మంగళగిరి మండలం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
| Coordinates: 16°25′55″N 80°34′08″E / 16.432°N 80.569°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | గుంటూరు జిల్లా |
| మండల కేంద్రం | మంగళగిరి |
| విస్తీర్ణం | |
• మొత్తం | 134 కి.మీ2 (52 చ. మై) |
| జనాభా (2011)[2] | |
• మొత్తం | 1,60,303 |
| • సాంద్రత | 1,200/కి.మీ2 (3,100/చ. మై.) |
| జనగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | 995 |
మంగళగిరి మండలం, ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన మండలం. ఇది తెనాలి రెవెన్యూ డివిజన్ పరిపాలనలో ఉంది. దీని ప్రధాన కార్యాలయం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిథిలోని మంగళగిరి పట్టణంలో ఉంది.[3] ఈ మండలం తుళ్లూరు, తాడేపల్లి, తాడికొండ, పెదకాకాని, దుగ్గిరాల మండలాలతో సరిహద్దులుతో కలిగి ఉంది. మండలంలోని కొంత భాగం కృష్ణా నది ఒడ్డున ఉంది.[4]
చరిత్ర
[మార్చు]1970 ఫిబ్రవరి వరకు, గుంటూరు జిల్లాలో ఎనిమిది తాలూకాలు మాత్రమే ఉండేవి. 1977 నవంబరులో అప్పటి ఎనిమిది తాలూకాలను పదకొండు తాలూకాలుగా పునర్వ్యవస్థీకరించడం ద్వారా మంగళగిరి తాలూకా 1 ఏర్పడింది. 1985 మే 25న, తాలూకాలు, ఫిర్కాల స్థానంలో మండల వ్యవస్థలో భాగంగా మంగళగిరి మండలం ఏర్పడింది.[5]
మండలంలోని పట్టణాలు
[మార్చు]మండల గణాంకాలు
[మార్చు]2001 భారత జనాభా గణాంకాలు
2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 1,36,260 మందికాగా, అందులో పురుషులు 69,000, స్త్రీలు 67,250 అక్షరాస్యత మొత్తం 61.66% - పురుషుల అక్షరాస్యత 69.62%- స్త్రీల అక్షరాస్యత 77.39%
2011 భారత జనాభా గణాంకాలు
మంగళగిరి మండలం మొత్తం జనాభా 1,60,303, అందులో పట్టణ జనాభా 1,07,197 కాగా, గ్రామీణ జనాభా 53,106. మంగళగిరిలో మొత్తం కుటుంబాలు 28,139. ఆరు సంవత్సరాల వయస్సులోపు పిల్లలు మెత్తం 15,833 ఉండగా వారిలో బాలురు 4,657, బాలికలు 11,176, అక్షరాస్యత 72.32%, లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 995 బాలికలు ఉన్నారు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన జనాభా 18.1% మంది ఉన్నారు. షెడ్యూల్డ్ తెగలకు చెందిన జనాభా 2.8% మంది ఉన్నారు.[6][7]
పాలన
[మార్చు]పరిపాలన
మండలంలోని నాలుగు గ్రామాలు, అవి కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు (నెరుకొండ గ్రామాలు), నౌలూరు (యెర్రబాలెం & బేతపూడి గ్రామాలు) ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరంలో భాగం. ఈ మండలం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలోకి వస్తుంది..[8] ఈ మండలాన్ని తహశీల్దారు నియంత్రణలో రెవెన్యూ పరిపాలన సాగుతుంది.
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015
- ↑ "Guntur District Mandals" (PDF). Census of India. p. 64.107. Retrieved 19 January 2015.
- ↑ "Mandals in Guntur district". aponline.gov.in. Archived from the original on 28 April 2015. Retrieved 28 July 2014.
- ↑ "Hand Book of Statistics 2013 Guntur District" (PDF). pp. i. Archived from the original (PDF) on 12 October 2016. Retrieved 9 September 2016.
- ↑ "Villages and Towns in Mangalagiri Mandal of Guntur, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-11-25.
- ↑ "Visualizations | Government of India". censusindia.gov.in. Retrieved 2025-11-25.
- ↑ "District wise mandals and villages covered in Krishna and Guntur districts" (PDF). Andhra Pradesh Capital Region Development Authority. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 23 September 2015. Retrieved 23 September 2015.
