కైకాల సత్యనారాయణ
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కైకాల సత్యనారాయణ | |
---|---|
![]() కైకాల సత్యనారాయణ | |
జననం | [1] | 1935 జూలై 25
ఇతర పేర్లు | నవరస నటసార్వభౌమ |
సుపరిచితుడు | సినిమాలు, రాజకీయం |
జీవిత భాగస్వామి | నాగేశ్వరమ్మ |
పిల్లలు | కైకాల రమాదేవి |
కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు, భారత పార్లమెంటు సభ్యుడు. గత 60 సంవత్సరాలుగా తెలుగు సినిమారంగంలో ఉన్న ఆయన 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో ఈయన ఒకరు. 1959 లో సిపాయి కూతురు అనే చిత్రంతో ఈయన సినీరంగప్రవేశం చేశాడు. తర్వాత ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించాడు.
వ్యక్తిగత జీవితం[మార్చు]
సత్యనారాయణ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో, కైకాల లక్ష్మీనారాయణకు 1935 జూలై 25 న జన్మించాడు.[2] ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేసి, గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. 1960 ఏప్రిల్ 10 న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు.
సినీ జీవితం[మార్చు]
తన గంభీరమైన కాయంతో, కంచు కంఠంతో, సినిమాలలో వేషాల కోసం సత్యనారాయణ మద్రాసు వెళ్ళాడు. అతన్ని మొదట గుర్తించింది డి.యల్.నారాయణ. 1959లో నారాయణ సిపాయి కూతురు అనే సినిమాలో సత్యనారాయణకు ఒక పాత్ర ఇచ్చాడు. దానికి దర్శకుడు చంగయ్య. ఆ సినిమా బాక్సు ఆఫీసు దగ్గర బోల్తాపడినా సత్యనారాయణ ప్రతిభను గుర్తించారు. అలా గుర్తించటానికి ఆసక్తి గల కారణం, అతను రూపు రేఖలు యన్.టి.ఆర్‌ను పోలి ఉండటమే. యన్.టి.ఆర్ కు ఒక మంచి నకలు దొరికినట్లు అయింది. అప్పుడే యన్.టి.ఆర్ కూడా ఇతన్ని గమనించారు. 1960లో యన్.టి.ఆర్ తన సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణిలో ఇతనుకు ఒక పాత్రనిచ్చారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించినవారు యస్.డి.లాల్. ఈ సినిమాలో సత్యనారాయణ యువరాజు పాత్ర వేసాడు.
సత్యనారాయణను ఒక ప్రతినాయకుడుగా చిత్రించవచ్చు అని కనిపెట్టినది బి.విఠలాచార్య. ఇది సత్యనారాయణ సినిమా జీవితాన్నే మార్చేసింది. విఠలాచార్య సత్యనారాయణ చేత ప్రతినాయకుడుగా కనకదుర్గ పూజా మహిమలో వేయించాడు. ఆ పాత్రలో సత్యనారాయణ సరిగ్గా ఇమడటంతో, తర్వాతి సినిమాల్లో అతను ప్రతినాయకుడుగా స్థిరపడి పోయాడు.
ప్రతినాయకుడిగా తన యాత్ర కొనసాగిస్తూనే, సత్యనారాయణ సహాయ పాత్రలు కూడా వేసారు. ఇది ఆయనను సంపూర్ణ నటుడిని చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు సత్యనారాయణ రూపంలో విలక్షణ నటుడు దొరికినట్లయింది. అతను యమగోల, యమలీల చిత్రాల్లో యముడిగా వేసి అలరించాడు. కృష్ణుడి గా, రాముడిగా యన్.టి.ఆర్ ఎలానో, యముడిగా సత్యనారాయణ అలా! ఎస్.వి.రంగారావు ధరించిన పాత్రలను చాలావరకు సత్యనారాయణ పోషించారు.[3] పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు సాంఘికాల్లో రౌడీ, కథానాయకుని (కథాకనాయిక) తండ్రి, తాత మొదలైనవి.
సత్యనారాయణ రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి ఇద్దరు దొంగలు[4] కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు సినిమాలు నిర్మించాడు.
రాజకీయాలు[మార్చు]
1996లో అతను రాజకీయాల్లోకి వచ్చి, మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[5]
నటించిన సినిమాల పాక్షిక జాబితా[మార్చు]
- సిపాయి కూతురు (1959) (మొదటి సినిమా)
- లవకుశ (1963)
- పాండవ వనవాసం (1965)
- పరమానందయ్య శిష్యుల కథ (1966)
- ప్రేమనగర్ (1971)
- తాతా మనవడు (1973)
- నిప్పులాంటి మనిషి (1974) - షేర్ ఖాన్
- జీవన జ్యోతి (1975)
- సిరిసిరిమువ్వ (1976)
- సెక్రటరీ (1976)
- చక్రధారి (1977)
- దాన వీర శూర కర్ణ (1977) - భీముడు
- యమగోల (1977) -యముడు
- శుభలేఖ (1982) - అంకెల ఆదిశేషయ్య
- శ్రుతిలయలు (1987) - వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు
- రుద్రవీణ (1988)
- నారీ నారీ నడుమ మురారి (1990) - జానకిరామయ్య
- సూత్రధారులు (1990) - నీలకంఠయ్య
- గ్యాంగ్ లీడర్ (1991) - జైలర్
- భైరవ ద్వీపం (1994)
- ముద్దుల ప్రియుడు (1994)
- యమలీల (1994) - యముడు
- ఘటోత్కచుడు (1995)- ఘటోత్కచుడు
- సాహసవీరుడు - సాగరకన్య (1996)[6]
- సూర్యవంశం (1998)
- శుభాకాంక్షలు (1998) - సీతారామయ్య
- సమరసింహారెడ్డి (1999)
- మురారి (2001)
- అరుంధతి (2009) *నరసింహుడు (2005)
గుర్తింపులు , బహుమతులు[మార్చు]
- నటశేఖర - అనంతపురంలో ఒక ప్రభుత్వేతర సంస్థ ఇచ్చింది.
- నటశేఖర - గుడివాడ పురపాలక సంఘ వేదికపై ఇచ్చినది
- కళా ప్రపూర్ణ - కావలి సాంసృతిక సంఘంవారు ఇచ్చినది
- నవరసనటనా సార్వభౌమ - ఒక సాంస్కృతిక సంఘం అనేకమంది పెద్దమనుషులు, పురజనుల మధ్య ఇచ్చింది.
గణాంకాలు[మార్చు]
- 777 సినిమాలు ఇప్పటిదాకా
- 28 పౌరాణిక చిత్రాలు
- 51 జానపద చిత్రాలు
- 9 చారిత్రక చిత్రాలు
- 200 మంది దర్శకులతో పనిచేసాడు
- 223 సినిమాలు 100 రోజులు ఆడాయి
- 59 సినిమాలు అర్ధశతదినోత్సవాలు జరుపుకున్నాయి
- 10 సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి
- 10 సినిమాలు ఒక సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ ఆడినవి
మూలాలు[మార్చు]
- ↑ "Kaikala Satyanarayana turns 85: Rana Daggubati, Pawan Kalyan and others wish the legendary Telugu actor - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-08-06.
- ↑ "సీనీ నటనాధురీణ... సత్యనారాయణ". సితార. Retrieved 2020-08-06.[permanent dead link]
- ↑ Team, TV9 Telugu Web (2020-07-24). "సినిమా పుట్టిన నాలుగేళ్లకే కైకాల జననం.. విభిన్నమైన పాత్రలతో చెరగని ముద్ర." TV9 Telugu (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-06.
- ↑ ఆంధ్రజ్యోతి, నవ్య (ఓపెన్ పేజీ) (21 June 2020). "ఎన్టీఆర్ సినిమా కథతో వీరిద్దరి సినిమా!". www.andhrajyothy.com. వినాయకరావు. Archived from the original on 21 June 2020. Retrieved 14 August 2020.
- ↑ Srinivas, Mittapalli (2017-10-07). ""ఎన్టీఆర్ అత్యంత కుమిలిపోయిన సందర్భం అదే.., బాబు తీరు అలా కనిపించడం లేదు"". telugu.oneindia.com. Retrieved 2020-08-06.
- ↑ ఐడ్రీమ్ పోస్ట్, సినిమాలు (7 April 2020). "గురి తప్పిన 'సాహస వీరుడు'". www.idreampost.com (in ఇంగ్లీష్). Retrieved 22 June 2020.[permanent dead link]
బయటి లింకులు[మార్చు]
- All articles with dead external links
- Articles with dead external links from జూన్ 2021
- Articles with permanently dead external links
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en)
- Articles with dead external links from జూలై 2020
- విస్తరించవలసిన వ్యాసాలు
- Pages using infobox person with unknown parameters
- Infobox person using religion
- రఘుపతి వెంకయ్య పురస్కార గ్రహీతలు
- 1935 జననాలు
- 11వ లోక్సభ సభ్యులు
- కృష్ణా జిల్లా సినిమా నటులు
- తెలుగు సినిమా నటులు
- తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు
- జీవిస్తున్న ప్రజలు
- రాజకీయాలలో సినీనటులు
- తెలుగు సినిమా ప్రతినాయకులు
- కృష్ణా జిల్లా సినిమా నిర్మాతలు
- కృష్ణా జిల్లా రాజకీయ నాయకులు
- కృష్ణా జిల్లా నుండి ఎన్నికైన లోక్సభ సభ్యులు