వాడుకరి చర్చ:యర్రా రామారావు
యర్రా రామారావు గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:58, 8 ఏప్రిల్ 2013 (UTC)
తెలుగువికీపీడియా భారతీయభాషలన్నింటిలోకి ఎక్కువ వ్యాసాలను కలిగి ఉంది. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఇంకా చురుగ్గా వ్యాసరచన కొనసాగించాలి. ఇంకో ముఖ్యవిషయం ఏంటంటే కొన్ని ఇతరభాషలతో పోల్చుకుంటే మన తెలుగువికీలో ఉన్న వ్యాసాల లోతు మరియు నాణ్యత చాలా తక్కువగా ఉంది. ఈ నాణ్యతను పెంచాలంటే మీరు వ్రాసే వ్యాసాల నాణ్యత పెంచాలి. ప్రస్తుతము తెలుగువికీపీడియాలో సభ్యుల కొరత కూడా చాలా ఉంది. కావున సభ్యులను ఆకర్షించి వారు వ్యాసరచన కొనసాగించే విధంగా చూడవలసిన భాధ్యత ఇప్పుడున్న తెలుగువికీ సభ్యులదే!
శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయం (పొనుగుపాడు)
యర్రా రామారావు గారికి నమస్కారములు, మీరు వికీలో సృష్టించిన శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయం (పొనుగుపాడు) వ్యాసం బాగుంది. వ్యాసాన్ని విస్తరించినందుకు ధన్యవాదాలు. వికీలో వ్యాసానికి మూలాలు ప్రధానం కనుక మీరు ఏ మూలాల నుండి ఆ వ్యాసం లోని విషయాలను వ్రాసారో ఆ మూలాలను చేర్చగలరు. ----కె.వెంకటరమణ⇒చర్చ 06:19, 22 సెప్టెంబరు 2017 (UTC)
విశ్వనాధుని ఖండ్రిక వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
విశ్వనాధుని ఖండ్రిక వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :దీనిని వ్యాసంగా పరిగణించలేము. ఎటువంటి ములాలు లేవు. విషయం సంగ్రహం.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణ⇒చర్చ 14:35, 12 అక్టోబరు 2017 (UTC) --కె.వెంకటరమణ⇒చర్చ 14:35, 12 అక్టోబరు 2017 (UTC)
గ్రామాల పేజీల్లో చేర్పులు
సార్, గ్రామాల పేజీల్లో సమాచారాన్ని చేర్చేటపుడు మొదటి పేరా చివర్లో, పిన్‌కోడుకు ముందు ఉండే మూలాన్ని తీసేస్తున్నట్లున్నారు. ఉంచేందుకు ఏదైనా సమస్య ఎదురౌతోందా? సమస్య ఏమీ లేకపోతే ఉంచెయ్యండి. __చదువరి (చర్చ • రచనలు) 16:16, 16 అక్టోబరు 2017 (UTC)
గ్రామ వ్యాసాల్లో జనగణన సమాచారం చేర్పు - అభివృద్ధి నమోదు
యర్రా రామారావు గారూ, జనగణన సమాచారంతో గ్రామాల వ్యాసాలను అభివృద్ధి చేసే ప్రాజెక్టులో మీ నిరంతర కృషి చాలా బావుంది. ఈ సందర్భంగా ప్రస్తుతం మీరు అభివృద్ధి చేస్తున్న మహబూబ్ నగర్ జిల్లా గ్రామాలలో అభివృద్ధి నమోదుకు ఓ పేజీ రూపొందించి అందిస్తున్నాను. మీకు ఇది ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను. ఐతే ఇది తెలంగాణ జిల్లాల విభజనకు పూర్వం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మండలాలను స్వీకరించినట్టుంది కాబట్టి గమనించండి. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:39, 15 డిసెంబరు 2017 (UTC)
- మీరు కోరిన విధంగా, మీ అవసరాలకు తగ్గట్టు పై విధమైన పేజీని పాత ఖమ్మం జిల్లాకు చేసి ఇస్తున్నాను. ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:42, 22 డిసెంబరు 2017 (UTC)
- పాత వరంగల్ జిల్లాకు సంబంధించి ఇక్కడ తయారుచేశాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:09, 22 డిసెంబరు 2017 (UTC)
మీ కృషికి ఒక పతకం
విశిష్టమైన కొత్త వాడుకరి పతకం తొలి అడుగులే చరిత్ర సృష్టించే మారథాన్ గా మలుచుకుంటున్నందుకు | ||
2012లోనూ, 2016లోనూ మొత్తం కలిపి నాలుగే మార్పులు చేశారు కాబట్టి 2017 డిసెంబరులో మీరు విజృంభించి చేస్తున్న కృషిని విశిష్టమైన కొత్త వాడుకరి పతకానికి అర్హుల్ని చేస్తున్నాయి. అంతేకాక గత సంవత్సరపు కొత్తవాడుకరుల్లో మీకు ప్రత్యేకతను ఆపాదించిపెట్టేలా వేలాది తెలుగు గ్రామాల వ్యాసాల ముఖచిత్రం మార్చే మీ కృషి అభినందనీయం. చేయిచేయి కలిపి ప్రాజెక్టు ముఖచిత్రాన్ని మార్చేయాలని ఆశిస్తూ మీకు ఈ పతకాన్ని ప్రదానం చేస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:49, 4 జనవరి 2018 (UTC) |
గ్రామ వ్యాసాలు - వర్గీకరణ
రామారావు గారూ,
నమస్తే. మీరు వర్గీకరణ గురించి నన్ను అడిగిన సందేహంపై నేను తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను. ప్రామాణికంగా నాకు తెలియకపోయినా, అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలను - ఆంగ్ల వికీపీడియాలో వర్గీకరణ గురించిన మార్గదర్శకాలతో సరిజూసుకుని చెప్తున్నాను.
- గ్రామ వ్యాసాల పరిపాలనా విభాగాల వర్గీకరణలో ప్రధానంగా ఈ కింది పద్ధతి అనుసరిస్తున్నారు.
- గ్రామ వ్యాసంలో కేవలం ఫలానా మండలంలోని గ్రామాలు అన్న వర్గం మాత్రమే ఉంటుంది. ఆ ఫలానా మండలంలోని గ్రామాలు అన్న వర్గం ఫలానా జిల్లాలోని మండలాలు మరియు ఫలానా జిల్లాలోని గ్రామాలు అన్న వర్గాల్లో ఉంటాయి. ఈ జిల్లాలకు సంబంధించిన వర్గాలు అన్నీ వర్గం:ఆంధ్ర ప్రదేశ్ మండలాలు లేదా వర్గం:తెలంగాణ మండలాలు అన్నదానిలోకి చేరుతోంది.
- గ్రామాన్ని అనుసరించి మిగతా విభాగాల్లోకి కూడా వర్గీకరణలు చేయవచ్చు. ఉదాహరణకు
- ప్రాథమిక ఆరోగ్యకేంద్రం లేని విశాఖ జిల్లా గ్రామాలు, ప్రాథమిక పాఠశాల లేని చిత్తూరు జిల్లా గ్రామాలు వంటి వర్గాలు సృష్టించి ఉపయోగించవచ్చు. అలానే పర్యాటక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు వంటివి ఉంటే వాటినీ వర్గీకరించవచ్చు.
నేను అందించిన సమాచారంపై ఏవేని సందేహాలున్నా, వేరేదైనా అడగదలిచినా తప్పక రాయండి. ఉంటాను. --పవన్ సంతోష్ (చర్చ) 10:25, 3 ఫిబ్రవరి 2018 (UTC)
ఒకే గ్రామానికి ఎక్కువ పేర్లతో ఉన్న గ్రామ వ్యాసాలు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- మొదటి పేరు బరి లో ఇది అనవసరం
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 12:33, 14 మే 2018 (UTC)
గ్రామ వ్యాసాల్లో మీరు చేస్తున్న కృషి
సార్, గ్రామ వ్యాసాల పేజీలు ఖాళీగానో, ఖాళీ విభాగాలతోనో ఉండేవి. అలాంటి కొన్ని వేల పేజీల్లో సమాచారాన్ని చేర్చే బృహత్కార్యంలో పాలుపంచుకుని నిర్విరామంగా కృషి చేస్తున్నందుకు అభినందనలతో ఈ తారకను ఇస్తున్నాను. స్వీకరించగలరు. __చదువరి (చర్చ • రచనలు) 02:04, 14 సెప్టెంబరు 2018 (UTC)
గ్రామ తారక | ||
వేలాది గ్రామాల పేజీల్లో సమాచారాన్ని చేర్చే పనిని నిర్విరామంగా చేస్తున్నందుకు, అభినందనలతో.. చదువరి (చర్చ • రచనలు) 02:04, 14 సెప్టెంబరు 2018 (UTC) |
రామారావు గారు.. గ్రామ వ్యాసాల్లో మీ కృషి అనన్య సామాన్యం.. ఏం చేస్తున్నారండి.. సూపర్..సాగించండి మీ కృషిని అదే వేగంతో... మీకు నా అభినందనలు..B.K.Viswanadh (చర్చ)
మీ నిర్వాహకత్వ ప్రతిపాదన
మిమ్మల్ని వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/యర్రా రామారావు పుటలో నిర్వాహకహోదాకై ప్రతిపాదించాను. ఆ పుటలో మీ అభిప్రాయాన్ని, సమ్మతిని తెలియజేయగలరు.--కె.వెంకటరమణ⇒చర్చ 14:36, 16 జనవరి 2019 (UTC)
- కె.వెంకటరమణ గారూ సమ్మతిని తెలియపర్చాను
అభినందనలు
యర్రా రామారావు గారూ, నిర్వాహకు డైనందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. కొద్ది కాలం లోనే వికీ నియమ నిబంధనలను అర్థం చేసుకుని తదనుగుణంగా అనేక ఉపయుక్తమైన రచనలు చేస్తూ ఉన్న మీరు ఈ బాధ్యతకు పూర్తిగా అర్హులని నేను భావిస్తున్నాను. గ్రామవ్యాసాలకు ఒక ఊపూ రూపూ తెచ్చిన మీరు నిర్వాహకుడిగా కూడా అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తారని భావిస్తున్నాను, నమ్ముతున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 01:27, 24 జనవరి 2019 (UTC)
- నిర్వాహకునిగా అయినందుకు అభినందనలు. --కె.వెంకటరమణ⇒చర్చ 01:52, 24 జనవరి 2019 (UTC)
- కె.వెంకటరమణ గారూ మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. మీకు ప్రత్యేక ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 04:02, 24 జనవరి 2019 (UTC)
నిర్వాహకుడిగా
సార్, నిర్వాహకుడిగా మారాక, కొత్త బాధ్యతలను నిర్వర్తించడానికి ఉన్న వెసులుబాట్లేమిటో పరిశీలించండి. ఇదివరకిటికి, ఇప్పటికీ ఇంటర్‌ఫేసు లోను, ఇతరత్రానూ ఏమేం మార్పులొచ్చాయో గమనించండి. పేజీలను తొలగించే విధానం, పద్ధతి మొదలైన పేజీలను గమనించండి. మొదటిపేజీ నిర్వహణ ఏమిటో చూడండి. నిర్వాహకుల నోటీసు బోర్డును ఒకసారి చూడండి. ప్రత్యేకపేజీల్లోను, "మరిన్ని" లలో వచ్చిన మార్పులు గమనించండి. ప్రస్తుతం మీరు చేస్తున్న పనికి కొద్దిగా విరామం తీసుకుని ఈ మార్పులను గమనించండి. ఏమైనా సందేహాలుంటే.. ఇతర నిర్వాహకులున్నారు, నేనున్నాను. కొత్త బాధ్యతలు మీకు సంతృప్తి కలిగిస్తాయని తలుస్తాను. __చదువరి (చర్చ • రచనలు) 01:36, 24 జనవరి 2019 (UTC)
- చదువరి గారూ మీ సూచనలు, సలహాలు ఎల్లప్పుడూ కోరుతూ, నాకు నిర్వాహక భాధ్యతలను బదలాయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు--యర్రా రామారావు (చర్చ) 04:08, 24 జనవరి 2019 (UTC)
మొదటి ఆన్ లైన్ తరగతి: శుద్ధి చేయాల్సిన వ్యాసం
మొదటి ఆన్ లైన్ తరగతిలో 2019 ఫిబ్రవరి 10 తేదీన జరిగింది. ముందుగా రాలేకపోతున్న సంగతి తెలియపరిచినందుకు ధన్యవాదాలు. మీరు రాలేకపోయినా, వచ్చే వారం జరిగే రెండవ తరగతికి హాజరు కాగలిగేలా వికీపీడియా:తటస్థ దృక్కోణం, వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం అన్న రెండు అంశాలను చదవండి. తరగతిలో నిర్ణయించుకున్న విధంగా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వ్యాసాన్ని పరిశీలించి, దిద్దమని సూచిస్తున్నాను. ప్రధానంగా వికీపీడియా:తటస్థ దృక్కోణం, వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం అన్న రెండు సూత్రాలను ఈ వ్యాసంలోని ప్రతీ వాక్యంలోనూ ఎలా ప్రతిఫలిస్తున్నాయో పరిశీలించండి. సరిగా లేనిచోట్ల మీరే సరిదిద్దండి. ఆపైన పూర్తయ్యాకా నన్ను పింగ్ చేస్తూ చర్చ:చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి పేజీలో కానీ, ఇక్కడే కానీ రాస్తే నేను పున:పరిశీలన చేసి మీకు సహాయం అందిస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:18, 16 ఫిబ్రవరి 2019 (UTC)
- పవన్ సంతోష్ గారూ 'చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి' వ్యాసాన్ని వికీపీడియా శైలి,మార్గదర్శకాలుకు అనుగుణంగా సవరించాను.మీరు పున:పరిశీలన చేయవలసిందిగా కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 15:47, 22 ఫిబ్రవరి 2019 (UTC)
- @యర్రా రామారావు: గారూ బావుందండీ. కానీ తటస్థతను దెబ్బతీస్తూ కొన్ని "శ్రీ"లు, బహువచన ప్రయోగాలు ఉన్నాయి. వ్యక్తిగత భావనలకు సంబంధం లేకుండానే మనం ఈ మార్పుచేర్పులు చేయకతప్పదు. ఉదాహరణకు నేను మిమ్మల్ని చర్చాపేజీల్లో మీరు, గారు అని రాస్తాను కానీ మీకంటూ ఒక వ్యాసం రాయదగ్గ విషయ ప్రాముఖ్యత బయటి మూలాల్లో నిర్ధారణ అయినాకా రాయవలిసి వస్తే "యర్రా రామారావు తన గ్రామ చరిత్ర, గ్రామంలోని ఆలయం చరిత్ర మీద పుస్తకాలు రాశాడు" అనే రాయకతప్పదు కదా. --పవన్ సంతోష్ (చర్చ) 16:08, 22 ఫిబ్రవరి 2019 (UTC)
- పవన్ సంతోష్ గారూ 'చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి' వ్యాసాన్ని వికీపీడియా శైలి,మార్గదర్శకాలుకు అనుగుణంగా సవరించాను.మీరు పున:పరిశీలన చేయవలసిందిగా కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 15:47, 22 ఫిబ్రవరి 2019 (UTC)
తర్వాతి టాస్కు
నమస్తే, ఆన్ లైన్ తరగతుల్లో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. ఇటీవలి తరగతిలో మనం చర్చించుకున్న వ్యాస పరిచయం ఎలావుండాలి, బహువచనం (చేశారు అన్నది చేశాడు, ఆయన అన్నది అతను, వగైరా) అన్న రెండు శైలీ పరమైన అంశాలు ఎలా ఉన్నాయన్నది మీకు ఇంతకుముందు ఇచ్చిన వ్యాసాల్లోనే పరిశీలించి, సరిగా లేకపోతే మార్చి 24 నాటికి దిద్దగలరు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 12:52, 6 మార్చి 2019 (UTC)
నిరోధం గురించి
రామారావు గారూ, ఎవరైనా అనుచిత మార్పులు చేస్తున్నపుడు ముందుగా వారికి తెలియ జెప్పి, వారు అలాంటి మార్పులు ఆపనప్పుడు మాత్రమే నిరోధం విధించాలి. రవిచంద్ర (చర్చ) 12:37, 7 మార్చి 2019 (UTC)
- రవిచంద్ర గారూ ఆ వాడకరి పదేపదే స్వంత సంస్థ పేరును, ఇతర అనుచితమైన రాతలు రాస్తూ ఉంటే అంత దూరం ఆలోచించకుండా నిరోధం విధించాను.గమనించి తెలిపినందుకు ధన్యవాదాలు.మీరు నిరోధం ఎత్తివేసి హెచ్చరిక సందేశం తెలుపగలరు. --యర్రా రామారావు (చర్చ) 12:52, 7 మార్చి 2019 (UTC)
- రామారావు గారూ, మీరు చేసిన నిరోధం సబబే. నేను నిరోధం ఎత్తివేయలేదు. ఆ ఖాతా ఇంతకు ముందుకు కూడా దుశ్చర్యలు పాల్పడింది నేను గమనించ లేదు. ఇక ముందు నిరోధం విధించేటపుడు గుర్తుంచుకుంటారని ఈ విషయం మీకు తెలియజేశాను. దయచేసి మరోలా భావించవద్దు. రవిచంద్ర (చర్చ) 13:02, 7 మార్చి 2019 (UTC)
చలసాని ప్రసాద్/ప్రసాదరావు
చలసాని ప్రసాద్, చలసాని ప్రసాదరావు - వీళ్ళిద్దరూ వేరువేరు వ్యక్తు లనుకుంటానండి. ఈ పేజీల విలీనం కూడదు.__చదువరి (చర్చ • రచనలు) 05:51, 8 జూన్ 2019 (UTC)
- చదువరి గారూ చలసాని ప్రసాద్, చలసాని ప్రసాదరావు - రెండు వ్యాసాలు పరిశీలించగా మీరు చెప్పినట్లు వీళ్ళిద్దరూ వేరువేరు వ్యక్తులని తెలుస్తుంది. విలీనం మూస తొలగించగలరు. --యర్రా రామారావు (చర్చ) 08:17, 8 జూన్ 2019 (UTC)
- మీరు పెట్టారు గదా.., అందుకే మీకు చెప్పాను. మీరే తొలగించండి.__చదువరి (చర్చ • రచనలు) 10:17, 8 జూన్ 2019 (UTC)
- చదువరి గారూ విలీనం మూస తొలగించాను.--యర్రా రామారావు (చర్చ) 13:25, 8 జూన్ 2019 (UTC)
- ధన్యవాదాల్సార్!__చదువరి (చర్చ • రచనలు) 14:30, 8 జూన్ 2019 (UTC)
చాంద్ బవోరి మెట్ల బావి
యర్రా రామారావు గారూ చాంద్ బవోరి మెట్ల బావి వ్యాసం కి మూలాలు ఇచ్చాను అండి. ఒక సారి మీరు పరిశీలించి మూసలను తొలగించండి. ధన్యవాదములు Ch Maheswara Raju (చర్చ) 03:40, 2 జూలై 2019 (UTC)
WikiConference India 2020: IRC today
{{subst:WCI2020-IRC (Oct 2019)}} MediaWiki message delivery (చర్చ) 05:27, 20 అక్టోబరు 2019 (UTC)
WikiConference India 2020: IRC today
Greetings, thanks for taking part in the initial conversation around the proposal for WikiConference India 2020 in Hyderabad. Firstly, we are happy to share the news that there has been a very good positive response from individual Wikimedians. Also there have been community-wide discussions on local Village Pumps on various languages. Several of these discussions have reached consensus, and supported the initiative. To conclude this initial conversation and formalise the consensus, an IRC is being hosted today evening. We can clear any concerns/doubts that we have during the IRC. Looking forward to your participation.
The details of the IRC are
- Timings and Date: 6:00 pm IST (12:30 pm UTC) on 20 August 2019
- Website: https://webchat.freenode.net/
- Channel: #wci
Note: Initially, all the users who have engaged on WikiConference India 2020: Initial conversations page or its talk page were added to the WCI2020 notification list. Members of this list will receive regular updates regarding WCI2020. If you would like to opt-out or change the target page, please do so on this page.
This message is being sent again because template substitution failed on non-Meta-Wiki Wikis. Sorry for the inconvenience. MediaWiki message delivery (చర్చ) 05:58, 20 అక్టోబరు 2019 (UTC)
Hello, Will you please let me know why did you revert my edit? Kind regards, Tulsi Bhagat (చర్చ) 08:54, 24 అక్టోబరు 2019 (UTC)
- Dear Friend Tulsi Bhagat garu Something went wrong. Sorry.edit rectified.--యర్రా రామారావు (చర్చ) 10:00, 24 అక్టోబరు 2019 (UTC)
- No problem. Thank you! Kind regards, Tulsi Bhagat (చర్చ) 10:03, 24 అక్టోబరు 2019 (UTC)
- Dear Friend Tulsi Bhagat garu Something went wrong. Sorry.edit rectified.--యర్రా రామారావు (చర్చ) 10:00, 24 అక్టోబరు 2019 (UTC)
I am sorry for using English. Hello! హాయ్! Looking at your revert edit, I think I made a mistake. Could you tell me what was the problem? This is to ensure that the same mistakes are not repeated. ధన్యవాదాలు and Kind regards, Sotiale (చర్చ) 14:34, 14 నవంబర్ 2019 (UTC)
- Ahh..! I guess that members of some group have assignments and leave their name after they write contents. Is it right? --Sotiale (చర్చ) 14:51, 14 నవంబర్ 2019 (UTC)
- Dear Friend Sotiale garu Something went wrong. Sorry.edit rectified.----యర్రా రామారావు (చర్చ) 17:21, 4 డిసెంబరు 2019 (UTC)
ముసునూరి నాయకులు పేజీలో మార్పులు
నమస్కారం యర్రా రామారావు గారు ముసునూరి నాయకులు పేజీలో మార్పులు చేయవలసిందిగా నేను కోరుతున్నాను. అందులో అనేక తప్పులు ఉన్నవి. మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు రచించిన ముసునూరి నాయకులు గ్రంధాన్ని పరిశీలించాక నేను ఈ మార్పులు ప్రతిపాదిస్తున్నాను
1. వీరి రాజ్య ప్రారంభ సంవంత్సరం 1324. పతన సంవంత్సరం 1369. పేజీలో చూపిన ఆధారాలు సరైనవి కాదు 2. ఈ నాయకుల పేర్లు ప్రోలయ్య నాయకుడు మరియు కాపయ్య నాయకుడు వ్యాసంలో తప్పగా నాయుడు అని సంబోధించటం జరిగింది. ఈ ఇద్దరికీ సంబంధించిన పేజీల పేర్లు కూడా మార్చవలసిందిగా కోరుతున్నాను. Pavanayani (చర్చ) 19:28, 8 డిసెంబరు 2019 (UTC)
[WikiConference India 2020] Invitation to participate in the Community Engagement Survey
This is an invitation to participate in the Community Engagement Survey, which is one of the key requirements for drafting the Conference & Event Grant application for WikiConference India 2020 to the Wikimedia Foundation. The survey will have questions regarding a few demographic details, your experience with Wikimedia, challenges and needs, and your expectations for WCI 2020. The responses will help us to form an initial idea of what is expected out of WCI 2020, and draft the grant application accordingly. Please note that this will not directly influence the specificities of the program, there will be a detailed survey to assess the program needs post-funding decision.
- Please fill the survey at; https://docs.google.com/forms/d/e/1FAIpQLSd7_hpoIKHxGW31RepX_y4QxVqoodsCFOKatMTzxsJ2Vbkd-Q/viewform
- The survey will be open until 23:59 hrs of 22 December 2019.
MediaWiki message delivery (చర్చ) 05:10, 12 డిసెంబరు 2019 (UTC)
వాడుకరు:ప్రయోగశాల యర్రా వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
వాడుకరు:ప్రయోగశాల యర్రా వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- వ్యాసం పేజీలో ఎటువంటి మసాచారం లేదు
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 09:48, 12 జనవరి 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 09:48, 12 జనవరి 2020 (UTC)
అనువదించాల్సిన పేజీలు
ఇంగ్లీషులో ఉన్న వ్యాసాల విషయంలో కింది పద్ధతిని పాటించవచ్చని నా అభిప్రాయం.
- వ్యాసం అసలు అనువాదమే కాకపోతే TWTW --> CSD చెయ్యాలి.
- వ్యాసం 75% కంటే పైన అనువాదం కాకుండా ఉంటే, తొలగింపుకు ప్రతిపాదించడం ఉత్తమం.
- అనువదించాల్సినది 75% లోపే ఉంటే, పేజీలో పైన
{{అనువాదము}}
మూస పెడితే సరిపోతుంది. ఆ పేజీ ఆటోమాటిగ్గా వర్గం:అనువాదము కోరబడిన పేజీలు వర్గం లోకి చేరుతుంది. ఈ పద్ధతిలో, పేజీ చూసే వారికి అనువాదం అభ్యర్ధన కూడా కనబడుతుంది.
పరిశీలించండి.__చదువరి (చర్చ • రచనలు) 00:31, 13 జనవరి 2020 (UTC)
పురపాలక వ్యాసాల కోసం
సార్, ఈ లింకు పురపాలక స్థానిక సంస్థల వ్యాసాలకు పనికి రావచ్చు. దీన్ని ఆర్కైవు కూడా చేసాను. __చదువరి (చర్చ • రచనలు) 08:33, 27 జనవరి 2020 (UTC)
- చదువరి గారూ ఉపయోగపడుతుంది. తెలిపినందుకు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 14:17, 27 జనవరి 2020 (UTC)
దిద్దుబాటు రద్దు
ఈ రద్దు ఎందుకు చేసారో అర్థం కాలేద్సార్. __చదువరి (చర్చ • రచనలు) 02:57, 12 ఫిబ్రవరి 2020 (UTC)
- క్షమించండి చదువరిగారూ, సెల్ లో ఇటీవల మార్పులు చూస్తూ పొరపాటున టచ్ అయింది.మరలా వెంటనే మీ కూర్పు వరకు తిప్పికొట్టాను.గమనించగలరు--యర్రా రామారావు (చర్చ) 03:11, 12 ఫిబ్రవరి 2020 (UTC)
- ధన్యవాదాలు సార్. __చదువరి (చర్చ • రచనలు) 05:27, 12 ఫిబ్రవరి 2020 (UTC)
[WikiConference India 2020] Conference & Event Grant proposal
WikiConference India 2020 team is happy to inform you that the Conference & Event Grant proposal for WikiConference India 2020 has been submitted to the Wikimedia Foundation. This is to notify community members that for the last two weeks we have opened the proposal for community review, according to the timeline, post notifying on Indian Wikimedia community mailing list. After receiving feedback from several community members, certain aspects of the proposal and the budget have been changed. However, community members can still continue engage on the talk page, for any suggestions/questions/comments. After going through the proposal + FAQs, if you feel contented, please endorse the proposal at WikiConference_India_2020#Endorsements, along with a rationale for endorsing this project. MediaWiki message delivery (చర్చ) 18:21, 19 ఫిబ్రవరి 2020 (UTC)
"మరియు"ల తొలగింపు
"మరియు"లను తొలగించడమనేది AWB ద్వారా చెయ్యవచ్చేమో పరిశీలించండి, తొందరగా అయిపోతుంది గదా అని మీరు రెండుసార్లు అన్నారు నాతో. అవదేమో, ప్రతీదీ చూసుకుంటూ చెయ్యాలేమో అనే ఉద్దేశంతో ఉండేవాణ్ని నేను. అదే ముక్క మీతోనూ అన్నాను. అయితే మీరు అన్నాక, మళ్ళీ పరిశీలిస్తే, పరిమిత స్థాయిలో యాంత్రికీకరణ చెయ్యవచ్చు అనిపించింది, పరీక్షార్థం చేసి చూసాను, ఫలితం బానే ఉంది. ప్రస్తుతం AWB వాడి, గ్రామాల పేజీల్లో తీసేస్తున్నాను. ఆ పేజీల్లో తేడాపాడాలేమైనా కనిపిస్తే చెప్పండి సార్. __చదువరి (చర్చ • రచనలు) 01:39, 25 ఫిబ్రవరి 2020 (UTC)
గ్రామ వ్యాసాల్లో సమాచారం.
రామారావు గారు. గ్రామ వ్యాసాల్లో మనం ఎక్కిస్తున్న ఒకేలాంటి మూస సమాచారం, అప్పటికే ఉన్న సమాచారానికి పైన తగిలిస్తున్నారు. దీని వలన చదువరులకు ఏ గ్రామ వ్యాసం చూసినా ఒకే తీరున ఇంకేం ఆశక్తి కలిగించే సమాచారంగా కానరావడం లేదు. కిందకు వచ్చి చూసేదానికి కూడా ఆశక్తి చూపడం లేదు. సమాచారం కొంత ఉన్నా కూడా దాని కిందే ఈ మూస సమాచారం ఉంటే. ముందున్న ఆ సహజమైన కొన్ని విశేషాలనూ చదువుతారు. మార్పులు చేస్తున్నపుడు మీకు అలాంటివేవైనా కనిపిస్తే ఈ సమాచారాన్ని కిందికి జరిపితే బావుంటుందని నా అభిప్రాయం.B.K.Viswanadh (చర్చ) 08:26, 6 మార్చి 2020 (UTC)
- B.K.Viswanadh గారూ అలాగే ఇంతకన్నా ముఖ్యమైన సమాచారం ఉంటే దానికి పైన ఉండేటట్టు చూడగలను.--యర్రా రామారావు (చర్చ) 08:34, 6 మార్చి 2020 (UTC)
వాడుకరి:యర్రా రామారావు నమస్కారం అండి. నాకు పటం ఎక్కించేటపుడు |pushpin_map = నాకు తెలియదు అందుకే నేను పెట్టలేకపోయాను. మీరు చెప్పాక అన్ని సరిచేసాను.(వాడుకరి:Tmamatha)(చర్చ)
రమణ మహర్షి వ్యాసం గురించి మీ సూచనలకు ధన్యవాదాలు
రామారావుగారు, మీరు చెప్పింది నిజమే, తెలియకే బహువచన ప్రయోగం చేశాను. మీరు సహృదయం తో సూచనలు చెప్పినందుకు ధన్యవాదాలు. ఈసారి నుంచి వ్యాసాలను రాసేటప్పుడు, అనువదించేటప్పుడు ఏకవచనమే వాడతాను. రమణ మహర్షి వ్యాసంలో కూడా మళ్ళీ ఏకవచన ప్రయోగంతో మార్పులు చేస్తాను టి పతంజలి (చర్చ) 16:33, 12 మార్చి 2020 (UTC)
- ధన్యవాదాలు సార్--యర్రా రామారావు (చర్చ) 17:21, 12 మార్చి 2020 (UTC)
"మరియు"ల ఏరివేత
"మరియు" ల ఏరివేత పూర్తైంది సార్. ప్రధాన పేరుబరిలో ఒక్కటి కూడా లేకుండా చేసాం. ఒక ప్రాజెక్టు లాగా తీసుకుని చేసాం కాబట్టి ఇది అయింది. దాదాపు రెండేళ్ళ నుండి నేను అనుకుంటున్నదిది. మీరూ పట్టుబట్టాకే ఈ పని ముందుకు పోయింది. అభినందనలు, ధన్యవాదాలు సార్. __చదువరి (చర్చ • రచనలు) 01:09, 23 మార్చి 2020 (UTC)
- చదువరి గారూ నడిచే వాళ్లకన్నా నడిపించేవాళ్లు ముఖ్యం అని నాభావన.ఇలాంటివి గమనించి పనిపూర్తైయ్యేదాకా రెవ్వూ చేస్తూ ఆచరించటంలో మీ తరువాతనే మేము. అందువలన అభినందనలు, ధన్యవాదాలు మీకే దక్కుతాయి.నిన్న మీరు చేసిన భారీ మార్పులు గమనించాను.వ్యాసాల విభాగాలలో, సమాచారపెట్టెలలో ఉన్నాయనుకుంటాను.అవి కూడా ఒకసారి గమనిద్దాం.--యర్రా రామారావు (చర్చ) 02:43, 23 మార్చి 2020 (UTC)
- సెర్చెలో పరిశీలిస్తే జీరో చూపిస్త్తుంది.మరొకసారి చప్పట్లు చదువరి గారూ.--యర్రా రామారావు (చర్చ) 02:52, 23 మార్చి 2020 (UTC)
రాయ్‌పుర్
Additional information has been added to రాయ్‌పుర్ Article. Request to reconsider your decision of deleting the article. Your Talk page is not allowing me to type in Telugu using Firefox Browser.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:55, 20 ఏప్రిల్ 2020 (UTC)
- సుల్తాన్ ఖాదర్ గారూ మీరు వెంటనే స్పందించి, ఈ వ్యాసాన్ని అభివృద్ధి చేసినందుకు ధన్యవాదాలు.తొలగింపు మూస తొలగించాను--యర్రా రామారావు (చర్చ) 16:24, 20 ఏప్రిల్ 2020 (UTC)
వాడుకరి టూల్స్
తొలగించబడిన వ్యాసాలలో మొలక స్థాయి దాటించ గల వ్యాసాన్ని నేను ప్రారంభించాలనుకుంటే ఏమి చేయాలి
- రామారావు గారు, నమస్కారం, ప్రస్తుతం ఏ వ్యాసంను మొలక స్థాయి దాటించి వ్రాయగలనో లేదో నాకు తెలియదు, కావున ఏదైనా వ్యాసం తొలగిస్తే మొలక స్థాయి దాటించ గల వ్యాసాన్ని నేను ప్రారంభించాలనుకుంటే ఏమి చేయాలనేది నాకు తెలియదు కావున వివరిస్తే వికీ నియమాల ప్రకారం తొలగించిన వ్యాసాన్ని సృష్టిస్తాను. తొలగించబడిన వ్యాసాలను ఎలా ప్రారంభించాలో తెలిపే తెలుగు సమాచారం ఉన్న లింకు ఇస్తే అక్కడి నియమాల ప్రకారం మాత్రమే తొలగించబడిన వ్యాసాలను ప్రారంభిస్తాను. ఎవరికైనా వికీ నియమాలు తెలియకపోతే, ముఖ్యంగా నాకు వికీ నియమాలు తెలియనందున (నాకు నిజంగా తెలియదు) వికీ నిర్వాహకులైన మీకు వికీ నియమాలను వివరించవలసిన బాధ్యత వుంది. YVSREDDY (చర్చ) 07:09, 15 మే 2020 (UTC)
- YVSR గారూ ఇది మీరు అడగదగ్గ సందేహంకాదు.నిన్న మెన్న వికీపీడియోలో అడుగిడిన కొత్త వాడుకరులు అడగవలసిన సందేహం.అసలు మీగురించి, వికీపీడియాలో మీ ప్రతిభను గురించి, వికీపీడియాలో మీ ప్రయాణం గురించి చర్చాపేజీలో జరిగిన చర్చలద్వారా ద్వారా నాకు తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాను.మీకు ఇప్పటికే మన గౌరవ నిర్వాహకులు వివరించారు కాబట్టి నేను వివరించవలసిన అవసరంలేదు.--యర్రా రామారావు (చర్చ) 16:02, 15 మే 2020 (UTC)
- రామారావు గారు, నమస్కారం, ప్రస్తుతం ఏ వ్యాసంను మొలక స్థాయి దాటించి వ్రాయగలనో లేదో నాకు తెలియదు, కావున ఏదైనా వ్యాసం తొలగిస్తే మొలక స్థాయి దాటించ గల వ్యాసాన్ని నేను ప్రారంభించాలనుకుంటే ఏమి చేయాలనేది నాకు తెలియదు కావున వివరిస్తే వికీ నియమాల ప్రకారం తొలగించిన వ్యాసాన్ని సృష్టిస్తాను. తొలగించబడిన వ్యాసాలను ఎలా ప్రారంభించాలో తెలిపే తెలుగు సమాచారం ఉన్న లింకు ఇస్తే అక్కడి నియమాల ప్రకారం మాత్రమే తొలగించబడిన వ్యాసాలను ప్రారంభిస్తాను. ఎవరికైనా వికీ నియమాలు తెలియకపోతే, ముఖ్యంగా నాకు వికీ నియమాలు తెలియనందున (నాకు నిజంగా తెలియదు) వికీ నిర్వాహకులైన మీకు వికీ నియమాలను వివరించవలసిన బాధ్యత వుంది. YVSREDDY (చర్చ) 07:09, 15 మే 2020 (UTC)
ఫొటోలు ఎక్కించడంలో సమస్య
వాడుకరి:యర్రా రామారావు గారు, వేరే పేజీలో మీరు పేర్కొన్న సమస్య "వికీ మీడియా కామన్స్ (కామన్సు ఎలా ఉందో చూడండి) ఫోటోలు వ్యాసలలో ఎక్కించాలంటే అసలు చూపటలేదు.ఏమిటా వికీమీడియా కామన్స్ అభిరుచులులోకి వెళ్లి పరిశీలించగా "Your current signature is invalid. Although you can still use it, you won't be able to change it until you correct it. Your signature must include a link to your user page, talk page or contributions. Please add it, for example: యర్రా రామారావు (చర్చ)." అని ఉంది.పరిష్కారం కనుగొనగలరు.--యర్రా రామారావు (చర్చ) 09:39, 22 జూలై 2020 (UTC)"
- నేను ఫొటోలు ఎక్కించడానికి సమస్య ఎదుర్కొన్నాను. ఫైల్ పేరు ఎంపిక పెట్టె తెరుచుకోదు. దీనికి కారణం నేను ఉబుంటు లో వాడతున్న Firefox snap 78.x రూపం అని తేలింది, snap కాని రూపం 68.x సరిగా పనిచేసింది. మీరు విండోస్ వాడుకరలయ్యుంటారు కాబట్టి, ఫైర్ఫాక్ ఇటీవలది అయితే ఆ సమస్య నాకు కనిపించలేదు. విహరిణి లు తరచుగా అభివృద్ధికి లోనవుతున్నాయి. అప్పుడు కొన్ని కొత్త బగ్గులు వుంటున్నాయి. ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఇతర విహరిణి(Chrome, Edge) ప్రయత్నించండి. మరిన్ని వివరాలతో అనగా ఆపరేటింగ్ సిస్టమ్, విహరిణి వర్షన్ తో మీరు స్పందిస్తే ఇతరులు మీ సమస్యని ధృవీకరించటానికి వీలవుతుంది. ఇది కామన్స్ కి మాత్రమే సంబంధించినది కాదు. తెలుగు వికీపీడియాలో లేక ఇంగ్లీషు వికీపీడియాలో కూడా స్థానికంగా ఫొటోలను ఎక్కించడానికి వీలవుతుందేమో మీరు ప్రయత్నించవచ్చు. ఇక మీ కామన్స్ లో సంతకం గురించిన సందేశం నాకు అనుభవంలేదు.-- అర్జున (చర్చ) 10:43, 22 జూలై 2020 (UTC)
మీ విస్తరణ జాబితాలో
కింది పేజీలను మీరు విస్తరించి మూసను తొలగించి ఉన్నారు. కానీ అవి మీ మొలకల విస్తరణ జాబితాలో కనబడలేదు. పరిశీలించండి.
- గోల్కొండ వజ్రం
- కార్యాలయం
- రామాలయం
- అమరావతి (స్వర్గం)
- వరుణుడు
- వాయుదేవుడు
- శబరి
- శూర్పణఖ
__చదువరి (చర్చ • రచనలు) 07:53, 25 జూలై 2020 (UTC)
- చదువరి గారూ సాయంత్రంలోగా జాబితా తాజాపరుస్తాను.--యర్రా రామారావు (చర్చ) 08:11, 25 జూలై 2020 (UTC)
తెలుగు అనువాద వ్యాసాల పతకం
తెలుగు అనువాద వ్యాసాల పతకం | |
యర్రా రామారావు గారికి, జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. మీరిలాగే తెవికీలో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ..--అర్జున (చర్చ) 07:43, 13 ఆగస్టు 2020 (UTC) |
- అర్జున గారూ అభిమానంతో మీరు గుర్తించి,పతకం అందజేసినందుకు ధన్యవాదాలు.నాకు ఓపిక ఉన్నంతవరకు తెవికీ అభివృద్ధికి నా వంతు కృషి అందిస్తానని ఈ సందర్బంగా తెలియజేస్తున్నాను
ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్
ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ పేజీని విస్తరించారు గానీ, మూసను తీసెయ్యలేదు. పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 04:57, 17 ఆగస్టు 2020 (UTC)
నీలమణి
నీలమణి వ్యాసాన్ని విస్తరించారు గానీ మూస తీసెయ్యలేదు. పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 09:28, 31 ఆగస్టు 2020 (UTC)
మొలకల విస్తరణ ఋతువు 2020 ప్రాజెక్టు విజయవంతమైనందుకు అభినందిస్తూ
- వాడుకరి:స్వరలాసిక గారూ మీరు గుర్తించి పతకం బహుకరించినందుకు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 14:31, 3 సెప్టెంబరు 2020 (UTC)
We sent you an e-mail
Hello యర్రా రామారావు,
Really sorry for the inconvenience. This is a gentle note to request that you check your email. We sent you a message titled "The Community Insights survey is coming!". If you have questions, email surveys@wikimedia.org.
You can see my explanation here.
MediaWiki message delivery (చర్చ) 18:54, 25 సెప్టెంబరు 2020 (UTC)
రెండు వ్యాసాలు ఒకటే
యర్రా రామారావు గారుశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)&శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయం, వేములవాడ ఈ రెండు వ్యాసాలు ఒకటే వికి ప్రామాణికంగా ఈ వ్యాసం ఉన్నది శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ) దీనిని ఉంచి మరొక వ్యాసాన్ని తొలగించగలరు.𝓒𝓱 𝓜𝓪𝓱𝓮𝓼𝔀𝓪𝓻𝓪 𝓡𝓪𝓳𝓾 (చర్చ) 02:23, 7 డిసెంబరు 2020 (UTC)
ఉషారాణి భాటియా
ఉషారాణి భాటియా వ్యాసాన్ని దయచేసి డిలీట్ చేయగలరు. ఈ వ్యాసం రాసి క్షమించరాని తప్పు చేశాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:11, 2 జనవరి 2021 (UTC)
వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్: కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు
వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్ వారు ఫిబ్రవరి 1 నుండి మర్చి 14 వరకు, కమ్యూనిటీ ద్వారా ఎన్నుకోబడే బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికి కారణం; గత పది సంవత్సరాలలో వికీమీడియా ఫౌండేషన్, ప్రాజెక్టులు ఐదు రెట్లు పెరగగా, బోర్డ్ పనితీరు, ఏర్పాట్లు, ఏమి మారలేదు. ఇప్పుడు ఉన్న విధానాల ప్రకారం, బోర్డుకు తగినంత సామర్థ్యం, ప్రాతినిధ్యం లేవు. మామూలుగా జరిగే ఎన్నికలు, బహిర్ముఖులుగా ఉంటూ ఇంగ్లీష్ వికీపీడియా వంటి పెద్ద ప్రాజెక్టులు లేదా అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు నుండి వచ్చేవారికి తోడ్పడుతున్నాయి. మిగిలిన వారికీ ఎన్ని శక్తిసామర్ధ్యాలు ఉన్నా తగినంత ప్రచారం లేనందు వలన వారికి ఓటు వేసే వారు తక్కువ మంది. ఉదాహరణకి, వికీమీడియా ఫౌండేషన్ పదిహేను సంవత్సరాల చరిత్రలో, భారత ఉపఖండం నుండి కేవలం ఒక్కళ్ళు మాత్రమే బోర్డు లో సేవలు అందించారు. వారు కూడా నిర్దిష్ట నైపుణ్యం కోసం నేరుగా నియమించబడ్డవారే గాని, ఎన్నుకోబడలేదు.
రానున్న నెలలో, మొత్తం ఆరు కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు జరుగుతున్న సంప్రదింపుల ద్వారా బోర్డు వారు కమ్యూనిటీల నుండి వారి పద్ధతుల మీద అభిప్రాయం సేకరిస్తున్నారు. ఈ నిమిత్తం తెలుగు కమ్యూనిటీలో తో మాట్లాడేందుకు ఒక ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇది ఫిబ్రవరి 6 (శనివారం), 6:00 pm నుండి 7:30 pm వరకు జరుగుతుంది; పాల్గొనడానికి గూగుల్ మీట్ లింకు ఇది https://meet.google.com/oki-espq-kog. ఈ కార్యక్రమములో పాల్గొనవలసిందిగా మిమల్ని ఆహ్వానితున్నాను. KCVelaga (WMF), 11:24, 1 మార్చి 2021 (UTC)
నిర్జన గ్రామాల వివరం
వాడుకరి:యర్రా రామారావు గారు, నిర్జన గ్రామాల వ్యాసాలు తొలగించినా (ఉదాహరణ తొలగింపు), వాటి పేర్లు సంబంధిత మండలం వ్యాసంలో చేర్చడం చారిత్రక అవసరాలకు ఉపయోగంగా వుంటుంది. పరిశీలించండి. గత చర్చలో ఈ విషయం వ్యక్తమయిందో లేదో నాకు గుర్తులేదు.--అర్జున (చర్చ) 05:59, 6 మార్చి 2021 (UTC)
- గతంలో ఈ విషయం సముదాయంలో చర్చించి నిర్ణయం తీసుకొనబడలేదు.సముదాయం నిర్ణయం మేరకు తొలగించబడుతున్నవి.చారిత్రక గ్రామాలు అలాగే మండల వ్యాసంలో తొలగించకుండా వేరే విభాగంలో ఉంటున్నవి.చేసేవారికి మీరు పని పెంచే సూచనలు చేయవద్దని నా మనవి. యర్రా రామారావు (చర్చ) 06:27, 6 మార్చి 2021 (UTC)
మొలకల గురించి..
మొలకల విస్తరణ 2021 ప్రాజెక్టు కోసం కింది పనులు చేసాను
- మొలక స్థాయి దాటిన వాటిని మొలక వర్గాల నుండి తీసేసాను.
- వర్గాల్లో చేరని మొలక వ్యాసాలను ఇప్పుడు చేర్చాను.
- వర్గం:మొలక లో ఉన్న వ్యాసాల సంబంధిత ఉప వర్గాల్లోకి చేర్చాను. ఈ వర్గంలో ఇంకా 40 దాకా వ్యాసాలున్నాయి - 27 జాబితా వ్యాసాలు (వీటిని మొలకలుగా పరిగణించరాదని నా అభిప్రాయం, సముదాయం నిర్ణయం అవసరం), రెండు వాడుకరి పేజీ లింకులు, మూడు తప్పు లింకులు (ఆంధ్రప్రదేశ్ పేజీ నుండి), మూణ్ణాలుగు వికీపీడియా, మూస పేరుబరుల్లోని పేజీలు, మరో మూణ్ణాలుగు పెద్దబాలశిక్ష పేజీలు.
మొలక నిర్వచనంగా 2048 బైట్లు కాక, 2148 బైట్లు తీసుకున్నాను (నిర్వహణ మూస ఉంటుందని కూడా పరిగణించి). ఇక ప్రాజెక్టు కోసం పేజీలు సిద్ధమైనట్లే. __ చదువరి (చర్చ • రచనలు) 14:00, 21 మార్చి 2021 (UTC)
- గమనించాను.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 14:53, 21 మార్చి 2021 (UTC)
- యర్రా రామారావు గారూ, మొలక గ్రామ వ్యాసాలలో ఎక్కువగా ప్రకాశం జిల్లాకు చెందినవి ఉన్నట్లున్నాయి. వాటిని విస్తరించడానికి ఏవైనా వనరులు ఉన్నాయా? -- K.Venkataramana -- ☎ 12:31, 17 ఏప్రిల్ 2021 (UTC)
- వెంకటరమణ గారూ ముందుగా ఆలస్యంగా స్పందించినందుకు క్షమించాలి.మొలకగా ఉన్న గ్రామాలు దాదాపుగా చాలా వరకు రెవెన్యూయేతర గ్రామాలు. ఇవి అన్నీ వెరే రెవెన్యూ గ్రామాలకు శివారు గ్రామాలు,కొన్ని గ్రామ పంచాయితీలు, హేమ్లెట్సు . వీటికి ప్రత్యేకంగా డేటా ఏమీ లేదు. సంబందిత రెవెన్యూ గ్రామ డేటాలోనే వీటి డేటా, జనాభా వివరాలు కూడా మిళితమై ఉంటాయి.విస్తారించాలన్నా చాలా కష్టమైన పనిగా ఉంది.సరియైన సమాచారం దొరకదు.వీటి మీద సముదాయం నిర్ణయం చేయాలి.తీసివేయటానికి ఏదో ఘోరం జరిగిపోతుందని భావిస్తారు.అలాని పరిష్కార దిశగా అలోచనలు జరుగుటలేదు.నేను అదే అలోచనలో ఉన్నాను.వీటిని గురించి మొలకలు కార్యక్రమం అయినాక ఆలోచిద్దామని అనుకుంటున్నాను.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 02:53, 19 ఏప్రిల్ 2021 (UTC)
- యర్రా రామారావు గారూ, మొలక గ్రామ వ్యాసాలలో ఎక్కువగా ప్రకాశం జిల్లాకు చెందినవి ఉన్నట్లున్నాయి. వాటిని విస్తరించడానికి ఏవైనా వనరులు ఉన్నాయా? -- K.Venkataramana -- ☎ 12:31, 17 ఏప్రిల్ 2021 (UTC)
తెలుగు కులాలు గురించి Agnivahnikukutpally అడుగుతున్న ప్రశ్న (18:08, 24 మే 2021)
The page https://te.wikipedia.org/wiki/తెలుగు_కులాలు contains false information. I want rights to edit. I am a Professor in JNTU, Hyderabad(http://sites.google.com/site/chandraksekharaiah). Please help me for editing rights for corrections by me. --Agnivahnikukutpally (చర్చ) 18:08, 24 మే 2021 (UTC)
- Agnivahnikukutpally గారూ నమస్కారం. ముందుగా తెలుగు వికీపీడియాలో పని చేయడానికి ఆసక్తితో ఉన్న మీకు ధన్యవాదాలు సార్, తెలుగు వికీపీడియా సముదాయం తరుపున మీకు స్వాగతం.మీరు తెలుగు కులాలు వ్యాసంలో తప్పుడు సమాచారం ఉన్నదని గుర్తించి, సవరించటానికి ముందుకు వచ్చినందుకు వికీపీడియా తరుపున అభినందనలు.మీరు పంపిన లింకు చూసాను.మీలాంటివారు తెలుగు వికీపీడియాకు చాలా అవసరం.మీకు వికీపీడియా గురించి సరైన అవగాహన ఉందని నేను భావించటంలో తప్పులేదనుకుంటాను.సరే ఇక అసలు విషయానికి వస్తాను.నాకు తెలిసినంతవరకు మీకు అర్థం అయ్యేలాగున కొన్ని విషయాలు మీ ముందుంచుతున్నాను.
- ఇది తెలుగు వికీపీడియా కావున తెలుగులోనే రాయాలి.
- ప్రజలే ప్రజల కోసం రాస్తున్న విజ్ఞాన సర్వస్వం ఇది.
- ఇక కులాలు వ్యాసాలు సహజంగా వివాదాస్పదంగా ఉంటాయి.అందరూ కాదు, కానీ ఎక్కువ మంది రాసే వారి కులాన్ని గురించి కొన్ని వాస్తవంకాని గొప్పలు రాస్తుంటారు.దాని వలన ఈ వ్యాసాలు ఒకరు రాసినవి ఇంకొకరు అభ్యంతరాలు లేవదీయటం, వివాదాస్పదం కావటం సహజం.ఇలాంటి వ్యాసాలలో సహనంతో, సున్నితంగా వ్యవహరించవలసిన అవసరం ప్రతి వాడుకరిపైన ఉంది.
- వికీపీడియాలో రాసిన సమాచారానికి సరియైన మూలాలు (ఆధారాలు) చూపించాల్సిన అవసరం ఉంటుంది.ఆధారంలేని సమాచారం, వ్యాసాలు తొలగింపుకు తరుచూ గురి అవుతూ ఉంటాయి.
- మీరు ఎన్నుకున్న వ్యాసానికి వాస్తవంగా ఒక్క మూలం లేదు.అందువలన ఆ వ్యాసంలో తప్పుడు సమాచారం ఉందనే అభిప్రాయం మీకు కలగటం సహజం.
- దేని గురించైనా గూగుల్లో తెలుగులో వెతికి చూస్తే, 90% కేసుల్లో, ఫలితాల్లో తెలుగు వికీపీడియా మొట్టమొదటి స్థానంలో కనిపిస్తుంది.అందువలన దీనిలో సరియైన సమాచారం తప్పనిసరిగా ఉండాలి.
- కావున మీరు ఆ వ్యాసంలో తగిన ఆధారాలతో కూడిన సమాచారం నిరభ్యంతరంగా చేర్చవచ్చు.
- వ్యాసం చర్చాపేజీ కూడా ఒకసారి పరిశీలించండి
- నేను మీకు సంతృప్తిగా వివరించాననుకుంటున్నాను.ఇంకా మీకు ఎప్పుడైనా, ఎటువంటి సందేహం వచ్చినా నిరభ్యంతరంగా అడగండి.నాకు తెలిసినంతవరకు వివరించటానికి ప్రయత్నిస్తాను.ధన్యవాదాలు సార్ యర్రా రామారావు (చర్చ) 06:50, 25 మే 2021 (UTC)
Give me editing rights to correct the false information in https://te.wikipedia.org/wiki/తెలుగు_కులాలు
సహాయం అందించబడింది
Sir,
Good time.
I am (http://sites.google.com/site/chandraksekharaiah) a Professor in Computer Science & Engineering in JNT University, India.
The article in https://te.wikipedia.org/wiki/తెలుగు_కులాలు has errors that are damaging to our community whose website is in the signature field below. Please inform me immediately the modus operandi to change it correctly.
When will I get the editing rights to correct the false information? How to correct the false information?
Regards,
Dr.K.Chandra Sekharaiah, Founder of the Caste Organization, Agni(Vahni)Kula Kshatriya Seva Samsthan, whose website is https://sites.google.com/site/agnivahnikukutpally
Agni(Vahni)Kula Kshatriya Seva Sansthan(Sangam),
Registered No. 553 of 2019,
Kukutpally, Hyderabad, Telangana
Branch@Miyapur
email-id: agnivahnikukutpally@gmail.com (C):9849352231
https://sites.google.com/site/agnivahnikukutpally
—Agnivahnikukutpally (చర్చ) 17:48, 25 మే 2021 (UTC)
- రామారావు గారూ, అది సంరక్షిత పేజీ కాబట్టి వారికి రాసే వీలు కలగడం లేదు. అలాంటివారు తాము రాయదలచినదాన్ని చర్చ పేజీలో రాస్తే, తెలిసినవాళ్ళు దాన్ని పరిశీలించి సముచితంగా ఉంటే పేజీలో చేరుస్తారు. అయితే ఆ విషయం సంరక్షణ సందేశంలో వివరంగా లేదు.
- అందుచేత, ప్రస్తుతం నేను ఆ పేజీ సంరక్షణను తాత్కాలికంగా తీసేసాను. ఇక @Agnivahnikukutpally గారు తాను రాయదలచిన దాన్ని నేరుగా అక్కడే రాయవచ్చు. __ చదువరి (చర్చ • రచనలు) 01:53, 26 మే 2021 (UTC)
- చదువరి గారూ నేను ఆ విషయం గమనించలేదండీ.మీరు గమనించి స్పందించినందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 03:47, 26 మే 2021 (UTC)
- @Agnivahnikukutpally గారు తెలుగు కులాలు వ్యాసం పేజీలో మీరు సవరణలు చేయటానికి వీలుగా సంరక్షణను తాత్కాలికంగా తొలగించబడినది.మీరు చేర్చదలుచుకున్న సమాచారం తగిన ఆధారాలతో చేర్చగలరు. యర్రా రామారావు (చర్చ) 07:03, 26 మే 2021 (UTC)
- చదువరి గారూ నేను ఆ విషయం గమనించలేదండీ.మీరు గమనించి స్పందించినందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 03:47, 26 మే 2021 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
మట్టెవాడ (వరంగల్)
రామారావు గారూ! మట్టెవాడ (వరంగల్) వ్యాసానికి చెందిన డేటాతో వ్యాసాన్ని అభివృద్ధి చేయగలరు. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 578478. ధన్యవాదాలు.--స్వరలాసిక (చర్చ) 06:57, 10 జూలై 2021 (UTC)
- స్వరలాసిక గారూ మట్టెవాడ (వరంగల్) గ్రామం మీరు ఏడేటా ఆధారంతో సృష్టించారో చెప్పగలరా! ఎందుకంటే పేజీ సృష్టించి,దానిలోని ఎక్కించిన డేటా ఆ గ్రామానికి చెందింది కాదు.అది మహబూబాబాదు జిల్లా, గూడూర్ మండలం లోని మట్వాడ గ్రామానికి చెందిన డేటా. అందులోని జనాభా వివరాలు, గ్రామం జనగణన లొకేషన్ కోడ్ 578478 మట్వాడ గ్రామానికి చెందినవి.మీరు సృష్టించిన మట్టెవాడ (వరంగల్) గ్రామం వరంగల్ పట్టణ జిల్లా, వరంగల్ మండలంలోని రెవెన్యూ గ్రామం.ఇంతవరకు సరియైన సమాచారం.ఇది వరంగల్ పట్టణంలో విలీనమైన గ్రామం.ఈ లింకును పరిశీలించండి.వరంగల్ నగరపాలక సంస్థ 25 వ వార్డులో విలీనమైనట్లుగా ఈ లింకు ద్వారా తెలుస్తుంది.అందువలనే రెవెన్యూ గ్రామానికి సరిపోను డేటా లేనందున గ్రామ పేజీ గతంలో సృష్టించలేదు.క్షమించాలి.అందువలన నేను ఆ గ్రామ వ్యాసం పేజీని విస్తరించటానికి, సవరించటానికి అవకాశం కలగలేదు.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 05:46, 12 జూలై 2021 (UTC)
- యర్రా రామారావుగారూ! ఈ లంకెలోని వరంగల్ జిల్లా సమాచారంతో నేను ఈ వ్యాసాన్ని సృష్టించాను. అప్పటికి మహబూబాబాద్ జిల్లా లేదు కాబట్టి నేనే పొరబడి ఉండవచ్చు. గ్రామ వ్యాసాన్ని ఖాళీ చేస్తున్నాను. ధన్యవాదాలు. స్వరలాసిక (చర్చ) 06:43, 12 జూలై 2021 (UTC)
ఆహ్వానం WPWP పునసమీక్షా సమావేశం
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 లో మీ చేర్పులకు ధన్యవాదములు, ఇందులో భాగంగా జూలై 15వ తేదీ సాయంత్రం 7.00 నుండి 8.00 IST వరకు జరుగుతున్న సభ్యుల పునసమీక్షా సమావేశంలో గూగుల్ మీట్ ద్వారా చేరగలరు (లింకు) Or Open Google Meet and enter this code: bqk-vdyf-gzc , ప్రాజెక్టు జరిగే కాలంలో ఇందులో పాల్గోనే అందరూ సబ్యులూ వీలయితే నేర్చుకొన్న విషయాలు పంచుకోవచ్చు,సూచనలు కూడా చేయవచ్చు, కొత్త వారికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది.
[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities
Hello,
As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.
An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:
- Date: 31 July 2021 (Saturday)
- Timings: check in your local time
- Bangladesh: 4:30 pm to 7:00 pm
- India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
- Nepal: 4:15 pm to 6:45 pm
- Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
- Live interpretation is being provided in Hindi.
- Please register using this form
For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.
Hope that you are able to join us, KCVelaga (WMF), 06:35, 23 జూలై 2021 (UTC)
జీవా (తమిళ నటుడు) గురించి Surendra Bojanapu అడుగుతున్న ప్రశ్న (02:57, 25 జూలై 2021)
నమస్తే గురువుగారు నా ప్రశ్న ఏమంటే పేజీలోని ఫోటోని మార్చచడం ఎలా అని? --Surendra Bojanapu (చర్చ) 02:57, 25 జూలై 2021 (UTC)
- @Surendra Bojanapu గారూ నమస్తే.ఆ వ్యాసంలో పొరపాటున తెలుగు నటుడు జీవా ఫొటో పెట్టినట్లుగా ఉంది.మీరు వికీమీడియా కామన్స్ ఈ పేజీలో లోకి వెళ్లి మీరు అందులో మీరు పెట్టాలన్న బొమ్మను సెలక్ట్ చేసుకుని,దానిమీద క్లిక్ చేయండి.ఆ ఫొటో కు సంబందించన పేజీ తెరుచుకుంటుంది.ఆ పేజీ దిగువున మరిన్ని వివరాలు అని ఉంటుంది.దాని మీద క్లిక్ చేస్తే పూర్తి పేజీ కనపడుతుంది.పైన ఉన్న బొమ్మ పేరును File:అనే వరకు వదిలేసి కాపీ చేసి, ఆ వ్యాసం సోర్స్ ఎటిట్ మోడ్ లోకి వెళ్లి సమాచారపెట్టెలోని పాత బొమ్మను తొలగించి దాని స్థానంలో పేస్టు చేసి ప్రచురించండి..ప్రయత్నం చేయండి.ఏదోనా అవసరమైతే సంప్రదించండి.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 03:46, 25 జూలై 2021 (UTC)
ధన్యవాదాలండీ. Surendra Bojanapu (చర్చ) 04:35, 25 జూలై 2021 (UTC
ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్ సవరణలు గురించి
యర్రా రామారావు గారు నమస్తే నేను రాసిన ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్ లో మీ నుంచి చిన్న సవరణ జరిగింది. ధన్యవాదములు . నాది చిన్న విన్నపం ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్ లను భారత్ ఎలక్ట్రానిక్ మెషిన్, బెంగళూర్ వారు , ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ అఫ్ ఇండియా హైదరాబాద్ వారు సంయుక్తం నిర్మాణము చేసినారు.
నేను వ్యాసములో రాసిన వ్యాసములో మీరు భారత్ ఎలక్ట్రానిక్ మెషిన్ ను భారత్ హెవి ఎలెక్ట్రికల్స్ లిమిటెడ్ గా సవరించారు. నేను ఈ రెండింటికి మూలములు జతచేసినాను. ఒకసారి మీరు పరిశీలించగలరు. కృతజ్ఞతలుPrasharma681 (చర్చ) 06:15, 9 ఆగస్టు 2021 (UTC)
- @Prasharma681 గారూ ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించాలి. మూలం లేనందున నేను పొరపాటున ఎర్రలింకులు సవరిస్తూ సవరణలు చేసాను. మీరు వాటిని తిరిగి సవరించి, మూలం కూర్పు చేసినందుకు ధన్యవాదాలు.ఇంకొక విషయం. వ్యాసంలో సవరించేటప్పుడు సాధ్యమైనంతవరకు ఎర్రలింకులు కలపటానికి ప్రయత్నించగలరు.కొద్ది తేడాతో తెవికీలో వ్యాసం ఉండటానికి అవకాశం ఉంది. దానికి ఉదాహరణగా ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ వ్యాసం లోనే భారత ఎన్నికల కమిషన్ అనే ఎర్ర లింకు ఉంది.కానీ వాస్తవంగా తెవికీలో భారత ఎన్నికల కమిషను అనే పేరుతో వ్యాసం ఉంది.దీనికి కలపాలి.లేదా భారత ఎన్నికల కమిషన్ అనే పేరుతోపేజీ సృష్టించి దారిమార్పు అయినా ఇవ్వవచ్చు. ఇలాంటివి కూడా గమనించగలరు. యర్రా రామారావు (చర్చ) 09:30, 11 ఆగస్టు 2021 (UTC)
యర్రా రామారావు గారు నమస్తే. పెద్దవారు మీరు వికీపీడియా ను తీర్చి దిద్దుతున్నారు. నేను ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాను. మీరు నాకు సూచనలు ఇవ్వగలరు. ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్ ( ఇ.వి.ఎం ) తో ఉన్న మొలక వ్యాసం,( వర్గం పరికరములు)నుంచి అభివృద్ధి చేసినాను . మున్ముందు నా వ్యాసములలో ఇలాంటి తప్పులు రాకుండా సరిచేసుకోగలను. కృతజ్ఞతలు Prasharma681 (చర్చ) 10:29, 11 ఆగస్టు 2021 (UTC)
Invitation for Wiki Loves Women South Asia 2021
Wiki Loves Women South Asia 2021
September 1 - September 30, 2021view details!
Wiki Loves Women South Asia is back with the 2021 edition. Join us to minify gender gaps and enrich Wikipedia with more diversity. Happening from 1 September - 30 September, Wiki Loves Women South Asia welcomes the articles created on gender gap theme. This year we will focus on women's empowerment and gender discrimination related topics.
We are proud to announce and invite you and your community to participate in the competition. You can learn more about the scope and the prizes at the project page.
This message has been sent to you because you participated in the last edition of this event as an organizer.
Best wishes,
Wiki Loves Women Team 01:28, 28 ఆగస్టు 2021 (UTC)
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి
నమస్తే యర్రా రామారావు,
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.
ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.
70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.
మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.
ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:02, 29 ఆగస్టు 2021 (UTC)
ఆహ్వానం : ఆజాదీ కా అమృత్ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)
నమస్కారం ,
తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 05:12, 1 సెప్టెంబరు 2021 (UTC)
అభినందనలు
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టులో మీ కృషి అమోఘం. అభినందనలు. త్వరలో మీకు WPWP సావినీర్లు, సర్టిఫికెట్ పంపబడతాయి. దయచేసి వెంటనే ఈ క్రింది లంకెలో ఉన్న ఫారంలో మీ వివరాలు తెలియజేయండి.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSd-TaLmENAW9Y3HbSDtLyBsneiZqiGFbStEjrr-lC9ASAZywA/viewform
--స్వరలాసిక (చర్చ) 09:41, 9 సెప్టెంబరు 2021 (UTC)
- @స్వరలాసిక గారూ పై లంకెలో ఉన్న ఫారంలో వివరాలు పంపాను.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 13:59, 9 సెప్టెంబరు 2021 (UTC)
కానుక
బొమ్మలు చేర్చిన నేర్పరులు | ||
వికీపీడియా పేజీలలో సముచితమైన బొమ్మలను చేర్చినందులకు గుర్తుగా ఈ మెడల్‌ను స్వీకరించండి.--స్వరలాసిక (చర్చ) 09:31, 14 సెప్టెంబరు 2021 (UTC) |
తెవికీ నిర్వహణపై ఆసక్తి
నమస్కారం యర్రా రామారావు గారూ, తెవికీలో కృషి చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నేను వికీలో చేరిన గత తొమ్మిది నెలలుగా వికీ పట్ల చక్కటి అవగాహన ఏర్పరచుకున్నాను. వికీలో నా సేవలు మరింత విస్తృత స్థాయిలో చేపడుతూ ముందుకు సాగాలని నా ఆశయం .. ఈ క్రమంలో వికీ నిర్వహణ పట్ల నాకు ఆసక్తి కలిగింది, ఈ విషయంపై మీ అభిప్రాయాలు సూచనలు తెలియజేయవలసిందినంగా కోరుతున్నాను. Nskjnv ☚╣✉╠☛ 19:00, 23 సెప్టెంబరు 2021 (UTC)
- @Nskjnv గారూ మీరు తెవికీలో నిర్వహణ లేదా నిర్వహకపదవి పట్ల మీ ఆసక్తికి ధన్యవాదాలు.మీరు మీ స్వీయ ప్రతిపాదనను సముదాయం దృష్టికి ప్రతిపాదించండి.సముదాయం పరిశీలించి మీరు దానికి అర్హులని భావిస్తే తప్పక సానుకూలనిర్ణయం తీసుకుంటుంది. యర్రా రామారావు (చర్చ) 08:49, 25 సెప్టెంబరు 2021 (UTC)
Movement Charter Drafting Committee - Community Elections to take place October 11 - 24
నమస్కారం రామారావు గారూ ,
వికీమీడియా ఉద్యమంలో వికిపీమీడియన్ల పాత్రలు బాధ్యతలను ఉద్యమ చార్టర్ నిర్వచిస్తుంది. అందరి భాగస్వామ్యంతో వ్యూహాత్మక దిశలో కలిసి పనిచేయడానికి ఈ ఫ్రేమ్‌వర్క్ ఉపయోగపడననుంది.
ఉద్యమ చార్టర్ డ్రాఫ్టింగ్ కమిటీ ఈ చార్టర్ ముసాయిదాను రూపొందిస్తుంది. కంటెంట్ ఈక్విటీ ఇన్ డెసిషన్ మేకింగ్ "అనే మూవ్మెంట్ స్ట్రాటజీ సిఫార్సును అనుసరిస్తుంది. కమిటీ పని ముసాయిదా రాయడం వరకు విస్తరించింది. ఇందులో కమ్యూనిటీలు, నిపుణులు, సంస్థలతో పరిశోధన ఇంకా సంప్రదింపులు ఉంటాయి. ఈ ముసాయిదా చార్టర్‌గా మారడానికి ముందు ఉద్యమం-అంతటా ఆమోదం ద్వారా ఏకాభిప్రాయం పొందాలి.
ఈ గ్రూపులో దాదాపు 15 మంది సభ్యులు ఉంటారు. ఇది ఉద్యమంలో వైవిధ్యాన్ని సూచిస్తుందని భావిస్తున్నారు. లింగం, భాష, భౌగోళికం అనుభవం లాంటి వివిధ వైవిద్యాలతో అభ్యర్థుల ఎంపిక జరగనుంది . ఈ సమూహ సభ్యులు ప్రాజెక్టులు, అనుబంధ సంస్థలు వికీమీడియా ఫౌండేషన్‌కి సంబందించిన కార్యకలాపాలలో పాల్గొనవలసి ఉంటుంది.
సభ్యుడిగా మారడానికి ఆంగ్ల భాష వచ్చి ఉండవలసిన అవసరం లేదు. అవసరమైతే అనువాదం, వివరణ మద్దతు అందించబడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ప్రతి రెండు నెలలకు US $ 100 పారితోషికం అందిచంబడుతుంది.
ఈ పోటీలో భారత్ నుండి 9 మంది వ్యక్తులు ఉండగా మన తెలుగు వికీ నుండి నేను ఒక్కడిని పాల్గొంటున్నాను అక్టోబరు 11 అనగా రేపటి నుండి దీని ఎన్నికలు జరగనున్నాయి. ఇది నా సభ్యత్వ పేజీ , పరిశీలించగలరు.
వికీమీడియా ఉద్యమంపై మంచి అవగాహన ఉన్న, నాకు సరిపడా అనుభవం లేదనేది వాస్తవం. కానీ, ఇటువంటి కార్యాచరణాలలో నేను భాగం కావడం నా కెరీర్ కి చాలా ఉపయోగపడనుంది.
ఈ పోటీలో నాకు మీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాను. ఒకవేళ నేను ఈ సమూహంలో సభ్యుడను కాగలిగితే మీ అనుభవం నుండి నేర్చుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. Nskjnv ☚╣✉╠☛ 06:25, 10 అక్టోబరు 2021 (UTC)
సహాయం
తెవికీలో వింజమూరు అనే మండల కేంద్రం వ్యాసం ఉండగా, వింజమూరు (వింజమూరు మండలం) అనే వ్యాసం కూడా ఉంది. అలాగే మండల వ్యాసం కూడా వేరుగా ఉంది. ఈ రెండు వ్యాసాలను పరిశీలించి సరైన రీతిలో సరిదిద్దగలరు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 16:25, 19 అక్టోబరు 2021 (UTC)
- వెంకటరమణ గారూ వింజమూరు గ్రామ వ్యాసాలు రెండు ఉన్నాయి.మండల వ్యాసం వేరేగా ఉంది.తొలగించే వ్యాసంలోని సమాచారం సరిచూసి, సరియైన వ్యాసంలో చేర్చి దానిని తొలగించాను.గమనించి దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 05:57, 20 అక్టోబరు 2021 (UTC)
ప్రామిసరీ నోట్ వ్యాసం తొలగింపు
రామారావు గారు, ప్రామిసరీ నోట్ వ్యాసం సరిచేసే అంత సరి చేసే అంత సమయం నాకు లేదు... తొలగిస్తారు సరి చేస్తారు మీ ఇష్టం... ధన్యవాదాలు.__ .@ప్రభాకర్ గౌడ్చర్చ 07:45, 3 నవంబరు 2021 (UTC) ః
- ప్రభాకర్ గౌడ్ నోముల గారూ నమస్కారం. మీ స్పందనకు ధన్యవాదాలు.దయచేసి మీ అభిప్రాయం తొలగింపు కొరకు వ్యాసాలు/ప్రామిసరీ నోటు పేజీలో రాయగలరు. యర్రా రామారావు (చర్చ) 08:02, 3 నవంబరు 2021 (UTC)
SAYYED YASIN అడుగుతున్న ప్రశ్న (14:06, 1 డిసెంబరు 2021)
Wikipedia Peru ela marchali? --SAYYED YASIN (చర్చ) 14:06, 1 డిసెంబరు 2021 (UTC)
- @SAYYED YASIN గారూ తెవికీలో అడుగు పెట్టినందుకు ధన్యవాదాలు.మీకు సమాధానం ఇవ్యటానికి సమయం పట్టినందుకు క్షంతవ్యుడును.మీరు అడిగిన ప్రశ్న వికీపీడియా పేరు ఎలా మార్చాలి అని అడిగారు.మీ దృష్టిలో వాడుకరిపేరు ఎలా మార్చాలని అని అనుకుంటాను.అదే అయితే ఈ లింకు పేజీలో తగిన కారణంతో అభ్యర్థన పంపించండి తెవికీలో మళ్లీ మళ్లీ కలుద్దాం. యర్రా రామారావు (చర్చ) 04:59, 4 డిసెంబరు 2021 (UTC)
సంరక్షణ
రామారావు గారు నా వాడుకరి పేజీ అజ్ఞాత వాడుకరులను నుండి సంరక్షించండి.➵𝐂𝐡 𝐌𝐚𝐡𝐞𝐬𝐰𝐚𝐫𝐚 𝐑𝐚𝐣𝐮☻ (చర్చ) 11:00, 24 డిసెంబరు 2021 (UTC)
How we will see unregistered users
Hi!
You get this message because you are an admin on a Wikimedia wiki.
When someone edits a Wikimedia wiki without being logged in today, we show their IP address. As you may already know, we will not be able to do this in the future. This is a decision by the Wikimedia Foundation Legal department, because norms and regulations for privacy online have changed.
Instead of the IP we will show a masked identity. You as an admin will still be able to access the IP. There will also be a new user right for those who need to see the full IPs of unregistered users to fight vandalism, harassment and spam without being admins. Patrollers will also see part of the IP even without this user right. We are also working on better tools to help.
If you have not seen it before, you can read more on Meta. If you want to make sure you don’t miss technical changes on the Wikimedia wikis, you can subscribe to the weekly technical newsletter.
We have two suggested ways this identity could work. We would appreciate your feedback on which way you think would work best for you and your wiki, now and in the future. You can let us know on the talk page. You can write in your language. The suggestions were posted in October and we will decide after 17 January.
Thank you. /Johan (WMF)
18:20, 4 జనవరి 2022 (UTC)
Vijaykumar Medical LibrarIan అడుగుతున్న ప్రశ్న (13:56, 9 జనవరి 2022)
గురువు గారికి నమస్కారం నెను వ్యాసాలు రాయాలని ఉంది మీరు సహాయం చెయగలరు --Vijaykumar Medical LibrarIan (చర్చ) 13:56, 9 జనవరి 2022 (UTC)
- విజయకుమార్ ఎం.ఎల్ గారూ తెలుగు వికీపీడియాలో చేరినందుకు ధన్యవాదాలు.తప్పనిసరిగా నాసహాయ సహకారాలు అందిస్తాను.అయితే మీరు రాయాలనుకున్న వ్యాసం సృష్టించే ముందు ఇంతకు ముందే శీర్షిక అక్షరభేధాలతో ఉందేమో ఒకసారి పరిక్షించండి.అది ఎలాగా ఉంటే వెతుకు పెట్టెలో శీర్షిక పేరు పలురకాలుగా ఉన్నదేమో పరిశీలించి లేదని నిర్థారించుకున్న తరువాత సృష్టించండి.మరిన్ని సందేహాలుకు సంప్రదించండి.మరొకసారి ధన్యావాదాలు యర్రా రామారావు (చర్చ) 07:29, 11 జనవరి 2022 (UTC)
చర్చలలో చురుకైనవారు
చర్చలలో చురుకైనవారు | ||
@యర్రా రామారావు గారు, 2021 లో వ్యాస, వికీపీడియా పేరుబరుల చర్చాపేజీలలో చురుకుగా పాల్గొన్నందులకు అభివందనాలు. గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి. మరిన్ని వివరాలు చూడండి. వికీపీడియా అభివృద్ధికి సామరస్యపూర్వక చర్చలు కీలకం. మీరు మరింత క్రియాశీలంగా చర్చలలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. అర్జున (చర్చ) 06:52, 23 మార్చి 2022 (UTC) |
- అర్జునరావు గారూ వికీ గణాంకాలు ద్వారా పేరుబరుల చర్చలలో చురుకైన వారిగా గుర్తించి పతకాన్ని బహుకరించినందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 07:39, 23 మార్చి 2022 (UTC)
శుభకృత్
శుభకృత్, శుభములు కలిగించే తెలుగు ఉగాది సంవత్సరానికి స్వాగతిస్తూ మీకు శుభాకాంక్షలు, మీ లాంటి వాళ్ళ మార్గదర్శకత్వంలో తెలుగు వికీపీడియా తెలుగు విజ్ఙానాన్ని నలు దిశలు వ్యాపించాలి అని కోరుకుంటున్న Pkraja1234 (చర్చ) 07:41, 2 ఏప్రిల్ 2022 (UTC)
- పికె రాజా గారూ నమస్కారం.ధన్యవాదాలు.అలాగే మీకు ఉగాది సంవత్సరాన్ని స్వాగతిస్తూ శుభాకాంక్షలు.మనందరం కలిసి సమన్వమయంతో తెలుగు వికీపీడియాను మరింత అభివృద్ధిలోకి తీసుకెళదాం. యర్రా రామారావు (చర్చ) 12:59, 2 ఏప్రిల్ 2022 (UTC)
వాడుకరి పేజీ సంరక్షణ
రామారావుగారు నా వాడుకరి పేజీనీ ఒక అజ్ఞాత వాడుకరి అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి రాస్తున్నాడు.ఒకసారి మీరు పరిశీలించి వాడుకరి పేజీని సంరక్షించండి.ఈ అజ్ఞాత వాడుకరి అజ్ఞాత వాడుకరి IP address తో రాసిన వ్యాసం మొసలిగంటి దీనినీ వ్యాసం కింద పరిగణించలేము. దీనిని కూడా తొలగించండి. ఈ వ్యాసంలో మార్పులు చేసినందుకే నా వాడుకరి పేజీలో అసభ్య పదజాలంతో వాడుకరి పేజీ లో ఉన్న సమాచారాన్ని తొలగించాడు.
Translation request
Hello.
Can you translate and upload the article en:List of World Heritage Sites in Azerbaijan in Telugu Wikipedia?
Yours sincerely, Multituberculata (చర్చ) 11:16, 8 మే 2022 (UTC)
గ్రామ పేజీలలో మీ సవరణలు
@యర్రా రామారావు గారు, గ్రామ పేజీలలో మీరు చెక్ లిస్ట్ ప్రకారం చేస్తున్న సవరణలు కొన్ని రోజులుగా గమనిస్తున్నాను. గ్రామపేజీలలో జనగణన ఆధారంగా జరిగిన సవరణల గురించి పెద్ద చర్చ, ఆ తరువాత గ్రామపేజీలు మెరుగు చేయటానికి ఒక పైలట్ ప్రాజెక్టు జరిగినవి. మీ చెక్ లిస్ట్ కు వాటిని పరిగణించినట్లు లేదు. మీరు ఆయా చర్చలను, ప్రాజెక్టును పరిశీలించి మీ చెక్ లిస్ట్ ను తాజా చేసి, స్పష్టతకూడిన,ఋణాత్మకసమాచారం లేని, ఉపయోగపడే జనగణన సమాచారం మాత్రమే పరిగణించి సవరణలు చేస్తే వికీపీడియా అభివృద్ధికి దోహదంగా వుంటుంది. పరిశీలించండి. అర్జున (చర్చ) 07:26, 13 మే 2022 (UTC)
- అర్జునరావు గారూ గ్రామ పేజీలలో నేను చెక్ లిస్ట్ ప్రకారం చేస్తున్న సవరణలు గమనించినందులకు ధన్యవాదాలు. అలాగే మీరు ఉదహరించిన
- జనగణన ఆధారంగా జరిగిన సవరణల గురించి పెద్ద చర్చ లింకును పరిశీలించాను.దీనిమీద జరిగిన పెద్ద చర్చలో ఎటువంటి నిర్ణయాలు వెలువరించనందున దానిని అంతగా పరిగణనలోకి తీసుకోనవసరంలేదు.
- గ్రామపేజీలు మెరుగు చేయటానికి ఒక పైలట్ ప్రాజెక్టు లింకును పరిశీలించాను.దానిలో కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు ఏమిలేవు.దీనిలో ఎక్కువుగా మీ వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ఉన్నవి.
- అసలు ఈ సవరణలు 2017 అక్టోబరు నుండి ఈ ప్రాజెక్టు ప్రకారం చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో నేను పూర్తిచేసిన విషయం మీకు తెలుసు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న అవే సవరణలు ఒక్కో జిల్లా తీసుకుని సవరించుట జరుగుతుంది.గమనించగలరు.
- తరువాత గ్రామ, మండల వ్యాసాలలో చేసిన సవరణలు అనుభవ దృష్ట్యా గ్రామ, మండల వ్యాసాల చెక్‌లిస్టు నొకదానిని తయారు చేసాను.మీరు ఏదో ఆ చెక్ లిష్టును తాజాచేయాలని అంటున్నారు. అవి అన్నీ ప్రాక్టికల్ గా సంభవించిన సవరణలకు అనుగుణంగా తయారుచేయబడినవి.మీరు క్షుణ్ణంగా పరిశీలించి గ్రామ మండల వ్యాసాల చెక్ లిష్టు చర్చా పేజీలో రాయండి. నేను వాటిని పరిశీలించి చేర్చవలసిన అవకాశం ఉన్నవాటిని నేను చేరుస్తాను.దయచేసి నేరుగా మీరు సవరించవద్దు.అవి చాలా అలోచించి కష్టపడి రాసినవి.
- గతంలో మండల, గ్రామ వ్యాసాల సవరణలుపై అపోహలు పై జరిగిన చర్చకూడా ఒకసారి పరిశీలించండి.
- చివరగా ఈ సవరణలు 13 పాత జిల్లాలలో 6 జిల్లాలలో మాత్రమే అయింది.ఇంకా 7 పాత జిల్లాలలో సవరించాల్సి ఉంది.మరి ఇంకా ఎంతకాలం పట్టిందో ఏమో అర్థం కాకుండా ఉంది.నేను అనుకున్న విధంగా సవరించటమే నాధ్యేయం.
- చివరగా నాదొక అభ్యర్థన. గ్రామ, మండల వ్యాసాల సవరణలు గమనించి మీరు సలహాలు అభిప్రాయాలు ఇస్తున్నారు కాబట్టి, మీకు వీటిమీద చాలా ఉత్సాహం ఉందని నేను భావిస్తున్నాను. అర్జునరావు గారూ మీరు కూడా ఈ బృహత్తర కార్యక్రమంలో నాకు తోడుగా భాగస్వామ్యం కావలసిందిగా అభ్యర్థిస్తున్నాను.
- యర్రా రామారావు (చర్చ) 08:54, 15 మే 2022 (UTC)
- @యర్రా రామారావుగారు, గతంలో జరిగిన చర్చలకు, కృషికి మీరు విలువనివ్వకుండా, గతంలో లాగానే మీరు జనగణన సమాచారం చేర్చటం, మీకు ఇష్టమైన విధంగా మీరు మార్పులు చేయటమే మీ ఉద్దేశ్యమని పై స్పందన సారాంశమని నాకు అనిపించినందున, ఈ చర్చవలన ఉపయోగంలేదు కావున విరమిస్తున్నాను. ఈ ధోరణి వికీపీడియా సహకారం పెరగడానికి, తద్వారా పురోగతికి ఏమాత్రం సహకరించదు. అర్జున (చర్చ) 06:25, 24 మే 2022 (UTC)
- అర్జునరావు గారూ అసలు నేను పైన రాసినవాటిలో గ్రామ, మండల వ్యాసాల చెక్‌లిస్టులో ఏమి సవరించాలో దాని చర్చాపేజీలో రాయవలసిందిగా అభ్యర్థించాను.కానీ ఆ పని మీరుచేయలేదు. నిర్మాణత్మకమైన చర్చలకు నేను ఎల్లప్పుడూ ముందుంటాను, గౌరవిస్తుంటాను.అందులో భాగంగానే నేను గ్రామ, మండల వ్యాసాలలో సవరణలు చేస్తున్నాను.మీ దోరణి చూస్తుంటే గ్రామ, మండల వ్యాసాలు అంత ముఖ్యమైనవి కావనే ధోరణి వ్యక్తపరుస్తున్నట్లుంది.నేను సవరణలు చేపట్టక ముందు మండలంలోని గ్రామాలు విభాగంలో,మండలం లోని గ్రామాలు మూసలో కూర్పు చేసిన గ్రామాలలో ఏది రెవెన్యూ గ్రామం, ఏది రెవెన్యూయేతర గ్రామం, ఏది జనగణన పట్టణం, ఏది నిర్జనగ్రామం అని గుర్తించలేని పరిస్థితి ఉందని మీకు తెలుసు. నేను చేస్తున్నపని అదే అని గమనించగలరు. మీరు వికీపీడియాలో చాలా అనుభవం ఉన్న పెద్ద (సీనియర్) వికీపీడియను. మీ మీద మాకు గౌరవం ఉంది. మిగతా అన్ని విషయాలు మీ విజ్ఞతకే వదిలివేస్తున్నాను. ధన్వవాదాలు.నావైపు నుండి చర్చను ముగించాను. యర్రా రామారావు (చర్చ) 04:35, 28 మే 2022 (UTC)
- @యర్రా రామారావుగారు, గతంలో జరిగిన చర్చలకు, కృషికి మీరు విలువనివ్వకుండా, గతంలో లాగానే మీరు జనగణన సమాచారం చేర్చటం, మీకు ఇష్టమైన విధంగా మీరు మార్పులు చేయటమే మీ ఉద్దేశ్యమని పై స్పందన సారాంశమని నాకు అనిపించినందున, ఈ చర్చవలన ఉపయోగంలేదు కావున విరమిస్తున్నాను. ఈ ధోరణి వికీపీడియా సహకారం పెరగడానికి, తద్వారా పురోగతికి ఏమాత్రం సహకరించదు. అర్జున (చర్చ) 06:25, 24 మే 2022 (UTC)
నిర్జనగ్రామాలకు మండల పేజీలో లింకులు
@యర్రా రామారావుగారు, నిర్జన గ్రామాలను తొలగించినపుడు, వాటి వికీడేటా అంశాలకు సంబంధిత మండల పేజీలో లింకుచేర్చండి. ఈ విషయం మండల గణాంకాల వివరాలకు ఉపయోగంగావుంటుంది. ఉదాహరణ. నేను చేసిన అటువంటి గత సవరణలను మీరు పట్టించుకున్నట్లు లేనందున మరొక్కసారి మీ దృష్టికి తెలియపరచడానికి ఈ వ్యాఖ్య చేరుస్తున్నాను. అర్జున (చర్చ) 06:32, 13 జూన్ 2022 (UTC)
- అర్జునరావు గారూ ముందుగా ఆలస్యంగా స్పందించినందుకు క్షంతవ్యుడను. సముదాయం నిర్ణయం మేరకు తొలగించిన నిర్జన గ్రామాల శీర్షికలును మండల వ్యాసాల పేజీలలో వికీ డేటా సైటుకు కొత్తగా మీరు దారి మార్పు లింకు ఇవ్యటం గమనించాను.నా దృష్టిలో ఇది సరియైన చర్య కాదు. ఎందుకంటే మనం తెలుగు వికీపీడియాలో ఎక్కడైనా ఆంగ్ల వ్యాసాలకు దారిమార్పు లింకులు కలిపిఉంటే వాటిని మనం తొలగిస్తున్నాం. ఇంకా ఈ విషయం మండల గణాంకాల వివరాలకు ఉపయోగంగా వుంటుంది అని మీరు వాఖ్య చేసారు.మీరు చెప్పినదాని ప్రకారం అలాగైతే తొలగించిన పేజీలన్నింటికి ఎక్కడ లింకులు ఇస్తున్నాం.నిర్జన గ్రామాలు తొలగింపు ప్రక్రియ ఈ రోజు ఏదో కొత్తగా జరుగుతుంది కాదు.గత నాలుగు సంవత్సరాల నుండి నేను రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాజెక్టులలో గ్రామ మండల వ్యాసాలలో తగిన సవరణలు చేస్తూ వాటిని గుర్తించినప్పుడు తొలగించుట జరుగుతుంది. ఉపయోగం లేని ఈ ఆలోచన మరి మీకు ఆకస్మికంగా ఎందుకు కలిగిందో నాకర్థం కాలేదు.నా దృష్టిలో అలా ఇవ్వాలిసిన అవసరం లేదు.దయచేసి మీరు కూడా అలా లింకులు ఇవ్వవద్దని మిమ్మల్ని కోరుచున్నాను.దాని వలన ఎటువంటి ఉపయోగం లేకపోగా పని భారం మనపై ఎక్కువ ఉంటుంది. గమనించగలరు.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 11:59, 14 జూన్ 2022 (UTC)
- @యర్రా రామారావుగారు, మండల గణాంక వివరాలకు ఉపయోగ మనేది మీరు సరిగా అర్ధం చేసుకున్నట్లులేదు. దానిని గురించి, మీ ఇతర అనుమానాల గురించి కాస్త విస్తరించే ప్రయత్నం క్రింది విభాగాలలో చేస్తాను. పరిశీలించండి. --అర్జున (చర్చ) 05:17, 18 జూన్ 2022 (UTC)
సమగ్ర సమాచార లక్ష్యానికి తోడ్పాటు
విజ్ఞానసర్వస్వ వ్యాసమన్నప్పుడు వ్యాసం గురించిన సమగ్ర, సంగ్రహ సమాచారం వుండాలనే అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. మండలంలోని నిర్జన గ్రామాలు కూడా మండలంలో భాగమేకావున, జనావాస రెవిన్యూ గ్రామాలతో పాటు వాటి వివరాలు ఉండటం వ్యాసం సమగ్రంగా వుండటానికి తప్పనిసరి. గతంలో నిర్జనగ్రామాలకు ప్రత్యేక వ్యాసాలు చేర్చుతున్నప్పుడు వాటిని తొలగించాలన్న విషయమై రచ్చబండ చర్చను ఇప్పుడు గమనించాను. ఆ చర్చను విధానంగా ప్రకటించడంలో వికీపీడియా విధానాల నిర్ణయ పద్ధతి సరిగా వాడనందున దానిని సరియైన సముదాయ నిర్ణయంగా భావించలేము. అయినా నేను నిర్జనగ్రామాలను తొలగించడానికి అభ్యంతరం చెప్పుటలేదు. ఆ చర్చలో ఇతరులు కూడా నిర్జనగ్రామాలను తొలగించినపుడు వాటి పేర్లు జాబితాలో వుండాలని తెలిపారు గమనించండి. నా అభిప్రాయం ఆ పేరు మండలం వ్యాసంలో చేర్చితే మంచిదని.--అర్జున (చర్చ) 05:17, 18 జూన్ 2022 (UTC)
- మీ వివరణలకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 05:53, 21 జూన్ 2022 (UTC)
నిర్జనగ్రామాల సంఖ్య ధృవీకరణకు తోడ్పాటు
మీరు కొన్ని చోట్ల నిర్జనగ్రామాల సంఖ్యని కూడా ప్రస్తావిస్తున్నారు. అటువంటి సంఖ్యని తెలిపేటప్పుడు ఎవరైనా దానిని ధృవీకరించుకోవాటానికి అవసరమైన పేర్లు ఆ మండల వ్యాసంలో వుండడం సహాయంగా వుంటుంది. రచ్చబండ చర్చలో వ్యక్తమయినట్లుగా అటువంటి వాటికి చారిత్రక విశేషాలేమైనా వుంటే వాటి గురించి మరల వ్యాసం తయారు చేయటానికి సౌలభ్యంగా వుంటుంది.--అర్జున (చర్చ) 05:17, 18 జూన్ 2022 (UTC)
- మీ సూచనలకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 05:55, 21 జూన్ 2022 (UTC)
వికీడేటా అంశాలు అనాధలు కాకుండా వుండటానికి సహాయం
నిర్జన గ్రామాల వ్యాసాలు ఉనికిలో వున్నప్పుడో లేక సమాంతరంగానో ఆ గ్రామాలకు వికీడేటాలో అంశాలు ఏర్పడ్డాయి. నిర్జనగ్రామం తొలగించినపుడు, ఆ వ్యాసంలో ముఖ్యమైన సమాచారమైన విస్తీర్ణం, మండలం లాంటి వివరాలు వికీడేటాలో అందుబాటులోనున్నందున వికీడేటాకు లింకు ఇవ్వడం ద్వారా ఆ నిర్జనగ్రామం గురించి ఆసక్తి వున్నవారికి ఆ సమచారం పొందే అవకాశం వుంది. వికీడేటా అంశాలు అనాధలుగా మిగిలిపోకుండాకూడా సహాయంగా వుంటుంది.--అర్జున (చర్చ) 05:17, 18 జూన్ 2022 (UTC)
- మీరు ఇవ్యమన్నట్లుగా తొలగించిన నిర్డనగ్రామాల పేర్లకు మండల వ్యాసంలో వికీడేటా లింకు ఇవ్యనవసరంలేదు.నేను మొదట తెలిపిన అభిప్రాయంలో ఎటువంటి మార్పులేదు.దయచేసి మీరు కూడా ఇవ్వద్దని కోరుచున్నాను. లేదు మీరు ఇవ్వాలనే అభిప్రాయం మీకుంటే రచ్చబండ చర్చను ప్రవేశపెట్టండి.సముదాయం నిర్ణయం ప్రకారం నడుచుకుందాం.దీని గురించి ఇక నావైపు నుండి చేప్పేదేమిలేదు.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 06:02, 21 జూన్ 2022 (UTC)
నాలుగు సంవత్సరాల నుండి కృషి జరుగుతున్నా ఇప్పుడెందుకు ఈ సలహా
గ్రామ వ్యాసాల విస్తరణ నేను అంత చురుకుగా లేని కాలంలో జరిగింది. నేను ఆ తరువాత మరల క్రియాశీలమైనప్పుడు దానిలోని లోపాలను గుర్తించి చర్చలో పాల్గొన్నాను. గ్రామ వ్యాసాలను సరి చేయడానికి నావంతు పైలట్ ప్రాజెక్టు కూడా చేశాను. ఆ ప్రాజెక్టు సమయంలో ఇతర వాడుకరులను పేరుపెట్టి పిలిచి స్పందించమన్నా స్పందన కరవైంది. వికీపీడీయా సముదాయ బలం పుంజుకోకపోవడం వలన అంత వీక్షణలు లేని గ్రామ వ్యాసాలపై కృషి చేయటకంటే నా సమయాన్ని ఎక్కువ వీక్షణలుండే జిల్లా, మండల స్థాయి వ్యాసాలపై కృషి చేయడం మెరుగనే అభిప్రాయానికొచ్చాను. ఇటీవలి అంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లా, మండల వ్యాసాలపై నేను కృషి చేయటం మీకు తెలిసినదే. ఈ విషయం మండల స్థాయి వ్యాసాలను ప్రభావితం చేస్తున్నది కావున స్పందించాను.
గ్రామాల వ్యాసాలను మెరుగుచేయడానికి చురుకుగా వున్న వికీపీడియన్లకు కూడా అంత ఆసక్తి లేదని విషయం నేను మీకు చెప్పనవసరంలేదు. తక్కువ ఆసక్తిగల వ్యాసాల నాణ్యత, ఒక్కరు ఎంతకష్టపడినా మెరుగవదు అని నా అభిప్రాయం. మరలా మరలా సవరణలు చేయవలసి వస్తూనే వుంటుంది. ఇప్పటివరకు నిర్జనగ్రామాల గురించి, మీ కృషిలో పురోగతి ఎంతవరకు జరిగిందో నాకు తెలియదుకాని ఆంధ్రప్రదేశ్ నిర్జనగ్రామాల గురించి ఇంకా చాలా జరగవలసివుందని నేను భావిస్తున్నాను. వికీపీడియా నాణ్యత పెంచే విషయమై ఎప్పుడు ఇతర అభిప్రాయాలు వచ్చినా స్వాగతించటమే మంచిది. ఆ అభిప్రాయంలో విలువ వుందనిపిస్తే అప్పటినుండి ఆ అభిప్రాయం పరిగణించి సవరణలు చేయటం మంచిది. మీకు విలువలేదనిపిస్తే, నిర్జన గ్రామాలను తొలగించటం నిలిపివేయటమైనా మంచిదే. (సముదాయనిర్ణయం, వికీపీడియా విధానాల పద్ధతి ప్రకారం జరగలేదని పైన తెలిపాను. గమనించండి).--అర్జున (చర్చ) 05:17, 18 జూన్ 2022 (UTC)
- మీ సూచనలకు, అభిప్రాయాలకు ధన్యవాదాలు.కానీ ప్రతిసారి "వీక్షణలు లేని గ్రామ వ్యాసాలపై కృషి చేయటకంటే" అనే వాక్యం పదేపదే వాడి గ్రామ వ్యాసాలను కించపర్చినట్లుగా అభిప్రాయం వ్యక్తంచేయటం నాకు భాధంగా ఉంది. ఉన్న నిర్జన గ్రామాలు తొలగించే పని మధ్యలో ఆపే ప్రసక్తిలేదు. ఆ కార్యక్రమం పూర్తిగా గట్టెక్కేవరకు చేసేపని. ఇక నేను ఈ విషయంపై నావైపు నుంచి చెప్పేదేమిలేదు. యర్రా రామారావు (చర్చ) 07:06, 21 జూన్ 2022 (UTC)
దారిమార్పు లింకులు?
నేను నిర్జన గ్రామాలకు ఇస్తున్న లింకులు దారిమార్పు లింకులు కావు. తొలగించిన వ్యాసం లింకులు, వికీడేటా లింకులు. తొలగించిన వ్యాసం లింకు ఉంటే, ఎవరైనా ఆ వ్యాసాన్ని మరల సృష్టించదలిచినప్పుడు, వారికి అది అంతకుముందు తొలగించిన వ్యాసమని వికీపీడియా హెచ్చరిక చేయటం వలన, వారు మరింత అర్ధం చేసుకొని అవసరమైతేనే మరల సృష్టించే అవకాశం వుంటుంది. వికీడేటా, కామన్స్ లాగా అన్ని వికీపీడియా ప్రాజెక్టులకు ఉపయోగపడే ప్రాజెక్టు. దీనిని మీరు ఆంగ్ల వికీపీడియా లింకులతో పోల్చటం తగదు. అయినా తెలుగు వికీలో ఆంగ్ల వికీ వ్యాసాలకు లింకు వుంటే వాటిని తొలగించే బదులు అది ఆంగ్ల వ్యాసం లింకు అని తెలిపే వివరం చేర్చటం నేను పాటిస్తున్నాను. --అర్జున (చర్చ) 05:17, 18 జూన్ 2022 (UTC)
- అవి దారిమార్పు లింకులు కావు. నిజమే! అవి తొలగించిన వ్యాసానికి వికీడేటా లింకులు.నాది అదే అభిప్రాయం. కానీ సమయానికి ఆ అభిప్రాయం వ్యక్తపరచలేకపోయాను.క్షమించాలి. సమయానికి సరియైన అభిప్రాయం చెప్పలేకపోయారని భావిస్తారు అని అనుకున్నాను. తప్పును ఎత్తిచూపినందుకు ధన్యవాదాలు. ఇంతకంటే ఇకనావైపు నుండి చేప్పేదేమీలేదు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 07:15, 21 జూన్ 2022 (UTC)
ఆహ్వానం: వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) 2022
నమస్కారం గురువుగారు, వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) అనేది ప్రతి యేటా నిర్వహించే ఉద్యమం. దీనిలో పాల్గొనే వాడుకరులు బొమ్మలు లేని వ్యాసాలలో బొమ్మలను చేరుస్తారు. వికీమీడియా నిర్వహించే అనేక ఫోటోగ్రఫీ పోటీలద్వారా, ఫోటో వాక్‌ల ద్వారా సేకరించిన ఫోటోలను వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించడాన్ని ప్రోత్సహించడమే ఈ ఉద్యమం ఉద్దేశం. బొమ్మలు పాఠకుల దృష్టిని అక్షరాలకన్నా ఎక్కువగా ఆకర్షిస్తాయి. సచిత్ర వ్యాసాలు బొమ్మలు లేని వ్యాసాలతో పోలిస్తే ఆకర్షణీయంగా ఉండి పాఠకుల మనసును ఆకట్టుకుంటాయి.
వికీ లవ్స్ మాన్యుమెంట్స్, వికీ లవ్స్ ఆఫ్రికా, వికీ లవ్స్ ఎర్త్, వికీ లవ్స్ ఫోక్‌లోర్ వంటి అనేక అంతర్జాతీయ పోటీలద్వారా, ఇతర అనేక మార్గాల ద్వారా వికీమీడియా కామన్స్లో ఎన్నో వేల చిత్రాలను చేర్చారు. ఐతే వీటిలో కొన్ని మాత్రమే వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించబడ్డాయి. ఈ ఖాళీని పూరించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
ఈ ప్రాజెక్టుని ఘనంగా జరుపుకోవడానికి మన తెలుగు వికీపీడియా సభ్యులందరూ చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ప్రాజెక్టు పేజీ వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ని చూడగలరు.
మీ Nskjnv ☚╣✉╠☛ 18:24, 28 జూన్ 2022 (UTC)
చర్చ పేజీలను తుడిచెయ్యడం
సార్, చర్చ:చిట్యాల మండలం (నల్గొండ జిల్లా), చర్చ:కొండమల్లేపల్లి మండలం పేజీలను మీరు తుడిచెయ్యడం గమనించాను. వాటిలో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} అనే మూసను తీసేసారు. అవి ఒక ప్రాజెక్టుకు సంబంధించిన మూసలు కాబట్టి ఆ మూసలు శాశ్వతంగా ఉండాల్సినవే.
- ఆ మూసలను పొరపాటున చేర్చి ఉంటే
లేదా
- ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉన్నా
వాటిని తీసెయ్యవచ్చు. లేదంటే సాధారణంగా వాటిని తీసెయ్యరు. __ చదువరి (చర్చ • రచనలు) 00:54, 31 జూలై 2022 (UTC)
- చదువరి గారూ క్షమించాలి. సరిగా గమనించకుండా వ్యాసం అభివృద్ధి జరిగిందికదా, మూస:మొలక అనే భావనతో చర్చాపేజీలు ఆరెండు తొలగించుట జరిగింది.ఆ మార్పులు రెండూ రద్దు చేసాను. యర్రా రామారావు (చర్చ) 03:26, 31 జూలై 2022 (UTC)
ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ కృషిలో చురుకైనవారు
ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ కృషిలో చురుకైనవారు | ||
@యర్రా రామారావు గారికి, ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీరణ 2022 - సంబంధిత అధిక ప్రాధాన్యతా వ్యాసాల అభివృద్ధి కృషిలో చురుకుగా పాల్గొన్నందులకు,మీ సహకారానికి ధన్యవాదాలు. గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి.. అర్జున (చర్చ) 14:14, 10 ఆగస్టు 2022 (UTC) |
ఆంధ్రప్రదేశ్ గ్రామాల పేజీల్లో ఎర్రలింకులు
సార్, కింది లింకుల్లో ఎర్రలింకులున్న ఆంధ్రప్రదేశ్ గ్రామాల పేజీల జాబితా చూడొచ్చు.
ఉంటాన్సార్. __ చదువరి (చర్చ • రచనలు) 07:14, 19 సెప్టెంబరు 2022 (UTC)
వాడుకరి:పాతచింతకాయపచ్చడి గురించి పాతచింతకాయపచ్చడి అడుగుతున్న ప్రశ్న (15:36, 17 అక్టోబరు 2022)
ఆర్యా! నా ఖాతాకు ఎందుకో ఇంకా కొత్త ఆర్టికల్ వ్రాసేందుకు సౌలభ్యం దొరకట్లేదు. మీకు ఏమైనా తెలుసా అంది ఎందుకు ఇంకా నాకు ఆ సౌలభ్యం ఇవ్వట్లేదని? --పాతచింతకాయపచ్చడి (చర్చ) 15:36, 17 అక్టోబరు 2022 (UTC)
- పాతచింతకాయపచ్చడి గారూ ముందుగా ఇది ఏమి పేరుండీ!సరే అది పక్కనబెడదాం.తెలుగు వికీపీడియాలో చేరినందుకు, కొత్త వ్యాసాలు రాయాలి అనే మీ అసక్తికి ధన్యవాదాలు. మీరు ఎలా ప్రయత్నించారో వివరాలు తెలుపలేదు.ముందుగా మీరు రాయాలనుకున్న వ్యాసం వికీపీడియాలో అంతకు ముందు ఉన్నదేమో అని పరిశీలించాలి. దానికి మీరు చేయవలసిందల్లా, ఏదేని ఒక వ్యాసం పేజీలో కుడివైపు పైన ఉన్న "వికీపీడియాలో వెతకండి" అనే సెర్చ్ బాక్సులో మీరు రాయలనుకున్న వ్యాసం శీర్షికను తెలుగులో రాసి వెతకాలి.వికీపీడియాలో ఉంటే ఆ పేజీ ఉందని చూపుతుంది. లేకపోతే ఎర్ర అక్షరాలతో శీర్షికను మన ముందుఉంచి పేజీ సృష్టించండని తెలుపుతుంది.అయితే ఇంకో విషయం. కొద్దిపాటి అక్షరబేదాలతో ఒక్కోసారి పేజీలు ఉండటానికి అవకాశం ఉంది.అలాకూడా పరిశీలించి, లేదని నిర్థారించుకున్న తరువాత మాత్రమే పై విధంగా చేయాలి.ప్రయత్నం చేయండి. మళ్లీ కలుద్దాం. ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 16:46, 17 అక్టోబరు 2022 (UTC)
ఎర్రలింకుల సంస్కరణ
రామారావు గారూ, గ్రామ వ్యాసాల పేజీలను తాజాకరించే పనిలో భాగంగా మీరు చేస్తున్న దీక్షలో భాగంగా అనేక వేల పేజీల్లో మార్పులు చేస్తూ పనిలో పనిగా ఎర్రలింకులను సంస్కరిస్తూ ఉండడం గమనించాను. ధన్యవాదాలు. ప్రత్యేక:అవసరమైనపేజీలు పేజీలో ఉన్న ఎర్రలింకు ప్రధానబరి వ్యాసాల్లో కొన్ని గ్రామాల పేజీలున్నట్లు నేను గమనించాను. ఉదా: పెదపాడు (దీనికి 38 ఎర్రలింకులున్నాయి). బహుశా నిర్జన గ్రామమై ఉండవచ్చు, లింకు పేరు తప్పు పడి ఉండవచ్చు,.. నేను ఆ జాబితాను పరిశీలించి అవసరమైన చర్య తీసుకుంటాను. ఒక జాబితాను కూడా చేస్తాను. మీరు కూడా వాటిని పరిశీలించవలసినది (ఆ ఎర్రలింకు పక్కనే దానికి ఉన్న లింకులను చూపిస్తుంది, ఆ పేజీలకు వెళ్ళి క్ష్చూస్తే తెలిసిపోతుంది, ఆ ఎర్రలింకులో ఉన్న దోషమేమిటో).__ చదువరి (చర్చ • రచనలు) 11:09, 1 నవంబరు 2022 (UTC)
- చదువరి గారూ పెదపాడు దీనికి ఉన్న ఎర్రలింకులు ప్రధాన పేరుబరిలో ఉన్న దాని సరియైన పేజీలకు కలిపాను.అది నిర్జన గ్రామం కాదు.పెదపాడు పేరుతో మరికొన్ని వ్యాసాలు ఉన్నవి.ఇందులో ఎక్కువుగా పెదపాడు కు ఎక్కువ లింకులు, పెదపాడు, పెద్దపాడు (కల్లూరు) కు రెండు లింకులు వాటి గమ్యపేజీలకు కలిపాను. కేవలం పెదపాడు అని మాత్రమే ఎర్రలింకులు ఉండటాన ప్రతి పేజీ పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది.ఒకసారి పరిశీలించి ఇంకా సరిచేయాలంటే తెలుపగలరు. యర్రా రామారావు (చర్చ) 03:23, 2 నవంబరు 2022 (UTC)
- ధన్యవాదాలు సార్. మీ వీలును బట్టి ఈ పేజీలు కూడా పరిశీలించండి.
- గుడిమెట్టపాలెం (25 లింకులు)
- చిన కొమెర (25 లింకులు)
- చెర్లొయడవల్లి (25 లింకులు)
- కురుగంటివారి ఖంద్రిక (24 లింకులు)
- రామారం (కొత్తగూడెం) (24 లింకులు)
- అమీన్‌పేట్ h/o అమీనాబాద్ (23 లింకులు)
- గూడూరు మొరవాయిపల్లె (23 లింకులు)
- చిన నందిపాడు (23 లింకులు)
- పోతుకట్ల (23 లింకులు)
- మెదిపాలెం (23 లింకులు)
- మొగలిపాలెం (23 లింకులు)
- వెంగంపల్లె (23 లింకులు) చదువరి (చర్చ • రచనలు) 07:12, 2 నవంబరు 2022 (UTC)
- చదువరి గారూ గూడూరు మొరవాయిపల్లె (23 లింకులు) తప్ప అన్ని పేజీల ఎర్ర లింకులు పరిష్కరించాను.ఆ పేజీలలో ఎక్కడా గానీ, మూసలో కానీ లేవు.అది నిర్జన గ్రామం.పేజీలేదు.మీరు పరిశీలించవలసినది.ఇంకా ఏమైనా ఉంటే తెలుపవలసింది. యర్రా రామారావు (చర్చ) 03:48, 3 నవంబరు 2022 (UTC)
- సూపర్ సార్. ఇవి కూడా చూడండి:
- బూర్జ (23 లింకులు)
- తొండుగుంట (32 లింకులు)
- పరిగి (32 లింకులు)
- ముదిగుబ్బ (31 లింకులు)
- సంగ్వి (గాదిగూడ) (31 లింకులు)
- పల్లమల (28 లింకులు)
- లచ్చన్నపాలెం (28 లింకులు)
- కొష్టాలు (సీతారాంపురం) (27 లింకులు)
- కోడూరు (గరివిడి మండలం) (35 లింకులు)
- కొండపాలెం (గరివిడి మండలం) (35 లింకులు)
- బోయపాలెం (58 లింకులు) చదువరి (చర్చ • రచనలు) 04:33, 3 నవంబరు 2022 (UTC)
- పూర్తైనవి. యర్రా రామారావు (చర్చ) 14:44, 3 నవంబరు 2022 (UTC)
- చదువరి గారూ గూడూరు మొరవాయిపల్లె (23 లింకులు) తప్ప అన్ని పేజీల ఎర్ర లింకులు పరిష్కరించాను.ఆ పేజీలలో ఎక్కడా గానీ, మూసలో కానీ లేవు.అది నిర్జన గ్రామం.పేజీలేదు.మీరు పరిశీలించవలసినది.ఇంకా ఏమైనా ఉంటే తెలుపవలసింది. యర్రా రామారావు (చర్చ) 03:48, 3 నవంబరు 2022 (UTC)
WPWPTE ముగింపు వేడుక
నమస్కారం !
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ప్రాజెక్టులో మీ కృషికి ధన్యవాదాలు.
నవంబరు 12 (రెండవ శనివారం) నాడు హైద్రాబాద్ రవీంద్ర భారతిలో WPWPTE ముగింపు వేడుక నిర్వహిస్తున్నాము. ఆరోజు పోటీలో గెలుపొందిన వారిని సత్కరించుకుందాం, అలాగే ఇటీవల మన సముదాయం కోల్పోయిన వికీపీడియను ఎల్లంకి భాస్కర్ నాయుడు గారిని స్మరించుకుందాం. కావున మీరు తప్పక హాజరవ్వగలరని నా మనవి.
వేడుకకి హాజరయ్యే వారు వేడుక పేజీలో పాల్గొనేవారు అనే శీర్షిక కింద మీ సంతకం చేయగలరు.
పోటీలో పాల్గొన్న వారందరికీ సావనీర్లు అందించాలని తలుస్తున్నాము, వీటికోసం ఈ [1] ఫారంలో మీ వివరాలు చేర్చగలరు.
ధన్యవాదాలు.
NskJnv 05:43, 5 నవంబరు 2022 (UTC)
బెజ్జంకి జగన్నాథాచార్యులు అడుగుతున్న ప్రశ్న
నా సవరణలను దృవీకరించండి. నా ప్రచురణల ఫోటోలు జోడించండి.పోటోలు ఎలాపంపాలి మీకు. --బెజ్జంకి జగన్నాథాచార్యులు (చర్చ) 11:13, 11 నవంబరు 2022 (UTC)
బెజ్జంకి జగన్నాథాచార్యులు అడుగుతున్న ప్రశ్న
ఆర్యా!నమస్కారం! నా రచనల పి.డి.యఫ్ లు పోటోలు ప్రచురించటం ఎలా?దయచేసి తెలుప గలరు.....నమస్సులతో .. బెజ్జంకి --బెజ్జంకి జగన్నాథాచార్యులు (చర్చ) 11:25, 11 నవంబరు 2022 (UTC)
జనగణన డేటా ఎక్కించని ఆంధ్ర గ్రామాల పేజీలు
జనగణన డేటా ఎక్కించని ఆంధ్ర గ్రామాల పేజీల కోసం ఈ క్వెరీ చూడండి. __చదువరి (చర్చ • రచనలు) 15:52, 12 నవంబరు 2022 (UTC)
WikiConference India 2023: Program submissions and Scholarships form are now open
Dear Wikimedian,
We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.
We also have exciting updates about the Program and Scholarships.
The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.
For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.
‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.
Regards
MediaWiki message delivery (చర్చ) 11:25, 16 నవంబరు 2022 (UTC)
(on behalf of the WCI Organizing Committee)
Aakbarali1982 అడుగుతున్న ప్రశ్న (13:30, 18 నవంబరు 2022)
నమస్కారం కొత్త వ్యాసం వ్రాయాలంటే ఏ మీట నొక్కాలి ఏమిటో అర్థం కావటం లేదు ,కొత్త వ్యాసం ఏదైనా వ్రాయాలంటే ఎలా మొదలు పెట్టాలో అస్సలు అర్థం కావటం లేదు..కాస్త చెప్పుదురు --Aakbarali1982 (చర్చ) 13:30, 18 నవంబరు 2022 (UTC)
- అక్బరాలి గారూ నమస్కారం.ముందుగా తెలుగు వికీపీడియాలో చేరి, పేజీలు సృష్టింపు, సవరణలు చేస్తున్నందుకు ధన్యవాదాలు.నన్ను పైన కొత్త వ్యాసం రాయాలంటే ఏ మీట నొక్కాలనే ప్రశ్న ఈ రోజు అడిగారు.చాలా సంతోషం.అయితే ఈ ప్రశ్న అడగటానికి ముందే, అంటే నవంబరు 16న నూర్ బాషా రహంతుల్లా (విశ్రాంత ప్రత్యేక కలెక్టర్), నూర్ బాషా/దూదేకుల, పింజరి ,లద్దాఫ్ అనే పేజీలు సృష్టించారు. ఈ ప్రశ్న అడిగిన తరువాత ఇంకా అంటే ఈ రోజు మరో రెండు పేజీలు సృష్టించారు.అందువలన పేజీ సృష్టింపుపై మీకు అవగాహన ఏర్పడిందని నేను భావిస్తున్నాను.అయితే ఇక్కడ మీకు చెప్పాలిసింది ఒకటి ఉంది.ఏదైనా ఒక కొత్త పేజీ సృష్టించే ముందు, అది అంతకు ముందు వికీపీడియాలో ఉందేమో సెర్చ్ బాక్స్ లో పరిశీలించాలి. ఒక్కోసారి ఒక్కో శీర్షిక కొద్దిపాటి తేడాలతో ఉండటానికి ఆస్కారం ఉంది.అందువలన నిశితంగా పరిశీలించి లేదని నిర్థారించుకున్న తరువాతనే పేజీ సృష్టించాలి.అలాంటి పేజీలు తొలగించటానికి లేదా అంతకు ముందు ఉన్న వ్యాసంలో విలీనం చేయబడుతుంది.దానికి ఉదాహరణ మీరు సృష్టించిన వ్యాసం నూర్ బాషా/దూదేకుల, పింజరి ,లద్దాఫ్ వ్యాసం.దానిలో విలీనం మూస తగిలించబడింది.గమనించే ఉంటారు.దయచేసి అలాంటి నిర్వహణ మూసలు మీరు తొలగించవద్దు. మీదగ్గరి అదనపు సమాచారం ఉంటే తగిన ఆధారాలతో అంతకు ముందు ఉన్న పేజీలలో మీరు చేర్చవచ్చు.ఇంకో విషయం మీరు సృష్టించే పేజీలకు ఎటువంటి మూలాలు ఉదహరించుటలేదు.మూలాలు లేని వ్యాసాలు తొలగింపు గురౌతాయి.వికీపీడియా లో రాసే వ్యాసాలు వికీపీడియా:శైలి/భాషకు, వికీపీడియా:శైలికి లోబడి రాయాలి.మీరు రాసిన చెల్లని రూక అనే వ్యాసం చాలా గందరగోళంగా ఉంది.ఇప్పటివరకు మీరు సృష్టించిన ఏ ఒక్క వ్యాసానికి మూలాలు లేవు. వికీపీడియా:శైలి/భాషకు, వికీపీడియా:శైలి, వికీపీడియా:మూలాలు, వికీపీడియా:నమ్మదగ్గ మూలాలు ఒకసారి చదవండి.మీరు మరికొంతమందికి చెపుతారు.భయపడకండా మీ సేవలు కొనసాగించగలరు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 15:34, 18 నవంబరు 2022 (UTC)
WikiConference India 2023: Help us organize!
Dear Wikimedian,
You may already know that the third iteration of WikiConference India is happening in March 2023. We have recently opened scholarship applications and session submissions for the program. As it is a huge conference, we will definitely need help with organizing. As you have been significantly involved in contributing to Wikimedia projects related to Indic languages, we wanted to reach out to you and see if you are interested in helping us. We have different teams that might interest you, such as communications, scholarships, programs, event management etc.
If you are interested, please fill in this form. Let us know if you have any questions on the event talk page. Thank you MediaWiki message delivery (చర్చ) 15:21, 18 నవంబరు 2022 (UTC)
(on behalf of the WCI Organizing Committee)
WikiConference India 2023: Open Community Call and Extension of program and scholarship submissions deadline
Dear Wikimedian,
Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.
COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.
Please add the following to your respective calendars and we look forward to seeing you on the call
- WCI 2023 Open Community Call
- Date: 3rd December 2022
- Time: 1800-1900 (IST)
- Google Link': https://meet.google.com/cwa-bgwi-ryx
Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 16:21, 2 డిసెంబరు 2022 (UTC)
On Behalf of, WCI 2023 Core organizing team.
WikiConference India 2023:WCI2023 Open Community call on 18 December 2022
Dear Wikimedian,
As you may know, we are hosting regular calls with the communities for WikiConference India 2023. This message is for the second Open Community Call which is scheduled on the 18th of December, 2022 (Today) from 7:00 to 8:00 pm to answer any questions, concerns, or clarifications, take inputs from the communities, and give a few updates related to the conference from our end. Please add the following to your respective calendars and we look forward to seeing you on the call.
- [WCI 2023] Open Community Call
- Date: 18 December 2022
- Time: 1900-2000 [7 pm to 8 pm] (IST)
- Google Link: https://meet.google.com/wpm-ofpx-vei
Furthermore, we are pleased to share the telegram group created for the community members who are interested to be a part of WikiConference India 2023 and share any thoughts, inputs, suggestions, or questions. Link to join the telegram group: https://t.me/+X9RLByiOxpAyNDZl. Alternatively, you can also leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 08:11, 18 డిసెంబరు 2022 (UTC)
On Behalf of, WCI 2023 Organizing team
నామని సుజనాదేవి పేజి సృష్టింపు
నమస్కారం సార్ నామని సుజనాదేవి పేజిని తొలగించారు. తిరిగి పునరుద్దరిస్తే సరైన వివరణలతో అవసరమైన మూలాలతో నిర్మిస్తాను మీరైన పునరుద్దరిస్తే ఆ పేజిని నిర్మించగలను.--~~ramesh bethi~~ (చర్చ) 15:15, 4 జనవరి 2023 (UTC)
- సృష్టించాను. యర్రా రామారావు (చర్చ) 16:21, 4 జనవరి 2023 (UTC)
వికీపీడియా:ఫైల్ ఎక్కింపు విజర్డు గురించి MEN IN GOLD BHANU అడుగుతున్న ప్రశ్న (09:12, 21 ఫిబ్రవరి 2023)
హాల్లో గురువు గారు బాగున్నారా --MEN IN GOLD BHANU (చర్చ) 09:12, 21 ఫిబ్రవరి 2023 (UTC)
- @MEN IN GOLD BHANU గారూ నమస్కారం.తెవికీ లో ప్రవేశించినందుకు ధన్యవాదాలు.వికీపీడియా:ఫైల్ ఎక్కింపు విజర్డు గురించి మీకు కలిగిన సమస్య, లేదా సందేహం పూర్తిగా వివరించగలరు. యర్రా రామారావు (చర్చ) 11:40, 21 ఫిబ్రవరి 2023 (UTC)
బెజ్జంకి జగన్నాథాచార్యులు అడుగుతున్న ప్రశ్న (14:44, 7 జూన్ 2023)
ఫోటోలు జోడించటం ఎలా.కొత్త వ్యాసాలురాయటం మార్గదర్శకాలు చూపండి. --బెజ్జంకి జగన్నాథాచార్యులు (చర్చ) 14:44, 7 జూన్ 2023 (UTC)
- స్యయంగా ఫోన్ ద్వారా మాట్లాడి వివరించటమైనది యర్రా రామారావు (చర్చ) 04:55, 29 జూన్ 2023 (UTC)
గవర వ్యాసం సవరణ
సహాయం అందించబడింది
ramarao garu you wrote an article on gavara community which is wrong.kindly refer castes and tribes of southern india by edward thurston.the caste occupation of gavaras is trading money lending and in rural areas poor gavara farmers used to prepare jaggery prepared by rich gavaras.rich gavaras used to sell the jaggery to few merchants and used to do this trade.meeru okasari correction cheyandi aa book lo vunnnadhi chadivi —Naidu999 (చర్చ) 20:59, 13 జూన్ 2023 (UTC)
- నాయుడు గారూ నమస్కారం.మీరు పైన ఈ వ్యాసం నేను రాసినట్లుగాను, అదిపూర్తిగా తప్పు అని తెలిపారు.ఆ వ్యాసంలో నేను ఏ మాత్రం విషయసంగ్రహం రాయలేదు.మూలాలు లేవు అనే నిర్వహణ మూస మాత్రమే కూర్పు చేసాను.మీరు అందులోని సమాచారం పూర్తిగా తప్పు సవరించండి అని నన్ను కోరారు.ఆ వ్యాసంలో తప్పు సమాచారం ఏమి ఉందో, దానిని ఏలాగ సవరించాలో, ఇంకా అదనంగా ఏమికూర్పు చేయాలో తగిన ఆధారాలతో ఆ వ్యాసం చర్చాపేజీలు పాయింట్లు వారిగా రాయండి. దానిమీద చర్చించి ఆసమాచారం ఆ వ్యాసంచేర్చి వ్యాసం మీరు అనుకున్న విధంగా సవరిద్దాం.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 04:49, 29 జూన్ 2023 (UTC)
Gavara caste
sir what you wrote on gavara caste history is fully wrong kindly correct it and refer few books and edit it like castes and tribes of southern india,andhrula sanghika charitra Naidu999 (చర్చ) 21:06, 28 జూన్ 2023 (UTC)
- నాయుడు గారూ నమస్కారం.వికీపీడియాలో ఏ వ్యాసం ఎవరురాసినా తగిన ఆధారాలు ఉండాలి.ఆధారాలు లేని సమాచారం తొలగింపుకు గురౌంతుంటుది.వికీపీడియాలోని వ్యాసాలలో ఎంతో మంది ఎన్నో సవరణలు చేస్తుంటారు. మీరు పైన ఈ వ్యాసం నేను రాసినట్లుగాను, అదిపూర్తిగా తప్పు అని తెలిపారు.ఆ వ్యాసంలో నేను ఏ మాత్రం విషయసంగ్రహం రాయలేదు.మూలాలు లేవు అనే నిర్వహణ మూస మాత్రమే కూర్పు చేసాను.ఆ వ్యాసం 2009 జనవరి 2017న వాడుకరి:Nrahamthulla గారు సృష్టించి కొంత సమాచారం చేర్చారు.ఆ తరువాత దానిలో వివిధ సవరణలు దాదాపు 10 మందికి పైగా వాడుకరులు సవరణలు చేసారు.మీరు అందులోని సమాచారం పూర్తిగా తప్పు సవరించండి అని నన్ను కోరారు.దానిమీద నాకు అంత అవగాహనలేదు, నేను వికీలోని వేరే ప్రాజెక్టులో పనిచేస్తునందున దీనిమీద నేను ప్రస్తుతం దృష్టి సారించలేను.ఆ వ్యాసంలో తప్పు సమాచారం ఏమి ఉందో, దానిని ఏలాగ సవరించాలో, ఇంకా అదనంగా ఏమికూర్పు చేయాలో తగిన ఆధారాలతో ఆ వ్యాసం చర్చాపేజీలు పాయింట్లు వారిగా రాయండి. దానిమీద చర్చించి ఆసమాచారం ఆ వ్యాసంచేర్చి వ్యాసం మీరు అనుకున్న విధంగా సవరిద్దాం.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 04:46, 29 జూన్ 2023 (UTC)
తొలగింపుల గూర్చి
యర్రా రామారావుగారూ, మీరు వ్యాసాన్ని తొలగించే ముందు ఆ వ్యాస పేజీలో "what links here" విభాగం చూడండి. ఈ వ్యాసం లింకు ఏ పేజీలో లేకపోతే సరి. ఒక వేళ లింకులున్నచో వాటిని కూడా సరైన పద్ధతిలో మార్చవలసి ఉంటుంది. మీరు భారతదేశ జిల్లాల జాబితా/బీహార్ ను తొలగించారు. అది భారతదేశ_జిల్లాల_జాబితా పేజీలో లింకుగా ఉన్నది. పరిశీలించండి. మీరు తొలగించిన వ్యాసం భారతదేశ జిల్లాల జాబితా, బీహార్ వ్యాసాలలో ఎర్ర లింకుగా కనిపిస్తుంది. మీరు ఆ పేజీలో సమాచారాన్ని కూడా సరిదిద్దగలరు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 16:27, 7 జూలై 2023 (UTC)
- మీరు మార్పు చేసిన పేజీ శీర్షికలను లింకు ఉన్న భారతదేశ జిల్లాల జాబితా, బీహార్ వ్యాసాలలో చేర్చగలరు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 16:31, 7 జూలై 2023 (UTC)
- @వెంకటరమణ గారూ వికీపీడియా:వికీప్రాజెక్టు/భారతదేశ జిల్లాల పేజీల పునర్వ్యవస్థీకరణ భాగంగా , ఆంగ్ల వ్యాసాల తాజా సమాచారానికి అనుగుణంగా నేను ఈ పనులు అన్నీ చేయుట జరుగుతుంది.మీరు చేసిన సూచనపై నాకు అవగాహన ఉంది. ఆ లింకులు అన్నీ నేను AWB ద్వారా, మానవీయంగా అన్ని నేను సరిచేస్తాను.ప్రధాన పేరుబరిలో స్లాష్ లేకుండా ఆంగ్ల వ్యాసాలకు అనుగుణంగా తరలించి,ఆ వ్యాసాలకు వికీడేటా లింకులు కలుపుతూ ఒక పద్దతిలో మార్పులు చేస్తున్నాను.తాత్కాలికంగా లోపాల కనపడవచ్చు.అవి ఇన్ని నేను సరిచేయగలవాడను.మీ సూచనలకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 16:45, 7 జూలై 2023 (UTC)
- మీరు మార్పు చేసిన పేజీ శీర్షికలను లింకు ఉన్న భారతదేశ జిల్లాల జాబితా, బీహార్ వ్యాసాలలో చేర్చగలరు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 16:31, 7 జూలై 2023 (UTC)
కావూరి వెంకయ్య గురించి బెజ్జంకి జగన్నాథాచార్యులు అడుగుతున్న ప్రశ్న (16:47, 10 జూలై 2023)
మార్పులు ప్రచురింప బడటము లేదు --బెజ్జంకి జగన్నాథాచార్యులు (చర్చ) 16:47, 10 జూలై 2023 (UTC)
- పోనులో వివరించటమైంది యర్రా రామారావు (చర్చ) 09:44, 16 ఆగస్టు 2023 (UTC)
యాంత్రిక అనువాదాలను చేయడం ఎలా
రామారావు గారు వికీపీడియాలో యాంత్రిక అనువాద వ్యాసాలను తయారు చేయడం ఎలా. ఉదయ్ కిరణ్ (చర్చ) 06:50, 26 ఆగస్టు 2023 (UTC)
- ఉదయ్ కిరణ్ గారూ యాంత్రిక అనువాద వ్యాసాలను తయారు చేయడం ఎలా అనే విషయం
- తెలుసుకోవాలనే అభిలాష మీకు కలిగినందుకు ధన్యవాదాలు. మీకు ఎలా వివరించినా అర్థం కాకపోవచ్చు.దానికికన్నా సులభమైన మార్గం వికీపీడియా:విషయ అనువాద ఉపకరణం, వికీపీడియా:అనువాద పరికరం - వాడే పద్ధతి , వికీపీడియా:అనువాద పరికరం - తరచూ వచ్చే సందేహాలు అనే ఈ లింకులు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోగలరు.దాదాపుగా మీకు దీనిని గురించి మీకు పూర్తిగా తెలుస్తుంది.అలాగే వికీపీడియాలో ఎలా సవరణలు చేయాలో, మార్గదర్శకాలు, నియమాలు, ఇంకా చాలా విషయాలు మీ చర్చాపేజీ వాడుకరి చర్చ:ఉదయ్ కిరణ్ లింకులో తెలిపిన అన్ని లింకులు కూడా క్షణ్ణంగా చదివితే మీకు దాదాపుగా అన్నీ సందేహాలుకు సమాధానాలు లభిస్తాయి.అవి చదివి అర్థం చేసుకోగలరు. యర్రా రామారావు (చర్చ) 07:38, 29 ఆగస్టు 2023 (UTC)
- ధన్యవాదాలు రామారావు గారు మీ సూచనలు తప్పక పాటిస్తాను. ఉదయ్ కిరణ్ (చర్చ) 07:40, 29 ఆగస్టు 2023 (UTC)
నందమూరి తారక రామారావు వ్యాస సంరక్షణ
రామారావు గారు నందమూరి తారకరామారావు గారి వ్యాసాన్ని సంరక్షించాలని కోరుతున్నాను. ఉదయ్ కిరణ్ (చర్చ) 06:39, 29 ఆగస్టు 2023 (UTC)
ఎందుకంటే నందమూరి తారక రామారావు ఎంతో పేరు పొందిన ప్రముఖుడు ఆయన వ్యాసాన్ని సంరక్షించండి. ఉదయ్ కిరణ్ (చర్చ) 06:40, 29 ఆగస్టు 2023 (UTC)
- మీరు ఆ వ్యాసాన్ని ఎందుకు సంరక్షణలో పెట్టమంటున్నారో పూర్తి వివరాలు తెలపండి.ఆ వ్యాసమే కాదు తెలుగు వికీపీడియాలోని ఏ వ్యాసంలో నైనా దుశ్చర్యలు జరిగితే ఆ దుశ్చర్యలకు కారణం అయిన వాడుకరిని నిరోధిస్తూ, అవసరమనుకుంటే ఆ వ్యాసంను నిర్వాహకులు సంరక్షణలో ఉంచుతారు.మీరు కోరటం తప్పుకాదు కానీ ప్రస్తుతానికి ఆ వ్యాసంలో ఎలాంటి దుశ్చర్యలు జరగనందున సంరక్షణలో ఉంచనవసరంలేదు.గమనించగలరు. ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 07:48, 29 ఆగస్టు 2023 (UTC)
రామారావు గారు చాలా వ్యాసాలలో దిద్దుబాటు చేయవచ్చు. ఇంగ్లీష్ వికీపీడియాలో సైతం కొన్ని వ్యాసాలను సంరక్షిస్తారు. వికీపీడియాలో కొన్ని వ్యాసాలకైనా భద్రత ఉండాలి. ఒకవేళ ఈ వ్యాసంలోని సమాచారాన్ని అజ్ఞాత వాడుకరులు తొలగిస్తే కొద్దిసేపటి వరకు వ్యాసం ఖాళీగానే ఉంటుంది. అందుకే ఈ వ్యాసాన్ని సంరక్షించాలని కోరుతున్నాను. ఉదయ్ కిరణ్ (చర్చ) 08:30, 29 ఆగస్టు 2023 (UTC)
- మీ సూచనలకు , మీ ఆందోళనలకు ధన్యవాదాలు.అవసరమైతే తప్పనిసరిగా సంరక్షణలో పెడతారు.ఇదే స్పూర్తి వికీ నియమాల ప్రకారం మీ సవరణలలో కూడా పాటించగలరు. యర్రా రామారావు (చర్చ) 15:23, 20 సెప్టెంబరు 2023 (UTC)
సింహళ పేజీలు
సార్, ఆ సింహళ భాషలో సృష్టిస్తున్న వ్యక్తిని నిర్వధికంగా నిరోధించవచ్చు. వారికి తెలుగూ రాదు, సింహళమూ రాదు. ఇలాగే అనేక వికీల్లో పేజీలు సృష్టించి పారేస్తున్నారు.__ చదువరి (చర్చ • రచనలు) 14:35, 20 సెప్టెంబరు 2023 (UTC)
- సూచన ఇచ్చినందుకు ధన్యవాదాలు.శ్వాశ్వత నిరోధం విధించాను. యర్రా రామారావు (చర్చ) 15:25, 20 సెప్టెంబరు 2023 (UTC)
వెలమ కుల సమాచారం అనామక వినియోగదారు ద్వారా తీసివేయబడింది
SIR...@యర్రా రామారావునేను వెలమ కులానికి సంబంధించిన సమాచారాన్ని జోడించాను మరియు అది అనామక వినియోగదారుచే తీసివేయబడింది.. సమాచారాన్ని పునరుద్ధరించండి మరియు నా సూచనలను తనిఖీ చేయండి.. Naidu999 (చర్చ) 21:23, 30 సెప్టెంబరు 2023 (UTC)
- సరే, అలాగే యర్రా రామారావు (చర్చ) 15:49, 1 అక్టోబరు 2023 (UTC)
వికీపీడియాలో ఫోటోలు వీడియోలు చేర్చడం ఎలా
@యర్రా రామారావు గారు వికీపీడియాలో ఫోటోలు వీడియోలు ఎక్కించడం ఎలా ఉదయ్ కిరణ్ (చర్చ) 11:06, 13 అక్టోబరు 2023 (UTC)
నా వాడుకరి పేజీని సంరక్షించండి
@యర్రా రామారావు గారు గత మూడు రోజులుగా నా వాడుకరి అజ్ఞాత వాడుకరి పనిగట్టుకొని దుశ్చర్యలకు పాల్పడుతున్నాడు. నా వాడు కరి పేజీని అజ్ఞాత వాడుకరులు దిద్దుబాటు చేయకుండా సంరక్షించలని నేను కోరుతున్నాను. ఉదయ్ కిరణ్ (చర్చ) 04:26, 27 అక్టోబరు 2023 (UTC)
- ఉదయ్ కిరణ్ గారి కోరిక మేరకు సంరక్షణలో ఉంచాను యర్రా రామారావు (చర్చ) 05:04, 27 అక్టోబరు 2023 (UTC)
ధన్యవాదాలు ఉదయ్ కిరణ్ (చర్చ) 05:10, 27 అక్టోబరు 2023 (UTC)
Block for 2409:4070:6E84:B784:0:0:4F4A:B402
Hello,
as you're an administrator here, why aren't you blocking vandal: 2409:4070:6E84:B784:0:0:4F4A:B402 (talk • contribs • deleted contribs • nuke contribs • logs • filter log • block user • block log) Tanbiruzzaman (చర్చ) 08:46, 29 అక్టోబరు 2023 (UTC)
- @Tanbiruzzaman The anonymous user id you mentioned above just has been permanently banned by user:Pranayraj1985.Thank you for your Value suggestion. యర్రా రామారావు (చర్చ) 09:41, 29 అక్టోబరు 2023 (UTC)
దుశ్చర్యలపై నిరోధం
దుశ్చర్యల నిరోధక బార్న్‌స్టార్ | ||
అజ్ఞాతలు చేస్తున్న దుశ్చర్యలపై నిఘా పెట్టి తక్షణ చర్యలు తీసుకుంటున్నందుకు గాను, ధన్యవాదాలతో - చదువరి (చర్చ • రచనలు) 08:18, 19 నవంబరు 2023 (UTC) |
- @చదువరి గారూ అజ్ఞాతలు చేస్తున్న దుశ్చర్యలపై నేను చేస్తున అతికొద్ది కృషిని గుర్తించినందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 08:27, 19 నవంబరు 2023 (UTC)
క్రికెట్ 2023 ప్రాజెక్టులో మీ కృషికి అభినందనలు
క్రికెట్ బార్న్‌స్టార్ | ||
క్రికెట్ 2023 ప్రాజెక్టులో కృషి చేసి ప్రాజెక్టు విజయంలో పాలుపంచుకున్నందుకు అభినందనలతో__చదువరి (చర్చ • రచనలు) 14:10, 21 నవంబరు 2023 (UTC) |
- చదువరి గారూ ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 04:04, 22 నవంబరు 2023 (UTC)
తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:19, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)
- @ప్రణయ్ రాజ్ గారూ ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 14:44, 11 డిసెంబరు 2023 (UTC)
- ధన్యవాదాలు @యర్రా రామారావు గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:11, 14 డిసెంబరు 2023 (UTC)
నూతన సంవత్సర శుభాకాంక్షలు
@యర్రా రామారావు గారు మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉదయ్ కిరణ్ (చర్చ) 04:23, 1 జనవరి 2024 (UTC)
సహాయం అందించబడింది
—Bollojubaba (చర్చ) 04:37, 31 జనవరి 2024 (UTC)
నేను రాసిన వ్యాసభాగాన్ని దయచేసి తొలగించవలసినదిగా కోరుచున్నాను.
- @బొల్లోజుబాబా గారూ ఈ వ్యాసంలో అజ్ఞాత వాడుకరి చేర్చిన సమాచారం ఈ లింకులో తొలగించబడింది.గమనించగలరు. యర్రా రామారావు (చర్చ) 16:32, 5 మార్చి 2024 (UTC)
నేను బౌద్ధమతంపై ఒక వ్యాసం రాసి దానిని మూడు పార్టులుగా 3, 5, 6 ఫిబ్రవరి 2022 లలో నా ఫేస్ బుక్ వాల్ పై పంచుకొన్నాను. అదే వ్యాసాన్ని "బుద్ధిజం కొన్ని ఆలోచనలు" పేరుతో FEBRUARY 7, 2022 న నా బ్లాగులో ప్రచురించాను. ఈ వ్యాసాన్ని తెలుగు వికిపీడియా దొంగిలించి "బౌద్ధ మతం" అనే వ్యాసంలో "సమకాలీన బౌద్ధం" అనే హెడ్డింగుకింద దాన్ని యధాతధంగా వాడుకొంది. కనీసం నా పేరుకానీ, నా బ్లాగును ఒక సోర్స్ గా కానీ ఉటంకించలేదు. (See link in first comment) నేడు ఆ వ్యాసాలను నేను పుస్తకరూపంలో తీసుకొని వద్దామని అనుకొంటున్నాను. ఈ విషయం గమనించకపోయినట్లయితే, నేనేదో వికినుండి కాపీ చేసాను అని పాఠకులు అనుకొనే అభిప్రాయం కలగవచ్చు.
బొల్లోజు బాబా
నా వ్యాసం లింకు https://sahitheeyanam.blogspot.com/2022/02/blog-post_7.html?fbclid=IwAR0H5pX7sryuoWWk2toRR_yBNMkpANCd4YzNZQ3GwJXYhLVHoJRZxoMqG28
మీరు కాపీ చేసిన పార్టు
ఈ వ్యాసనిర్మాణంలో మీరు కూడా ఉన్నారు కనుక ఇలా అడుగుతున్నాను. దయచేసి తొలగించండి.
బొల్లోజు బాబా
నమస్కారం @ యర్రా రామారావు గారు,
స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.
2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.
వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.
ధన్యవాదాలు.
ఇట్లు
Tmamatha (చర్చ) 10:36, 5 ఫిబ్రవరి 2024 (UTC)
నిర్వాహక హోదాకు ప్రతిపాదన
నమస్కారం వాడుకరి :యర్రా రామారావు గారు,
తెవికీ పండగలో మిమ్మల్ని కలవటం చాలా ఆనందాన్ని కలుగజేసింది, ఇక మీరు సూచించిన విధంగా నేను నిర్వాహక హోదాకి స్వీయ ప్రతిపాదన పెట్టాలి అనుకుంటున్నాను, తగు మార్గదర్శకాలు సూచించగలరు. నేతి సాయి కిరణ్ (చర్చ) 16:08, 13 ఫిబ్రవరి 2024 (UTC)
- @సాయికిరణ్ గారూ సమాధానం ఇవ్వటానికి ఆలస్యమైనందుకు ముందుగా క్షమించగలరు.తెవికీలో చురుకుగా ఉన్న నిర్వాహకులు తక్కువ మంది ఉన్నమాట వాస్తవం.ఈ పరిస్థితులలో యువకులైన మీరు వికీ నిర్వాహకులుగా చేరటం ఎంతో అవసరం. మీరు స్వీయ ప్రతిపాదన చేసుకోవటానికి ఎటువంటి అభ్యంతరంలేదు. తెవికీ 2024 పండగలో కూడా ఈ విషయం చర్చకు వచ్చిన సంగతి మనందరకు తెలుసు.దాని పూర్తి నివేదిక వచ్చిన తరువాత దీనిమీద కొన్ని అసందిగ్దంగా ఉన్న మార్గదర్శకాలపై సముదాయంలో చర్చించి తగిన నిర్ణయాలు చేయవలసిన అవసరముంటుదని నేను భావిస్తున్నాను. అంతేగాదు గతంలో దీనిమీద వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 63#తెలుగు వికీపీడియాలో నిర్వాహకులు కొరత ఉన్నది అనే విభాగంలో చర్చ జరిగిన తరువాత అదే చర్చలో వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 63#నిర్వాహకత్వ నియమ నిబంధనలు అనే దానిలో నిర్వాహకత్వ బాధ్యతలను ఉపసంహరించడం కోసం విధానపేజీ కోసం ఒక ప్రతిపాదన పేజీ మాత్రమే తయారుచేయబడింది. అయితే నిర్వాహకత్వ బాధ్యతలను ఇవ్వడం కోసం విధానపేజీ ప్రతిపాదన పెండింగులో ఉంది. దీనిమీద తెవికీ పండగ నివేదిక వచ్చిన తరువాత చర్యలు తీసుకోబడతాయని నేను భావిస్తున్నాను. ఏది ఏమైనా మీరు ఇప్పుడైనా స్వీయప్రతిపాదన చేసుకోవటానికి ఎటువంటి అభ్యంతరం లేదనుకుంటున్నాను.ఇంకోటి మీరే కాదు,ఇంకా ఆసక్తి ఉండి, దానికి న్యాయం చేయకలుగుతామనే భావన ఉన్న వారెవరైనా నిరభ్యంతరంగా స్వీయప్రతిపాదన చేసుకోవచ్చని నా అభిప్రాయం.ఇంకో విషయం మీరు నా అభిప్రాయం కోరినట్లే మరికొంతమంది అభిప్రాయం కోరవచ్చు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 17:11, 5 మార్చి 2024 (UTC)
- @Nskjnv గారూ వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/నిర్వాహకత్వ హక్కులు పొందటానికి మార్గదర్శకాలు పేజీలో విస్తృత చర్చ జరిగిన తరువాత వచ్చిన నిర్ణయంతో నిర్వాహకత్వం పొందటానికి మార్గదర్శకాలు విధాన నిర్ణయ పేజీ తయారుచేయబడింది. మీకు ఆసక్తి ఉంటే నిర్వాహకత్వ బాధ్యతలు స్వీకరించటానికి స్వీయ ప్రతిపాదన చేసుకోగలరు. యర్రా రామారావు (చర్చ) 04:17, 26 జూన్ 2024 (UTC)
నమస్కారం యర్రా రామారావు గారు, మీ సూచనకి ధన్యవాదాలు. నేతి సాయి కిరణ్ (చర్చ) 06:37, 27 జూన్ 2024 (UTC)
తొలగించండి.
యర్రా రామారావు గారికి నమస్కారం
సర్ నేను రాథోడ్ శ్రావణ్ నా రైటర్ పేజిని వాడదలచుకోలేదు.దయచేసి తొలగించాలని మనవి. RATHOD SRAVAN (చర్చ) 09:50, 12 మార్చి 2024 (UTC)
శీర్షిక మార్పు
ప్రేమ్ సింగ్( దీక్ష గురు ) శీర్షిక మార్చినందుకు ధన్యవాదాలు సర్.
RATHOD SRAVAN (చర్చ) 07:42, 14 మార్చి 2024 (UTC)
దేశం పేరులు, లిప్యంతరీకరణలు
దేశం పేరులు, లిప్యంతరీకరణలు గురించి మాకు ఒక ప్రశ్న ఉంది. ప్రశ్న ఏమిటో పూర్తిగా గుర్తులేదు హహ, కానీ నా అంతర్జాల మిత్రుడులు తో మాట్లాడి మీతో మొత్తం చెపుతా. మీరు ఒక అధికారి అని అనుకుంటు, మీతో చెప్పుకుంటున్నాను. మొదటిగా ఆంగ్లంలో వ్రాయడం. చాల వ్యాసములలో ఇలాగ ఉంటుంది: కిటికీ (ఆంగ్లం: window) అనేది...
ఈటీవీలో తప్పు ఆంగ్లం లో పేరు పెట్టడం. మా అభిప్రాయం ఏమంటే తెలుగు చదవలేని వాళ్ళు, లేక తెలుగులో పేరు తెలియని వాళ్ళు మొదటిగా ఆ వ్యాస్యం ని నొక్కారు, లేదా ఆంగ్లం వికీని చదవాగేలరు. అందుకనే ఆంగ్లం లో పేరులు పెట్టడం అక్కరలేదు. పెట్టుతే అది పడమర భాషలకు సేవ. ఎవరైనా తెలుగు చావలేక పోతే వ్యాస్యంని అనువాదాయంత్రంలోకి పెట్టచ్చు, లేక ఆంగ్లం వికీ చదవగలరు. రెండవది ఆంగ్లం. ఒక తెలుగు వికీకి ఆంగ్లం చాలా ఉంది. ప్రతి బొమ్మ కింద అనువదించిన ఆంగ్లం ఉంటుంది, ప్రతి సమాచారంపెట్టె లో ఆంగ్లం పదాలు ఉంటాయి. చివరిగా దేశాలు పేరులు. నేను నా అంతర్జాల మిత్రుడులు కి భూమిశాస్త్రం, భాషాశాస్త్రం అంటే ఇష్టం. మేము తెలుగులో దేశం పేరులకి వెతుకుతున్నాము. ఈ వికీలో చాల దేశాలుకి ఇలాగ ఉంటుంది : సంకంట్రి రిపబ్లిక్ (ఆంగ్లం : somecountry republic ) అనేది యూరప్లో ఒక దేశం.
ఇక్కడ చాల తప్పులు ఉన్నాయి. మొదటిగా ఆంగ్లం , దేశంలో వాళ్ళు మాట్లాడకపోతే ఉండకోరాదు, రెండోది రిపబ్లిక్, అది గణతంత్రం తెలుగులో (ఇలాగె చాల పదాలు అనువదించకుండా ఆంగ్లం పదం తెలుగులో వ్రాస్తారు, ఉత్తర, కొత్త, ప్రజల) . చివరగా పేరు. సంకంట్రి నిజాంగా తెలుగులో ఏదోదేశం. కానీ వాళ్ళు లిప్యాంతరీకరణలు వ్రాస్తున్నారు. ఇలాగె ఫ్రాన్స్ కోసం పరాసుదేశం, టర్కీ కు తురుష్కము (అనుకుంట), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి సంయుక్త అరబ్బీ రాజ్యాలు. ఈ భాషాద్రోహాలు సరిచేయడానికి మీరు కొన్ని సమితలను ఏర్పాటయించుతారు అడుగుతున్న. ధన్యవాదాలు! Helloisgone (చర్చ) 03:18, 21 ఏప్రిల్ 2024 (UTC)
- దయచేసి ప్రత్యుత్తరం ఇవ్వండి (నా చండాలం తెలుగు వ్రాత కు క్షమించండి హహ ) Helloisgone (చర్చ) 23:56, 21 ఏప్రిల్ 2024 (UTC)
- @Helloisgone గారూ తెలుగు వికీపీడియాలో ప్రవేశించి, మీరు ఆసక్తితో సవరణలు చేపడుతున్నందుకు ధన్యవాదాలు. మీరు రాసిన పై విషయంలో తప్పులు ఉన్నా, విషయం అర్థం అయింది. మీరు చెప్పేదాానిలో వాస్తవాలు ఉన్నాయి. కొన్ని ఆంగ్ల పదాలు బాగా జనాబాహుళ్యంలోకి చొచ్చుకుపోయాయి.(అన్నీ కాదు, కొన్ని మాత్రమే) అలాంటి పదాలు కొన్ని ఉండవచ్చు. కానీ రకరకాల వాడుకరులు ఉంటారు. కొంతమంది అవసరంలేని ప్రతిదానికి పరదేశ భాషాపదాలు వాడుతున్నారు.అలా వాడాలిసిన అవసరంలేదు.అయితే కొన్ని విషయాలు సముదాయంలో చర్చించాలిసి ఉంటుంది. మీరు నా చర్చాపేజీలో ఈ విషయం రాసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి వాటిని మీరు రచ్చబండ సముదాయం చర్చాపేజీలో పెడితే అక్కడ అందరూ స్పందిస్తారు. ఈ విషయాలు మీకు తెలియవని కాదు.మీ వాడుకరి పేజీలో మీరు రాసిన నాలుగు వాక్యాలు చదివాను.భాషా శాస్త్రం, భౌగోళిక శాస్తం ఇష్టం అని తెలిపారు. 'మరియు' లు తెలుగు వికీపీడియా లో నిషిద్దం. అయినా కాంతమంది మరలా వాడుతున్నారు. దాని బదులు అవసరం అయినచోట కామా (,) వాడవచ్చు.లోగడ ఒకసారి వేలల్లో ఉన్నవాటిని AWB తో తొలగించాం. మరలా తొలగించగలం. మామూలుగా తొలగించటానికి మీరు అంత శ్రమతీసుకోనవసరం లేదు. మీ సేవలు, మీ సలహాలు తెలుగు వికీపీడియాలో కానసాగించాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుతున్నాను.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 04:37, 22 ఏప్రిల్ 2024 (UTC)
నా వాడుకరి పేజీలో నేను సృష్టించిన వ్యాసాలు సంబంధించిన లింకును చేర్చండి
@యర్రా రామారావు గారు ముందుగా మీకు నమస్కారం. నేను సృష్టించిన వ్యాసాలలో మార్పులు చేయాలనుకుంటున్నాను. మీరు నా వాడుకరి పేజీలో నేను సృష్టించిన వ్యాసాల జాబితా లింకును చేర్చగలరు. ఉదయ్ కిరణ్ (చర్చ) 13:03, 28 మే 2024 (UTC)
- @ఉదయ్ కిరణ్ గారూ మీరిు కోరిన ప్రకారం మీరు సృష్టింన వ్యాసాల జాబితా లింకు ఇచ్చాను.పరిశీలించగలరు. యర్రా రామారావు (చర్చ) 13:12, 28 మే 2024 (UTC)
మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.
చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:
- ఎస్. గోకుల ఇందిర (evaluated by Nskjnv; స్థితి = rejected)
- కవితా జైన్ (evaluated by Nskjnv; స్థితి = rejected)
ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 11:00, 9 జూన్ 2024 (UTC)
ఎన్నికల ప్రాజెక్టు 2024
ధన్యవాదాలు సర్,
తెలుగు వికీపీడియా ఎన్నికల ప్రాజెక్టు2024లో నా కృషిని గుర్తించి నాకు పతకం అందజేసిన ప్రముఖ వికీపీడియన్ గౌరవ శ్రీ యర్రా రామారావు గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు..మీ రాథోడ్ శ్రావణ్ RATHOD SRAVAN (చర్చ) 02:51, 20 జూన్ 2024 (UTC)
ఇండిక్ మీడియావికి డెవలపర్స్ యూజర్ గ్రూప్ - టెక్నికల్ సంప్రదింపులు 2024
నమస్తే,
ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నప్పుడు వివిధ సాంకేతిక సమస్యలపై సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిటీ టెక్నికల్ కన్సల్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి లక్ష్యం కమ్యూనిటీలలోని సవాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సాధారణ సమస్యలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం.
మొదటి దశ మీ సాధారణ సమస్యలు, ఆలోచనలు మొదలైనవాటిని ఎక్కడ నివేదించాలనే సర్వే. దయచేసి సర్వేను (మీకు నచ్చిన భాషలో) ఇక్కడ పూరించండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link
చివరి తేదీ 20 సెప్టెంబర్ 2024.
మీరు బహుళ సమస్యలు లేదా ఆలోచనలను నివేదించాలనుకుంటే, మీరు సర్వేను ఒకటి కంటే ఎక్కువసార్లు పూరించవచ్చు.
కార్యాచరణ గురించి మరింత చదవడానికి, దయచేసి సందర్శించండి: https://w.wiki/AV78
సర్వే తెలుగులో పైన పేజీలో ఉన్నాయ్.
ధన్యవాదాలు! MediaWiki message delivery (చర్చ) 13:29, 9 సెప్టెంబరు 2024 (UTC), ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ తరపున
Translation request
Hello, యర్రా రామారావు.
Can you translate and upload the articles en:Azerbaijani manat, en:Azerbaijani manat sign and en:Campi Flegrei in Telugu Wikipedia?
Yours sincerely, Oirattas (చర్చ) 17:10, 15 సెప్టెంబరు 2024 (UTC)
దేశవాళీ వరి వంగడాలు పేజీ గురించి
ముందుగా తెలుగు వికీపీడియాలో శుద్ధి దళ సభ్యులుగా మీ కృషి కి అభినందనలు . "దేశవాళీ వరి వంగడాలు" అన్న పేజీ ని ఫేస్బుక్ లో కొన్ని అంశాలు ఉన్న కారణంగా తొలగించారు. ఫేస్బుక్ లో అడపావెంకటరమణ గారు నాకు, నాబోటి రైతులకు తెలిసిన విషయాలే పేస్ బుక్ నందు ఉంచారు. నేను వికీ పీడియాలో ఉంచాను . మీరు పేజీ ని తొలగించకుండా నా వివరణ అడిగివుంటే బాగుండేది . "దేశవాళీ వరి వంగడాలు" పేజీ ని మరింత అభివృద్ధి కోసం చాలా రైతులతో ""దేశవాళీ వరి వంగడాలు" లింక్ ని పంచుకోవడం జరిగింది . కానీ మీరు పేజీ నే డిలీట్ చేసేసారు.(మర్చిపోయిన సంతకం:వాడుకరి:Malyadri 05 నవంబరు 2024)
- మల్యాద్రి గారూ నమస్కారం. మీ బాధ నాకర్థమైంది. మీరు నాకన్నా ముందుగా తెవికీలో చేరారు.అందులో మీ వాడుకరిపేజీలో శుద్దిదళ సభ్యులు అనే మూసను చూసాను.అందువలన మీకు నేను ఎక్కువ వివరించాలిసిన పనిలేదనుకుంటాను.తొలగించిన పేజీలో ఉన్న విషయ సంగ్రహం మొత్తం ఎట్టి మార్పులు లేకుండా పేసుబుక్ లో ఉన్నది ఉన్నట్లుగా ఈ లింకు నుండి కాపీ పేస్ట్ చేయబడినందున ఆ వ్యాసం పేజీ సత్వర తొలగింపుకు గురి అయింది.అంతేగానీ వేరే ఏ ఉద్ధేశ్యం లేదు. మీరు మరలా సృష్టించిన దేశవాళీ వరి వంగడాలు అనే పేజీ చూసాను. తగిన మూలాలతో అన్నదాతకు ఉపయోగపడే వ్యాసం తొలగింపుకు గురికాకుండా రాయగలరనే నమ్మకంతో ... మీకు నా ధన్యవాదాలు--యర్రా రామారావు (చర్చ) 07:20, 5 నవంబరు 2024 (UTC)
- ధన్యవాదాలు! mali (చర్చ) 16:23, 6 నవంబరు 2024 (UTC)
కృష్ణశాస్త్రి ప్రూఫ్ రీడథాన్
నమస్కారం!
వికీపీడియాలో మనందరం సమిష్టిగా చేస్తున్న కృషి అమోఘం. ఈ చురుకుదనాన్నిసోదర ప్రాజెక్టులలోకి సైతం తీసుకువెళ్లడానికి ఈ నవంబర్ 1న తెలుగు సాహిత్యంలో ఎంతో కృషి చేసిన భావకవి అయిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వికీసోర్సులో ప్రూఫ్ రీడథాన్ ను నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు పేజీ ని గమనించి పాల్గొనగలరు. -- అభిలాష్ మ్యాడం (చర్చ) 09:27, 7 నవంబరు 2024 (UTC)