నీరుకొండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నీరుకొండ
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం మంగళగిరి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522503
ఎస్.టి.డి కోడ్ 08645

నీరుకొండ, గుంటూరు జిల్లా,మంగళగిరి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. మంగళగిరి మండలం లోని కురగల్లు దాని పరిధిలోని హామ్లెట్స్, కృష్ణాయపాలెం. నవులూరు(గ్రామీణ) దాని పరిధిలోని హామ్లెట్స్, నిడమర్రు, యర్రబాలెం, బేతపూడి గ్రామాలు ఉన్నాయి.

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

ఎస్.ఆర్.ఎం.(శ్రీ రామస్వామి మెమోరియల్) విశ్వవిద్యాలయం[మార్చు]

నీరుకొండ గ్రామములో నూతనంగా నిర్మించిన ఈ విశ్వవిద్యాలయాన్ని, 2017,జులై-15న ప్రారంభించారు. ఈ విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం 100 ఎకరాల స్థలం కేటాయించగా, 20 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం భవనాన్ని నిర్మించుచున్నారు.

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

వీధి దీపాలు[మార్చు]

ఈ గ్రామములో రాజధాని కొరకు 100% భూసేకరణ జరిగింది. దానితో గ్రామములోని 72 వీధిదీపాలకు ఉన్న ట్యూబులైట్లను తీసివేసి, వీటిస్థానములో ఎల్.ఇ.డి.దీపాలు ఏర్పాటు చేసారు. దీని వలన విద్యుత్తు బిల్లుల ఖర్చు చాలా తగ్గినది.

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో సి.హెచ్.సామ్రాజ్యం సర్పంచిగా ఎన్నికైనాడు.
  2. ఈ గ్రామ పంచాయతీలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి 100% పన్ను వసూలుచేసారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ కోదండరామాలయం[మార్చు]

ఈ ఆలయ వార్షికోత్సవాలు 2014,నవంబరు-4 నుండి 8 వరకు వైభవంగా నిర్వహించారు. 8వ తేదీ శనివారం నాడు పూర్ణాహుతితో ఈ కార్యక్రమాలు ఘనంగా ముగిసినవి. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు. ఈ ఐదురోజులూ గ్రామంలో అఖండ హరినామ సంకీర్తన చేసారు.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

  • పాశం రవీంద్ర.
  • నన్నపనేని సాంబశివరావు:- దేశంలోనే ప్రఖ్యాతి పొందిన ఎరువుల తయారీ సంస్థ అయిన క్రిభ్కో కు, వీరు ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టరుగా ఉన్నారు.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నీరుకొండ&oldid=4130402" నుండి వెలికితీశారు