సీతారామ కళ్యాణం (1961 సినిమా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మరికొన్ని ఇటువంటి పేరులు గల వ్యాసాల కోసం సీతా కళ్యాణం అయోమయ నివృత్తి పేజీ కూడా చూడండి.

సీతారామ కల్యాణం
(1961 తెలుగు సినిమా)
Seetharamula kalyanam 1961 film.jpg
దర్శకత్వం నందమూరి తారక రామారావు
నిర్మాణం నందమూరి త్రివిక్రమరావు
తారాగణం హరనాథ్,
గీతాంజలి,
ఎన్.టి.రామారావు,
బి.సరోజాదేవి ,
చిత్తూరు నాగయ్య,
గుమ్మడి,
మిక్కిలినేని,
కాంతారావు,
ఛాయాదేవి,
కస్తూరి శివరావు,
వల్లభజోస్యుల శివరాం,
శోభన్‌బాబు,
కొమ్మినేని శేషగిరిరావు
సంగీతం గాలిపెంచల నరసింహారావు
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
ఛాయాగ్రహణం రవికాంత్ నగాయిచ్
కళ టి.వి.యస్.శర్మ
నిర్మాణ సంస్థ ఎన్.ఏ.టి. పిక్చర్స్
విడుదల తేదీ జనవరి 6, 1961
భాష తెలుగు

ఇది 1961లో విడుదలైన తెలుగు చిత్రం. భూకైలాస్ తరువాత రామారావు ఈ చిత్రంలో రావణ పాత్ర ధరించారు.ఈ సినిమా లో రామారావు పోషించిన రావణ పాత్ర మిక్కిలి ప్రాచుర్యం పొందింది. రావణ తన అభిమాన పాత్రగా ఆ రోజుల్లో ఎన్.టి.ఆర్ చెప్పుకున్నారు (ఆంధ్ర పత్రిక - వారపత్రిక). హరినాథ్ గీతాంజలి శ్రీరామ, సీత పాత్రలు ధరించారు. నారద పాత్ర కాంతారావు ధరించారు. ప్రాచుర్యంలో ఉన్న కథలకు భిన్నంగా రావణుడు, శూర్పణఖ లు సీత, రాముల్ని సీతా స్వయంవరం కన్నా ముందే మోహించడం ఇందులో చూపబడింది. ఇందుకు రామారావు గారు ఆశ్చ్యర్య రామాయణం, విచిత్ర రామాయణం వంటి గ్రంధాలను పరిశీలించారు. చిత్రానికి తొలుత ఎస్.రాజేశ్వరరావు పనిచేశారు. రుద్రవీణతో శివుని ప్రసన్నం చేసుకునే సందర్భంలో వచ్చే పాట 'కానరార కైలాస నివాస', 'జటాకటాహ' (శివతాండవ స్తోత్రం - రావణ బ్రహ్మ విరచితంగా చెబుతారు) మొదలైనవి రాజేశ్వరరావు గారు స్వరపరచారు. తెలుగు చిత్రగీతాల్లో 'ఆల్ టైమ్ సూపర్ హిట్' గా చెప్పదగిన 'సీతారాముల కళ్యాణము చూతము రారండి' పాట ఇందులోనిదే. "జానక్యా కమలాంజలీ పుటేయా పద్మ రాగాయతే" అన్న సంస్కృత పదం - "జానకి దోసిట కెంపుల పోగై" వంటి చక్కటి తెలుగుపదం గా మారింది.)

పాటలు[మార్చు]

పాట రచయిత సంగీతం గాయకులు
జగదేక మాతా గౌరీ కరుణించవే భవానీ కరుణించవే భవానీ సముద్రాల రాఘవాచార్య గాలిపెంచల నరసింహారావు పి.సుశీల
సీతారాముల కళ్యాణం చూతము రారండి సముద్రాల రాఘవాచార్య గాలిపెంచల నరసింహారావు పి.సుశీల, బృందం
 1. ఇనుప కట్టడాలు గట్టిన మునులె ఐనా కోరి యముతో (పద్యం) - పి.బి. శ్రీనివాస్
 2. ఓ సుకుమారా నినుగని మురిసితిరా నిను వలచేర - పి.లీల, ఘంటసాల - రచన: సముద్రాల
 3. కానరార కైలాస నివాస పాలేందుధరా జటాధర - ఘంటసాల - రచన: సముద్రాల
 4. జయత్వదభ్రవిభ్రమ భ్రమభుజంగ (రావణాష్టకం నుండి) - ఘంటసాల
 5. జయ గోవింద మాధవ దామోదరా జగదానంద కారణ - ఘంటసాల - రచన: సముద్రాల
 6. జనకుండు సుతుడును జన్నంబు చేసిన వనితా (పద్యం) - ఘంటసాల - రచన: ధనేకుల
 7. జగదేక మాతా గౌరీ కరుణించవే భవాని కరుణించవే - సుశీల
 8. దానవకుల వైరి దర్పంబు వర్ణించు చదువులెవ్వరుగాని (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల
 9. దేవ దేవ పరంధామ నీలమేఘశ్యామా - పి.బి. శ్రీనివాస్
 10. నెలతా ఇటువంటి నీ మాట నీదు పాట నీ వలపు (పద్యం) - ఘంటసాల - రచన: ధనేకుల
 11. పరమశివాచార పరులలో అత్యంత ప్రియుడన్న (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల
 12. పాడవే రాగమయీ వీణా పాడవే రాగమయీ - సుశీల
 13. పొలుపగు బ్రహ్మ వంశమున బుట్టి ఋతుల్ పఠియించి (పద్యం) - పి.లీల
 14. లక్ష్మీ క్షీరసముద్రరాజ తనయాం (శ్లోకం) - ఎం. ఎస్. రామారావు
 15. వేయి కన్నులు చాలవుగా వేడుకైన మా సీతను చూడ - పి.లీల
 16. సరసాల జవరాలను నేనె కదా సరసాల జవరాలను మురిపాలు - పి.లీల
 17. హే పార్వతీనాధ కైలసశైలాగ్రవాసా శశాంకార్ధమౌళి - ఘంటసాల - రచన: సముద్రాల

మూలాలు[మార్చు]