సముద్రాల రాఘవాచార్య

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సముద్రాల రాఘవాచార్య
Samudrala-1.png
సముద్రాల రాఘవాచార్య
జననం సముద్రాల వేంకట రాఘవాచార్యులు
జూలై 19, 1902
రేపల్లె, గుంటూరు జిల్లా
మరణం మార్చి 16, 1968
ఇతర పేర్లు సముద్రాల సీనియర్
వృత్తి రచయిత
పిల్లలు సముద్రాల రామానుజాచార్య
తండ్రి సముద్రాల వేంకట శేషాచార్యులు
తల్లి లక్ష్మీతాయారు

సముద్రాల రాఘవాచార్య (Samudrala Raghavacharya) (జూలై 19, 1902 - మార్చి 16, 1968) తెలుగు సినిమా పరిశ్రమలో సముద్రాల సీనియర్ గా ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత, దర్శకుడు మరియు నేపథ్యగాయకుడు. ఈయన కుమారుడు సముద్రాల రామానుజాచార్య సముద్రాల జూనియర్ గా తెలుగు చిత్ర పరిశ్రమ పరిచయము. రాఘవాచార్య 1902లో గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించాడు. పి.వి.దాసు నిర్మించిన శశిరేఖా పరిణయం సినిమాకు కొన్ని సన్నివేశాలు వ్రాయడంతో సినీ వ్యాసంగాన్ని ప్రారంభించిన సముద్రాల వందకు పైగా సినిమాలకు స్క్రిప్టులను వ్రాశాడు. అనేక పాటలు కూడా వ్రాశాడు. ఈయన వినాయకచవితి (1957), భక్త రఘునాథ్ (1960), బభృవాహన (1964) సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు.

తెలుగు చిత్ర పరిశ్రమ[మార్చు]

రచయితగా[మార్చు]

 1. కనకతార (1937) (మాటలు మరియు పాటలు) (మొదటి సినిమా)
 2. గృహలక్ష్మి (1938) (కథ, మాటలు మరియు పాటలు)
 3. వందేమాతరం (1939) (మాటలు మరియు పాటలు)
 4. సుమంగళి (1940) (మాటలు మరియు పాటలు)
 5. దేవత (1941) (మాటలు మరియు పాటలు)
 6. భక్త పోతన (1942) (కథ, మాటలు మరియు పాటలు)
 7. జీవన్ముక్తి (1942) (పాటలు)
 8. గరుడ గర్వభంగం (1943) (మాటలు)
 9. భాగ్యలక్ష్మి (1943 (మాటలు మరియు పాటలు)
 10. చెంచులక్ష్మి (1943) (కథ, మాటలు మరియు పాటలు)
 11. పంతులమ్మ (1943) (మాటలు మరియు పాటలు)
 12. స్వర్గసీమ (1945) (మాటలు మరియు కొన్ని పాటలు)
 13. త్యాగయ్య (1946) (మాటలు మరియు కొన్ని పాటలు)
 14. పల్నాటి యుద్ధం (1947) (మాటలు మరియు పాటలు)
 15. యోగి వేమన (1947) (మాటలు మరియు పాటలు)
 16. రత్నమాల (1947) (మాటలు మరియు పాటలు)
 17. బాలరాజు (1948) (మాటలు మరియు పాటలు మల్లాది రామకృష్ణశాస్త్రి గారితో)
 18. మన దేశం (1949) (చిత్రానువాదం, మాటలు మరియు పాటలు)
 19. లైలా మజ్ను (1949) (మాటలు మరియు పాటలు)
 20. తిరుగుబాటు (1950) (పాటలు)
 21. స్వప్న సుందరి (1950) (మాటలు మరియు పాటలు)
 22. షావుకారు (1950) (పాటలు)
 23. నవ్వితే నవరత్నాలు (1951)
 24. పెళ్లికూతురు (1951) (మాటలు మరియు పాటలు)
 25. స్త్రీ సాహసము (1951) (కథ, మాటలు మరియు పాటలు)
 26. సౌదామిని (1951) (మాటలు మరియు పాటలు)
 27. ధర్మ దేవత (1952) (కొన్ని పాటలు)
 28. చండీరాణి (1953) (మాటలు మరియు పాటలు)
 29. బ్రతుకు తెరువు (1953) (మాటలు) (కథ)
 30. దేవదాసు (1953) (మాటలు మరియు పాటలు)
 31. వయారిభామ (1953) (పాటలు)
 32. విప్రనారాయణ (1954) (మాటలు మరియు పాటలు)
 33. అనార్కలి (1955) (మాటలు మరియు పాటలు)
 34. కన్యాశుల్కం (1955) (కీచకవధ వీధినాటకం)
 35. జయసింహ (1955) (మాటలు) (కథ)
 36. దొంగ రాముడు (1955) (పాటలు)
 37. సంతోషం (1955) (మాటలు మరియు పాటలు)
 38. చరణదాసి (1956) (పాటలు)
 39. జయం మనదే (1956) (మాటలు) (కథ) (కొన్ని పాటలు)
 40. తెనాలి రామకృష్ణ (1956) (మాటలు మరియు పాటలు)
 41. భక్త మార్కండేయ (1956) (కథ, మాటలు మరియు పాటలు)
 42. సొంతవూరు (1956) (కొన్ని పాటలు)
 43. సారంగధర (1957) (కథ, మాటలు మరియు పాటలు)
 44. వినాయక చవితి (1957) (కథ, మాటలు, పాటలు మరియు దర్శకత్వం)
 45. సువర్ణసుందరి (1957) (కొన్ని పాటలు)
 46. భూకైలాస్ (1958) (కథ, మాటలు మరియు పాటలు)
 47. దీపావళి (1960) (కథ, మాటలు మరియు పాటలు)
 48. భక్త రఘునాథ్ (1960) (కథ, చిత్రానువాదం)
 49. సీతారామ కళ్యాణం (1961) (మాటలు మరియు పాటలు)
 50. బాటసారి (1961) (మాటలు మరియు పాటలు)
 51. భక్త జయదేవ (1961) (కథ, మాటలు మరియు పాటలు)
 52. సతీ సులోచన (1961) (కథ, మాటలు మరియు పాటలు)
 53. దశావతారములు (1962) (డబ్బింగ్ సినిమా పాటలు)
 54. స్వర్ణమంజరి (1962) (పాటలు)
 55. నర్తనశాల (1963) (మాటలు మరియు పాటలు)
 56. లవకుశ (1963) (కొన్ని పాటలు)
 57. వాల్మీకి (1963) (కథ, మాటలు మరియు పాటలు)
 58. సోమవార వ్రత మహత్యం (1963) (కథ, మాటలు మరియు కొన్ని పాటలు)
 59. అమరశిల్పి జక్కన (1964) (మాటలు మరియు కొన్ని పాటలు)
 60. బభ్రువాహన (1964) (కథ, మాటలు మరియు పాటలు)
 61. పాండవ వనవాసం (1965) (మాటలు మరియు కొన్ని పాటలు)
 62. సతీ సక్కుబాయి (1965) (కథ, మాటలు మరియు పాటలు)
 63. పరమానందయ్య శిష్యుల కథ (1966)
 64. భక్త పోతన (1966) (కథ మరియు కొన్ని పాటలు)
 65. శకుంతల (1966) (మాటలు మరియు కొన్ని పాటలు)
 66. శ్రీకృష్ణ పాండవీయం (1966) (మాటలు మరియు కొన్ని పాటలు)
 67. శ్రీకృష్ణ తులాభారం (1966) (మాటలు మరియు కొన్ని పాటలు)
 68. భక్త ప్రహ్లాద (1967 సినిమా)
 69. రహస్యం (1967)
 70. శ్రీకృష్ణావతారం (1967) (మాటలు మరియు కొన్ని పాటలు)
 71. భార్య (1968)
 72. వీరాంజనేయ (1968)
 73. శ్రీరామకథ (1968) (చివరగా రచించిన సినిమా)
 74. తారాశశాంకం (1969) (మాటలు మరియు కొన్ని పాటలు) (చివరగా విడుదలైన సినిమా)

దర్శకత్వం[మార్చు]

 1. వినాయక చవితి (1957)
 2. భక్త రఘునాథ్ (1960)
 3. బభృవాహన (1964)

నిర్మాత[మార్చు]

 1. దేవదాసు (1953) (నిర్మాత) (uncredited)
 2. శాంతి (1952) (నిర్మాత) (uncredited)
 3. స్త్రీసాహసం (1951) (నిర్మాత) (uncredited)

నేపధ్య గాయకుడు[మార్చు]

 1. భక్త రఘునాథ్ (1960) (playback singer)

బయటి లింకులు[మార్చు]


Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.