Jump to content

కాలం మారింది (1972 సినిమా)

వికీపీడియా నుండి
కాలం మారింది
దర్శకత్వంకె. విశ్వనాథ్
రచనకె. విశ్వనాథ్, బొల్లిముంత శివరామకృష్ణ (మాటలు)
నిర్మాతవాసిరాజు ప్రకాశం, బి. హనుమంతరావు
తారాగణంగుమ్మడి వెంకటేశ్వరరావు,
అంజలీదేవి,
శోభన్ బాబు,
శారద
ఛాయాగ్రహణంఅశోక్ కుమార్
కూర్పుకె. సత్యం
సంగీతంఎస్. రాజేశ్వరరావు
నిర్మాణ
సంస్థ
భాషతెలుగు

కాలం మారింది1972లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇది కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వాసిరాజు ప్రకాశం నిర్మించిన నంది ఉత్తమ చిత్రం. అంటరానితనం, కుల నిర్మూలన ఈ చిత్రంలోని ప్రధాన ఇతివృత్తం. ఈ చిత్రాన్ని మహాత్మా గాంధీకి అంకితమిచ్చారు.[1]

తారాగణం

[మార్చు]
  • శ్రీనివాస్ గా శోభన్ బాబు
  • శాంతి గా శారద
  • కోటీశుగా రావు గోపాలరావు
  • కృష్ణావతారంగా చంద్రమోహన్
  • దొడ్డమ్మ గా సూర్యకాంతం
  • రావి కొండలరావు
  • లక్ష్మీపతిగా గుమ్మడి
  • డాక్టర్ గా చలపతిరావు
  • శేషావతారం గా సాక్షి రంగారావు
  • గీతగా గీతాంజలి
  • తాయారు గా పుష్పకుమారి.
  • అన్నపూర్ణ గా అంజలీదేవి
  • కృష్ణావతారం స్నేహితుడు గా పొట్టి ప్రసాద్
  • యం.ఎల్.ఎ. ఏకాంబరేశ్వరరావు గా అల్లు రామలింగయ్య
  • శాంతి అత్త గా నిర్మలమ్మ
  • దేవదాసు కనకాల
  • కె.వి.చలం
  • డాక్టర్ గా పి.జె.శర్మ.

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: కాశీనాధుని విశ్వనాథ్
  • మాటలు: బొల్లిముంత శివరామకృష్ణ
  • సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
  • చిత్రంవాదం: కె.విశ్వనాథ్
  • పాటలు: దేవులపల్లి కృష్ణశాస్త్రి, కొసరాజు రాఘవయ్య చౌదరి, దాశరథి కృష్ణమాచార్య, సింగిరెడ్డి నారాయణరెడ్డి
  • నేపథ్య గాయకులు: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి, ఎస్.రాజేశ్వరరావు, అల్లు రామలింగయ్య
  • కధ:మమతా యూనిట్
  • ఛాయ గ్రహణం: అశోక్ కుమార్
  • ఎడిటింగ్: పి.వెంకటేశ్వరరావు, కె.సత్యం
  • నిర్మాతలు: వాసిరాజు ప్రకాశం, బి.హనుమంతరావు
  • నిర్మాణ సంస్థ: మమత ప్రొడక్షన్స్
  • విడుదల:1972.

పాటలు

[మార్చు]
  • చాతుర్ వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ - భగవద్గీత పద్యాలు - ఘంటసాల
  • ముందరున్న చిన్నదాని అందమేమో చందమామ సిగ్గుచెంది సాగిపోయే దాగిపోయే - ఘంటసాల, పి.సుశీల . రచన: దాశరథి.
  • ఏ తల్లి పాడేను జోల, ఏ తల్లి ఊపేను డోల ; ఎవరికి నీవు కావాలి ఎవరికి నీమీద జాలి - ఘంటసాల
  • నిజం తెలుసుకోండి, ఓ యువకుల్లారా (దేశభక్తి గేయం)
  • ఇంతకు మించి ఏమిలేదురా బావా ఈ బ్రతుకే ఇంక- ఘంటసాల, పి.సుశీల- రచన: సి. నారాయణరెడ్డి.
  • ఏమిటయ్యా సరసాలు ఎందుకయ్యా జలసాలు- ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం- రచన:కొసరాజు రాఘవయ్య గానం
  • ఓం నమో నారాయణాయ ... ఏది ఏది గంగ కడిగిన- పి సుశీల- రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి
  • మారలేదులే ఈకాలం మారలేదులే ఈలోకం- ఎస్.రాజేశ్వరరావు కోరస్- రచన: దాశరథి
  • వారేమీవారు అనాధలు అభాగ్యులు- ఎస్.రాజేశ్వరరావు కోరస్- రచన: దాశరథి
  • కుక్కను చూసి గురుతర భక్తితో బైరవుండని(పద్యం)- అల్లు రామలింగయ్య.


పురస్కారాలు

[మార్చు]

1972 వ సంవత్సరానికి గాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రధమ ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసిబంగారు నంది అవార్డు ప్రకటించింది.

మూలాలు

[మార్చు]
  1. ఎ. ఎస్., రామశాస్త్రి (2021). విశ్వనాథ్ విశ్వరూపం. అపరాజిత పబ్లికేషన్స్. p. 81.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.

బయటి లింకులు

[మార్చు]