కె. ఎస్. చిత్ర

వికీపీడియా నుండి
(కె.ఎస్.చిత్ర నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కె. ఎస్. చిత్ర
KS Chithra.jpg
జననం
కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర

(1963-07-27) 1963 జూలై 27 (వయస్సు 58)
త్రివేండ్రం, కేరళ
ఇతర పేర్లునైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా[1]
పియా బసంతి (ఉత్తర భారతదేశం)[1]
వనంబాడి (కేరళ)[2]
చిన్న కూయిల్ (తమిళనాడు)[2]
సంగీత సరస్వతి (ఆంధ్రప్రదేశ్)[1]
కన్నడ కోగిలే (కర్ణాటక)[1]
విద్యాసంస్థకేరళ విశ్వవిద్యాలయం
వృత్తి
  • గాయని
  • సంగీత నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1979–ప్రస్తుతం
జీవిత భాగస్వామివిజయశంకర్
(m.1988-ప్రస్తుతం)
పురస్కారాలుపద్మశ్రీ (2005)
పద్మ భూషణ్ (2021)
సంగీత ప్రస్థానం
సంగీత శైలి
  • భారత శాస్త్రీయ సంగీతం
  • నేపథ్య గాయని
  • సినీ సంగీతం
వాయిద్యాలుగాత్రం
లేబుళ్ళుAudiotracs
వెబ్‌సైటుwww.kschithra.com

చిత్ర గా సుపరిచితురాలైన కె. ఎస్. చిత్ర, భారతీయ సినీ రంగములో ప్రసిద్ధ నేపథ్య గాయని. "దక్షిణ భారత నైటింగేల్" అని బిరుదునందుకున్న ఈమె మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ మొదలైన భాషల సినిమాల్లో సుమారు 25 వేలకు పైగా పాటలు పాడింది. చిత్ర 2005 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం, 2021 లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నది.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

చిత్ర అసలు పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర. తండ్రి కృష్ణన్ నాయర్, తల్లి శాంతకుమారి ఇద్దరి పేర్లు పూర్తి పేరులో ఉన్నాయి.[3] ఈమె 1963, జూలై 27న కేరళలోని తిరువనంతపురంలో, సంగీతకారుల కుటుంబంలో జన్మించింది. బాల్యంలో తండ్రి దగ్గరే సంగీతంలో ఓనమాలు నేర్చుకుంది. చిత్ర అక్క బీనా, తమ్ముడు మహేష్. వీరి తల్లిదండ్రులకు తమ పిల్లల్లో ఒకరిని సంగీతంలోకి పంపాలనే కోరికగా ఉండేది. అందుకుగాను బీనాకు చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇప్పించారు. అక్క సాధన చేసేటపుడూ చిత్ర కూడా ఆమెతో పాటు స్వరాలు పాడేది. చిన్నతనంలో ఉండగానే ఆలిండియా రేడియోలో రెండేళ్ళ కృష్ణుడికి ఈమె చేత పాట పాడించారు. ఆమె తొలి రికార్డింగ్ అదే.[3]

చిత్ర పూర్తి స్థాయిలో సంగీతం నేర్చుకోవడం కోసం తండ్రి కోరికమేరకు కేంద్రప్రభుత్వం అందించే నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్ షిప్ కి దరఖాస్తు చేసుకుంది. కానీ అందుకోసం అప్పటి వరకే రెండేళ్ళు శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఉండాలి. కానీ ఆమెకు అప్పటిదాకా ఉన్న సంగీత పరిజ్ఞానంతో అందుకు దరఖాస్తు చేసింది. ఎంపికలో భాగంగా ఆమె న్యాయనిర్ణేతల ముందు స్వరాలు తెలియకుండానే ఒక త్యాగరాజ కృతిని పాడింది. అందులో ఆమెకు తెలియకుండానే అసావేరి రాగంలో ఒక ప్రయోగం చేసింది. ఆమె ప్రతిభను గమనించిన న్యాయనిర్ణేతలు ఉపకారవేతనానికి ఎంపిక చేశారు. అలా ఆమె 1978 నుండి 1984 వరకు కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనంతో డా. కె. ఓమనకుట్టి వద్ద కర్ణాటక సంగీతంలో విస్తృతమైన శిక్షణ పొందింది.

సిని జీవితం[మార్చు]

ఈమె గురువు ఓమనకుట్టి అన్నయ్య అయిన ఎం. జి. రాధాకృష్ణన్ 1979లో ఓ మలయాళ సినిమాలో మొట్టమొదటిసారిగా పాడించాడు. అయితే ఆ సినిమా విడుదల కాలేదు. 1982లో మళ్ళీ ఒక యుగళగీతం పాడే అవకాశం వచ్చింది. మొదట్లో ట్రాక్ కోసమని ఓమనకుట్టి తమ్ముడు శ్రీకుమరన్, చిత్ర కలిసి పాడారు. తర్వాత అసలైన పాట కోసం కె. జె. ఏసుదాసు తో పాటు పాడే అరుదైన అవకాశం దక్కింది. మొదటిసారి తప్పులు పాడినా జేసుదాసు సహకారంతో విజయవంతంగా పాడగలిగింది. దాంతో ఆమెకు మిగతా సంగీత దర్శకులు అవకాశం ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ ఆమె గొంతు చిన్నపిల్లలా ఉందని ఒక అభిప్రాయం ఏర్పడింది. ఒక మలయాళ సినిమాను దర్శకుడు ఫాజిల్ తమిళంలో కూడా తీద్దామనుకున్నాడు. నటి నదియా కోసం మలయాళంలో చిత్ర పాటలు పాడింది. సంగీత దర్శకుడు ఇళయరాజా ఈమె గొంతు కొత్తగా ఉందని తమిళంలో కూడా ఆమెకే అవకాశం ఇచ్చాడు.

దీని తర్వాత సింధుభైరవి అనే చిత్రంలో తెలుగులో పి. సుశీల పాడిన నేనొక సింధు అనే పాటను తమిళంలో చిత్ర పాడింది. తర్వాత అదే సినిమాలో పాడలేని పల్లవైన భాషరాని దానను అనే పాటను తమిళ, తెలుగు భాషల్లోనూ చిత్రనే పాడింది. తెలుగు సినిమాల్లో చిత్రకు ఇదే తొలిపాట. ఈ పాటకు ఆమెకు తొలిసారిగా జాతీయ పురస్కారం దక్కడమే కాక లెక్కలేనన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. దక్షిణాది భాషలు, హిందీలలో ఈమెకున్న పరిచయము వలన ఆయా భాషలలో పాటలను చక్కగా పాడగలదు. అందుకే ఆమె ప్రతి ఒక్క ప్రాంతంలో అభిమానులను సొంతం చేసుకున్నారు.

పురస్కారాలు[మార్చు]

చిత్ర వేలకొద్ది సినిమా పాటలు, సినిమాయేతర పాటలు రికార్డు చేసింది. చిత్ర గాత్రానికి మెచ్చిన భారత ప్రభుత్వం 2005 లో పద్మశ్రీ, 2021 లో పద్మభూషణ్ పురస్కారాలతో ఆమెను సన్మానించింది. చిత్ర తన గాత్ర జీవితములో ఉత్తమ మహిళా నేపథ్యగాయనిగా ఆరు జాతీయ పురస్కారాలతో పాటు అనేక అవార్డులనందుకొన్నారు. జాతీయ పురస్కారాలు అందుకొన్న సినిమాలు.

ఇవేకాక చిత్ర ఉత్తమ నేపథ్యగాయనిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుండి 16 పురస్కారాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి 11 పురస్కారాలు, తమిళ రాష్ట్ర ప్రభుత్వం నుండి 4 పురస్కారాలు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుండి 2 పురస్కారాలను అందుకుంది. దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలచే ఉత్తమ నేపథ్యగాయక పురస్కారాలందుకున్న తొలి గాయనిగా రికార్డు సృష్టించింది. అంతేకాక ఒడిశా ప్రభుత్వం నుండి 1,బెంగాల్ ప్రభత్వం నుండి 1 అందుకున్నారు. 8 ఫిలింఫేర్ పురస్కారాలు కూడా అందుకున్నారు. ఇవే కాకుండా 252 ఇతర అవార్డ్ లు అందుకున్నారు. మరియు చైనా ప్రభుత్వం నుండి అవార్డ్ పొందిన మొదటి భారత దేశ నేపథ్య గాయకురాలు గా చరిత్ర సృష్టించారు. బ్రిటిష్ పార్లమెంటు లోనూ అరుదైన గౌరవం లభించిన మొదటి భారతీయ మహిళగా నిలిచింది. ఆమె అందుకున్న అన్ని పురస్కారాల సంఖ్య 452 పై చిలుకు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "Wishing "Nightingale of South India" – Chitra a Very Happy Birthday". Telugu Film Nagar. Archived from the original on 14 జూలై 2018. Retrieved 27 July 2016. {{cite web}}: Check date values in: |archive-date= (help) ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Telugu Filmnagar" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Telugu Filmnagar" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Telugu Filmnagar" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. 2.0 2.1 "One more feather in her cap". The Hindu. Archived from the original on 10 జనవరి 2016. Retrieved 21 July 2005. {{cite news}}: Check date values in: |archive-date= (help)
  3. 3.0 3.1 "పిల్లల కోసమే అక్కడికి వెళ్తా..! - Sunday Magazine". www.eenadu.net. Archived from the original on 2021-02-07. Retrieved 2021-02-07.

బయటి లింకులు[మార్చు]

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా | ఉత్తమ నటుడు | ఉత్తమ నటి | ఉత్తమ సహాయ నటుడు | ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు | ఉత్తమ బాల నటుడు | ఉత్తమ ఛాయా గ్రహకుడు | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ | ఉత్తమ దర్శకుడు | ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు | ఉత్తమ గీత రచయిత | ఉత్తమ సంగీత దర్శకుడు | ఉత్తమ నేపథ్య గాయకుడు | ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం | ఉత్తమ కూర్పు | ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్ | ఉత్తమ బాలల సినిమా | ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం | ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా | ఉత్తమ బెంగాలీ సినిమా | ఉత్తమ ఆంగ్ల సినిమా | ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా | ఉత్తమ మళయాల సినిమా | ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా | ఉత్తమ పంజాబీ సినిమా | ఉత్తమ కొంకణి సినిమా | ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా | ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం