గీతాంజలి (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గీతాంజలి
Old Heroine Geetanjali.jpg
జననంమణి
1947
రాజమండ్రి[1]
మరణంఅక్టోబరు 31, 2019
హైదరాబాదు
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు1960's– 2019
జీవిత భాగస్వామిరామకృష్ణ
తల్లిదండ్రులు
  • శ్రీరామ్మూర్తి (తండ్రి)
  • శ్యామలాంబ (తల్లి)

గీతాంజలి (1947 - అక్టోబరు 31, 2019) 1960వ దశకములో పేరొందిన తెలుగు సినిమా నటి. గీతాంజలి దక్షిణ భారత భాషలన్నింటితో పాటు హిందీ సినిమాలలో కూడా నటించింది.

తొలి జీవితం[మార్చు]

గీతాంజలి 19147లో కాకినాడలో శ్రీరామమూర్తి, శ్వామసుందరి దంపతులకు జన్మించారు. నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్న కుటుంబంలో గీతాంజలి రెండవ అమ్మాయి. కాకినాడలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంటులో కొన్నేళ్లు చదివింది. మూడేళ్ల ప్రాయం నుండే గీతాంజలి తన అక్క స్వర్ణతో పాటు కాకినాడలోని గంధర్వ నాట్యమండలిలో లక్ష్మారెడ్డి, శ్రీనివాసన్ ల వద్ద నాట్యం నేర్చుకోవటం ప్రారంభించింది. నాలుగేళ్ల నుండే అక్కతో పాటు సభల్లో నాట్య ప్రదర్శనలు ఇవ్వటం ప్రారంభించింది.[2]

సినిమారంగం[మార్చు]

ప్రధానంగా తెలుగు, తమిళంలో నటించిన గీతాంజలి కన్నడలో రెండు సినిమాలు, మలయాళంలో మూడు సినిమాలు మరియు ఒక డజనుకు పైగా హిందీ సినిమాలలోనూ నటించింది. ఈమె అసలు పేరు మణి. పారస్ మణి అనే హిందీ చిత్రంలో పనిచేస్తుండగా ఆ చిత్ర నిర్మాతలు లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సినిమా టైటిల్లోనూ మణి ఉంది కాబట్టి ఈమెకు గీతాంజలి అని నామకరణం చేశారు.[3] ఆ పేరు సినీరంగంలో అలానే స్థిరపడిపోయింది.

వివాహం[మార్చు]

సహనటుడు రామకృష్ణను వివాహమాడి చిత్రరంగం నుండి నిష్క్రమించింది. వివాహం కాకముందు రామకృష్ణ, గీతాంజలి కలిసి కొన్ని సినిమాలలో నటించారు. గీతాంజలి 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరింది.

నటించిన సినిమాలు[మార్చు]

మరణం[మార్చు]

గీతాంజలి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ 2019, అక్టోబరు 31 ఉదయం 4 గంటలకు మరణించారు.[4][5]

మూలాలు[మార్చు]

  1. కె., హరనాథ్. "వాళ్ళందరూ హాస్యనటులే!". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Retrieved 16 November 2016.
  2. తెలుగుసినిమా.కాంలో గీతాంజలి ఇంటర్వ్యూ
  3. హిందూ పత్రిక లో గీతాంజలి ఇంటర్వ్యూ
  4. http://www.indiaglitz.com/channels/telugu/article/44864.html
  5. ఆంధ్రజ్యోతి, తాజావార్తలు (31 October 2019). "సీనియర్ నటి గీతాంజలి కన్నుమూత". www.andhrajyothy.com. మూలం నుండి 31 October 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 31 October 2019.

బయటి లింకులు[మార్చు]