మాటలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అన్ని భాషలలో మనం మాట్లాడే విషయాన్ని మాటలు, పలుకు లేదా వాక్కు అంటారు.

శ్లోకం[మార్చు]

"సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
న బ్రూయాత్ సత్య మప్రియం
ప్రియం చ నానృతం బ్రూయాత్
ఏష ధర్మ స్సనాతన:!!"

మనుస్మృతి

తాత్పర్యం[మార్చు]

సత్యాన్నే పలుకు, ప్రియాన్నే మాట్లాడు సత్యమైనా ఆప్రియాన్నిపలక్కు, ఇదే సనాతన ధర్మం అని శ్లోక తాత్పర్యం.

ఇది చెప్పేవాడికి చెప్పే లక్షణ శ్లోకంలా కనిపిస్తుంది.కానీ అడిగే వాడెలాంటి విషయం వింటానికి అడగాలో, ఏది వినాలో చెప్పే చమత్కారం కూడా యిందులో ఉంది.

సత్యాన్నేవిను, ప్రియమైన దాన్నే విను.సత్యమైనా అప్రియంగా వుంటే వినకు.అలాగే ప్రియంగా వుందని అసత్యాన్ని వినకు.అలాంటి లక్షణాలతో చెప్పేవాడు.

వినేవాడూ వున్నప్పుడు ఆ చెప్పిన విషయం హృదయానికి హత్తుకుని ఎల్ల కాలం గుర్తుంటుంది.

అనగా ఇతరులకు ప్రియం కానిది అది సత్యమైనా మనం చెప్పకూడదు. అందులో కాఠిన్యముండడమే కారణం. అలాగే జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడకపోతే అది సత్యమైనా తగవులాటకు కారణమవుతుంది. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నారు.

మాటలలో రకాలు[మార్చు]

 1. మంచి మాటలు
 2. చెడు మాటలు : చెడు వాక్కులు నాలుగు విధాలుగా ఉంటాయి.
 • పారుష్యం అనగా కఠినంగా మాట్లాడడం. కష్టం కలిగించే విధంగా మాట్లాడితే కష్టాలు, సమస్యలే కాక మిత్రులు కూడా శత్రువులు అవుతారు. అందువలన అశాంతి, దుఃఖం కలుగుతుంది. ఇతరులు వారితో మాట్లాడేందుకు సంకోచిస్తారు**.
 • అనృతం అనగా అసత్యం చెప్పడం. దీనివలన ఆత్మ, మనస్సు కలుషితమవుతాయి. సత్యం దేవతల వ్రతం అని, అసత్యం చెప్పడం అసురుల స్వభావమని వేదవిదులు అంటున్నారు. అసత్యవాదులు జీవించినా మరణించిన వారితో సమానమని వేదోక్తి.
 • పైశున్యం అనగా చాడీలు చెప్పడం. దీనివలన కుటుంబాలలో కలహాలు, సన్నిహితులతో విరోధాలు ఏర్పడతాయి. పరస్పరం అసూయ, అసహనం ఏర్పడతాయి ఇతరుల నుండి అవమానాల్ని, అవహేళనల్ని పొందాల్సి ఉంటుంది. వీరు సాంఘిక జీవనం కోల్పోతారు.
 • అసందర్భ ప్రలాపం : పరమాత్మ ప్రసాదించిన వాక్కును ఆచితూచి వినియోగించాలి. అనవసరంగా, అసందర్భంగా వ్యర్ధంగా మాట్లాడకూడదు. ఇడతెగకుండ మాట్లాడుతుంటే ఇతరులకు చిరాకుపెడుతుంది.

ప్రసిద్ధ వ్యక్తుల విచిత్రమాటలు[మార్చు]

 • సరస్వతీదేవి భారతదేశానికి ఇచ్చిన గొప్పవరం ఆంగ్లభాష - రాజాజీ.
 • నేపాల్ భారతదేశంలో ఒక భాగం -మాధురీ దీక్షిత్
 • ఎయిడ్స్ కూడా జలుబులాంటిదే - కాజోల్
 • ఇండియాలో ఎవరికీ శీలంలేదు - సుస్మితాసేన్
 • ప్రపంచంలో దారిద్ర్యంపోవాలంటే ప్రకృతి విపత్తులురావాలి - శిల్పా శెట్టి
 • పెళ్ళి అంటే జీవితఖైదు - శత్రుగ్న సిన్హా

మూలాలు[మార్చు]

 • వాగ్వైభవము, డా. సంధ్యావందనం లక్ష్మీదేవి, 150 వసంతాల వావిళ్ల వాజ్మయ వైజయంతి, పేజీలు 110-14.
"https://te.wikipedia.org/w/index.php?title=మాటలు&oldid=3898401" నుండి వెలికితీశారు