Jump to content

శ్రీకృష్ణార్జున యుద్ధము

వికీపీడియా నుండి
శ్రీకృష్ణార్జున యుద్ధం
(1963 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వి.రెడ్డి
నిర్మాణం కె.వి.రెడ్డి
చిత్రానువాదం కె.వి.రెడ్డి
తారాగణం నందమూరి తారక రామారావు,
అక్కినేని నాగేశ్వరరావు,
బి.సరోజాదేవి,
ధూళిపాళ,
ముక్కామల,
ఎస్.వరలక్ష్మి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
కాంతారావు,
శ్రీరంజని జూ.,
ఛాయాదేవి,
ఋష్యేంద్రమణి,
బాలసరస్వతి,
చిత్తూరు నాగయ్య,
స్వరాజ్యలక్ష్మి,
సి.హెచ్.కుటుంబరావు,
మిక్కిలినేని,
అల్లు రామలింగయ్య,
చిట్టి,
లీల,
మోహన,
సత్యనారాయణ
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల,
మాధవపెద్ది సత్యం,
స్వర్ణలత,
బి.గోపాలం,
వసంత
నృత్యాలు పసుమర్తి కృష్ణమూర్తి
గీతరచన పింగళి నాగేంద్రరావు
సంభాషణలు పింగళి నాగేంద్రరావు
ఛాయాగ్రహణం కమల్ ఘోష్
కళ మాధవపెద్ది గోఖలే,
తోట వెంకటేశ్వరరావు
కూర్పు వాసు
నిర్మాణ సంస్థ జయంతి పిక్చర్స్
భాష తెలుగు

శ్రీకృష్ణార్జున యుద్ధము 1963 లో నిర్మించిన తెలుగు పౌరాణిక సినిమా. గయుడు అనే గంధర్వుని కారణంగా ఆప్తమిత్రులు, బావ మరదులూ ఐన కృష్ణుడికి, అర్జునుడికీ మధ్య యుద్ధం జరగడం ఈ సినిమా ఇతివృత్తం. ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్ కృష్ణుడిగాను, ఏ.ఎన్.ఆర్ అర్జునిడిగానూ నటించారు. బి.సరోజా దేవి సుభద్ర పాత్రను, ఎస్.వరలక్ష్మి సత్యభామ పాత్రలనూ పోషించారు. కృష్ణార్జునుల యుద్ధానికి కారణమైన గయుడి పాత్రను ధూళిపాళ పోషించారు. మాయాబజార్ చిత్రంలో దుర్యోదనుడి పాత్రను పోషించిన ముక్కామల ఈ చిత్రంలో కూడా తిరిగి దుర్యోదనుని పాత్రలో నటించారు.

సంక్షిప్త చిత్ర కథ

[మార్చు]

గయుడు అనే గంధర్వుడు పుష్పకవిమానంలో వెళ్తూ తను నములుతున్న తాంబూలాన్ని భూమి మీదకు ఉమ్ముతాడు. అది సంధ్యావందనం చేస్తూ అర్ఘ్యమిస్తున్న శ్రీకృష్ణుని దోసిలిలో పడుతుంది. దానితో ఆగ్రహించిన కృష్ణుడు గయుణ్ణి సంహరిస్తానని శపథం చేస్తాడు. దానితో భీతిల్లిన గయుడు నారదుని సలహామీద, అసలు విషయం చెప్పకుండా అర్జునుడి శరణు పొందుతాడు. తరువాత విషయం తెలిసిన తరువాత కూడా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అర్జునుడు శ్రీకృష్ణుడితో పోరాడటం ఇందులోని కథాంశం.

పాత్రలు-పాత్రధారులు

[మార్చు]
పాత్ర నటి/నటుడు
శ్రీకృష్ణుడు నందమూరి తారక రామారావు
అర్జునుడు అక్కినేని నాగేశ్వరరావు
సుభద్ర బి. సరోజాదేవి
గయుడు ధూళిపాళ సీతారామశాస్త్రి
సత్యభామ ఎస్. వరలక్ష్మి
బలరాముడు మిక్కిలినేని
నారదుడు తాడేపల్లి కాంతారావు
శివుడు ప్రభాకర రెడ్డి
రుక్మిణి శ్రీరంజని
ధర్మరాజు గుమ్మడి వెంకటేశ్వరరావు
అక్రూరుడు చిత్తూరు నాగయ్య
గయుని భార్య ఋష్యేంద్రమణి
రేవతి ఛాయాదేవి
కర్ణుడు కైకాల సత్యనారాయణ
దుర్యోధనుడు ముక్కామల కృష్ణమూర్తి
అల్లు రామలింగయ్య
బాలసరస్వతి

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
అన్నీ మంచి శకునములే కోరిక తీరే దీవెనలే
మనసున మంగళ వాద్యమహా మ్రోగెలే
పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల
పి.సుశీల
అలిగితివ సఖీ ప్రియ కలత మానవా
ప్రియమారగ నీ దాసుని ఏలజాలవా ("నను భవదీయ దాసుని" పద్యంతొ సహా)
పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల
చాలదా ఈ పూజ దేవి, చాలదా ఈ కొలువు దేవి
నీ భక్తునింత నిరాదరణ చేయనేలా
పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల
తపము ఫలించిన శుభవేళా బెదరగనేలా ప్రియురాలా పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల
దేవ దేవ నారాయణ పరంధామ పరమాత్మ నీలీలలనెన్న తరమా పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల
మనసు పరిమళించెనే - తనువు పరవశించెనే
నవవసంత గానముతో నీవు నటన సేయగనే
పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల
పి.సుశీల
స్వాముల సేవకు వేళాయే, వైనమురారే చెలులారా ఆశీర్వాదము పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు పి.సుశీల, బృందం

ఇంకా..

  • అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమె భామిని - బి.గోపాలం, స్వర్ణలత
  • ఉపకారమంబులు చేసినాడ కదా ఎన్నోరీతులన్ ( సంవాద పద్యాలు ) - ఘంటసాల
  • చాలదా ఈ పూజ దేవి చాలదా ఈ కొలువు దేవి ఈ భక్తునింక నిరాదరణ - ఘంటసాల
  • జయచంద్రకోటీర జయఫణిహారా జయ (స్తోత్రం) - మాధవపెద్ది బృందం
  • ధరణీ గర్భము దూరుగాక వడిపాతాళంబున చేరుగాక (పద్యం) - ఘంటసాల
  • నమ: పూర్వాయగిరయే పశ్చిమాయాద్రయేనమ: జ్యోతిర్‌గణనాం (శ్లోకం) - ఘంటసాల
  • నాగలోకము జొచ్చి దాగియుండెదమన్న బలియే (పద్యం) - మాధవపెద్ది
  • నీకు సాటి రవితేజా నీవేలే మహారాజా - బి.వసంత,స్వర్ణలత ( ధూళిపాళ మాటలతో)
  • నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా నీకై కాచితినయ్యా - సుశీల
  • భళిరా బావపైయిన్ సహోదరిపైయిన్ వాత్సల్యభావంబు (పద్యం) - ఘంటసాల
  • వసుదేవ సుతం దేవం కంసచారోణ మర్ధనం ( కృష్ణాలీలా తరంగిణి లోనిది) - ఘంటసాల
  • వేయి శుభములు కలుగు నీకు పోయిరావే మరదలా ప్రాణపదముగా - ఎస్. వరలక్ష్మి బృందం
  • స్ధాణుండే హరిపద్ధమున్‌గొని మహౌధత్యముబుంనన్ వచ్చినన్ (పద్యం) - ఘంటసాల

మూలాలు

[మార్చు]
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు
భక్త పోతన | యోగి వేమన | గుణసుందరి కథ | పాతాళభైరవి | పెద్దమనుషులు | దొంగరాముడు | మాయాబజార్ | పెళ్ళినాటి ప్రమాణాలు | జగదేకవీరుని కథ | శ్రీకృష్ణార్జున యుద్ధం | సత్య హరిశ్చంద్ర | భాగ్యచక్రం | ఉమా చండీ గౌరీ శంకరుల కథ | శ్రీకృష్ణసత్య