నారాయణ గురు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
శ్రీ నారాయణ గురు
Narayana Guru.jpg
శ్రీ నారాయణ గురు
జననం 1856
చెంపళంతి, ట్రావెంకూర్, కేరళ
నిర్యాణము సెప్టెంబరు 20 1928
వర్కాల, ట్రావెంకూర్

నారాయణ గురు (1856 - సెప్టెంబరు 20, 1928) కేరళకు చెందిన ఒక సంఘసంస్కర్త. సమాజంలోని మూఢ విశ్వాసాలను, కుల తత్వాన్ని నిరసించాడు.[1] కులం కారణంగా కొన్ని వర్గాలకు చెందిన ప్రజలు అన్యాయానికి గురవుతున్నారనీ, వారికి ఆధ్యాత్మిక స్వేచ్ఛ, సామాజిక స్వాతంత్ర్యం ఉండాలని ఆయన భావించాడు. వారిని ఉద్ధరించడానికి ఆలయాలు, పాఠశాలలు మొదలైన సంస్థలు నెలకొల్పడానికి పాటు పడ్డాడు.[2]

బాల్యం[మార్చు]

1887లో ఆయన ప్రాచుర్యంలోకి వచ్చాక ఆయన బాల్య విశేషాల గురించి అనేక రకాలైన కథలు ప్రచారంలోకి వచ్చాయి కానీ అందులో వేటిలోనూ ఖచ్చితమైన సమాచారం లభించలేదు. నారాయణ గురు 1856లో కేరళ లోని తిరువనంతపురం సమీపంలోని చెంపళంతి అనే గ్రామంలో మదన్ ఆసన్, కుట్టియమ్మ అనే వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించాడు. వయలవరంలోని వారి ఇల్లు ఆర్థికంగా, సామాజికంగా మంచి స్థాయిలో ఉన్నది. ఆయనకు నారాయణన్ అనే పేరు పెట్టి నానూ అని పిలుచుకునే వారు. నానూ కు ముగ్గురు సోదరీ మణులు ఉండేవారు. తండ్రి మదన్ ఆసన్ ఉపాధ్యాయుడు. ఆయనకు సంస్కృతం, జ్యోతిష శాస్త్రం, ఆయుర్వేదం లోనూ ప్రవేశం ఉంది. నారాయణన్ కు ఐదేళ్ళ వయసులో పక్కనే ఉన్న గురుకుల పాఠశాలలో తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు.[3]

గుర్తింపు[మార్చు]

రవీంద్రనాథ ఠాగూర్ నారాయణ గురు ను 1922 నవంబరున శివగిరి ఆశ్రమంలో కలిశాడు. తరువాత ఠాగూర్ ఆయన్ను గురించి నారాయణ గురును మించిన లేక ఆయనతో పోల్చదగిన ఆధ్యాత్మిక వేత్తను నేను ఎన్నడూ చూడలేద ని ప్రశంసించాడు.[4][5]

మూలాలు[మార్చు]

  1. "కులమత భేదాల నిర్మూలన కోసం నారాయణ గురు కృషి గొప్పది : సోనియా". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Retrieved 8 November 2016. 
  2. Pullapilly, Cyriac K. (1976). "The Izhavas of Kerala and their Historic Struggle for Acceptance in the Hindu Society". In Smith, Bardwell L. Religion and social conflict in South Asia. International studies in sociology and social anthropology. 22. BRILL. pp. 24–46. ISBN 978-90-04-04510-1. 
  3. కత్తి, పద్మారావు. "అక్షర దీపం వెలిగించిన నారాయణ గురు". prajasakti.com. ప్రజాశక్తి. Retrieved 9 November 2016. 
  4. Bhattacharya, Sabyasachi (31 December 2011). "The Other Tagore". Frontline (Volume 28 - Issue 27). Retrieved 9 February 2015. 
  5. "కారు చీకట్లలో చైతన్య దీప్తులు". sakshi.com. సాక్షి. Retrieved 8 November 2016.