Jump to content

గయుడు

వికీపీడియా నుండి
దస్త్రం:Arjuna meets Krishna at Prabhasakshetra.jpg
కృష్ణుడు, అర్జునుడు

గయుడు ఒక గంధర్వుడు, మణిపురమునకు రాజు.

ఒకనాడు శివుని పూజించి తిరుగు ప్రయాణంలో ఆకాశ మార్గాన పోవుచుండగా క్రిందికి ఉమ్మి వేసెను. అది అర్ఘ్యమిస్తున్న శ్రీకృష్ణుని దోసిట పడినది. సూర్యభగవానుని ఆరాధిస్తున్న తనపై ఉమిసిన వానిని చంపుదునని శపథము చేసెను. ఆ పలుకులు ఆకాశవాణి వలన గయుడు విని బ్రహ్మ, పరమశివులను శరణువేడగా వారు తిరస్కరించిరి. గయుడు తనకు మరణం తప్పదు అనుకొనుచున్న సమయంలో నారదుడు మార్గమున కలుసుకొని అర్జునుని శరణు వేడమని చెప్పెను. గయుడు అర్జునుని వద్దకు వేగముగా పోయి శరణార్ధిని, కాపాడమని ప్రార్థించెను. అర్జునుడు అతనికి అభయమిచ్చెను. విషయము తెలిసిన తరువాత కృష్ణుని పగవానిని తాను రక్షింపవలసి వచ్చినందులకు చాలా విచారించెను. కృష్ణుడు గయుని తనకు అప్పగించమని వర్తమానము పంపెను. శరణు వేడిన వానిని విడువనని అర్జునుడు జవాబు చెప్పెను. ఇరువైపుల వారు సంధి చేయుటకు ప్రయత్నించినా కూడా అది కుదరలేదు. చివరకు గయుని వలన కృష్ణార్జునులకు యుద్ధము వచ్చెను. వీరిరువురు ఘోరముగా పోరాడుచుండిరి.తుదకు గౌరీ శంకరులు.అనగా....జగన్మాత...... సర్వ దేవతా లోక సార్వ భౌములు అయిన గౌరీ శంకరులు వచ్చి వారి యుద్ధమును మాన్పించిరి. గయుడు కృష్ణుని పాదములపై పడి శరణు వేడగా అతడు మన్నించెను.

ఇవి కూడా చూడండి

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=గయుడు&oldid=3821931" నుండి వెలికితీశారు