చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చంద్రశేఖరేంద్ర సరస్వతి VIII
Paramacharya.JPG
A 1933 photograph of Chandrasekharendra Saraswati Swamigal
మాతృభాషలో పేరు శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు
జననం స్వామినాథన్
(1894-05-20) 1894 మే 20
విల్లుపురం
మరణం 1994 జనవరి 8 (1994-01-08)(వయసు 99)
Kanchi mutt
సమాధి కంచి మటం
జాతీయత భారతదేశమం
శీర్షిక జగద్గురు
ముందువారు శ్రీ శ్రీ మహాదేవేంద్ర సరస్వతి VI
తరువాతి వారు శ్రీ జయేంద్ర సరస్వతి

జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి (మే 20, 1894 – జనవరి 8, 1994) కంచి కామకోటి పీఠము యొక్క జగద్గురు పరంపరలో 68వ వారు. వారు పరమాచార్య, మహాస్వామి మున్నగు పేర్లతో కూడా పిలవబడతారు. ధర్మాచరణకు శ్రద్ధ ప్రాతిపదిక అంటారు స్వామి. స్వామి సంకల్పబలంతో ఇది ఫలానా సమయానికి పూర్తి కావాలంటే అయి తీరాల్సిందే. ఒక ధర్మం శక్తి ఆ ధర్మానికి చెందిన వ్యక్తులసంఖ్యపై గాక దాన్ని ఆచరించే వారి స్వభావంపై ఆధారపడి ఉంటుందంటారు స్వామి.

జీవిత విశేషాలు[మార్చు]

కంచి మహాస్వామిగా పేరుగాంచిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు మే, 20,1894 వ సంవత్సరములో దక్షిణ తమిళనాడులోని దక్షిణ ఆర్కాట్ జిల్లాలోని విల్లుపురం గ్రామమునందు ఒక స్మార్త హొయసల కర్నాటక బ్రాహ్మణ కుటుంబములో మే 20, 1894 నాడు అనూరాధ నక్షత్రములో (చాంద్రమాసానుసారము) జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి మహాలక్ష్మీ, శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గార్లు. వారికి చిన్నతనములో పెట్టబడిన పేరు స్వామినాథన్. జిల్లా విద్యాధికారిగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్య శాస్త్రిగారికి వారు రెండవ అబ్బాయి. వారి ఇలవేల్పు, కుంబకోణము దగ్గర్లోనున్న స్వామిమలై ఆలయము ప్రధాన దేవత ఐన స్వామినాథుని పేరు మీదుగా బాలుడికి స్వామినాథన్ అని నామకరణము చేసారు. స్వామినాథన్ దిండివనములో తన తండ్రి పనిచేస్తున్న ఆర్కాట్ అమెరికన్ మిషన్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం ఆరంభించారు. వారు చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకుని పలు పాఠ్యాంశాలలో రాణించారు. వారికి 1905లో ఉపనయనము జరిగింది. శివన్ సర్ గా పేరొందిన సదాశివ శాస్త్రిగారు స్వామినాథన్ కి అనుజులు. ఆబాలుడు 13వ ఏటనే సన్యాసదీక్ష పుచ్చుకొని కంచి కామ కోటి పీఠం అధిష్టించాడు. చంద్రశేఖ రేంద్ర స్వామి కేవలం పీఠాధిపతులే కారు. వారిలో ఒక రాజకీయవేత్త, చారిత్రక పరిశోధకుడు, ఒక శాస్త్రపరిశోధ కుడు, జ్యోతిశ్శాస్త్రవేత్తను, ఆధ్యాత్మిక తరంగాన్ని ఇలా ఒకటేమిటి ఎందరినో దర్శించవచ్చు. ఇన్ని విషయాల్లో విస్తృతమైన ప్రతిభాసామర్థ్యాలు కలిగిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి జీవితం అద్భుతం, అనితర సాధ్యం. నిండు నూరేళ్ళు విలక్షణమైన జీవితాన్ని గడిపి, పాదచారియై దేశమంతా సంచరిస్తూ ధర్మప్రభోదాలు సలిపి, అనేక దివ్యశక్తులు ప్రదర్శిస్తూ, సనాతన ధర్మపునరుద్ధరణకై జీవితాన్ని అంకితం చేసుకున్న మహాపురుషులు స్వామి. ఈయన 'నడిచే దేవుడి' గా ప్రసిద్ధికెక్కాడు.

విశేషాలు[మార్చు]

చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఒకసారి తమిళ నాడులోని చిదంబరంసమీపంలోని 'ఆనంద తాండవ పురం'లో ఒక మూగబాలుడికి మాటలు రప్పించారు.స్వామి మతాతీతుడు. 1926లో కారం బుక్కుడి నుండి పుదుక్కోటకు వెళ్ళే దారిలో గుంపుగా ప్రజలు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. వారిలో మహమ్మదీయులూ ఉన్నారు. అలా ఓ మహమ్మ దీయుడు స్వామి పల్లకీ మోసాడు. స్వామి అతన్ని పిలిచి క్షేమం అడిగాడు. ఆ భక్తుడు 'ఆచార్యుల వారి రూపంలో నా కళ్ళకు 'అల్లా' కనిపించాడన్నాడు. మహాపురుషులు మతాతీ తులు కదా!భారత రాజ్యాంగం మతాన్ని 'ప్రాథమిక హక్కు'గా గుర్తించడానికి శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి వారే కారణమని ఈ దేశంలో చాలా మందికి తెలియదు. వారు సన్యాసదీక్ష తీసుకొని మఠాధిపత్యం వహించడం వల్ల దేశ రాజకీయాలలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. కాని భారతస్వాతంత్య్రాన్ని వారు మనస్ఫూర్తిగా కాంక్షిం చారు. ఉద్యమాన్ని సమర్థించారు. గాంధీజీ విదేశీ వస్త్ర బహిష్కరణకు పిలుపు ఇచ్చిన నాటి నుండి స్వామి స్వయంగా ఖద్ధరునే ధరించారు. 'భారతరాజ్యాంగం ద్వారా మన మతాన్ని కాపాడుకోవడం మన తక్షణ కర్తవ్యం. ఇది ఎంత మాత్రం ఉపేక్షించవలసిన విషయం కాదు' అని స్వామి తన భక్తులను హెచ్చరించాడు.

మతాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తింపజేయుటకు కృషి[మార్చు]

భారతదేశానికి నూతన రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఒక రాయబారవర్గాన్ని బ్రిటీష్ ప్రభుత్వం భారత్‌కు పంపింది. అప్పుడు మనమతం గొప్పదనం, మత సంస్థల పరిస్థితుల్ని ఆ సభ్యులకు జెప్పాలని స్వామి తన భక్తులనాదేశించారు. అలాగే, భక్తులంతా ఆ సభ్యులకు టెలిగ్రాములు పంపారు. కాని వారు స్పందించలేదు. అయినా స్వామి నిరాశపడ లేదు. అయితే, చివరకు తాతాచారి అనే పెద్దకు వచ్చిన ఆహ్వానం మేరకు మత సంస్థలకు రాజ్యాంగ రక్షణ అవసరమన్న స్వామి వారి ఆశయాన్ని రాయబార వర్గంలో ప్రముఖుడైన శ్రీసోరెన్ సన్‌కు వివరించారు. స్వామి ఒక్క క్షణం ధ్యానంలో మునిగి, ఆ తరువాత 'మతాన్ని ప్రాథమిక హక్కుగా' పరిగణిస్తూ చట్టం చేయాలని కోరుతూ వినతిపత్రం తయారు చేయమని భక్తులకు ఆదేశించారు. తరువాత ఢిల్లీ వెళ్ళి సోరెన్ సన్‌కు విజ్ఞాపన పత్రం అందించడం జరిగింది. రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది.

కంచి పీఠాధిపతులుగా[మార్చు]

పూర్వాశ్రమంలో స్వామినాథ అనే పేరుతో పిలవబడే వారు. స్వామికి 1905 వ సంవత్శరములో ఉపనయనము జరిగింది. ఫిబ్రవరి 13, 1907 వ సంవత్సరములో స్వామి కంచి పీఠానికి 68 వ పీఠాధిపతిగా నియమించబడ్డారు. వేదరక్షణ, సంస్కృతి రక్షణ మొదలైన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఉన్నారు. భారతదేశము అంతా పాదయాత్ర చేశారు. స్వామి వారి ఉపన్యాసములు చాలా ప్రసిధ్ది పొందాయి.

జనవరి 8, 1994 న స్వామి శివసాన్నిధ్యం చెందారు. [1]

మూలాలు[మార్చు]

  1. సరస్వతీ స్వామి, చంద్రశేఖరేంద్ర. చంద్రశేఖరేంద్ర సరస్వతి ఉపన్యాసములు. [dead link]

యితర లింకులు[మార్చు]

అంతకు ముందువారు
Sri Sri Mahadevendra Saraswathi VI
Kanchi Kāmakoti Pīṭādipati
February 13, 1907 – January 8, 1994
తరువాత వారు
జయేంద్ర సరస్వతి