పరమానందయ్య శిష్యుల కథ (1966 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పరమానందయ్య శిష్యుల కథ
Paramanandayya sishyula katha1966.jpg
దర్శకత్వంసి.పుల్లయ్య,
(సహాయకుడు:బి.ఎల్.ఎన్.ఆచార్య)
రచనవెంపటి సదాశివబ్రహ్మం (కథ/మాటలు)
నిర్మాతతోట సుబ్బారావు
నటవర్గంనందమూరి తారక రామారావు
కె.ఆర్.విజయ,
ఎల్.విజయలక్ష్మి
నాగయ్య
ముక్కామల
ఛాయాగ్రహణంసి.నాగేశ్వరరావు
సంగీతంఘంటసాల వెంకటేశ్వరరావు
నిర్మాణ
సంస్థ
శ్రీ దేవి ప్రొడక్షన్స్
విడుదల తేదీలు
1966 ఏప్రిల్ 7 (1966-04-07)[1]
భాషతెలుగు

పరమానందయ్య శిష్యుల కథ సి. పుల్లయ్య దర్శకత్వంలో 1966 లో విడుదలైన చిత్రం. ఈ చిత్రాన్ని తోట సుబ్బారావు శ్రీ దేవి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. వెంపటి సదాశివబ్రహ్మం కథ, మాటలు సమకూర్చాడు. ఇందులో ఎన్. టి. రామారావు, కె. ఆర్. విజయ, చిత్తూరు నాగయ్య, ముక్కామల ప్రధాన పాత్రల్లో నటించారు. ఘంటసాల సంగీత దర్శకత్వం వహించాడు.

కథ[మార్చు]

నందివర్ధన మహారాజు పరిపాలనలో శ్రద్ధ లేకుండా ఎప్పుడూ మద్యపానం సేవిస్తూ నర్తకి రంజని గృహంలో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాడు. ఇంత దురలవాట్లకు లోనయినా శివ పూజ మాత్రం మానకుండా చేస్తుంటాడు. ఆయన ఆస్థానంలో రాజగురువు పరమానందయ్య రాజు ప్రవర్తన బాగు చేయాలని ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు మంత్రి నందివర్ధన మహారాజును ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని బందిపోటు దొంగలతో చేతులు కలిపి అనేక పథకాలు వేస్తుంటాడు. చిత్రలేఖ అనే గంధర్వ కన్య ఒకసారి భూలోక విహారం చేస్తుండగా అక్కడ ఆమెను కొంతమంది మునికుమారులు చూస్తారు. ఆమె వాళ్ళని మంద బుద్ధులు కమ్మని శపిస్తుంది. ఇంతలో వారి గురువు వారి దగ్గరకు వచ్చి వారికి శాప విమోచనం ఎలా అని ఆమెను అడుగుతాడు. ఆమె తన వివాహం అయిన వెంటనే వాళ్ళు మామూలు మనుషులుగా మారతారని చెబుతుంది. ఆమె మళ్ళీ భూమ్మీదకు వచ్చి ఎవరితోనైనా గడిపితే ఆమె శాశ్వతంగా భూలోకంలో ఉండవల్సి వస్తుందని హెచ్చరించి పంపేస్తాడు.

మూఢులైన వారు గురువు సలహా మేరకు పరమానందయ్య దగ్గర శిష్యులుగా చేరతారు.

పాత్రలు-పాత్రధారులు[మార్చు]

నటులు పాత్రలు
చిత్తూరు నాగయ్య పరమానందయ్య
నందమూరి తారక రామారావు నందివర్ధన మహారాజు
కె. ఆర్. విజయ చిత్రలేఖ, గంధర్వ కన్య
శోభన్ బాబు శివుడు
బి. పద్మనాభం నంది (శిష్యుడు)
అల్లు రామలింగయ్య (శిష్యుడు)
రాజబాబు ఫణి (శిష్యుడు)
సారథి (శిష్యుడు)
బొడ్డపాటి (శిష్యుడు)
ముక్కామల కృష్ణమూర్తి మంత్రి
ఛాయాదేవి ఆనందం, పరమానందయ్య భార్య
ఎల్. విజయలక్ష్మి రంజని, రాజనర్తకి
వంగర వెంకట సుబ్బయ్య పరబ్రహ్మ శాస్త్రి
కైకాల సత్యనారాయణ జగ్గారాయుడు, గజ దొంగ
రాజనాల నాగేశ్వరరావు
శివరామకృష్ణయ్య విరూపాక్షయ్య

పాటలు[మార్చు]

01. అక్కట కన్నుగానక మధాంధుడనై ప్రియురాలి (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం

02. ఇదిగో వచ్చితి రతిరాజా మధువే తెచ్చితి మహారాజా రాజా - ఎస్. జానకి - రచన: శ్రీశ్రీ[2]

03. ఎనలేని ఆనందమీ రేయి మనకింక రాబోదు ఈ హాయి - ఎస్. జానకి, ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం

04. ఓ మహదేవ నీ పదసేవ భవతరణానికి నావా ఓ మహదేవా ఓ మహదేవా - పి.సుశీల

05. ఓం శివాయ నమహ: ఓం శివలింగాయ నమహ: ఓం జ్వలాయనమహ: - ఘంటసాల

06. ఓం నిధనపతయె నమహ: ఓం నిధనపాంతతికాయ నమహ: - ఘంటసాల బృందం

07. ఓం నమశ్శివాయ నమశ్శివాయ నమో నమేస్తే ఓం ఓం ఓం - బృందగీతం

08. కామినీ మదన రారా నీ కరణకోరి నిలిచేరా కామినీ మదన రారా - ఘంటసాల, పి. లీల - రచన: సముద్రాల రాఘవాచార్య

09. నాలోని రాగమీవే నడయాడు తీగవీవే పవళించె లోన బంగారు వీణ పలికించ నీవు రావే - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సి. నారాయణ రెడ్డి

10. నవనవోజ్వలమగు యవ్వనంబు నీదు మధుర ( పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం

11. పరమగురుడు చెప్పిన వాడు పెద్ద మనిషి కాడురా - జె.వి.రాఘవులు, అప్పారావు, పిఠాపురం నాగేశ్వరరావు

12. మౌనివరేణ్య శాపమున (పద్యం) - పి.సుశీల

13. వనిత తనంతట తానే వలచిన ఇంత నిరాదరణా ఓ రమణ - పి.లీల, ఎ.పి.కోమల (పోటీ నృత్యం)

14. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల

15. శంకరస్య చరితాకథామృతం చంద్రశేఖర గణాను కీర్తనం (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల

16. శోకముతో నే మానితినై ఈ లొకములోన మనగలనా .. ఓ మహదేవా నీ పదసేవ - పి.సుశీల

17. సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధసాధకే శరణ్యేత్రయంబకే (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల

మూలాలు[మార్చు]

  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966లో విడుదలైన చిత్రాలు. గోటేటి బుక్స్. p. 18.
  2. శ్రీశ్రీ (2001). ఉక్కుపిడికిలి - అగ్ని జ్వాల శ్రీశ్రీ సినిమా పాటలు (1 ed.). విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. Retrieved 17 June 2020.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)