సీతామాలక్ష్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీతామాలక్ష్మి
(1978 తెలుగు సినిమా)
Seeta MaaLakshmi (1978).jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం కె. విశ్వనాథ్
నిర్మాణం మురారినాయుడు
కథ కె. విశ్వనాథ్
తారాగణం చంద్రమోహన్ ,
సంగీతం కె.వి.మహదేవన్
సంభాషణలు జంధ్యాల
ఛాయాగ్రహణం యు.రాజగోపాల్
కూర్పు జి.జి.కృష్ణారావు
భాష తెలుగు

సీతామాలక్ష్మి 1978 లో విడుదలైన తెలుగు చిత్రం. కె. విశ్వనాథ్ రచన దర్శకత్వం నిర్వహించిన ఈ సినిమా [1] తాళ్ళూరి రామేశ్వరికి తొలి చిత్రం. ఈ సినిమాలో నటనకు ఆమె నంది అవార్డును గెలుచుకుంది. దీన్ని తమిళంలో ఎనిప్పడిగళ్ పేరుతో పునర్నిర్మించారు. 1980 లో హిందీలో మిథున్ చక్రవర్తి, జరీనా వాహబ్ లతో సితార పేరుతో నిర్మించారు [2]

కథ[మార్చు]

కొండయ్య ( చంద్రమోహన్ ), సీతలు ( రామేశ్వరి ) కురబలకోట గ్రామంలోని టూరింగ్ థియేటర్‌లో పనిచేస్తూ ఉంటారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. నిరక్షరాస్యులే ఐనప్పటికీ, వారు సినిమాలు చూస్తూ, సినిమా డైలాగులు చెప్పడం, పాటలు పాడడాం నేర్చుకుంటారు. గ్రామానికి వచ్చిన ఒక చిత్ర నిర్మాత తన సినిమాల్లో సీతాలును హీరోయిన్‌గా చేస్తానని తప్పుడు వాగ్దానం చేస్తాడు. సీతాలు కొండయ్యతో పాటు హైదరాబాద్ వెళ్తుంది. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న తరువాత, చిత్రకారుడు శ్రీధర్ సహాయంతో సీతాలు చివరకు హీరోయిన్ అవుతుంది. ఆమె విజయం ఆమె డబ్బు బంధువులను దగ్గర చేస్తాయి. ఆ సినీ పట్టణ సంస్కృతిలో తాను ఇమడ లేనని కొండయ్య నెమ్మదిగా తెలుసుకుంటాడు. అతను గ్రామానికి తిరిగి వస్తాడు. యువ ప్రేమికులు ఎలా ఏకం అవుతారు అనేది మిగిలిన సినిమా.

నటవర్గం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

పాటలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-05-04. Retrieved 2020-08-18.
  2. https://www.imdb.com/title/tt0400830/