శుభప్రదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శుభప్రదం
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. విశ్వనాథ్
నిర్మాణం హరి గోపాలకృష్ణ
పీలా నీల తిలక్
కథ కె. విశ్వనాథ్
చిత్రానువాదం కె. విశ్వనాథ్
తారాగణం అల్లరి నరేష్
మంజరి ఫడ్నిస్
అనంత్
సంగీతం మణిశర్మ
ఛాయాగ్రహణం వేణుగోపాల్ మడత్తిల్
విడుదల తేదీ 2010 జూలై 16
భాష తెలుగు

కె. విశ్వనాథ్ దర్శకత్వంలో 2010లో వచ్చిన సినిమా శుభప్రదం. అల్లరి నరేష్, మంజరి ఫడ్నిస్ నటించారు. [1]

కథ[మార్చు]

ఇందూ ( మంజరి ఫడ్నిస్ ) సంగీతమంటే ఇష్టం. ఆమె తల్లి మలయాళీ, తండ్రి ( వైజాగ్ ప్రసాద్ ) తెలుగు. ఆమెకు ఇద్దరు బాబాయిలు ( అశోక్ కుమార్, గుండు సుదర్శన్ ). వీరి భార్యలు చెన్నై, కోల్‌కతాలకు చెందినవారు. ఆ విధంగా భారతదేశం మొత్తం ఆ కుటుంబంలో ఉంది. ఆమె తెలుగు, మలయాళం, బెంగాలీ, తమిళ భాషలు బాగా మాట్లాడగలదు. అనుకోకుండా ఆమె చక్రీ ( అల్లరి నరేష్ ) ని చూస్తుంది. అతడు మంచి గాయకుడు. కానీ ప్రొఫెషనల్ గాయకుడు కాదు. చక్రి ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతణ్ణి ప్రేమిస్తుంది. కానీ చక్రిది ఒక విచిత్రమైన వృత్తి. అది సినిమా సగంలో బయట పడుతుంది. అది, ఓ కొండ పైన ఉన్న గుడికి వెళ్ళే వృద్ధులను, వికలాంగులను వీపుపై ఎక్కించుకుని మోసుకు వెళ్ళడం.

ఇందూ తన జీవితాన్ని మార్చే సంఘటనలో ఒక ధనవంతుడి ( శరత్ బాబు ) కంటబడుతుంది. కథలోని ప్రధాన మలుపు అక్కడ కనిపిస్తుంది. ఆ ధనవంతుడు ఎవరు - అతనికి సింధు అనే మనవరాలు ఉంది. ఆమె అచ్చు ఇందు లాగానే ఉండేది. సింధు యాసిడ్ దాడిలో మరణిస్తుంది. అందువల్ల ఇందులో తన మనవరాలిని రూపాన్ని చూసు కుంటున్నాడు. తరువాత ఏమి జరుగుతుందనేది మిగతా సినిమా.

నటవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

శుభప్రదం యొక్క ఆడియో 2010 జూన్ 20 న విడుదలైంది. నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కె రోశయ్య సిడిలను ఆవిష్కరించి ఎస్పీ బాలసుబ్రమణ్యానికి అందజేశాడు. [3] ఈ చిత్రంలో మణి శర్మ సంగీతం అందించాడు. [4]

క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "తప్పట్లోయ్ తాళాలోయ్"  కె.ఎస్.చిత్ర 4:14
2. "మౌనమే చెబుతోంది"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ప్రణవి 5:00
3. "ఏలేలో ఏలేలో"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, శంకర్ మహదేవన్ 5:57
4. "నీ చూపే కడదాకా"  కార్తిక్, సునీత 4:58
5. "బైలేలే బైలేలే పల్లకి"  మల్లికార్జున్, విజయలక్ష్మి, మాళవిక 4:14
6. "ఓరిమి చాలమ్మా ఓ భూమాతా"  రీటా త్యాగరాజన్ 5:16
7. "అంబ పరాకు దేవీ పరాకు"  డి.ఎస్.వి. శాస్త్రి 2:23
32:02

విడుదల[మార్చు]

ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించలేకపోయింది. [5]

మూలాలు[మార్చు]

  1. "Subhapradam Review - 123telugu.com".
  2. "Subhapradam Review - 123telugu.com". Retrieved 3 November 2018.
  3. "Rosaiah at Subhapradam Audio Launch Photo Gallery" (in ఇంగ్లీష్).
  4. "Subhapradam - All Songs - Download or Listen Free - Saavn".
  5. "Senior Big Three Directors - Big Failures".
"https://te.wikipedia.org/w/index.php?title=శుభప్రదం&oldid=3820176" నుండి వెలికితీశారు