కులం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కులం అనేది సమాజంలో ఏ వ్యక్తినైనా తేలికగా గుర్తించడానికి వేద కాలంలో ఆర్యులు రూపొందించిన ఒక వ్యవస్థ. తమలో తాము వివాహాలు చేసుకుంటూ, ఒక విధమైన జీవన సరళిని కొనసాగిస్తూ వచ్చిన సామాజిక వర్గాలకు కులాలు అని పేరు. వృత్తి, ఆచారాలు, సామాజిక స్థాయి వంటి అనేకాంశాలు కులాల్లో పరంపరాగతంగా కొనసాగేవి. వంశపారంపర్యంగా పాటించబడే ఒక సామాజిక ఆచారం. సాధారణంగా కులం వృత్తులు, కులవివాహాలు, సంస్కృతి, సామాజిక స్థాయి మరియు రాజకీయాలపై అత్యధిక ప్రభావాన్ని చూపుతుంది.[1][2] యునిసెఫ్ అధ్యయనాల ప్రకారం కులవివక్ష ప్రపంచవ్యాప్తంగా 25కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేస్తోంది.[3][4] ఈ కుల వ్యవస్థ ప్రముఖంగా ఆసియా (భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, జపాన్) మరియు ఆఫ్రికా ఖండాలలో ప్రబలి ఉంది. భారత దేశంలో కుల వ్యవస్థ వలన కొన్ని దురాచారాలు ఏర్పడినవి. కులం లేదా వర్ణం భారతదేశంలో హిందూ మతానికి చెందిన ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది.

భాషా విశేషాలు[మార్చు]

తెలుగు భాషలో కులము అనే పదానికి తెగ, జాతి, వంశము సమానార్ధాలున్నాయి.[5] భారతదేశంలో కులం అనే పదం జాతి లేక సామాజిక వర్గాన్ని సూచిస్తుంది. పూర్వం ఆర్యుల కాలంలో ఎంతో మేధస్సుతో జాతి వర్గీకరణ చేయబడింది. ఒక జాతికి (కులం) సంబంధించిన వారందరికీ ఒకే లక్షణములు ఉంటాయి. కాని పూర్వం కొందరు ఆర్యులు వాత్సాయన ఋషి కాలంలో శూద్ర స్త్రీలను కామకోరికలకు బానిసలుగా మార్చుకోవడం మరియు బలాత్కారం చేయడం వల్ల నేడు అనేక మిశ్రమ జాతులు వారు ఏర్పడినారు.

వేదకాలంలో కులం[మార్చు]

మన హిందూ మతము పేరు చెప్పగానే మొదట అందరికీ గుర్తుకు వచ్చేది కులాల సంగతి. హిందూమతమునకు ప్రామాణ్యము వేదాలు అని అందరికీ తెలుసు. స్త్రీలు, శూద్రులకు వేదాధ్యయనాధికారం లేదని అలా అని వేదాలలో ఉన్నదని చాలామంది నమ్ముతున్నారు. కానీ వేదాలలో అలా లేదని చెప్పడానికి ఈ ప్రయత్నం. భగవధ్గీత 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు “చాతుర్వర్ణ్యం మయాసృష్ట్యం గుణకర్మ విభాగశః”అన్నాడు. దీని అర్థం”మొదట వారి గుణాల బట్టి, తర్వాత వారు చేసే పనుల బట్టి నాలుగు వర్ణాలు (కులాలు) నాచే (భగవంతుడిచే) సృష్టింపబడ్డాయి.“అని అర్థం. వేదాలలో నాలుగు వర్ణాల (కులాల) గురించి చెప్పారు కానీ వాటి మధ్య ఎక్కువ, తక్కువల గురించి చెప్పలేదు. మధ్యయుగంలో సాంప్రదాయవాదులు స్త్రీ,శూద్రులకు వేదాధ్యయనాధికారం లేదని వారి వారి గ్రంథాలలో చొప్పించారు కానీ ఏ వేదంలోనూ అలా చెప్పబడలేదు. సరిగదా ఆ అధికారం ఉన్నదని చెప్పాయి.

 • 1. యజుర్వేదం(26.2) శ్లోకం

“యధేమంవాచం కళ్యాణీవధజనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యం శూద్రాయ చర్యాయచస్వయచరణాయ”

అంటే “నేనెలా ఈ కళ్యాణవాక్కులను బ్రహ్మ మొదలు శూద్రుల వరకు సర్వ మానవులకూ చెప్పానో నీవూ అలానే చెప్పాలి.”అని అర్థము.

 • 2. అధర్వణ వేదం (8వ మండలం, 2వ అనువాకం) బ్రాహ్మణులకు, శూద్రులలో కూడా చివరివారికి

“సత్యమహం గభీరకావ్యేన సత్యంజాతే నస్మిజాతవేద, నం దాసోనం ఆర్యోమహిత్వ వ్రతం మిమయయదహధరిష్యే”

అంటే “ఓ మానవుడా! గంభీర సత్యస్వరూపుడనైన నేను పుట్టుక నిచ్చినవాడను. నేను దాస (శూద్ర), ఆర్య పక్షపాతము గలవాడను కాదు. నావలె ప్రవర్తించి సత్యవంతములైన నా ఆదేశములను పాటించు వారినందరినీ రక్షిస్తాను“ అని అర్థము.

 • 3. ఇంకనూ ఋగ్వేద 10వ మండలం,3 వ అనువాకంలోని 30-34 వరకుగల సూక్తాలను ప్రచారం చేసిన కపశైలీషుడు శూద్రుడని ఐతరేయ బ్రాహ్మణమును, స్వయంగా ఋగ్వేదములోనూ మరియు శాయనాచార్య భాష్యములోనూ చూడవచ్చు.
 • 4. అలానే ఋగ్వేద ఒకటవ మండలం, 17వ అనువాకంలోని 116-126 వరకు గల సూక్తాలను ప్రచారం చేసిన కక్షవాన్ ఋషి అంగదేశపు రాజు బానిస కొడుకని ఋగ్వేదంలోనూ, శాయన భాష్యములోనూ, మహాభారతంలోనూ చూడవచ్చు.
 • 5. అంతేకాక జనశృతి అనే ఋషి శూద్రుడు. సత్యకామజాబాలి వేశ్య కొడుకు. వీరిద్దరూ ఉపనిషత్తుల ప్రకారం (వేదాల చివరివి) ఉత్తమ వేదాంతబోధ పొందినవారు.
 • 6. ఋగ్వేద ఒకటవ మండలం 223వ అనువాకం 129వ సూక్తాన్ని లోపాముద్ర, 8వ మండలం 1వ అనువాకం 91 వ సూక్తాన్ని అపలా అనే స్త్రీలు ప్రచారం చేసారని ఋగ్వేద అనుక్రమణిక, శాయనభాష్యములోనూ చెప్పబడింది.

“న స్త్రీ శూద్ర వేదం అధీయతాం” (స్త్రీలు, శూద్రులు వేదమును అభ్యసింపరాదు) అన్నది మధ్యయుగపు గ్రంథాలలో చేర్చారు కానీ ఈ వాక్యము ఏ వేదములోనూ లేదు.ఇది వైదిక వాక్యము కాదు.

 • 7. ఇక జనక మహారాజు కొలువులోని గార్గి అనే మహాయోగిని గురించి అందరికీ తెలుసు. యాజ్ఞవల్కుడు అను ఋషిని ధైర్యంగా ప్రశ్నలు అడగి సమాధానాలు రాబట్టింది. ఆ తర్వాతనే యాజ్ఞ్యవల్కుడు వేదవేత్తగా అంగీకరింపబడ్డాడు. ఈ యాజ్ఞవల్క్యుని భార్య అయిన మైత్రేయి ఇతనిచే బ్రహ్మజ్ఞానం తెలుసుకొని ఆ కాలంలో చాలా పేరు ప్రఖ్యాతులు పొందింది. (బృహదారణ్యకోపనిషత్తు నుండి).
 • 8. వజ్రసూచీ ఉపనిషత్తు ప్రకారం ఎవరికి వేదాలను అధ్యయనం చేసి ఆచరించాలన్న సహజమైన కోరిక ఉంటుందో, సామర్థ్యము ఉంటుందో వారు స్త్రీపురుష శూద్ర భేదము లేక అందరూ అర్హులే.

నిజమైన ఆత్మానుభవం పొందిన వారి ఉపదేశాలకు, శాస్త్ర వాక్యాలకు వైరుధ్యమేర్పడినప్పుడు ఆత్మవేత్తల (ఆత్మానుభవం పొందినవారు) మాటే వినమని ధర్మశాస్త్రాలు చెపుతాయి.

దుష్టము, సంకుచితము ఐన నేటి కులవ్యవస్థ శాస్త్రీయము కాదని, ఇవి వేదాల తర్వాతి కాలంలోని గ్రంథాలలో చేర్చబడ్డాయని చెప్పవచ్చు.

సమకాలీన కాలంలో కులవ్యవస్థ[మార్చు]

ఇప్పుడు కూడా కుల వ్యవస్థ ఉనికిలో ఉన్నప్పటికీ సమాజంలో కులం కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు.పూర్వం కూటికి పేదలం కానీ కులానికి పేదలం కాదు అనేవారు.ఇప్పుడు కొంత మంది కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు కానీ అక్కడ కూడా తమ డబ్బు-హోదాకి తగిన వ్యక్తుల్నే ఎంచుకుంటున్నారు. ఉన్నవాళ్ళు-లేనివాళ్ళు అనే భేదం ఎప్పుడూ ఉంటుంది.సొంతకులంలో కూడా డబ్బున్న కుటుంబాలకి చెందిన వాళ్ళు పేద కుటుంబాలకి చెందిన వాళ్ళని పెళ్ళి చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ. పట్టణ ప్రాంతాలలోనూ, కొన్ని గ్రామీణ ప్రాంతాలలోనూ కుల పునాదులు అంత బలంగా కనిపించడం లేదు. అంత కంటే డబ్బున్న వాళ్ళు - పేద వాళ్ళు అన్న భేదాలే ఎక్కువగా కనిపిస్తాయి. రాజకీయాల విషయంలో మాత్రం కులం ఎక్కడా లేనంత బలంగా కనిపిస్తుంది. కొన్ని కుల సంఘాల వాళ్ళు తమ కులం వారికి ఇన్ని సీట్లు ఇస్తేనే వోట్లు వేస్తామని డిమాండ్లు చేస్తుంటారు.నియోజకవర్గాలు కూడా కులాల వారీగా రాజ్యాంగ ప్రకారం కేటాయుంపులు చేయబడ్దాయి.ఓటర్ల జాబితా నుంచి ఓటర్ల కులం పేరునుతొలగించవలిసిందిగా ఎన్నికలు కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ వేలు గాంధీ లేవనెత్తిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు 24.10.2008 న తోసిపుచ్చింది.

చాతుర్వర్ణ్యం మయాసృష్ట్యం గుణకర్మ విభాగశః”అన్నాడు. దీని అర్థం”మొదట వారి గుణాల బట్టి, నాచే (భగవంతుడిచే) సృష్టింపబడ్డాయి.“అని అర్థం. వేదాలలో నాలుగు వర్ణాల (కులాల) గురించి చెప్పారు కానీ వాటి మధ్య ఎక్కువ, తక్కువల గురించి చెప్పలేదు. మధ్యయుగంలో సాంప్రదాయవాదులు స్త్రీ,శూద్రులకు వేదాధ్యయనాధికారం లేదని వారి వారి గ్రంథాలలో చొప్పించారు కానీ ఏ వేదంలోనూ అలా చెప్పబడలేదు. సరిగదా ఆ అధికారం ఉన్నదని చెప్పాయి.

"'తర్వాత వారు చేసే పనుల బట్టి నాలుగు వర్ణాలు (కులాలు) "'

వివిధ కులస్థుల నివాసాలు[మార్చు]

చాలా వరకు గ్రామాలలో ఒక కులానికి చెందిన వారంతా ఆ గ్రామంలోని ఒక ప్రత్యేక వాడలో నివసిస్తారు. కొన్ని గ్రామాలలో వాడల పేర్లు వారి కులంతో సంబంధం కలిగి ఉంటాయి. ఇది పట్టణాలలో కచ్చితంగా పాటించకపోయినా కొంతవరకు పట్టణాలలో కూడా ఈ విధమైన నివాసాలు కానవస్తాయి. కుల నిర్ములన చెయాలి. కులాంతర వివాహాలని ప్రొత్సహించంది . మనషులంత ఎకమవుదాం. యువకులరా మనమె ఈ పనికి పూనుకొవాలి.

కుల నిర్మూలన[మార్చు]

కులం కార్య విభాగమే, కులాలలొ సమత్వమూ, సమాన గౌరవమూ, ఉన్నన్నాళ్ళూ నిలిచాయి కులాలు. కార్య విభాగంలొ భేదంగాని, గౌరవంలొ భేదంగాని రాగానే వేరుపురుగు పుట్టిందన్నమాటే. మూఢత్వమూ, అజ్ఞానమూ తగ్గగానే తక్కువజాతి వాళ్ళనే వాళ్ళు మోసం తెలుసుకుని తిరగబడుతున్నారు. స్త్రీ కూడా అంతే. - చలం

భారతీయ సమాజంలో ఒక కులం లేదా మతం మనుషులు మరొక కులం వారి కంటే ఎక్కువ తక్కువని అనుకోవటం వల్ల, మనుషులందరు సమానులు కాదనుకోవటం వల్ల, అంటరానితనాన్ని పాటించటం గతంలో జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం కులాంతర మతాంతర వివాహాలకు ఇచ్చేప్రోత్సాహక మొత్తాన్ని 25000 నుండి 50000 రూపాయలకు పెంచాలని నిర్ణయించినట్లు కేంద్ర సామాజిక న్యాయశాఖా మంత్రి మీరాకుమారి చేప్పారు. డాక్టర్ అంబేద్కర్ లాంటి అభ్యుదయవాదులు, మానవతావాదులు కులనిర్మూలన కోసం పోరాడుతున్నారు కానీ పెద్దగా ప్రయోజనం లేదు. రాజస్తాన్ లో గుజ్జర్లు తమను షెడూల్డ్ ట్రైబుల్లో చేర్చాలని, మన రాష్ట్రంలో కాపులు తమను వెనుకబడిన కులాల్లో చేర్చాలని పోరాడుతున్నారు. గతంలో కారంచేడు, నీరుకొండ, చుండూరు, పదిరికుప్పం లాంటి చోట్ల కులహింస జరగ్గా, మళ్ళీ ఇప్పుడు హెచ్చుసంఖ్యలో కులాంతర వివాహాలు జరగటం వల్ల కులనిర్మూలన జరుగుతుంది.

అజాత్[మార్చు]

1920 ప్రాంతంలో మహారాష్ట్రలోని అమరావతి జిల్లా 'మంగ్రోల్‌ దస్తగిర్‌' గ్రామంలో గణపతి భభుత్కర్‌ అనే సంఘసంస్కర్త మనుషులంతా సమానమేనని చెప్పి కులం, మతం పట్టింపులేని వారందరినీ 'అజాత్‌' అనే ఒక సామాజిక వర్గంగా మార్చే ఉద్యమం చేపట్టారు. భభుత్కర్‌ సందేశం నచ్చి విదర్భ ప్రాంతంలో దళిత, మాలి, బ్రాహ్మణ.... లాంటి దాదాపు 18 కులాలవారు కలిసిపోయారు. 1950 నాటికి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో అజాతీయులుగా చెప్పుకునే వారి సంఖ్య సుమారు అరవైవేలకు చేరింది.1960, 70ల్లో 'అజాత్‌' ఒక ప్రత్యేక సామాజిక వర్గంగా గుర్తింపు పొందింది. వీరి స్కూల్‌ సర్టిఫికెట్‌లోనూ కులం అని రాసున్న చోట అజాత్‌ ఉంటుంది.ఇప్పటికీ మంగ్రోల్‌లోని గణపతి భభుత్కర్‌ నిర్మించిన ఆలయ ప్రాంగణంలో ఏటా నవంబరులో 'అజాత్‌' సమావేశం జరుగుతుంది. 105 కుటుంబాలకు చెందిన రెండువేల మంది ఈ సమావేశాలకు హాజరవుతారు. జనాభా గణనలో కులం పేరు తప్పనిసరిగా చేర్చాలనుకుంటే, ఏ కులమూ లేదని చెప్పేవారికీ ప్రత్యేక గుర్తింపునివ్వాలి' అని వీరు డిమాండ్ చేస్తున్నారు.[6]

కుల నిర్మూలనపై వ్యాఖ్యానాలు[మార్చు]

మహాత్మా గాంధీ, అంబేద్కర్ లాంటి సంఘ సంస్కర్తలు వర్ణ వ్యవస్థ ను నిరసించారు..[7]

కుల నిర్మూలన గురించి అంబేద్కర్ మాటలు:

 • కులంవల్ల ఆర్థిక శక్తియుక్తులేమీ సమకూడవు.కులంవల్ల జాతి కూడా ఏమీ వికసించదు, వికసించలేదు.కానీ కులం ఒకపనిచేసింది.అది హిందువులు నీతి నికోల్పోయి పూర్తిగా చిన్నాభిన్నామయ్యేలా చేసింది.కులాలు ఒక కూటమిగాకూడా ఏర్పడలేవు.ఒక కులం ఇంకొక కులానికి అనుబంధంగా కూడా ఉండదు.ప్రతి కులం మిగతా కులాలనుండి తానొక ప్రత్యేక కులంగా గుర్తింపుకోసం పోరాడుతుంది.కులవ్యవస్థ అందరూ కలిసి పాల్గొనే ఉమ్మడి కార్యక్రమాన్ని అడ్డగిస్తుంది.ఇది మన అందరి పని అనే స్పృహ లేకుండా, హిందువులందరూ ఐఖ్యం కాకుండా చేస్తుంది.కులంఉండటం, కులస్పృహ ఉండటం వల్ల పాత వివక్ష లన్నీ గుర్తుకొస్తూ సమైక్యత ఆగిపోతున్నది.క్లబ్బు సభ్య త్వం లాగా కులం సభ్యత్వం అందరికీ రాదు.కులంలో సభ్యత్వం కావాలంటే ఆకులంలో పుట్టాలి.అది కులధర్మం .కులాలు స్వయంప్రతిపత్తి గలవి. ఎవరైనా కొత్తవ్యక్తి వస్తే ఒక కులంలోకి చేర్చుకొమ్మని చెప్పే అధికారం ఎవరికీ లేదు. హిందూ సంఘం ఒక కులాల కూటమి . ప్రతి కులం మూసుకుపోయి ఉంటుంది కాబట్టి కులం మారే అవకాశం ఎవరికీ ఉండదు. హిందూసమాజం విస్తరించకుండా ఇతర మతస్థులను కలుపుకోకుండా కులమే అడ్డుపడింది. కులాలున్నంతవరకు హిందూ మతం విశ్వజనీన సేవా మతం కాలేదు.శుద్ధి హాస్యాస్పదం, నిష్ఫలకార్యక్రమం.సదాచార సంపన్నుల చేతిలోని కులం సంస్కర్తలనూ, సంస్కరణ లనూ నాశనంచేసే ఆయుధం .తన కులంకాని వాడిలో ఉన్న ప్రతిభను ప్రశంసించే శక్తి హిందువులో ఉండదు.మౌర్యుల కాలంలో చతుర్వర్ణ వ్యవస్థను సమూలంగా తుడిచిపెట్టారు.
 • "భగవంతుని ప్రేమికులు ఏ కులానికీ చెందరు.... ప్రేమ గుణం లేని బ్రాహ్మణుడు , బ్రాహ్మణుడు కాజాలడు. భక్తి ద్వారా అంటరాని వాడు కూడా పరమ పవిత్రుడు కాగలడు."- రామకృష్ణ పరమహంస [8]
 • The Supreme Court in a judgment on July 7, 2006 said: “The caste system is a curse on the nation and the sooner it is destroyed, the better”. The Bench consisting of Justices Ashok Bhan and Markandey Katju observed that in fact the caste system is “dividing the nation at a time when we have to be united to face the challenges before the nation”.

One of the effective means and instruments for ushering in a casteless society is inter-caste marriage. Mahatma Gandhi advocated this by insisting on inter-caste marriages with dalits, and also by Dr.B.R.Ambedkar as an important measure for ‘Annihilation of Caste’. Central and State Governments have provided cash incentives and even gold medals to inter-caste couples. The Supreme Court highlighted that “inter-caste marriages are in fact in national interest, as they will result in destroying the caste system”

 • కుల, మతాల ఆధారంగా దేశాన్ని ఐక్యంగా ఉంచలేము--ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్ 21.2.2010
 • దళితులను కించపరచాలనే ఉద్దేశంతో కులం పేరిట పిలిస్తే నేరమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. (ఈనాడు20.4.2011)

సమత్వం[మార్చు]

కులాల మధ్య తీవ్రమైన వివక్ష సాగుతున్న రోజుల్లోనే కొన్ని ప్రత్యేక అంశాల్లో ఆశ్చర్యమైన సమత్వం వెల్లివిరిసింది. ముఖ్యంగా చాతుర్వర్ణ్య వ్యవస్థను, కులకట్టుబాట్లను తీవ్రంగా పాటించేవారు కూడా గురుత్వం, ఆచార్యత్వం వంటి విషయాల్లో కులాల భేదాలను పూర్తిగా విడిచిపెట్టేవారు. ఆచార్యపురుషుల పుట్టుపూర్వోత్తరాలు కనుక్కోవడం గురుశిష్య పరంపర పద్ధతిలో తీవ్రమైన అవమానంగా, తప్పుగా ఎంచబడేది. శూద్ర, పొడబాగ్డి, అగురి కులాల వస్తాదుల వద్ద బ్రాహ్మణులు మొదలుగా అన్ని కులస్తులు ఛడీ, బాణా (కర్ర) మొదలైన పోరాటవిద్యలు నేర్చుకునేవారు. రంగంలోకి వెళ్ళగానే ముందుగా తన పోరాటానికి అడ్డురాకుండా జంధ్యాన్ని తొలగించేవారు. ఆయుధాలను గురువు పాదాల వద్ద ఉంచి, ఆయన మోకాళ్ళు తాకి, నమస్కరించి, ‘‘జేయ్ గురూ’’ అని గురువు అనుమతి పొందాకే విద్య నేర్వడం సాగేది. ఈ క్రతువును ఏ బ్రాహ్మణుడూ అవమానంగా భావించే స్థితి ఉండేదికాదు. అలాగే ఇవి చేసినందుకు తోటి బ్రాహ్మణులెవరూ వారిని అవమానించేదీ, వెలివేసేదీ లేదు.[9]

భారత దేశంలో కొందరు ప్రముఖ కులాంతర మతాంతర వివాహితుల జాబితా[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. Scott, John; Marshall, Gordon (2005), "caste", A Dictionary of Sociology, Oxford, UK; New York, NY: Oxford University Press, p. 66, ISBN 978-0-19-860987-2, retrieved 10 August 2012
 2. Winthrop, Robert H. (1991), "Caste", Dictionary of Concepts in Cultural Anthropology, New York, NY: Greenwood Press, pp. 27–30, ISBN 978-0-313-24280-9, retrieved 10 August 2012
 3. "వివక్ష." యునిసెఫ్.
 4. "విశ్వవ్యాప్తంగా కులవివక్ష" మానవహక్కుల గమనిక.
 5. బ్రౌన్ నిఘంటువు ప్రకారం కులము పదప్రయోగాలు.
 6. ఈనాడు 25.7.2010
 7. Elenanor Zelliot, "Caste in Contemporary India," in Rinehart 2004
 8. Nikhilananda 1992, p. 155
 9. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 సంపాదకులు.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.

ఉపయుక్త గ్రంథ సూచి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కులం&oldid=2429179" నుండి వెలికితీశారు