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.

[మార్చు]

చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:

  • దేవి (evaluated by Nskjnv; స్థితి = approved)

ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 16:57, 12 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.

[మార్చు]

చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:

  • దేవి (evaluated by Nskjnv; స్థితి = approved)

ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 14:29, 16 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.

[మార్చు]

చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:

ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 13:00, 5 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.

[మార్చు]

చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:

ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 11:00, 9 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.

[మార్చు]

చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:

ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 08:06, 11 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.

[మార్చు]

చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:

ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 04:00, 17 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.

[మార్చు]

చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:

ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 05:00, 17 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఇండిక్ మీడియావికి డెవలపర్స్ యూజర్ గ్రూప్ - టెక్నికల్ సంప్రదింపులు 2024

[మార్చు]

నమస్తే,

ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నప్పుడు వివిధ సాంకేతిక సమస్యలపై సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిటీ టెక్నికల్ కన్సల్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి లక్ష్యం కమ్యూనిటీలలోని సవాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సాధారణ సమస్యలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం.

మొదటి దశ మీ సాధారణ సమస్యలు, ఆలోచనలు మొదలైనవాటిని ఎక్కడ నివేదించాలనే సర్వే. దయచేసి సర్వేను (మీకు నచ్చిన భాషలో) ఇక్కడ పూరించండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link

చివరి తేదీ 20 సెప్టెంబర్ 2024.

మీరు బహుళ సమస్యలు లేదా ఆలోచనలను నివేదించాలనుకుంటే, మీరు సర్వేను ఒకటి కంటే ఎక్కువసార్లు పూరించవచ్చు.

కార్యాచరణ గురించి మరింత చదవడానికి, దయచేసి సందర్శించండి: https://w.wiki/AV78

సర్వే తెలుగులో పైన పేజీలో ఉన్నాయ్.

ధన్యవాదాలు! MediaWiki message delivery (చర్చ) 13:29, 9 సెప్టెంబరు 2024 (UTC), ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ తరపున[ప్రత్యుత్తరం]