తిరువనంతపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Thiruvananthapuram
Clockwise, from top: View of Kulathoor, Padmanabhaswamy Temple, Niyamasabha Mandiram, East Fort, Technopark, Kanakakkunnu Palace, Thiruvananthapuram Central and Kovalam Beach
Official seal of Thiruvananthapuram
ముద్ర
ముద్దుపేరు(ర్లు): 
Evergreen City of India
God's Own Capital
[1]
Thiruvananthapuram is located in Kerala
Thiruvananthapuram
Thiruvananthapuram
Thiruvananthapuram (Kerala)
Thiruvananthapuram is located in India
Thiruvananthapuram
Thiruvananthapuram
Thiruvananthapuram (India)
నిర్దేశాంకాలు: 08°29′15″N 76°57′09″E / 8.48750°N 76.95250°E / 8.48750; 76.95250Coordinates: 08°29′15″N 76°57′09″E / 8.48750°N 76.95250°E / 8.48750; 76.95250
Country India
State Kerala
DistrictThiruvananthapuram
ప్రభుత్వం
 • ప్రభుత్వ రకంMunicipal Corporation
 • నిర్వహణThiruvananthapuram Municipal Corporation
 • MayorArya Rajendran [2] (CPI(M)
 • Deputy MayorP. K. Raju (CPI)
 • Member of ParliamentShashi Tharoor (INC)
 • City Police CommissionerSanjay Kumar Gurudin IPS
విస్తీర్ణం
 • Metropolis214 km2 (83 sq mi)
 • మెట్రో ప్రాంతం
311 km2 (120 sq mi)
విస్తీర్ణపు ర్యాంకు1st
సముద్రమట్టం నుండి ఎత్తు
10 మీ (30 అ.)
జనాభా వివరాలు
(2011)
 • Metropolis9,57,730
 • సాంద్రత4,500/km2 (12,000/sq mi)
 • మెట్రో ప్రాంతం
1,687,406
పిలువబడువిధం (ఏక)Trivandrumite,[3] Trivian
Languages
 • Official LanguageMalayalam, English[4]
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
695 XXX
ప్రాంతీయ ఫోన్ కోడ్+91-(0)471
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు
GDP Nominal$2.47 billion[5]
Percapita$3,323 or ₹2.34 lakh[5]
ClimateAm/Aw (Köppen)
జాలస్థలిtrivandrum.nic.in

తిరువనంతపురం, కేరళ రాష్ట్రానికి రాజధాని. దీనిని బ్రిటీషు పరిపాలనా కాలములో ట్రివేండ్రం అని పిలిచేవారు. ఇది ఒక రేవు పట్టణం. అనంతపద్మనాభస్వామి కొలువైవున్న దివ్యక్షేత్రం. ఈ ఆలయంలోనికి హిందువులని మాత్రమే అనుమతిస్తారు. మగవాళ్ళు పంచలు మాత్రమే ధరించి లోనికి వెళ్ళాలి. ఆడవారు కుడా ఎటువంటి అధునాతన దుస్తులు ధరించరాదు. అందరు సాంప్రదాయ వస్త్రాలలోనే ప్రవేశించాలి.ఈ మధ్యనే ఈ దేవాలయం లోని నేలమాళిగలలో లక్షన్నర కోట్లకు పైగా విలువ చేసే అపార సంపద బయటపడడంతో ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. తిరువనంతపురం కరమన నది, కిల్లీ నదీ తీరాలలో ఉంది.

శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం[మార్చు]

పద్మనాభస్వామి దేవాలయం.

తాళపత్ర గ్రంథాల ఆధారంగా కలియుగం ఆరంభమైన 950వ రోజు తుళువంశ బ్రాహ్మణ ఋషి దివాకరముని సారథ్యంలో విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది. విష్ణుభక్తుడైన దివాకరముని తపస్సు ఆచరించగా శ్రీ మహావిష్ణువు రెండు సంవత్సరాల బాలుని రూపంలో ప్రత్యక్ష్మమయ్యాడు. ఆ బాలుని ముఖవర్చస్సుకు తన్మయుడైన ముని తన వద్ద ఉండిపోవాలని కోరాడు. అందుకు ఆ బాలుడు అంగీకరించి తనను వాత్సల్యంతో చూడాలని అలా జరగని నాడు వెళ్ళిపోగలనని ఆంక్ష విధించాడు. అందుకు అంగీకరించిన ముని ఆ బాలుని అమిత వాత్సల్యంతో చూస్తూ, బాల్యపు చేష్టలను ఓర్చుకుంటూ ఆనందంతో జీవిస్తున్నారు. ఒక రోజు దివాకరముని పూజా సమయంలో సాలగ్రామాన్ని ఆ బాలుడు నోటిలో ఉంచుకొని పరుగెత్తాడు. అందులకు ముని బాలునిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు ఇచ్చిన మాటను ముని తప్పినాడని భావించి ఆ బాలుడు నన్ను చూడాలని పిస్తే అరణ్యంలో కనిపిస్తానని చెప్పి అదృశ్యమైనాడు. ఈ సంఘటనతో దివాకరమునికి ఆ బాలుడు ఎవరైనది అర్థమై తీవ్ర మనోవ్యధకు గురైనాడు. ఎలాగైనా ఆ బాలుని తిరిగి దర్శించుకోవాలన్న తలంపుతో ముని అరణ్యబాట పట్టగా, క్షణకాలం పాటు కనిపించిన ఆ బాలుడు, అనంతరం ఒక మహా వృక్షరూపంలో నేలకొరిగి శ్రీమహావిష్ణువు శేషశాయనుడిగా ఉన్న రూపంలో కనిపించాడు. ఆ మహిమాన్విత రూపం దాదాపు 5 కి.మీ. దూరం వ్యాపించి, శిరస్సు 'తిరువళ్ళం' అన్న గ్రామం వద్ద, పాదములు 'త్రిప్పాపూర్' వద్ద కన్పించాయి. అంతటి భారీ విగ్రహన్ని మానవమాతృలు దర్శించడం కష్టమని, కనువిందు చేసే రూపంలో అవరతించాలని ముని వేడుకున్నాడు. ముని విన్నపాన్ని మన్నించిన స్వామి ప్రస్తుత రూపంలో కన్పించగా, ఆ విగ్రహాన్ని తెచ్చి 'తిరువనంతపురం'లో ప్రతిష్ఠించినట్లు కథాంశం.

పరిపాలన[మార్చు]

దీని పరిపాలన తిరువనంతపురం నగరపాలక సంస్థ నిర్వహిస్తుంది. నగరపాలక సంస్థ మేయరుగా ఆర్య రాజేంద్రన్ 2020 డిసెంబరు 28 నుండి కొనసాగుచున్నాడు.

మూలాలు[మార్చు]

  1. "History – Official Website of District Court of India". District Courts. Archived from the original on 25 December 2018. Retrieved 18 May 2017.
  2. "India: 21-year-old student Arya Rajendran set to become mayor in Kerala". gulfnews.com (in ఇంగ్లీష్). Retrieved 2020-12-25.
  3. "Ramzan turns Kerala into a foodies' paradise". Times of India. 23 June 2017. Retrieved 9 July 2018.
  4. "The Kerala Official Language (Legislation) Act, 1969" (PDF). PRS Legislative Research. Retrieved 19 July 2018.
  5. 5.0 5.1 "District Domestic Product Per Capita". Retrieved 8 January 2023.

వెలుపలి లింకులు[మార్చు]

  • కావటూరి సుగుణమ్మ: శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం, తిరువనంతపురం. సప్తగిరి సచిత్ర మాస పత్రిక, 2008 జనవరి సంచిక నుంచి.

మూస:కేరళలోని జిల్లాలు