మనుస్మృతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Matsya pulls a boat carrying Saint Manu and Saptrishi during floods or Pralaya

మనుస్మృతి పురాతనమైన హిందూ ధర్మశాస్త్రాలలో ఒకటి. దీన్ని మనుధర్మ శాస్త్రం అని, మానవ ధర్మ శాస్త్రం అని కూడా అంటారు. అయితే, ఈ గ్రంథం హిందూ ధర్మంలోనే అత్యంత నకిలీకి గురైన గ్రంథంగా మిగిలి పోయింది. అంతేకాదు, హిందూ ధర్మాన్ని విచ్చిన్నం చేయడానికి, కులాల అంతరాలను, లింగపర వివక్షను రగిలించదానికి ఉపయోగించబడిన ఒక ప్రణాళికగా మిగిలిపోయింది.

మొత్తం 50 రకాల మనుధర్మ శాస్త్రాలు అందుబాటులో వుండటం వలన, అంతేకాక ఒక దాంట్లోని వాక్యాలు ఇంకొక గ్రంథంలోని వాక్యాలతో ఏకీభవించకపోవడం వలన ఇది కొందరి చేత దురుద్దేశ పూర్వకంగా మార్చబడిందని విశ్లేషకులు నిర్థారించారు. కుళ్ళుక భట్టా వాఖ్యానంలో కలకత్తా సంస్థ ప్రచురించిన పుస్తకం అధికారికమైనది అనుకున్నప్పటికీ, దాని వాస్తవికతను కూడా ఆధునిక చరిత్రకారులు తిరస్కరించారు. ముఖ్యంగా మనుధర్మ శాస్త్రం "ఒక చొప్పించబడిన వివక్ష పూరిత వాక్యాల వైరుధ్యాల సముదాయం" అని ఎందరో నిపుణులు, పండితులు నిర్థారించారు.

ముఖ్యంగా శూద్రులు, మహిళల పట్ల వివక్ష పూరిత వాక్యాలు ఎవరో ఉద్దేశ పూర్వకంగా ఈ గ్రంథంలోకి చొప్పించి ప్రచురించారని చరిత్రకారులు, పండితులు నిర్ధారించారు. విలియం జోన్స్ అనువదించిన మనుధర్మ శాస్త్రం ద్వారా దేశాన్ని పరిపాలిస్తున్న అప్పటి బ్రిటీషు వారు హిందూ చట్టాన్ని రూపొందించారు. ఇది సామాన్య శకం పూర్వం 2వ శతాబ్దం నుండి, సామాన్య శకం ౩వ శతాబ్దం మధ్య కాలంలో రచించబడి ఉంటుందని అంచనా.  

ఆదిమానవుడు మనువు, అతను మానవాళికి ఇచ్చిన చట్టాన్ని మనుస్మృతిగా పేర్కొంటారు. ఈనాడు 80 శాతం హిందువులకు మనుధర్మ శాస్త్రం అందుబాటులో లేదని ఒక అంచనా. "అందరం పరమాత్మ అంశయే, ఎవరూ ఎవరికన్నా తక్కువ కాదు" అనే భగవద్గీత, ఉపనిషత్తుల మూల సిద్ధాంతాలకి విరుద్ధంగా వుండటంతో, మనుస్మృతి బ్రిటీషు వారి హయాంలో జరిగిన ఒక కుట్రపూరిత ప్రణాళికగా ప్రస్తావించబడింది. అసలైన మనుధర్మ శాస్త్రం యొక్క ఆనవాళ్ళు ఈనాడు దాదాపుగా లేవు. ప్రతీ సంవత్సరం డిశంబరు 25న కొన్ని దళిత సంఘాలు, మహిళా సంఘాలు "మనుస్మృతి దహనం" పేరిట ప్రస్తుతం అందుబాటులో వున్న కాపీలని నిరసనా కార్యక్రమాలతో కాల్చి వేస్తున్నాయి.

లంకెలు[మార్చు]

http://sanskritdocuments.org/all_pdf/manusmriti.pdf